Star Maa Serials Trp Ratings: టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడితో కార్తీక దీపం 2 పోటీ - గుప్పెడంత మ‌న‌సు లాస్ట్‌-star maa serials latest trp ratings brahmamudi top in list karthika deepam 2 second spot barc telugu serials trp rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Trp Ratings: టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడితో కార్తీక దీపం 2 పోటీ - గుప్పెడంత మ‌న‌సు లాస్ట్‌

Star Maa Serials Trp Ratings: టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడితో కార్తీక దీపం 2 పోటీ - గుప్పెడంత మ‌న‌సు లాస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Jul 20, 2024 08:20 AM IST

Star Maa Serials: స్టార్ మా సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడి, కార్తీక దీపం 2 టాప్‌లో నిలిచాయి. గుప్పెడంత మ‌న‌సు లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకుంది.

స్టార్ మా సీరియ‌ల్స్
స్టార్ మా సీరియ‌ల్స్

Star Maa Serials: ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడితో పాటు కార్తీక దీపం 2 సీరియ‌ల్స్ అద‌ర‌గొట్టాయి. ఈ ఏడాది 28వ వీక్ తెలుగు సీరియ‌ల్స్‌ టీఆర్‌పీ రేటింగ్స్‌ను బార్క్ వెల్ల‌డించింది. మిగిలిన ఛానెల్స్‌తో పోలిస్తే స్టార్ మా సీరియ‌ల్స్ దే టీఆర్‌పీ రేటింగ్స్ లో డామినేష‌న్ క‌నిపిస్తోంది. డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను స్టార్ మా సీరియ‌ల్స్ అట్రాక్ట్ చేస్తోన్నాయి. స్టార్ మా సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్ టాప్ సీరియ‌ల్స్ ఏవంటే?

yearly horoscope entry point

బ్ర‌హ్మ‌ముడి నంబ‌ర్‌వ‌న్‌...

28వ వారం టీఆర్‌పీ రేటింగ్‌లో బ్ర‌హ్మ‌ముడి టాప్ ప్లేస్‌లో నిలిచింది. 13.36 టీఆర్‌పీతో మిగిలిన సీరియ‌ల్స్‌ను దాటేసి నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సొంతం చేసుకున్న‌ది. గ‌త టీఆర్‌పీ కంటే ఈ సారి మ‌రింత సీరియ‌ల్‌కు మైలేజీ పెరిగింది. లాస్ట్ వీక్ 12.49 రాగా...ఈ సారి 13.36 వ‌చ్చింది. రాజ్‌, కావ్య రొమాంటిక్ ట్రాక్‌తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వారి మ‌ధ్య ఉన్న బాండింగ్‌ను ద‌ర్శ‌కుడు సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌తో ఆవిష్క‌రిస్తోన్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు.

కార్తీక దీపం సీక్వెల్ పోటీ...

టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్ర‌హ్మ‌ముడితో కార్తీక దీపం 2 పోటీప‌డుతోంది. తాజా టీఆర్‌పీలో కార్తీక దీపం 2... 10.85తో సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. బ్ర‌హ్మ‌ముడితో పాటు కార్తీక దీపం టీఆర్‌పీ కూడా లాస్ట్ వీక్‌తో పోలిస్తే కొంత పెరిగింది. గ‌త టీఆర్‌పీలో కార్తీక దీపం 2 ...10.55 ద‌క్కించుకున్న‌ది. జ్యోత్స‌ను పెళ్లి చేసుకోకుండా త‌ప్పించుకునేందుకు కార్తీక్ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం, దీప అడ్డంకిగా ఉంద‌ని జ్యోత్స‌తో పాటు పారిజాతం అపోహ‌ప‌డుతూ ఆమెను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నాల చుట్టూ లాస్ట్ వీక్ ఈ సీరియ‌ల్ ర‌న్ అయ్యింది.

గుండెనిండా గుడిగంట‌లు...

బ్ర‌హ్మ‌ముడి, కార్తీక దీపం 2 త‌ర్వాత తాజా టీఆర్‌పీలో గుండెనిండా గుడిగంట‌లు టాప్ త్రీలో నిలిచింది. ఈ సీరియ‌ల్‌కు 10.26 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. గుండెనిండా గుడిగంట‌లు త‌ర్వాత 9.77 తో ఇంటింటిరామాయ‌ణం ఫోర్త్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది.

చిన్ని వ‌ర్సెస్ స‌త్య‌భామ‌

కొత్త‌గా ప్రారంభ‌మైన చిన్న సీరియ‌ల్ 7.62 టీఆర్‌పీతో టాప్ ఫైవ్‌లో నిలిచింది. సీరియ‌ల్ ప్రారంభ‌మైన ఫ‌స్ట్ వీక్‌తో పోలిస్తే ఈ సారి టీఆర్‌పీ కొంత పెరిగింది. ఇప్పుడిప్పుడే చిన్న క్యారెక్ట‌ర్ చుట్టూ డ్రామాను ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తోన్నాడు. స‌త్య‌భామ సీరియ‌ల్ 7.22తో ఆరో ప్లేస్‌ను సొంతం చేసుకున్న‌ది. మ‌గువ ఓ మ‌గువ (5.98 ), నువ్వు నేను ప్రేమ (5.71), ప‌లుకే బంగార‌మాయేనా (5.58), వంట‌ల‌క్క (5.49 ) టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్నాయి.

గుప్పెడంత మ‌న‌సు లాస్ట్‌

గుప్పెడంత మ‌న‌సు తో ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు టీఆర్‌పీ ప‌రంగా చివ‌ర‌లో నిలిచాయి. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు 4.40 టీఆర్‌పీ రేటింగ్ రాగా...ఎటో వెళ్లిపోయింది మ‌న‌స 4.25 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. రిషి రీఎంట్రీ త‌ర్వాత గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ టీఆర్‌పీ పెరుగుతుంద‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ ఈ సీరియ‌ల్‌లో డ్రామా, ల‌వ్‌స్టోరీ స‌రిగ్గా పండ‌క‌పోవ‌డంతో ఆడియెన్స్‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతుంది.

Whats_app_banner