Karthika deepam 2 serial july 19th: అర్థరాత్రి నరసింహ వీరంగం, తన్ని తరిమేసిన జనాలు, దీప మళ్ళీ సుమిత్ర ఇంటికి వెళ్తుందా
Karthika deepam 2 serial today july 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అర్థరాత్రి నరసింహ దీప ఇంటికి వస్తాడు. శౌర్యను ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటే దీప అడ్డుకుంటుంది. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు వాడిని తన్ని తరిమేస్తారు.
Karthika deepam 2 serial today july 19th episode: కార్తీక్ వచ్చేశాడని శౌర్య సంతోషంగా గోడ మీద రాసిన పేరును చెరిపేస్తుంది. ఇక నుంచి కార్తీక్ రోజు ఇంటికి వస్తాడు తనతో ఆడుకుంటానని చెప్తుంది. కార్తీక్ ఇక రాడని దీప మనసులో అనుకుంటుంది. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను మొదట్లోనే జాగ్రత్త పడ్డాను కానీ ఎవరు వినిపించుకోలేదు. ఊరు వెళ్ళే వరకు శౌర్యకు నిజం తెలియకూడదని అనుకుంటుంది.
దీపను తీసుకొస్తాను
జ్యోత్స్న కార్తీక్ దీప కలుసుకున్న విషయం పారిజాతానికి చెప్తుంది. వాళ్ళ మాటలు వినవచ్చు కదా అంటుంది. వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. వాళ్ళు ఏదో చేయబోతున్నారని అంటుంది. ఈ ఎంగేజ్ మెంట్ జరగదు మనవరాలు. శౌర్య నా కూతురు అని కార్తీక్ చెప్పాడు. అదే రోజు రాత్రి దీప వెళ్ళిపోయింది.
దీప ఎక్కడ ఉందో కార్తీక్ కి తెలుసు కానీ చెప్పలేదు. పంతులు పెట్టిన ముహూర్తానికి మీ బావ దీపను అని అనబోతుంటే జ్యోత్స్న గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు నీ ఎంగేజ్ మెంట్ జరగాలంటే దీపను నేనే తీసుకొస్తానని జ్యోత్స్న కోపంగా చెప్తుంది. తను వస్తే నీ నిశ్చితార్థం జరగదని అంటే జరుగుతుంది దీన్ని ఎవరు ఆపలేరు.
అర్థరాత్రి దీప ఇంటికి నరసింహ
బావ నా మెడలో మూడు ముళ్ళు వేసే వరకు దీప ఇంట్లోనే ఉండాలి. పంతులు పెట్టిన అదే ముహూర్తానికి నీ మనవడికి మనవరాలికి నిశ్చితార్థం జరుగుతుంది. దీన్ని ఎవరు మార్చాలని చూసిన సహించను క్షమించనని చెప్తుంది. అర్థరాత్రి దీప ఇంటికి నరసింహ వస్తాడు.
ఎందుకు వచ్చావ్ తన కూతురు నిద్రపోతుందని చెప్తుంది. నిద్రపోతున్న నీ కూతురిని ఎత్తుకుపోవడానికి వచ్చానని అంటాడు. తన కూతురు జోలికి రావొద్దని గొడ్డలి ఎత్తుతుంది. ఆరోజు వాడు చెప్పిన మాట నమ్మేసి వెళ్లిపోయాను అనుకున్నావ్ కదా కానీ నేను నమ్మలేదు.
నా కూతురికి నేను తండ్రిని, శోభ తల్లి అంటాడు. నువ్వు నన్ను చంపాలని అంటే నీకు గొడ్డలి కావాలి. కానీ నేను నిన్ను చంపడానికి శౌర్యకు నేను తండ్రి అని తెలిస్తే చాలు. ఈరోజు ఎలాగైనా నా కూతురిని నేను తీసుకుని వెళ్లిపోతాను అని ఇంట్లోకి వెళ్లబోతుంటే దీప ఆపుతుంది.
తన్ని తరిమేసిన జనాలు
శోభకు పిల్లలు పుట్టి ఉంటే ఈ పని చేసే వాడిని కాను. నీ దరిద్రం ఏంటో కానీ ఎలాగైనా నీ కూతురిని ఎత్తుకుని వెళ్లిపోతానని అంటుంది. అప్పుడే శౌర్య నిద్రలేచి తలుపు కొడుతుంది. నా కూతురు నిన్ను చూస్తే జ్వరం తెచ్చుకుంటుంది వెళ్లిపొమ్మని దీప బతిమలాడుతుంది.
నోరు మూసుకుని ఉండు లేదంటే నీ కూతురికి నేను బూచోడిని కాదు నీ తండ్రినని చెప్తానని బెదిరిస్తాడు. తలుపు తీయబోతుంటే దీప నరసింహను తోసేస్తుంది. దీంతో అక్కడ ఉన్న బిందెల మీద పడతాడు. శబ్ధం రావడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి గొడవ అని వస్తారు.
వీడు ఎవడో తాగుబోతు వచ్చాడు దీపను అల్లరి పెడుతున్నాడని నరసింహను చుట్టుపక్కల వాళ్ళు కొట్టి బయటకు గెంటేస్తారు. శౌర్య ఏమవుతుందని చాలా కంగారుపడుతుంది. లోపలికి వచ్చిన దీప భయపడిపోతున్న శౌర్యను దగ్గరకు తీసుకుంటుంది. వచ్చింది బూచోడు కాదని దీప చెప్తుంది.
నాన్నను వెతుకుదాం
లేదు నేను గొంతు విన్నాను వచ్చింది బూచోడే. కార్తీక్ ఉంటే బూచోడు వచ్చేవాడు కాదు. కానీ నువ్వే కార్తీక్ ని పంపించేశావు. భయపడకు అమ్మ ఉంది కదా అంటే అమ్మకు ఏదైనా అయితే. అందుకే నాన్నను వెతుకుదాం అన్నాను. నాన్నను వెతకడానికి కార్తీక్ హెల్ప్ తీసుకుందాం.
కార్తీక్ కి అందరూ తెలుసు. నాన్న ఎక్కడ ఉన్న తీసుకొస్తాడని అంటుంది. కార్తీక్ బాబు అన్నమాటలు శౌర్య వినలేదని దీప ఊపిరి పీల్చుకుంటుంది. ఇక్కడ ఉంటే నాకు భయంగా ఉంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని శౌర్య చెప్తుంది. కార్తీక్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.
కార్తీక్ బాబు చెప్పిన మాట నిజమే. ఊరు వెళ్ళినా కూడా నరసింహ శౌర్యను వదిలిపెట్టడు. సుమిత్ర ఇంట్లోనే రౌడీకి సేఫ్టీ దొరుకుతుందని కార్తీక్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. నాకు ఏం జరిగినా పరవాలేదు నా కూతురిని కాపాడుకోవాలి అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్