Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. ఎట్టకేలకు కార్తీక్ ను కలుసుకున్న శౌర్య, దీప ఇంటి అడ్రస్ తెలుసుకున్న జ్యోత్స్న-karthika deepam 2 serial today july 17th episode sourya and karthik feel happy as they meet each other ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. ఎట్టకేలకు కార్తీక్ ను కలుసుకున్న శౌర్య, దీప ఇంటి అడ్రస్ తెలుసుకున్న జ్యోత్స్న

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. ఎట్టకేలకు కార్తీక్ ను కలుసుకున్న శౌర్య, దీప ఇంటి అడ్రస్ తెలుసుకున్న జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu
Jul 17, 2024 07:05 AM IST

Karthika deepam 2 serial today july 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య ఎట్టకేలకు కార్తీక్ ను కలుసుకుంటుంది. కడియం ద్వారా కార్తీక్ శౌర్యను దీప ఇంటికి తీసుకుని వెళతాడు. వాళ్ళను ఫాలో అవుతూ వెళ్ళి జ్యోత్స్న కూడా దీప ఇల్లు తెలుసుకుంటుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 17వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 17వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today july 17th episode: శౌర్య రోడ్డు మీద ఏడుస్తూ నడవడం కడియం చూస్తాడు. వెంటనే తన దగ్గరకు వెళతాడు. అమ్మ ఏది అంటే నేను కార్తీక్ కోసం వచ్చాను, అమ్మకు చెప్పలేదని అంటుంది. అలా రావడం తప్పు కదా అమ్మ ఎంత భయపడుతుందని శౌర్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లడానికి చూస్తాడు.

yearly horoscope entry point

నీ ప్రాబ్లం ఏంటి బావ?

కానీ శౌర్య మాత్రం నేను ఇంటికి రాను అమ్మ నన్ను కార్తీక్ ని కలవనివ్వడం లేదని మొండికేస్తుంది. కార్తీక్ తో మాట్లాడకుండా ఇంటికి రానని అంటుంది. కార్తీక్ ఇంటి దగ్గర సుమిత్ర కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. తన పక్కన కూర్చుని మాట్లాడుతుంటే బయటకు వెళ్తానని అంటాడు.

జ్యోత్స్న తనని ఆపి అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా ఉంటున్నావ్. గురువారం మన ఎంగేజ్ మెంట్. నీ జీవితం గురించి మమ్మీతో మాట్లాడాలని అన్నావ్ అదేంటో చెప్పమని నిలదీస్తుంది. అత్తతో మాత్రమే చెప్తానని కోపంగా సమాధానమిస్తాడు. నేను నీకు కాబోయే భార్యను అందరి కంటే ఇప్పుడు నేనే నీకు ఎక్కువని పట్టుబడుతుంది.

కార్తీక్ కి కడియం ఫోన్ 

లేదు అత్తతోనే చెప్తానని అంటే జ్యోత్స్న కోపంగా చెప్పకపోతే తన మీద ఒట్టే అని అంటుంది. నీ మనసులో ఏముందో నాకు చెప్పాల్సిందేనని పట్టుబడుతుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎందుకు ఆగడం నిజం చెప్పేయాలని డిసైడ్ అవుతాడు. శౌర్య కార్తీక్ అంటూ ఏడుస్తుంటే కడియం కార్తీక్ కి ఫోన్ చేస్తాడు.

కార్తీక్ నిజం చెప్పే టైమ్ కి కడియం ఫోన్ చూసి టెన్షన్ గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కడియం శౌర్య గురించి చెప్తాడు. కార్తీక్ హడావుడిగా వెళ్ళిపోతాడు. కార్తీక్ ని ఫాలో అవుతూ జ్యోత్స్న కూడా వెళ్తుంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నువ్వు దీప దగ్గరకు వెళ్తున్నావని జ్యోత్స్న అనుకుంటుంది.

కార్తీక్ రాగానే శౌర్య హగ్ చేసుకుని బాగా ఏడుస్తుంది. నువ్వు ఎందుకు రాలేదు నువ్వు అసలు మంచి ఫ్రెండ్ కాదు. హాస్పిటల్ లో నాతో ఉండమని చెప్పాను కదా ఎందుకు వెళ్లిపోయావు. తర్వాత అయినా మా ఇంటికి రావాలి కదా ఎందుకు రాలేదని నిలదీస్తుంది.

నిజం చెప్పేసిన కడియం 

బావకు ఫోన్ చేసింది శౌర్య అని జ్యోత్స్న చూస్తుంది. శౌర్య కార్తీక్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నాకు నిన్ను చూడాలని అనిపిస్తుంది. అందుకే అమ్మకు చెప్పకుండా తీసుకొచ్చాను. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియక రోడ్డు మీద వెళ్తున్న కార్లు చూస్తూ వచ్చాను.

దార్లో బూచోడు కనిపించాడు. కనిపించకుండా దాక్కున్నానని చెప్తుంది. అమ్మకు చెప్పకుండా ఇలా రాకూడదని వెంటనే ఇంటికి వెళ్దామని అంటాడు. కార్తీక్ దీప ఇల్లు తెలుసా అని కడియం అంటే కంగారులో తెలుసని చెప్తాడు. మళ్ళీ తెలియదని అంటే శౌర్య అదేంటి నువ్వే కదా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లిందని అంటుంది.

నరసింహను దెప్పిపొడిచిన శోభ 

కార్తీక్ కడియాన్ని తిడతాడు. వీళ్ళు దీప దగ్గరకే వెళ్తున్నారని మళ్ళీ కార్తీక్ ని ఫాలో అవుతుంది. నరసింహ డల్ గా ఇంటికి వస్తాడు. ఒట్టి చేతులతో వచ్చినందుకు శోభ నరసింహను దెప్పిపొడుస్తుంది. అనసూయ ఓపిక పట్టమని సర్ది చెప్తుంది. దీప కూతురిని నీ కూతురుగా పెంచగలవా అని అనసూయ గట్టిగా అడుగుతుంది.

ముందు కూతురిని తీసుకురమ్మనండి ఎలా పెంచుతానో చూస్తానని చెప్తుంది. నీ మనవరాలిని నువ్వే వెళ్ళి తీసుకురావచ్చు కదాని శోభ అనసూయను తిడుతుంది. మీరు ఎలాగో కొట్టుకుని చావండి నేను ఎలాగైనా నా బిడ్డను తెచ్చుకుంటానని అంటుంది. ఈ విషయం శౌర్య వాళ్ళ అమ్మకు చెప్తే ఏంటి పరిస్థితి అంటే చెప్పే ఉంటుందని అనసూయ అంటుంది.

శౌర్య ఇంటికి వచ్చి ఉంటుందేమోనని దీప మళ్ళీ ఇంటికి వస్తుంది. శౌర్య అని పిలుస్తూ ఇల్లంతా తిరుగుతుంది. కానీ ఎక్కడా కనిపించదు. శౌర్య కార్తీక్ బాబు కోసం వెళ్ళిపోయి ఉంటుందని దీప కంగారుగా బయటకు వస్తుంది. అప్పుడే కార్తీక్ కారు ఇంటి ముందు ఆగుతుంది.

దీప అడ్రస్ తెలుసుకున్న జ్యోత్స్న 

కారులో నుంచి శౌర్య దిగడం చూస్తుంది. జ్యోత్స్న దూరంగా ఉండి దీపను చూస్తుంది. ఇంటి దగ్గర ఉండమంటే కార్తీక్ బాబు కోసం వెళ్లిపోయావా అని దీప శౌర్యను తిడుతుంది. అడ్రస్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు మా ముందు ఏమి తెలియనట్టు నటిస్తూ ఇక్కడికి వచ్చి కలుస్తున్నారు మీరు అని జ్యోత్స్న రగిలిపోతుంది.

గోడ మీద కార్తీక్ అనే పేరును చూస్తాడు. నువ్వు నాతో లేవు కదా అందుకే నీ పేరు రాసుకున్నానని శౌర్య చెప్తుంది. నా కార్తీక్ నా కోసం వచ్చాడని శౌర్య సంతోషంగా చెప్తుంది. తనకు ఇంటి అడ్రస్ తెలియదు కడియం తాత కూడా చెప్పలేదు అందుకే రాలేదు. లేదంటే ఎప్పుడో వచ్చేవాడని చెప్తుంది.

కార్తీక్ వెళ్లబోతుంటే శౌర్య నా గుండె ఇంకా భయంతో కొట్టుకుంటుంది. మళ్ళీ బూచోడు వస్తాడేమోనని అనేసరికి దీప టెన్షన్ పడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner