Karthika deepam 2 serial:కార్తీకదీపం 2 సీరియల్.. దీపను బెదిరించిన నరసింహ.. పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానన్న కార్తీక్
Karthika deepam 2 serial today june 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య తనకు పుట్టిన కూతురు అయితే ఇచ్చేయమని లేదంటే బలవంతంగా అయినా ఎత్తుకెళ్లిపోతానని దీపను నరసింహ బెదిరిస్తాడు.
Karthika deepam 2 serial today june 29th episode: దీపను ప్రిన్సిపల్ కూడా మెచ్చుకుంటాడు. గతంలో అవమానించినందుకు క్షమించమని అడుగుతాడు. శ్రీధర్ వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతుంది. స్వప్నకు తెలియదు కానీ నీకు తెలిసి ఎందుకు అడుగుతున్నావని సీరియస్ అవుతాడు.
ఏం నిజం దాచారు?
నువ్వు పిలవగానే రమన్నంత తేలిక కాదు రావడం. స్వప్నకు ఈ నిజం ఎప్పుడో చెప్పి ఉండాల్సింది కానీ ఏదో ఒకరోజు అని అక్కడ స్వప్న ఉండటం చూసి ఆపేస్తాడు. స్వప్న మాటలు విన్నదేమోనని కంగారుపడతారు. శ్రీధర్ వెళ్తుంటే ఆపి నాతో చెప్పాల్సిన నిజం ఏంటి? ఏదో ఒకరోజు అని తెలియాల్సిందే కదా అని ఎందుకు సగంలో ఆపేశావని నిలదీస్తుంది.
నేను నీ దగ్గర ఒక నిజం దాచాను. ఆ విషయం నేను చెప్పడం కంటే మీ అమ్మ చెప్పడమే మంచిదని కావేరిని ఇరికిస్తాడు. కావేరి కంగారుగా మాట్లాడుతుంది. నిజం చెప్తాడని టెన్షన్ పడుతుంది. నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది వాళ్ళకి నీ ఫోటో పంపించాను నువ్వు వాళ్ళకు తెగ నచ్చావు.
ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నామని కవర్ చేస్తాడు. డాడీని అనవసరంగా అనుమానించానని స్వప్న ఫీలవుతుంది. క్యాంప్ కి వెళ్తున్నానని చెప్పి మొదటి భార్య దగ్గరకు బయలుదేరతాడు. దీప సంతోషంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నరసింహ అడ్డుపడతాడు.
మంచి మనిషిగా బతుకు
చప్పట్లు కొట్టి వెటకారంగా దీపను అవమానిస్తాడు. ఫాదర్స్ డే ఫంక్షన్ కి నేను కూడా వచ్చాను. అది తండ్రి గురించి మాట్లాడుతుంటే అప్పుడు అర్థం అయ్యింది నువ్వు దాన్ని ఎలా తయారు చేశావోనని అంటాడు. నీలాంటి వాడి గురించి తెలిస్తే నా కూతురు అసహ్యించుకుంటుందని అంటుంది.
తండ్రి కార్తీక్ అని తన పేరు చెప్పు అది ఆనందపడిద్దని అంటాడు. తనని తనలాగే ఉండనివ్వమని దీప వార్నింగ్ ఇస్తుంది. అది నా బలహీన అనుకుంటున్నావేమో కానీ అది నా బలం. దాని కోసం చేతులు చచ్చి బతిమలాడగలను, అవసరంఅయితే చెయ్యి ఎత్తగలను. మంచి భర్త కాలేదు, తండ్రివి కాలేకపోయాను మంచి మనిషిగా ఉండమని చెప్తుంది.
నువ్వు నన్ను ఏం చేస్తావ్ కొడతావా కొట్టు.. నేను గాలిలో దుమ్ములాంటి వాడిని ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. ఈ పంచాయతీ ఎందుకు ఒక మాటకు వద్దామని అంటాడు. సంబంధంలేదని వదిలేశావ్ అలాగే ఉండనివ్వమని అంటుంది. అయితే నీ కూతురు నాకు పుట్టలేదని ఒప్పుకో.
బూచోడు వస్తాడు
ఒకవేళ నాకు పుట్టి ఉంటే నాకు ఇచ్చేయ్. నువ్వు చెప్పే సమాధానంతో నేను సైలెంట్ అయిపోతాను. నాకు కావాల్సింది నా కూతురు. నువ్వే తేల్చుకో. నువ్వు సమాధానం చెప్పకపోతే నేను సైలెంట్ గా ఉండనని బెదిరిస్తాడు. నాకంటూ మిగిలిన ఒకే ఒక బంధం అది దాన్ని నాకు వదిలిపెట్టు అని బతిమలాడుతుంది.
నాకు పుట్టలేదని చెప్పు నోరు మూసుకుని వెళ్లిపోతాను. దాని ఒంట్లో నా రక్తమే ఉంటే చెప్పు నేను తీసుకుని వెళ్లిపోతాను. నీకు టైమ్ లేదు ఆలోచించుకో. సమాధానం ఇస్తావో కూతురిని ఇస్తావో తేల్చుకో అంటాడు. కార్తీక్ ని అడ్డం పెట్టుకుని దీపను మాటలు అంటాడు.
బూచోడు వస్తాడు పాప జాగ్రత్త అనేసి బెదిరించి వెళ్ళిపోతాడు. పెళ్లి గురించి క్లారిటీ కావాలని శ్రీధర్ కాంచన కార్తీక్ ని నిలదీస్తారు. త్వరగా పెళ్లి చేసుకోమని చెప్తాడు. లేదంటే నీ మీద పడిన నిందలు ఎక్కడ నిజమవుతాయోనని శ్రీధర్ నోరు జారతాడు. పెళ్లి గురించి ఒక విషయం చెప్పేస్తానని కార్తీక్ చెప్తాడు.
స్కూల్ కి వెళ్లొద్దు
శౌర్య బుంగమూతి పెట్టుకుని కూర్చుంటుంది. దీప చూసి ఏమైంది శౌర్య పాప డల్ గా ఉందని అడుగుతుంది. నా కూతురు నన్ను ఎంత ప్రేమిస్తుందోనని మురిసిపోతుంది. తనని అందరూ బాధపెడుతున్నారని శౌర్య అంటుంది. రేపు స్కూల్ కి వెళ్ళను అంటే వారం రోజులు ఎక్కడికి వెళ్లొద్దని చెప్తుంది.
వారం రోజులు ఎందుకు స్కూల్ మానేయాలని అడుగుతుంది. ఎందుకో తర్వాత చెప్తాను నువ్వు నాకు చెప్పకుండా అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్లకూడదని అంటుంది. అప్పుడే ఎందుకు అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీని ఎందుకు స్కూల్ కి పంపించకూడదని అడుగుతాడు.
ఊరు వెళ్లాలని అనుకుంటున్నానని అబద్ధం చెప్తుంది. శౌర్య కార్తీక్ తో మాట్లాడకుండా అలుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్