Brahmamudi June 26th Episode: బ్రహ్మముడి- రాజ్ కావ్య శోభనానికి తంటాలు- చెడగొట్టనున్న కల్యాణ్- రుద్రాణి కొత్త ప్లాన్-brahmamudi serial june 26th episode rudrani new plan to stop raj kavya first night by kalyan brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 26th Episode: బ్రహ్మముడి- రాజ్ కావ్య శోభనానికి తంటాలు- చెడగొట్టనున్న కల్యాణ్- రుద్రాణి కొత్త ప్లాన్

Brahmamudi June 26th Episode: బ్రహ్మముడి- రాజ్ కావ్య శోభనానికి తంటాలు- చెడగొట్టనున్న కల్యాణ్- రుద్రాణి కొత్త ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Jun 26, 2024 07:03 AM IST

Brahmamudi Serial June 26th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్‌లో రాజ్ కావ్య శోభనం ఏర్పాట్లకు తంటాలు పడుతుంటారు ఇంట్లోవాళ్లు. వాళ్లిద్దరికి తెలియకుండా జాగ్రత్తలు పడతారు. మరోవైపు కల్యాణ్‌ ద్వారా శోభనం చెడగొట్టేలా ప్లాన్ చేస్తుంది రుద్రాణి. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ కావ్యకు శోభనం చేయాలని ఇంట్లోవాళ్లతో ఇందిరాదేవి ప్లాన్ చేస్తుంది. కానీ, దాని గురించి రాజ్ కావ్యకు తెలియకూడదు అని చెబుతుంది. అందరూ రెడీనా ఇందిరాదేవి అడిగితే.. రెడీ రెడీ అని అంటారు. ఇంతలో కావ్య వచ్చి దేనికి రెడీ అని అడుగుతుంది. రుద్రాణి చెప్పబోతుంటే కాలు తొక్కి మరి ఆపుతుంది స్వప్న.

రెడీ అన్నారు దేనికి

పొరపాటున కాలు తొక్కాను అత్త అని స్వప్న అంటుంది. సరే నేను వెళ్లి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని ప్రకాశం అంటే.. ఎందుకు అని కావ్య అడుగుతుంది. నాకే. నేను పేషంట్‌ను కదా అని అపర్ణ కవర్ చేస్తుంది. సరే చిన్న మావయ్య తీసుకురండి. నేను జ్యూస్ చేస్తాను అని కావ్య వెళ్లబోతూ మళ్లీ రెడీ అన్నారు అది దేనికి అని అంటుంది. రాజ్ ఏదైనా చెబితే చేయడానికి రెడీనా అని ఇందిరాదేవి అడిగితే.. హా రెడీ రెడీనే అని కావ్య అంటుంది.

అయ్యో ఎక్కడి అయోమయాలు దొరికారో అని అపర్ణ చిరాకు పడుతుంది. దేనికి అత్తయ్య కోప్పడుతున్నారని కావ్య అడుగుతుంది. నీకు చెప్పాలా. అన్నింటిలో ఎందుకు దూరతావు. వెళ్లి పని చేసుకో అని అపర్ణ అంటుంది. మరోవైపు శోభనానికి కావాల్సిన లిస్ట్ రాస్తుంటారు స్వప్న ప్రకాశం. అక్కడికి రాజ్ వచ్చి అవి దేనికి అని అడుగుతాడు. స్వప్న, ప్రకాశం ఏదో కవర్ చేస్తారు. కానీ, రాజ్‌కు డౌట్ రావడంతో అపర్ణ వచ్చి అమావాస్య పూజ అని కవర్ చేస్తుంది.

కావ్య చేతిలో మన జుట్టు

రాజ్‌కు తెలియకుండా తంటాలు పడతారు అపర్ణ, స్వప్న, ప్రకాశం. మరోవైపు రుద్రాణిపై సెటైర్లు వేస్తాడు రాహుల్. రాజ్ కావ్య ఒక్కటైపోయి రేపు వారసులను దింపి వాళ్లకు ఆస్తి అంటగడతారు. అప్పుడు మనం వాళ్లకు ఊడిగం చేయాలి అని రాహుల్ అంటాడు. నేను ఉండగా వాళ్లను సంతోషంగా ఎలా బతకనిస్తాను అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు మన జుట్టు కావ్య చేతిలో ఉంది. ఏం చేయలేం అని రాహుల్ అంటాడు.

మనం చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇంట్లోవాళ్లతో చేపిస్తే.. ఇవాళ అగ్గిరవ్వ రాజేయబోతున్నాను. దాంతో రావణకాష్టం జరగబోతుంది. గెలిచానన్న పొగరుతో ఉన్న కావ్యను దెబ్బ కొడతాను అని రుద్రాణి అంటే.. ఎవరా అగ్గిరవ్వ అని రాహుల్ అడుగుతాడు. ఇంకెవరు ఉన్నాడు కల్యాణ్. ఆ అమాయకుడితోనే మొదలుపెట్టబోతున్నాను అని రుద్రాణి అంటుంది. కట్ చేస్తే కల్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. సిగ్గు పడుతూ బెడ్ రూమ్ డోర్ పెడుతుంది.

నమ్మకం అంటే అది

ఇంట్లో అన్ని సమస్యలు తీరిపోయాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. మనం కూడా గొడవలు పడటం ఎందుకు. సంతోషంగా ఉందాం అని అనామిక అంటే.. నువ్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే చెప్పాను అని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు వింటాను అంటున్నాను కదా అని అనామిక అంటుంది. నేను విసిగిపోయాను. నాలో మంచితనం చంపేశావ్ అని కల్యాణ్ అంటే.. నన్ను నమ్మవా అని అనామిక అంటుంది.

చాలా ఈజీగా చెప్పావ్ నమ్మకం అని.. నమ్మకం అంటే కావ్య గురించి చెబుతాడు కల్యాణ్. రాజ్ కోసం కావ్య ఎంత నమ్మకంతో ఉందో గొప్పగా చెబుతాడు. కానీ, నువ్ మాత్రం ఏ తప్పు చేయని నన్ను అవమానించావ్. పనికిరానివాడిగా మాట్లాడావ్. వదినను చూసి ఈర్ష్య పడటం కాదు. చూసి నేర్చుకో అని కల్యాణ్ వెళ్లిపోతాడు. ఇంతలో కల్యాణ్‌కు రిపోర్టర్ కాల్ చేసి ఆరోజు మీకు అప్పుకు అలా జరగడానికి పెద్ద కారణం, కుట్ర ఉందని, మీరు వస్తే అన్ని ఆధారాలతో చూపిస్తాను అని చెబుతుంది.

రిపోర్టర్ దగ్గరికి కల్యాణ్

దాంతో కల్యాణ్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు సీతారామయ్య బెడ్ రూమ్‌ను డెకరేట్ చేస్తుంది స్వప్న. ఇంతలో సుభాష్ వచ్చి మాట్లాడుతాడు. అప్పుడే ప్రకాశం స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొస్తాడు. మరోవైపు కావ్య డైపర్స్ కోసం వెతుకుతుంటే ఇందిరాదేవి వచ్చి డైవర్ట్ చేస్తుంది. ఇంతలో అగరవత్తులతో అపర్ణ కనిపిస్తే అవి ఎక్కడికి అని కావ్య అడుగుతుంది. ఎలుక చచ్చినట్లు వాసన వస్తే ఇవి వెలిగించుదామని అపర్ణ అంటుంది. అలా వాసన రావట్లేదు కదా అని కావ్య అడుగుతుంది.

అత్తను నేనా నువ్వా. నువ్ నీ పని చేసుకో అని దబాయిస్తుంది అపర్ణ. దాంతో కావ్య వెళ్లిపోతుంది. ఇంతకన్నా అబద్ధాలు నేను ఆడను. మీరే చూసుకోండి అని ఇందిరాదేవికి చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను కూడా బెడ్ రూమ్ వైపు వెళ్లకుండా సుభాష్, ప్రకాశం ఆపుతారు. ఇవాళ మెమోరీ లాస్ డేనా. అందరూ ఏదో ఒకటి మర్చిపోతున్నారు అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ తన గదిలోకి వెళ్తే అక్కడ సీతారామయ్య, ఇందిరాదేవి నవ్వుతూ ఉంటారు.

ఏసీ పనిచేయట్లేదు

మీరేంటి నా గదిలో ఉన్నారు. మీ గదికి ఏమైంది అని రాజ్ అడుగుతాడు. కావ్య కూడా వచ్చి అదే అడుగుతుంది. మా రూమ్‌లో ఏసీ పని చేయట్లేదు. మీ గదిలో మేము పడుకోకూడదా అని ఇందిరాదేవి అంటుంది. మేము ఎక్కడ పడుకోవాలి అని రాజ్ అడిగితే.. స్టోర్ రూమ్‌లో. పెళ్లైన కొత్తలో నన్ను అక్కడే ఉంచారు కదా. మీరు తాగి వచ్చి అని కావ్య చెబుతుంటే.. వద్దు. ఫ్లాష్ బ్యాక్ వద్దని రాజ్ ఆపేస్తాడు. మా గదిలో పడుకోమ్మని ఇందిరాదేవి చెబుతుంది.

అక్కడ ఏసీ పని చేయట్లేదన్నావ్ అని రాజ్ అడిగితే.. ఫ్యాన్ పనిచేస్తుందన్నావ్ కదా అని ఇందిరాదేవి అంటుంది. ఏసీ లేకుండా పడుకోలేనని రాజ్ అంటే.. మీరు పడుకున్నాకా ఏసీ రోజు ఆఫ్ చేస్తున్నాను. మీకంటే ముందు లేస్తాను కాబట్టి.. మళ్లీ ఆన్ చేస్తాను అని కావ్య అంటుంది. అమ్మా రాక్షసి అని రాజ్ అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

WhatsApp channel