Pasvik yogam: అశుభకరమైన పాశ్విక్ యోగం.. ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి-mars forms pasvik raja yogam in vrishabhra rashi three zodiac signs to alert ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pasvik Yogam: అశుభకరమైన పాశ్విక్ యోగం.. ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

Pasvik yogam: అశుభకరమైన పాశ్విక్ యోగం.. ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

Gunti Soundarya HT Telugu
Jul 12, 2024 08:05 AM IST

Pasvik yogam: జులై 12 నుంచి కుజుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావంతో అశుభ యోగం ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశుల వారికి జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడబోతున్నాయి.

కుజుడి సంచారంతో అశుభకరమైన యోగం
కుజుడి సంచారంతో అశుభకరమైన యోగం (freepik)

Pasvik yogam: అంగారకుడు 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటారు. ఈరోజు నుంచి కుజుడు మేష రాశిని వీడి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులకు అదృష్టాన్ని ఇస్తే మరికొందరికి బాధలు, కష్టాలు ఇస్తుంది.

కుజుడి సంచారం వల్ల అశుభకరమైన పాశ్విక్ యోగం సృష్టించింది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని శుభ యోగంగా పరిగణించరు. ఇది మానవుడి జీవితం మీద ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. పాశ్విక్ యోగం వల్ల ఏ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో తెలుసుకుందాం. ఏ రాశులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తుందో చూద్దాం.

మిథున రాశి

మిథున రాశి వారికి పాశ్విక్ యోగం అశుభ పరిణామాలు కలిగిస్తుంది. ఈ సమయంలో కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. లేదంటే వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు. ఓపికగా ఉండాలి. తల్లిదండ్రులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా కొద్దిగా ఆందోళన చెందుతారు. ఈ సమయంలో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలోనూ ఒకటి తర్వాత మరొకటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయాలి.

కన్యా రాశి

కన్యా రాశి పదో ఇంట్లో కుజుడి సంచారం జరుగుతుంది. అందువల్ల పాశ్విక్ యోగం వీరికి కష్టాలను ఇస్తుంది. ఈ కారణంగా వివాహితులు వారి వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో అనవసర విషయాల్లో వాదనలకు దిగుతారు. పరిస్థితి అదుపు చేయలేకపోతే వైవాహిక బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ఖర్చులు పెరగవచ్చు. దీని వల్ల ఆందోళన చెందుతారు. విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ధన నష్టం జరగవచ్చు. ఈ సమయంలో కొన్ని విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి ఆరవ ఇంట్లో అంగారకుడి సంచారం జరుగుతోంది. ఈ రాశి వారికి పాశ్విక్ యోగం అశుభం. దీని వల్ల ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ఖర్చులు అధికం అవుతాయి. వాటిని అధిగమించేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఉద్యోగం చేసే ప్రదేశంలో జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. దూకుడు స్వభావం తగ్గించుకోవాలి. భాగస్వామితో కొన్ని విషయాల గురించి వాదనలు జరగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు

జాతకంలో కుజుడు బలహీనంగా ఉండటం వల్ల అనవసర విషయాలపై స్థానికులకు పదే పదే కోపం వస్తుంది. అంగారకుడు కోపం, దూకుడుకు కారణమవుతుంది. జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి భయపడతారు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. జాతకంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల వారి జీవితాల్లో ప్రమాదాలు సంభవిస్తాయి. అసూయ, అహంభావం ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణక్రియ సమస్యలు వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలతో వారు ఇబ్బంది పడవచ్చు.

కుజుడిని బలపరిచే మార్గాలు

జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే మంగళవారం స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి, “ఓం క్రం క్రీం క్రౌం స: భౌమాయ నమః” అనే మంత్రాన్ని మూడు, ఐదు లేదా ఏడు సార్లు జపించండి. మంగళవారం ఉపవాసం అంగారకుడి స్థానాన్ని బలపరుస్తుంది. కుజుడు బలహీనంగా ఉంటే మంగళవారం నాడు హనుమాన్ జీకి వెర్మిలియన్ ఆయిల్ సమర్పించండి. మంగళవారం నాడు హనుమంతుడికి చోళాన్ని సమర్పించండి.

Whats_app_banner