Laughing buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎలాంటిది పెట్టుకుంటే ఇంటికి మంచిది-how many types of laughing buddha and what is its importance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Laughing Buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎలాంటిది పెట్టుకుంటే ఇంటికి మంచిది

Laughing buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎలాంటిది పెట్టుకుంటే ఇంటికి మంచిది

Gunti Soundarya HT Telugu
Dec 13, 2023 11:00 AM IST

Laughing buddha: లాఫింగ్ బుద్ధ చూడగానే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఎలాంటి లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం.

లాఫింగ్ బుద్ధ విగ్రహాలు
లాఫింగ్ బుద్ధ విగ్రహాలు (pixabay)

Laughing buddha: లాఫింగ్ బుద్ధ.. ఈ విగ్రహం చూడగానే మనకి తెలియకుండా మన మొహంలో చిరునవ్వు తీసుకొస్తుంది. చాలా మంది ఇళ్ళల్లో ఈ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు. ఇంటిలో నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే సంపద, అదృష్టం, శ్రేయస్సుని తీసుకొస్తుంది.

వివిధ ఆకారాల్లో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. పెద్ద పొట్ట వేసుకుని నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ద చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని పురాణాల ప్రకారం లాఫింగ్ బుద్ధ బొడ్డుని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుందని చెప్తున్నాయి. ఇల్లు లేదా ఆఫీసు టేబుల్స్ మీద చాలా మంది లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు.

లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎక్కడ పెట్టాలి?

లాఫింగ్ బుద్ధని ఇంటికి ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం ఉత్తమమైనది. లివింగ్ రూమ్, ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా, బెడ్ రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. డబ్బుని ఆకర్షించడానికి పెట్టుకోవాలని అనుకుంటే ఇంటి ప్రవేశ ద్వారంలో తలుపుకి ఎదురుగా పెట్టుకోవాలి. ఆఫీసు డెస్క్ మీద లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే మీ వృత్తిపరమైన జీవితం సంతోషంగా ఉంటుంది.

ఇంటికి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పిల్లలకి చదువు మీద శ్రద్ద కలగాలి అనుకుంటే వాళ్ళ స్టడీ టేబుల్ మీద నవ్వుతున్న బుద్ధుని విగ్రహం ఉంచడం మంచిది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు. భూమికి కనీసం 3-4 అడుగుల ఎత్తులో ఉండాలి. లాఫింగ్ బుద్ద విగ్రహం పూజ చేసేందుకు కాదు. దీన్ని ఎప్పుడు షూ ర్యాక్ పైన పెట్టకూడదు.

లాఫింగ్ బుద్ధ విగ్రహం రకాల ప్రాముఖ్యత

లాఫింగ్ బుద్ధ విగ్రహం రకరకాల భంగిమల్లో కనిపిస్తుంది. లాఫింగ్ బుద్ధ నిటారుగా నిలబడి రెండు చేతులు పైకెత్తి బంగారు కడ్డీ పట్టుకున్నట్టు ఉంటే సంపద, శ్రేయస్సు లభిస్తాయి. ఇది ఇంటికి మంచి చేస్తుంది. ఈ విగ్రహం ఇంటి వాయువ్య మూలలో ఉండాలి.

ఫ్యాన్ పట్టుకున్న లాఫింగ్ బుద్ధ

ఫ్యాన్ తో నవ్వుతున్నట్టు లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అది ఇంటికి అత్యంత మేలు అందిస్తుంది. శక్తివంతమైన బుద్ధ విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇంటికి అలంకరణగా పెడతారు. ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకోరికలు నెరవేరుతాయి. ఒక చేతిలో ఫ్యాన్, మరో చేతికి గోరింటాకు పెట్టుకుని ఉన్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

పిల్లలతో లాఫింగ్ బుద్ధ

ఐదుగురు పిల్లల్ని ఎత్తుకుని ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం సంతానానికి ప్రతీకగా నిలుస్తుంది. కొత్తగా వివాహమైన దంపతులు ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే మంచిది. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు చదువులో రాణిస్తారు. ఏకాగ్రత మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఈ విగ్రహాన్ని పడకగది పశ్చిమ దిశలో పెట్టాలి.

చేతులు పైకెత్తి ఉన్న లాఫింగ్ బుద్ధ

నిలబడి రెండు చేతులు పైకెత్తి నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఆనందం, శ్రేయస్సు ఇస్తుంది. డబ్బు సంపాదించాలనుకుంటున్న వాళ్ళు, సంతోషకరమైన జీవితం కావాలనుకున్న వాళ్ళు ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకోవచ్చు.

డ్రాగన్ తో నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ శ్రేయస్సు, పాజిటివ్ ఎనర్జీని సూచిస్తాయి. తాబేలుతో ఉన్న లాఫింగ్ బుద్ధ కూడా సంపదని సూచిస్తుంది. ఫెంగ్ షూయి ప్రకారం డ్రాగన్, తాబేలు రెండూ సంపదకి చిహ్నాలుగా భావిస్తారు. అందుకే చాలా మంది క్రిస్టల్ తాబేలు బొమ్మ పెట్టుకుంటారు.

చేతిలో డబ్బు సంచి పట్టుకుని వు లౌ పట్టుకుని ఉన్న లాఫింగ్ బుద్ధ ఆరోగ్యం, దీర్ఘాయువు ఇస్తుంది.

టాపిక్