Feng shui tips: ఫెంగ్ షూయి ప్రకారం ఈ ఐదు లక్కీ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు కొదవ ఉండదు-keep these five lucky things at home will be no shortage of money as per feng shui ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Feng Shui Tips: ఫెంగ్ షూయి ప్రకారం ఈ ఐదు లక్కీ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు కొదవ ఉండదు

Feng shui tips: ఫెంగ్ షూయి ప్రకారం ఈ ఐదు లక్కీ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకు కొదవ ఉండదు

Gunti Soundarya HT Telugu
Jul 10, 2024 09:00 AM IST

Feng shui tips: నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే అది జీవితం మీద అనేక విధాలుగా ప్రభావితం చూపిస్తుంది. వాటి నుంచి బయట పడేందుకు ఈ ఫెంగ్ షూయి చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి.

ఈ ఐదు వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమే
ఈ ఐదు వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమే

Feng shui tips: ఫెంగ్ షూయి అనేది చైనీస్ గ్రంథం. మనకు వాస్తు శాస్త్రం ఎంత నమ్మకమో వారికి ఫెంగ్ షూయి శాస్త్రం అంటే అంత గౌరవం. జీవితానికి సంబంధించి అనేక వాస్తు నియమాలు గురించి ఇది వివరిస్తుంది.

ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో ప్రతికూల శక్తి మీ కెరీర్, ఆర్థిక జీవితం, ఆరోగ్యం, ప్రేమ, వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఫెంగ్ షూయి శాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి. వీటిని అవలంబించడం మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు.

జడే మొక్క

కుబేర మొక్కగా ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. చిన్న చిన్న ఆకులు కలిగిన ఈ జడే మొక్క చాలా అదృష్టమని భావిస్తారు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఈ మొక్క ఆక్సిజన్‌ను పెంచడమే కాకుండా ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుంది.

చైనీస్ నాణేలు

ఫెంగ్ షూయి శాస్త్రంలో చైనీస్ నాణేలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. వీటిని ఇంట్లో వేలాడదీయడం లేదా పూజ గదిలో ఉంచుకోవడం శుభకారంగా భావిస్తారు.

చేపల అక్వేరియం

చేపల అక్వేరియం ఇంట్లో ఉంటే వారికి డబ్బు కొరత ఉండదని అంటారు. వాస్తు శాస్త్రం కూడా చేపల అక్వేరియం పెట్టుకోవడం శుభకరంగా చెప్తుంది. మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీ ఇంటికి ఫిష్ అక్వేరియం తీసుకురండి. ఇంట్లో చేపల అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోతుంది. అయితే అక్వేరియంలో వేసే చేపల సంఖ్య కూడా చాలా ముఖ్యం. ఇందులో గోల్డ్ ఫిష్ వేసుకోవడం వల్ల ఆర్థికంగా బలపడతారని నమ్ముతారు.

తాబేలు

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి సంబంధించినదిగా చెప్తారు. విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మవతారం కూడా ఉంది. ఇదే కాదు ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో తాబేలు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంటి ఉత్తర దిశ సంపదకు దేవుడైన కుబేరుడికి సంబంధించినది. కావున తాబేలును నీటి కుండలో ఉత్తర దిక్కున ఉంచితే ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఉత్తర దిశలో తాబేలు ఉంచడం వల్ల కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి. తాబేలు ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు.

లాఫింగ్ బుద్ధ

ఫెంగ్ షూయి ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. లాఫింగ్ బుద్ధను ఎక్కువగా మెయిన్ డోర్ ముందు ఉంచాలి. తద్వారా మీరు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే మొదటి చూపు లాఫింగ్ బుద్ధపై పడుతుంది. ఇది ఇంటికి సంతోషాన్ని, నవ్వులను మాత్రమే కాదు అదృష్టాన్ని ఆర్థిక లాభాలను కూడా ఇస్తుంది.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

WhatsApp channel

టాపిక్