Karthika deepam 2 serial: నేను చనిపోకూడదు అంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాల్సిందేనన్న దీప.. సుమిత్ర హ్యాపీ-karthika deepam 2 serial today july 20th episode deepa advises karthik for his marriage with jyotsna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: నేను చనిపోకూడదు అంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాల్సిందేనన్న దీప.. సుమిత్ర హ్యాపీ

Karthika deepam 2 serial: నేను చనిపోకూడదు అంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాల్సిందేనన్న దీప.. సుమిత్ర హ్యాపీ

Gunti Soundarya HT Telugu
Jul 20, 2024 07:22 AM IST

Karthika deepam 2 serial today july 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప మళ్ళీ సుమిత్ర ఇంటికి చేరుతుంది. కార్తీక్ దీపను కలిసి తనకు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తాడు. ఎందుకు ఇష్టం లేదంటూ దీప సూదుల్లాంటి ప్రశ్నలు వేసి నోట మాట రాకుండా చేస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 20వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 20వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today july 20th episode: దీపకు ఫోన్, గాజులు ఇవ్వడం కోసం కార్తీక్ ఇంటికి వెళతాడు. తాళం వేసి ఉండటం చూసి ఏమైందని పక్కింటి ఆమెను అడుగుతుంది. దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని ఆమె చెప్తుంది. కార్తీక్ నిరాశగా వెనుదిరుగుతాడు. దీప చెప్పాపెట్టకుండా ఊరు వెళ్లిపోయిందని సీరియస్ అవుతాడు.

నరసింహను సైలెంట్ గా ఉండమన్న అనసూయ

ఇప్పుడు నేను అత్త దగ్గరకు వెళ్ళి నిశ్చితార్థం జరగకుండా చేయాలని ఫిక్స్ అవుతాడు. దీప మళ్ళీ సుమిత్ర ఇంటికి వెళ్ళిందని శోభ అనసూయ మీద అరుస్తుంది. నీ మొగుడు చేసిన పనికి అది మళ్ళీ శౌర్యను కాపాడుకోవడం కోసం వెళ్ళిందని అనసూయ చెప్తుంది.

అనసూయ, నరసింహ కాసేపు మంచి సరదాగా మాట్లాడతారు. నా మనవరాలిని తీసుకొచ్చి నిన్ను అమ్మను చేసే బాధ్యత నాది అని హామీ ఇస్తుంది. బిడ్డను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లాలో నేను చెప్తాను. అప్పటి వరకు వదిలేయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉండమని చెప్తుంది. ఆ ఇంట్లో మనకు సాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని అనసూయ ఆలోచిస్తుంది.

సుమిత్ర ఇంటికి దీప

జ్యోత్స్న పారిజాతాన్ని దీప దగ్గరకు తీసుకెళ్తానని చెప్తుంది. తనతోనే ఇంట్లో అడుగు పెట్టాలని ఆర్డర్ వేస్తుంది. సుమిత్ర పూజ చేసుకుంటూ ఉండగా శౌర్య వచ్చి తన కళ్ళు మూస్తుంది. నీకోసం అమ్మ నేను వచ్చేశామని చెప్తుంది. జ్యోత్స్న వాళ్ళను చూసి బిత్తరపోతుంది.

సుమిత్ర సంతోషంగా దీప దగ్గరకు వెళ్తుంది. ఎన్ని రోజులని భారంగా ఉంటాను అందుకే వెళ్లిపోయానని చెప్తుంది. జ్యోత్స్న నిశ్చితార్థం గురువారం ఫుడ్ స్పెషల్స్ నువ్వే చేయాలని దీప చెప్తుంది. పారు, జ్యోత్స్న వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. దీప వచ్చింది నాకోసం కాదు గ్రాని అని అంటుంది.

థాంక్స్ దీప

అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. అక్కడ శౌర్య, దీపలను చూసి చాలా సంతోషపడతాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కార్తీక్ నీకోసం వెతుకుతూనే ఉన్నాడు. నాలాగే నీ గురించి ఆలోచించాడని సుమిత్ర చెప్తుంది. ఇక నుంచి దీప కోసం వెతికే అవసరం లేదని అంటుంది.

పాత ఇంటి దగ్గరకు వెళ్ళాను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసి బాధపడ్డాను అంటాడు. అర్థం చేసుకుని తిరిగి వచ్చినందుకు కార్తీక్ దీపకు థాంక్స్ చెప్తాడు. ఎందుకు వచ్చారని అంటే గాజులు, ఫోన్ తనకు ఇస్తాడు. హాస్పిటల్ బిల్లు అప్పు అనుకోండి పాత బాకీ అనుకుని డబ్బులు డబ్బాలో వేయమని చెప్తాడు.

జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు

నేను ఇంటికి తిరిగి రావడానికి ఒక కారణం జ్యోత్స్న, మీకు నిశ్చితార్థం అని చెప్తుంది. అది జరగదులే అంటాడు. ఏం ముహూర్తం మార్చారా అంటే కాదు మారాల్సింది పెళ్లి కొడుకు. నిశ్చితార్థం జరగడం లేదు. ఎందుకంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు.

తను కేవలం నా మరదలు మాత్రమే భార్యగా చూడలేను అంటాడు. ఈ విషయం మీ అమ్మానాన్నకు తెలుసా అని అడుగుతుంది. ఎవరికీ తెలియదు ఈ విషయం అత్తయ్య మావయ్యకు చెప్పడానికి వచ్చానని చెప్తాడు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నారా?

జ్యోత్స్న ఎందుకు నచ్చలేదు?

జ్యోత్స్న మీతో తప్పుగా ప్రవర్తించిందా? మరి జ్యోత్స్న నచ్చకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. నచ్చకపోవడానికి కారణాలు ఉండాలా అంటే ఉండాలి. జ్యోత్స్న పరాయి అమ్మాయి కాదు మీ మరదలు చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమే కదా అంటుంది.

మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే కుదరలేదు అంటాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు చెప్తే ఇది మీరు చేసే మూడో తప్పు అవుతుంది. నా తండ్రి చావుకు కారణం మీరు కాదు. కానీ నాకు నిజం తెలిసే వరకు మీరు నింద మోశారు. కానీ ఆరోజు మీరు ఆగి మీ తప్పు లేదని నిరూపించుకుని వెళ్ళిపోయి ఉంటే ఒక మనిషిని ద్వేషంతో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు.

మూడో తప్పు అవుతుంది

ఇది మీరు చేయకపోయిన చేసిన మొదటి తప్పు. నా బిడ్డను కాపాడటం కోసం ఏ మార్గం లేనట్టు నేనే కన్న తండ్రిని అని చెప్పారు. అది వినలేదని అర్థం అయ్యింది కాబట్టి ఇక్కడికి రాగలిగాను. అది వింటే మీరే దానికి తండ్రి అవుతారు. అది అబద్ధం నిజం ఇది అని నేను చెప్పగలనా? ఒక భార్యగా నేను చనిపోయాను మనిషిగా మీరు చంపేశారు. శౌర్య విని ఉంటే తల్లిగా కూడా చనిపోయే దాన్ని.

ఇది మీరు చేసిన రెండో తప్పు. జ్యోత్స్న మీ మరదలు మీరిద్దరూ కలిసే పెరిగారు కదా. ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు అంటుంది. చెప్పలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటాడు. నా కూతురుకు తల్లిగా నేను చావకూడదు అంటే మీరు ఈ పెళ్లి చేసుకోవాలి.

జ్యోత్స్న మీ కోసమే బతుకుతుంది

మీరు ఎవరి కోసం బతుకుతున్నారో నాకు తెలియదు కానీ జ్యోత్స్న మాత్రం మీ కోసమే బతుకుతుంది. నచ్చలేదు అని చెప్పడానికి కారణం ఉందా అంటే లేదని చెప్తాడు. మీరు చెప్పకుండానే కారణం వాళ్ళకు తెలుస్తుంది. మీరు హాస్పిటల్ లో ఏదైతే చెప్పారో అది ఏదో ఒక రకంగా వాళ్ళకు తెలుస్తుంది.

మీరు అర్థం అయ్యేలా చెప్పాలని చూసిన ప్రయోజనం ఉండదు. మీరు చేయని తప్పును చేయలేదు అని చెప్పడానికి సంవత్సరం పట్టింది. ఇప్పుడు మీరు అన్న మాటను ఎందుకు అన్నారో వివరించినా అర్థం చేసుకునే ఓపిక ఉండదు. అన్నారా లేదా అని అడుగుతారు, అన్నాను అంటారు.

మిగతా కథ వాళ్ళు రాసుకుంటారు. అప్పుడు నాది నా బిడ్డ పరిస్థితి ఏంటి?మీరు ఎటు తేల్చుకోలేని ఆలోచనలతో ఊగిసలాడొద్దు. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి నేను కూడా సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయేలా ఉన్నానని దీప చెప్తుంది. అక్కడితో కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner