Brahmamudi June 21st Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన అనామిక- అప్పు కోసం భార్యతో కల్యాణ్ ఛాలెంజ్- కావ్య రొమాన్స్-brahmamudi serial june 21st episode kavya raj mission and maya reveals subhas is innocent brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 21st Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన అనామిక- అప్పు కోసం భార్యతో కల్యాణ్ ఛాలెంజ్- కావ్య రొమాన్స్

Brahmamudi June 21st Episode: బ్రహ్మముడి- రుద్రాణిని మించిన అనామిక- అప్పు కోసం భార్యతో కల్యాణ్ ఛాలెంజ్- కావ్య రొమాన్స్

Sanjiv Kumar HT Telugu
Jun 21, 2024 07:33 AM IST

Brahmamudi Serial June 21st Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 21వ తేది ఎపిసోడ్‌లో హోటల్‌లో అప్పును, తనను కావాలనే ఇరికించారని, దాని వెనుక ఎవరున్నారో మీడియా ముందు నిజాలు బయటపెడతానని కల్యాణ్ అంటాడు. దాంతో అనామిక భయపడిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 21వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 21వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అనామిక అన్నమాటలకు అపర్ణ బాధపడుతుంటుంది. అపర్ణ దగ్గరికి వచ్చిన సుభాష్ తను చిన్న పిల్ల. తను అన్నదానికి బాధపడకు అని అంటాడు. బాధపడకుండా ఎలా ఉండమంటారు. ఇంట్లో నా మాటకు ఎవరు అడ్డు చెప్పలేదు. ధాన్యలక్ష్మీ నా మాటకు ఎదురు చెప్పాలంటే చాలా సార్లు ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ తన కోడలు అనేదాకా తీసుకొచ్చింది ఎవరు అని అపర్ణ అడుగుతుంది.

నేనే శిక్ష అనుభవిస్తాను

నేను తప్పు చేశానని ఒప్పుకున్నా కదా. ఇంకా ఎన్ని రోజులు శిక్షిస్తావ్ అని సుభాష్ అంటాడు. ఇవాళ కల్యాణ్ తప్పు చేయలేదని చెబుదామనుకున్నాను. వాడిని నా చేతులతో పెంచాను. వాడు తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది. అది చెబితే.. ముందు నీ భర్త గురించి చూసుకో అంటారని మౌనంగా ఉండిపోయాను అని అపర్ణ అంటుంది. నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను అని సుభాష్ అంటాడు. ఈ విషయాన్ని ఇంట్లో మర్చిపోతారా. సమయం దొరికిన ప్రతిసారి దీన్ని వేలెత్తి చూపుతారు. మీ భార్య అయినందుకు మీ తప్పులో నాకు భాగముంటుంది అని అపర్ణ వెళ్లిపోతుంది.

కట్ చేస్తే కావ్యపై ఫైర్ అవుతూ రాజ్ వెళ్తుంటాడు. కానీ, కావ్య మాత్రం చాలా ప్రేమగా, రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. నా శీలాన్ని దోచుకుంటారా అని అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. అప్పుడు రాజ్‌పై చేయి వేసి రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. తన తండ్రి, తల్లి గురించి కోప్పడుతూ అడిగిన రాజ్ కొద్దిసేపటికి కావ్య మాటలకు లొంగిపోతాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. కావ్య ఎలా మాట్లాడితే రాజ్ అలాగే తిప్పుకుంటూ ప్రేమగా మాట్లాడుతాడు.

ముద్దు కావాలన్నట్లుగా

తర్వాత తేరుకున్న రాజ్ కోప్పడటంతో మాయ తనకు వీడియో పంపిన విషయం, సెల్ ఫోన్ లాక్కున్న మ్యాటర్ చెబుతుంది. అలాగే ఇద్దరం కలిసి మాయను పట్టుకుందామని రాజ్‌తో అంటుంది కావ్య. దానికి సరేనని రాజ్ అంటాడు. ఇంతమంచి ఐడియా ఇచ్చినందుకు నాకేం లేదా అని ముద్దు కావాలన్నట్లుగా అడుగుతుంది. హా ఉంది.. ముందు మాయను పట్టుకోవడం. ఎప్పుడు అదే గోల అని రాజ్ వెళ్లిపోతాడు. ఏ మనిషో.. ఏ ముద్దు ముచ్చట లేదు అని కావ్య అనుకుంటుంది.

మరోవైపు కల్యాణ్, అప్పును విడగొట్టినందుకు అనామికకు కంగ్రాట్స్ చెబుతుంది రుద్రాణి. ఇందులో తన సహాయం కూడా ఉందని అనామిక అంటుంది. స్నేహం పేరుతో నా ముందు తిరుగుతుంటే నాకు మండదా. అందుకే లేనిదాన్ని ఉన్నదాన్ని క్రియేట్ చేసి చెప్పాను అని అనామిక అంటే.. నువ్ మా మామ్‌ను మించిపోయావ్ అని రాహుల్ అంటాడు. ఇదేముంది. ముందు ముందు చూడు అని అనామిక అంటుంది.

అనామిక తింగరిదిరా

ఏది ఏమైనా కల్యాణ్‌తో మంచిగుండు అని రుద్రాణి అంటుంది. మంచిగా చెబితే ఈ మగవాళ్లు ఎక్కడ వింటారు. చెప్పాల్సిన పద్ధతిలోనే చెబితే వింటారు. కల్యాణ్‌ను నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని అనామిక వెళ్లిపోతుంది. నువ్వేంటి మామ్ నీతులు చెబుతున్నావ్ అని రాహుల్ అడిగితే.. ఈ అనామిక తింగరిదిరా. మనం మంచిగా ఉండమంటే ఓవరాక్షన్ చేస్తుంది. ఓవరాక్షన్ చేయమంటే మంచిగా ఉంటుంది. అందుకే కల్యాణ్‌తో గొడవ పడమని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పా. ఇంట్లో గొడవ అయిన దాని వెనుక మనం ఉన్నామని తెలియకూడదు కదా అని రుద్రాణి అంటుంది.

మరోవైపు అప్పుపై కనకం ఫైర్ అవుతుంది. ఇంట్లోనుంచి బయటకు వెళితే కాళ్లు విరగొడతా అంటుంది. వాళ్ల మీద కోపం నామీద చూపిస్తావేంటని అప్పు అంటే.. ఎదురుతిరుగుతావా అని చేయి ఎత్తుతుంది కనకం. కృష్ణమూర్తి అడ్డుకుంటాడు. దాంతో ఇదంతా నీవల్లే వచ్చింది. ఆరోజు కల్యాణ్‌తో బయటకు వెళ్లకని నేను చెబితే.. తనేం తప్పు చేసిందని వత్తాసు పలికావ్ అని కనకం అంటుంది. డబ్బున్న వాళ్లతో తిరిగితే మన పరువే పోతుంది. వాళ్లకేం పోదు. మన కూతురికే నష్టం అని కనకం అంటుంది.

అసలు పెళ్లి చేసుకోను

నువ్ ఎక్కువగా భయపడుతున్నావ్ అని కృష్ణమూర్తి అంటే.. నువ్ మగాడివి కదా నీకు అర్థం కాదు ఆ బాధ. ఆడదానిగా, తల్లిగా నాకు తెలుసు బాధ అని కనకం బాధపడుతుంది. రేపు నీకు పెళ్లి అయ్యాక అక్కడ ఇలాంటి గొడవల్లో నువ్ ఉన్నావని తెలిస్తే.. నీకు కల్యాణ్‌కు నీ మొగుడు సంబంధం అంటగడితే.. ఒక్కసారి మొగుడికి అనుమానం వస్తే అది జీవితాంతం ఉంటుంది అని కనకం అంటుంది. అలాంటి మొగుడు నాకొద్దు. నన్ను అర్థం చేసుకునే వాడినే చేసుకుంటాను అని అప్పు అంటుంది.

అలాంటి వాడు దొరకడే. అందరూ ఒక్కటే అని కనకం అంటుంది. అలా అయితే నేను పెళ్లే చేసుకోను. జీవితాంతం మీతోనే ఉండిపోతాను అని వెళ్లిపోతుంది అప్పు. చూశారా అది ఏమంటుందో ఇప్పుడు ఏం చెబుతారో చెప్పండి అని కనకం అంటుంది. ఇలా జరుగుతుందని, కావాలని చేస్తారని అనుకోరు కదా. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. అప్పు జీవితానికి ఏం కాదు. తను సంతోషంగా ఎలా ఉండాలో నేను చూసుకుంటాను అని ఓదార్చి కృష్ణమూర్తి వెళ్లిపోతాడు.

మీడియా ముందు బయటపెడతాను

కల్యాణ్ కోసం అనామిక ఎదురుచూస్తుంటే వస్తాడు. గొడవ చేసింది చాలదా అని కల్యాణ్ అంటే.. అది గొడవలా ఉందా. ఇకనుంచి మనం ప్రేమగా ఉందాం. ఎలాంటి గొడవలు వద్దు అని అనామిక అంటుంది. గాయం చేసి కారం పూసి మర్చిపో అంటున్నావా. తప్పు చేయకున్న నిందలు వేస్తున్నావ్. అసలు అప్పు నేను అక్కడికి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు. కానీ, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు మీడియా అక్కడికి ఎలా వచ్చింది. మేమున్న గదికి లాక్ వేసి మీడియా రాగానే ఎవరు తీశారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని అదే మీడియా ముందు బయటపెడతాను అని కల్యాణ్ అంటాడు.

నా వల్ల అప్పు మీద మచ్చపడింది. వాళ్ల కుటుంబం చాలా బాధపడుతుంది. అది పొగొడుతాను అని కల్యాణ్ చెప్పి వెళ్లిపోతాడు. దాంతో అనామిక తెగ భయపడిపోతుంది. మరోవైపు రాజ్ కారులో వెళ్తుంటారు. ఈ ఆపరేషన్ మాయలో మీరు పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని కావ్య అంటుంది. ఇది నా కుటుంబం కాబట్టి పాలు, పెరుగు, వెన్న అన్ని పంచుకుంటాను రాజ్ సెటైర్ వేస్తాడు. తర్వాత ఈ విషయంలో పోలీస్ కమిషనర్ సహాయం తీసుకుంటున్నాం. అక్కడ ఇలా మాట్లాడకు అని రాజ్ అంటాడు.

ఆపరేషన్ మాయ స్పీడుగా

కట్ చేస్తే రుద్రాణికి రౌడీలు కాల్ చేసి మాయ తప్పించుకుందని చెబుతారు. దాంతో షాక్ అయిన రుద్రాణి అది మా ఇంటికి వస్తే నేను అడుక్కు తినడానికి మీ ఇంటికే రావాలి. దాన్ని తొందరగా పట్టుకోండని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు రౌడీలు మాయ వెంట పడతారు. మాయ ఆపరేషన్ చాలా స్పీడుగా వెళ్లాలి అని దేవుడిని కోరుకుంటుంది కావ్య. ఇంతలో కారు ఆగిపోతుంది. దాంతో కావ్యపై రాజ్ కోపంగా చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్, కావ్య కారులో వెళ్తుంటే.. అద్దంలో వెనుక నుంచి మాయ పరుగెత్తడం కావ్య చూస్తుంది. కారు ఆపమని రాజ్‌కు చెబుతుంది కావ్య. వెంటనే కారు ఆపిన రాజ్ మాయను, రౌడీలను చూస్తాడు. కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంట్లో మాయ ఉంటుంది. ఇప్పుడు ఆమె నోరు విప్పి ఏం చెబుతుందో వినండి అని కావ్య అంటుంది. దాంతో మాయ సుభాష్ నిర్దోషి అనే నిజం చెప్పినట్లు చూపిస్తారు. దానికి ఇంట్లో వాళ్లంతా షాక్ అయి చూస్తారు.

WhatsApp channel