Karthika deepam 2 serial: దీపను హేళన చేసిన జ్యోత్స్న..ఫ్యామిలీతో రెస్టారెంట్ కి కార్తీక్, నిజం చెప్పేస్తాడా?
Karthika deepam 2 serial today july 1st episode: కార్తీక్ రెస్టారెంట్ చూసి శౌర్య తల్లిని హోటల్ గురించి అడుగుతుంది. దానికి జ్యోత్స్న దీపను అవమానించేనలా హేళనగా మాట్లాడుతుంది. వెంటనే కార్తీక్ దీపను సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు.
Karthika deepam 2 serial today july 1st episode: రౌడీ ఎందుకు వారం రోజులు స్కూల్ కి పంపించకూడదని కార్తీక్ దీపను అడుగుతాడు. ఊరు వెళ్లాలని అనుకుంటున్నాను అందుకే స్కూల్ కి పంపించడం లేదని చెప్తుంది. కార్తీక్ శౌర్యను పలకరిస్తే అలిగి బుంగమూతి పెడుతుంది.
అలిగిన రౌడీ
నేను నీతో మాట్లాడనని చెప్తుంది. నేను ఫోన్ చేసి రమ్మంటే సరే అన్నావ్ కానీ రాలేదు నీకోసం ఎంత ఎదురుచూశానో తెలుసా? కావాలనే నువ్వు నా దగ్గరకు రాలేదు కదా అంటుంది. లేదు నేను ఆఫీసుకు వెళ్లానని చెప్తాడు. కాదు నువ్వు వచ్చావ్ నాకు అనిపించిందని చెప్తుంది.
ఫంక్షన్ కి ఎందుకు రాలేదని కార్తీక్ ని నిలదీస్తుంది. దీప వారించాలని చూసినా కూడా శౌర్య మాత్రం వినిపించుకోదు. ఇక ఎప్పుడు ఫ్రెండ్ ని ఇలా వదిలేయనని ప్రామిస్ చేయమని అడిగితే ఎప్పుడూ బాధపెట్టనని ప్రామిస్ చేస్తాడు. అమ్మ కనిపించకపోతే ఎంత బాధ కలుగుతుందో నువ్వు కనిపించకపోయిన అంతే బాధ కలిగింది.
మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని అంటుంది. స్కూల్ లో చాలా బాగా మాట్లాడావని మెచ్చుకుంటాడు. నీకు ట్రీట్ ఇస్తానని మన రెస్టారెంట్ కి వెళ్దామని దీప, శౌర్యను రమ్మని పిలుస్తాడు. దీప మాత్రం రాలేనని చెప్తుంది. సరే అయితే రౌడీని తీసుకుని వెళ్తానని అనేసరికి నరసింహ మాటలు తలుచుకుంటుంది.
ఎంగేజ్ మెంట్ కి ప్లాన్
శౌర్య బతిమలాడటంతో బయటకు వస్తానని ఒప్పుకుంటుంది. బయటకు వెళ్తున్నామని శౌర్య తెగ సంబరపడిపోతుంది. అమ్మకు వంట చేసినందుకు దీపకు థాంక్స్ చెప్తాడు. రౌడీని స్కూల్ కి పంపించకపోవడానికి కారణం ఏంటని మళ్ళీ అడుగుతాడు. కానీ దీప చెప్పదు. కారణం ఏంటో తెలుసుకుంటాను ఏదో ఒకరోజు తెలుస్తుందని అనేసి వెళ్ళిపోతాడు.
శివనారాయణ తెగ ఆలోచించి ఎంగేజ్ మెంట్ రెస్టారెంట్ లో ప్లాన్ చేద్దాం. పెళ్లి ఇంట్లో పెట్టుకుందామని చెప్తాడు. ఇది పెరిగిన ఈ ఇంట్లోనే అన్నీ శుభకార్యాలు జరగాలని సుమిత్ర అంటుంది. పెళ్లి గురించి మాట్లాడుకోవడం చూసి పారిజాతం కార్తీక్ సరే అనకుండానే వీళ్ళు తెగ హడావుడి చేస్తున్నారని అనుకుంటుంది.
ట్రీట్ ఇస్తానన్న కార్తీక్
కార్తీక్ వచ్చి దేని గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. మీ గురించే మాట్లాడుకుంటున్నామని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్నను రెడీ అవమని రెస్టారెంట్ కి వెళ్దామని చెప్తాడు. మొదట సంబరపడిన జ్యోత్స్న… దీప, శౌర్య కూడా వస్తున్నారని చెప్పడంతో మొహం చిరాకుగా పెట్టేస్తుంది.
దీప వాళ్ళు ఎందుకని పారిజాతం ప్రశ్నిస్తుంది. రౌడీని ఎప్పటి నుంచో బయటకు తీసుకుని వెళ్లాలని అనుకున్నాను. అందుకే తీసుకెళ్తున్నా అని చెప్తాడు. మరి దీప ఎందుకు అంటే అమ్మ తీసుకురమ్మనదని అబద్ధం చెప్తాడు.
రెడీగా ఉండు వచ్చి పికప్ చేసుకుంటానని అంటే వద్దని చెప్పేస్తుంది. నా కారులో నేను వస్తానని జ్యోత్స్న చెప్తుంది. నీతో పాటు నేను వస్తానని పారిజాతం అడిగితే అవసరం లేదని జ్యోత్స్న చెప్తుంది. స్వప్న కావేరిని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లాలని బయటకు తీసుకొస్తుంది.
దీపను హేళన చేసిన జ్యోత్స్న
కార్తీక్ కి ఫోన్ చేసి మంచి రెస్టారెంట్ పేరు చెప్పమని అడుగుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ కి రమ్మని తాను అక్కడే ఉన్నానని చెప్తాడు. కార్తీక్ రెస్టారెంట్ చూసి ఎంత పెద్దగా ఉందో నీ టిఫిన్ సెంటర్ కూడా ఇలాగే పెద్దగా ఉంటుందా అని శౌర్య అడుగుతుంది. వాళ్ళది ఈ రెస్టారెంట్ లో వాష్ రూమ్ అంత కూడా ఉండదని జ్యోత్స్న దీపను అవమానకరంగా మాట్లాడుతుంది.
కార్తీక్ దీపను వెనకేసుకొస్తాడు. హోటల్ సిబ్బంది అంతా జ్యోత్స్నకు విష్ చేస్తారు. ఎందుకని శౌర్య అమాయకంగా అడిగితే దీనికి ఓనర్ తన కోడలేనని కాంచన చెప్తుంది. పెళ్లి విషయం మాట్లాడమని తెలిసి దీపను ఎందుకు తీసుకొచ్చాడని శ్రీధర్ అనుకుంటాడు. అప్పుడే అక్కడికి కావేరిని తీసుకుని స్వప్న రెస్టారెంట్ కి వస్తుంది.
రెస్టారెంట్ కి స్వప్న, కావేరి
పెళ్లి విషయం మాట్లాడటానికి దీపను ఎందుకు తీసుకొచ్చాడని జ్యోత్స్న కూడా అనుమానిస్తుంది. దీప రెస్టారెంట్ బయట స్వప్న వాళ్ళను చూసి కంగారుపడుతుంది. శ్రీధర్ గారిని కుటుంబంతో చూస్తే నిజం తెలిసిపోతుందని టెన్షన్ పడుతుంది. ఇలా అందరి ముందు తెలిసిపోవడం మంచిది కాదని అనుకుంటుంది.
దీప శ్రీధర్ కి సైగ చేసి బయటకు చూడమని చెప్తుంది. స్వప్న వాళ్ళను చూసి శ్రీధర్ టెన్షన్ పడతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్