Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్ .. కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్,దీపను కలుసుకున్న సుమిత్ర-karthika deepam 2 serial today july 12th episode sumitra questions deepa for leaving the house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2:కార్తీకదీపం 2 సీరియల్ .. కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్,దీపను కలుసుకున్న సుమిత్ర

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్ .. కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్,దీపను కలుసుకున్న సుమిత్ర

Gunti Soundarya HT Telugu
Jul 12, 2024 07:01 AM IST

Karthika deepam 2 serial today july 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సుమిత్ర కుటుంబం గుడికి వెళ్ళి కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తారు. అదే గుడికి దీప కూడా వెళ్తుంది. సుమిత్ర దీపను చూసి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయావని నిలదీస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 12వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 12వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today july 12th episode: గోడ మీద రాసిన కార్తీక్ పేరును దీప చెరిపోయబోతుంటే శౌర్య ఆపుతుంది. పేరు చెరిపోతే అలుగుతానని అంటుంది. గోడ మీద ఇలా పేర్లు రాయకూడదని చెప్తుంది. శౌర్య వెళ్ళి తన చేతి మీద కార్తీక్ అని పేరు రాసుకుంటుంది. ఇంటి ఓనర్ మూర్తి వచ్చి రామాలయంలో అన్నదానం చేస్తున్నాను ప్రసాదం చేయమని దీపకు పురమాయిస్తాడు.

yearly horoscope entry point

తప్పు చేస్తున్నావ్ పారు

పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారని తెలుసుకున్న కార్తీక్ జ్యోత్స్నకు నిజం చెప్పాలని ఇంటికి వస్తాడు. ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడని అడుగుతాడు. నీకు జ్యోత్స్నకు నిశ్చితార్థం ముహూర్తం పెట్టించడం కోసం గుడికి వెళ్లారని శివనారాయణ చెప్పడంతో షాక్ అవుతాడు.

సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నావా అని పారిజాతం కావాలని కార్తీక్ ని కదిలిస్తుంది. తప్పు చేస్తున్నావ్ పారు అన్ని విషయాలు తెలిసి కూడా దగ్గరుండి ఇలా చేయిస్తున్నావని అంటాడు. నీ చేత్తో నా మనవరాలి మెడలో మూడు ముళ్ళు వేయించే బాధ్యత నాది అని పారిజాతం అంటుంది.

పగటి కలలు కనకు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి ముహూర్తాలు పెట్టించడం ఆపించేస్తానని ఆవేశంగా చెప్తాడు. అన్న కూతురిని కోడలిని చేసుకోవాలని మాట తీసుకుంది మీ అమ్మ. పెళ్లి వద్దని అంటే మొదట బాధపడేది మీ అమ్మ. ఇక నీ మరదలు బావ పెళ్లి వద్దని అంటే విషం తాగి చస్తానని అంటుంది.

నిశ్చితార్థం అపలేవు

ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఒక్కటిగా ఉంటున్న కుటుంబం రెండు ముక్కలు అవుతుంది. ఈ నిశ్చితార్థాన్ని నువ్వు అపలేవని బ్లాక్ మెయిల్ చేయడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. దీప, శౌర్యను తీసుకుని గుడికి వెళ్తుంటే ఆటో ఆగిపోతుంది. దారిలో ఒక పాప తన తండ్రితో కలిసి వెళ్ళడం శౌర్య చూస్తుంది.

తండ్రి గురించి అడుగుతాడని దీప భయపడుతుంటే కార్తీక్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. సుమిత్ర, కాంచన దంపతులు గుడిలో శాంతి పూజ చేయించి జ్యోత్స్న, కార్తీక్ నిశ్చితార్థం ముహూర్తం పెట్టించేందుకు పంతులుతో మాట్లాడతారు. అదే గుడికి దీప కూడా వస్తుంది.

ముహూర్తం ఫిక్స్

వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. దీంతో అందరూ సంతోషంగా అదే ముహూర్తాన్ని ఖాయం చేయమని చెప్తారు. దీప గుడిలో సుమిత్రను చూస్తుంది. అక్కడే ఉన్న మిగతా వాళ్ళను చూస్తుంది. శౌర్య చూస్తే పరిస్థితి ఏంటని అనుకుంటుంది.

శౌర్య సుమిత్రను చూసి అమ్మమ్మ ఇక్కడే ఉందని వెళ్లబోతుంటే దీప ఆపుతుంది. మనం అక్కడికి ప్రసాదం తెచ్చుకుందామని అంటే దీప వద్దని వారిస్తుంది. దీప గుడి వెనుక వెళ్ళి సుమిత్రకు కనిపించకుండా నిలబడుతుంది. అప్పుడే సుమిత్ర వచ్చి దీప అని తన భుజం మీద చెయ్యి వేస్తుంది.

దీపను కలిసిన సుమిత్ర

దొరికిపోతానని అనుకోలేదు కదా. నీ కూతురిని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడికి రావడం నేను చూశాను. ఏంటి దీప ఇది అసలు ఏం జరుగుతుంది. శౌర్యకు ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ లో చేర్పించావు. ఆ విషయం మాకేవారికీ చెప్పలేదు. అర్థరాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది.

ఏం జరగలేదని దీప చెప్పకుండా దాచేస్తుంది. ఏదో జరిగింది అది నువ్వు నాతో చెప్పడానికి ఇష్టపడటం లేదు. నేనే తెలుసుకోవాలని అనుకుంటుంది. ఎన్ని రోజులు పరాయి ఇంట్లో ఉంటాను వెళ్లిపోతానని ఎప్పుడో చెప్పాను కదా అది ఇప్పుడు చేశానని అంటుంది.

బాగా అబద్ధం చెప్పావని సుమిత్ర అంటుంది. నువ్వు నన్ను చూసి కూడా దాక్కున్నావ్ అంటే ఏదో తప్పు జరిగింది. నువ్వు ఏం తప్పు చేశావని నిలదీస్తుంది. నేను తప్పు చేశాను అంటే మీరు నమ్ముతారా అని దీప అడుగుతుంది. దేవుడు దిగి వచ్చి నువ్వు తప్పు చేశావ్అని చెప్పినా కూడా నేను నమ్మను.

ఎందుకు వెళ్లిపోయావు?

కారణం లేకుండా నువ్వు ఏ పని చెయ్యవు. ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? నీ భర్త నిన్ను బెదిరించాడా? మీ అత్త నిన్ను ఏమైనా మాటలు అన్నదా అంటే దీప లేదని బదులిస్తుంది. మరి ఎందుకు వెళ్లిపోయావని అడుగుతుంది. ఏం లేడు అక్కడ ఎన్నాళ్ళు ఉంటాను చెప్తే వెళ్లనివ్వరని ఎవరికి చెప్పకుండా వచ్చేశానని చెప్తుంది.

సుమిత్ర సైలెంట్ అయిపోతుంది. నువ్వు నన్ను పరాయి దాన్ని అనుకుంటావ్ కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడూ కూతురు అనుకుంటాను. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కార్తీక్ నీకోసం వెతుకుతున్నాడు. నీ జీవితానికి ఏ దారి చూపించలేదని బాధ నాకు ఉంది.

నిశ్చితార్థానికి రా దీప

నా మనవరాలిని తీసుకుని మన ఇంటికి వచ్చేయమని సుమిత్ర పిలిస్తే రానని చెప్తుంది. కార్తీక్, జ్యోత్స్నకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించడానికి వచ్చాము. మీరు నా ఇంట్లో జరిగే శుభకార్యానికి లేకపోతే నాకు వెలితిగా ఉంటుంది.

రా దీప నువ్వు వస్తే నేను చాలా సంతోషపడతాను. నేను నీకు పరాయిదాన్ని ఏమో కానీ నువ్వు నాకు ఎప్పటికీ నా కూతురువే. నా చిన్న కూతురు నిశ్చితార్థానికి నా పెద్ద కూతురు రాకపోతే ఎలా అంటుంది. కానీ దీప మాత్రం తాను రాలేనని అంటుంది. రాలేను అనేది నీ నిర్ణయం రావాలి అనేది నా కోరిక ఏం చేయాలి అనేది నీ ఇష్టమని సుమిత్ర చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner