Brahmamudi June 13th Episode: బ్రహ్మముడి- అత్తను కాపాడుకున్న కావ్య- రుద్రాణిని పంపించేయమన్న రాజ్ - కోడలితో ప్రేమగా అపర్ణ-brahmamudi serial june 13th episode kavya saves aparna and discharge rudrani rahul in trouble brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 13th Episode: బ్రహ్మముడి- అత్తను కాపాడుకున్న కావ్య- రుద్రాణిని పంపించేయమన్న రాజ్ - కోడలితో ప్రేమగా అపర్ణ

Brahmamudi June 13th Episode: బ్రహ్మముడి- అత్తను కాపాడుకున్న కావ్య- రుద్రాణిని పంపించేయమన్న రాజ్ - కోడలితో ప్రేమగా అపర్ణ

Sanjiv Kumar HT Telugu
Jun 13, 2024 07:47 AM IST

Brahmamudi Serial June 13th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 13వ తేది ఎపిసోడ్‌లో అత్త అపర్ణను ఓదార్చి ధైర్యం చెబుతుంది కావ్య. దాంతో ఆ మరుసటి రోజు అపర్ణకు నయమైందని డాక్టర్ వచ్చి చెబుతుంది. ఇంట్లో అపర్ణ బాధపడేలా మాట్లాడిన రుద్రాణిని పంపించేయమని రాజ్ అంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 13వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 13వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో సుభాష్ సూసైడ్‌కు ప్రయత్నించడంపై రాజ్ ఓదార్చుతాడు. ఏంటీ డాడ్ ఇలా చేశారని రాజ్ అంటే.. నేను తలెత్తుకోలేక పోతున్నాను, నేను ఇంట్లో అందరికీ లోకువ అవుతాను. నేను ధైర్యంగా నిలబడలేను. ఎవరైనా తప్పు చేస్తే అడగలేను అని సుభాష్ అంటాడు. ఆయన బిడ్డను తీసుకొచ్చినప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నాను. కానీ, ఆయన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు అని కావ్య చెబుతుంది.

ధైర్యంగా ఉండండి

తప్పొప్పు సరిచూసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తప్పు చేసినవాళ్లు ఈ లోకంలో మిగిలేవారే కాదు అని కావ్య అంటుంది. మామ్ ఇవాళ కాకుంటే రేపు క్షమిస్తుంది. మీరు ఇలాంటివి ఇంకోసారి చేయకండి డాడ్ అని రాజ్ చెబుతాడు. తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్లి అత్తయ్య అని కావ్య లేపుతుంది. అపర్ణ స్పృహలోకి వచ్చి చూస్తుంది. మీకేం కాదు అత్తయ్య. ధైర్యంగా ఉండండి అని కావ్య చెబుతుంది. మాస్క్ తీసేసి నువ్ నాకు ధైర్యం చెబుతున్నావా అని అపర్ణ అడుగుతుంది.

ఈ ఇంట్లో ఇప్పుడు మీకు ధైర్యం చెప్పే ఏకైక వ్యక్తిని నేనే. ఆ అర్హత నాకు మాత్రమే ఉంది. కొన్నాళ్ల క్రితం ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేను ఉన్నాను. పెళ్లి రోజు భర్త కోసం సంతోషంలో ఉంటే బిడ్డతో వచ్చాడు. బిడ్డకు తనే తండ్రి అని చెప్పాడు. అప్పుడు నేను ఏ శూన్యంలో అయితే ఉన్నానో ఇప్పుడు మీరు ఉన్నారు. కానీ, అప్పుడు నేను మీలాగే తట్టుకోలేనంత బాధకు గురి కాలేదు. ఎందుకో తెలుసా. నమ్మకం. నా భర్తపై నాకున్న నమ్మకం. ఆయన కలలో కూడా తప్పు చేసే మనిషి కాదని తెలుసు కాబట్టి నిలబడ్డాను అని కావ్య అంటుంది.

ఏం మిగల్లేదు

అదే నమ్మకం మీకు మావయ్య గారి మీద ఎందుకు నమ్మకం లేదు. మీ అబ్బాయితో పెళ్లి అయి నాకు ఏడాది మాత్రమే అయింది. నేనే ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను. మీరు ఇన్నేళ్లలో మావయ్యను అర్థం చేసుకుంది ఇంతేనా అని కావ్య అంటుంది. నేను మూర్ఖంగా అపార్థం చేసుకున్నానా. ఆయన తప్పు చేశాడని నా కన్నకొడుకు చెప్పినా, కన్నవాళ్లు చెప్పిన నమ్మేదాన్ని కాదు. కానీ, ఆయన నోటితే ఆయనే చెప్పారు. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంది. అర్థం చేసుకోవాల్సింది ఏముంది. ఏమి మిగల్లేదు అని అపర్ణ బాధగా అంటుంది.

లేదు. మావయ్య గారు మిమ్మల్ని మోసం చేయాలని అనుకోరు. ఆయన మోసపోయారని చెప్పలేం కదా. బిడ్డ లేకుండా తల్లి ఉండలేదు. దూరంగా ఉండలేదు. దూరంగా ఉండేందుకు నెలకు పది లక్షలు తీసుకుంటుంది. ఏదో జరిగింది. అది తెలుసుకునేవరకు మీరు ఓపిక పట్టండి అని కావ్య అంటుంది. నువ్ నాకు ఏం చెప్పకు. నేను ఎప్పటికీ నమ్మను అని అపర్ణ స్పృహ తప్పిపోతుంది. దాంతో మాస్క్ పెట్టి కావ్య వెళ్లిపోతుంది.

అధికారం మన చేతికి వస్తుంది

ఆ చిత్ర విషయంలో మన పేర్లు బయటకు రాలేదని సంతోషపడాలో.. అత్తయ్య చనిపోలేదని బాధపడాలో తెలియట్లేదని రాహుల్ అంటాడు. ఏంట్రా అలా అంటున్నావ్. వదినా చనిపోవాలని అనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. అలా అయితేనే కదా తాము చేసిన తప్పులకు చనిపోయిందని, రాజ్, మావయ్య బాధపడుతారు. అప్పుడు అధికారం మన చేతికి వస్తుందని రాహుల్ అంటాడు. అలా అని వదినా చనిపోవాలా. పాపంరా వదినా అని రుద్రాణి అంటుంది.

వామ్మో నీ నోటి నుంచి ఈ మాటలు ఏంటీ మమ్మీ అని రాహుల్ అంటాడు. రేయ్ నేను ఏం చేసిన ఇంట్లోనుంచి వెళ్లిపోమనలేదురా వదినా. ఎప్పుడు కలిసి ఉందామనే అంది. మా వదినా మంచిదిరా. మా అన్నయ్య పిచ్చిమాలోకం అని రుద్రాణి అంటే.. కానీ, కొడుకుకు మాత్రమే అధికారం ఉండాలనుకున్నారు కదా అని రాహుల్ అంటాడు. అది కరెక్టే అనుకో. కొడుకు భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు కదా నాకు. ఏదో ఒక మంచి సమయం చూసి మా వదినను పంపించేద్దాం అని రుద్రాణి అంటుంది.

పని చేసిన కావ్య ట్రీట్‌మెంట్

ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే గుండె షెడ్డుకు వెళ్లినట్లే. దానికి ఏ ఇబ్బందికలిగిన గుండె ఆగిపోతుంది. అలాంటి పరిస్థితులు మనం క్రియేట్ చేస్తే ఆ గుండె ఆగిపోతుంది. దాంతో మా వదినా పైకి వెళ్లిపోతుంది. నువ్ ఆఫీస్‌లో సరిగ్గా చేయు.. నేను ఇక్కడ ఇంటికి వచ్చిన మా వదినాతో ఏం చేయాలో అది చేస్తాను అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం అపర్ణ తనతో మాట్లాడిందని కావ్య చెబుతుంది. దాంతో ఆశ్చర్యపోతారు రాజ్, సుభాష్.

డాక్టర్ వస్తే మా మామ్ కండిషన్ ఎలా ఉందని రాజ్ అడుగుతాడు. ఏమ్మా రాత్రి మీ అత్తకు ఏం మెడిసిన్ ఇచ్చావ్. మేము గుండె పనితీరుకు ట్రీట్‌మెంట్ మాత్రమే ఇచ్చాం. కానీ, మీ భార్య ధైర్యం చెప్పి నార్మల్ స్టేజ్‌కు తీసుకొచ్చింది. మీ ఇంటికి నర్స్‌ను పంపిద్దామనుకున్నా. కానీ, మీ భార్య వల్ల ఆమె రెండు రోజుల్లో తిరుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య ఉంటే ఇంకా బాగా మెరుగవుతారు. డిశ్చార్జ్ చేస్తాను. కానీ, తనకు ఎలాంటి షాకింగ్ న్యూస్‌లు చెప్పకండి. పసిపిల్లలా చూసుకోండి అని డాక్టర్ చెబుతుంది.

కావ్యను నిందిస్తారు

థ్యాంక్యూ సో మచ్ డాక్టర్ అని రాజ్ చెబితే.. అది మీ భార్యకు చెప్పండని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. సుభాష్, కావ్య సంతోషిస్తుంది. కానీ, రాజ్ మాత్రం కోపంగానే ఉంటాడు. మరోవైపు ఊరుకు వెళ్లి వచ్చిన కనకం, కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంట్లో, కావ్యకు జరిగింది చెబుతుంది అప్పు. పెళ్లి జరిగి ఉంటే కావ్య పరిస్థితి ఏం అయ్యేది. ఇప్పుడు అత్త గారికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడు అంతా దానివల్లే అని నిందిస్తారు అని కనకం బాధపడుతుంది.

మరోవైపు అపర్ణను ఇంటికి తీసుకొస్తారు. అందరి అదృష్టం వల్ల ఇంటికి తిరిగివచ్చావ్ అని ఇందిరాదేవి అంటుంది. మమ్మీ ఇక నుంచి దేనిగురించి పట్టించుకోవద్దు. ముందు నీ ఆరోగ్యం కుదుటపడాలి. నీకు ఏం కావాలన్న నేనే చూసుకుంటాను. మందులు కూడా నేనే దగ్గరుండి ఇస్తాను. సరేనా అని రాజ్ అంటాడు. ఇప్పటివరకు ఇంట్లో జరిగిన గొడవలు చాలు. ఇక గొడవలు జరగకూడదు. మమ్మీని ప్రశాంతంగా ఉండేలా అందరు చూడాలి అని రాజ్ అంటాడు.

సవతి పోరు అవసరమా

ప్రశాంతంగా ఎలా ఉంటాం రాజ్. జరిగింది మాములు విషయమా. ఇప్పుడే ఈ విషయం తేల్చుకోవాలి కదా. ఇంట్లో బాబు ఉన్నాడు. ఆ వదినా కానీ వదినా ఎక్కడ ఉందో. సడెన్‌గా ఊడిపడి అన్నయ్యకు రెండో భార్యగా వస్తే ఎలా. ఇప్పుడు ఈ వయసులో వదినకు సవతి పోరు అవసరమా అని రుద్రాణి అపర్ణకు బాధ కలిగేలా మాట్లాడుతుంది. ఇప్పుడు నిన్ను ఏం అనాలో అర్థం కావట్లేదు. చెల్లెలివి అయిపోయావ్ ఛీ. ఇప్పుడు అవసరమా అని ప్రకాశం అంటాడు.

అక్కయ్య ఏ పరిస్థితుల్లో ఉంది. ఏం మాట్లాడుతున్నావ్. ఇంత వయసు వచ్చింది. మా అక్కను ప్రశాంతంగా ఉండనివ్వవా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇందిరాదేవి కూడా ఫైర్ అవుతుంది. కల్యాణ్ కాశీకో, రామేశ్వరానికో టికెట్ బుక్ చేయి. రుద్రాణి అత్తయ్య కోసం. అటు వెళ్తే అయిన బుద్ధి, జ్ఞానం దేవుడు ప్రసాదిస్తాడు. కనీసం మూడు నెలలు ఇంటికి రాకుండా ప్లాన్ చేయు అని రాజ్ అంటాడు. అదెందుకు అన్నయ్య అవుట్ స్కర్ట్‌లో మన ఫామౌజ్ ఉందిగా. కాకపోతే ఎవరు ఉండరు. పాములు అవి ఉంటాయి అని కల్యాణ్ అంటాడు.

మర్యాదగా వెళ్లిపోమ్మంటున్నాం

ఏం కాదు. ఏ పని లేకుండా తిని తెగ బలిసి కొట్టుకుంటుంది. తన పనులు తాను చేసుకోగలదు అని స్వప్న అంటుంది. వాచ్‌మెన్ కూడా ఉండడని కల్యాణ్ అంటే.. ఇంట్లో పనిపాట లేకుండా రాహుల్ పడి ఉంటున్నాడు కదా అని స్వప్న అంటుంది. అత్తయ్య వెళ్లే ఏర్పాట్లు చేయండి అని రాజ్ అంటాడు. నేను వెళ్లను అని రుద్రాణి అంటుంది. ఇంటి ఆడపడుచువి. బయటకు వెళ్లు అనలేక మర్యాదగా వెళ్లిపో అంటున్నాం అని ప్రకాశం అంటాడు.

అన్నయ్య తప్పు చేస్తే నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు ఏంటీ అని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణి గారు అని కావ్య అరుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కనకం వాళ్లు అపర్ణను పరామర్శించడానికి వస్తారు. ఇంతలో కావ్యను పిలిచి.. నీకు బుద్ధుందా.. పుట్టింటివాళ్లు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటీ అని కావ్యను అంటుంది అపర్ణ. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత పూజలో నా కొడుకు కోడలు కూర్చుంటారు అని అపర్ణ చెబుతుంది.

WhatsApp channel