Home Main entrance vastu tips: ఇంటి ప్రవేశ ద్వారం ఏ దిక్కున ఉంటే సంపద పెరుగుతుంది-which direction is best for main entrance as per individual zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Home Main Entrance Vastu Tips: ఇంటి ప్రవేశ ద్వారం ఏ దిక్కున ఉంటే సంపద పెరుగుతుంది

Home Main entrance vastu tips: ఇంటి ప్రవేశ ద్వారం ఏ దిక్కున ఉంటే సంపద పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
Dec 11, 2023 08:43 AM IST

Main entrance vastu tips: ఇంటి ప్రధాన ద్వారం సరైన దిక్కున లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు. ఈ రాశుల వారికి సింహ ద్వారం ఈ విధంగా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.

ఏ దిక్కున ఇంటి ప్రధాన ద్వారం ఉండాలి
ఏ దిక్కున ఇంటి ప్రధాన ద్వారం ఉండాలి (pixabay)

Home main entrance vastu tips: ఇల్లు అందమైన స్వరం. ప్రతి ఒక్కరి కల తమకి ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతాడు. ఇంటికి ప్రధాన ప్రవేశ ద్వారం అనేది చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే అనేక అనర్థాలు ఎదురవుతాయి. ఇంటి ప్రవేశ ద్వారం నుంచే శక్తులు ఇంట్లోకి వెళ్ళడానికి, బయటకి పోవడానికి ఉంటుంది. ఇంట్లో శ్రేయస్సు, కుటుంబం బాగుండాలంటే ప్రధాన ద్వారం సరైన దిశలో ఉండాలి.

ప్రధాన ప్రవేశ ద్వారం ప్రాముఖ్యత

ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇవి సానుకూల శక్తిని విడుదల చేస్తుంది. ముందు తలుపు నుంచి వెలువడే శక్తి మొత్తం భవనం మీద పడుతుంది. అందుకే వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం పెడతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సృష్టించడంలో ప్రధాన ద్వారం కీలక పాత్ర పోషిస్తుంది. ఏయే రాశుల వారికి ఏ విధంగా ఇంటి ప్రధాన ద్వారం ఉంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం.

ఏ రాశి వారికి ఏ దిక్కు ప్రవేశ ద్వారం మంచిదంటే…

మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశ ఉత్తమమైనది. వృషభం, తుల, మకర రాశుల వారికి దక్షిణ ద్వారం మంచిది. మిథునం, కన్య, కుంభ రాశులకు పశ్చిమ ద్వారం మంచిది. కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వారికి ఉత్తర ద్వారం మేలు చేస్తుంది. ఒకవేళ రాశికి అనుగుణంగా ద్వారం ఏర్పాటు చేయలేకపోతే ఆ దిశలో కనీసం కిటికీ పెట్టినా శుభప్రదంగానే ఉంటుంది.

వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికైనా సరిపోతాయి. కానీ దక్షిణ, పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశులకి తప్ప వేరొకరికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఉత్తర దిశలో ప్రధాన ద్వారం ఉంటే సంపద, అదృష్టం కలుగుతుంది. తూర్పున ఉంటే ఇంట్లోకి శక్తి, ఆనందం వస్తుంది. ప్రధాన ద్వారం కోసం పశ్చిమ, వాయువ్య దిశలు శుభప్రదంగా పరిగణిస్తారు.

ఇంటి ప్రధాన ద్వారం వాస్తు శాస్త్రం ప్రకారం ఉండటం వల్ల మీకు సంపద, ఆనందాన్ని ఇస్తుంది. మెయిన్ డోర్ కి ఎప్పుడు నలుపు రంగు తలుపు పెట్టకూడదు. అది ఇంటికి అరిష్టంగా భావిస్తారు. అందుకే ఎక్కువ మంది దేవతామూర్తులు ఉన్న వాటితో డిజైన్ చేయించి పెట్టుకుంటారు. ఇంటి ప్రవేశ ద్వారం ఈశాన్య దిశగా ఉండటం వల్ల సూర్యుని కాంతి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి.

తలుపు పగిలితే మార్చేయాలి

ఇతర తలుపులతో పోలిస్తే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసే తలుపు పరిమాణం పెద్దదిగా ఉండాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బేసి సంఖ్యలోనే మెట్లు ఏర్పాటు చేయాలి. అలా చేయడం వల్ల ఇంటిని హానికరమైన ప్రభావాల నుంచి కాపాడుతుంది.

ప్రవేశ ద్వారం పగిలినా లేదంటే విరిగినా వెంటనే కొత్తది పెట్టించుకోవడం మంచిది. వాస్తు ప్రకారం తలుపు అలా ఉంటే దోషం అంటారు. ఇంటి కుటుంబ సభ్యుల శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది. సంపద మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సరైన కాంతి ఉండే విధంగా చూసుకోవాలి.