Laughing Buddha | ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ పెట్టకూడదో మీకు తెలుసా?
లాఫింగ్ బుద్ధ విగ్రహం గురించి తెలియని వాళ్లుండరు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా, ఎవరిపై కోపంలో ఉన్నా, ఎలాంటి సమస్యతో అయినా సతమతమవుతుంటే.. 10సెకన్ల పాటు లాఫింగ్ బుద్ధ విగ్రహం చూస్తే చాలు ఆ సమస్యల నుంచి కాసేపు అయినా విముక్తి పొందుతారు. అంతటి పవర్ ఉంది ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాలకి.
లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం, ఐశ్వర్యం కలిసి వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. లాఫింగ్ బుద్ధా అదృష్టానికి చిహ్నమని చెబుతుంటారు. అయితే ఇంతటి పవిత్రమైన లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఏదిశలో పెట్టుకుంటే ఎలాంటి లాభం జరుగుతుందనేది చాలా మందికి ఉన్న సందేహం.
- మీ ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచితే కుటుంబసభ్యుల మధ్య గొడవలు తగ్గి ప్రశాంతత చేకూరుతుందని విశ్వాసం.
- ఇంట్లో పడమర దిశలో ఈ విగ్రహాన్ని ఉంచినట్లయితే దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం.
ఉద్యోగ ప్రయత్నాల కోసం..
- ఇంటికి ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం పెడితే ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయని విశ్వాసం. ఈ దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో డబ్బులకు కొరత ఉండదు.
- ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా, మీ పనిపై చెడు దృష్టి పడుతున్నట్లు భావిస్తే నడిచే దారిలో లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టండి.
- ఇల్లు, ఆఫీసుల్లో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే.. రెండు చేతులు పైకి ఎత్తి ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ప్రత్యేకంగా తూర్పు వైపుగా ఉంచాలి.
- సంతానం కలగాలంటే.. పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలి.
- వంటగదిలో, బాత్రూమ్ సమీపంలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచకూడదు.
- విగ్రహాన్ని ఎప్పుడూ కంటికి కనిపించే అంత ఎత్తులో ఉంచుకోవాలి. అలాగే ప్రతి రోజూ ఈ విగ్రహం పొట్టపై కుడి చేత్తో రుద్దడం వల్ల శుభం కలుగుతుందట.
సంబంధిత కథనం