Brahmamudi June 11th Episode: బ్రహ్మముడి- బద్దలైపోయిన రహస్యం- అపర్ణకు గుండెపోటు- కావ్యను నిందించిన రాజ్- విడిపోనున్న జంట-brahmamudi serial june 11th episode subhash exposes the truth and aparna gets heart attack brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 11th Episode: బ్రహ్మముడి- బద్దలైపోయిన రహస్యం- అపర్ణకు గుండెపోటు- కావ్యను నిందించిన రాజ్- విడిపోనున్న జంట

Brahmamudi June 11th Episode: బ్రహ్మముడి- బద్దలైపోయిన రహస్యం- అపర్ణకు గుండెపోటు- కావ్యను నిందించిన రాజ్- విడిపోనున్న జంట

Sanjiv Kumar HT Telugu
Jun 11, 2024 07:19 AM IST

Brahmamudi Serial June 11th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 11వ తేది ఎపిసోడ్‌లో రాజ్ తీసుకొచ్చిన బిడ్డ గురించి సుభాష్ నిజం చెబుతాడు. దాంతో అపర్ణకు గుండెపోటు వస్తుంది. హాస్పిటల్‌లో ప్రాణపాయ స్థితిలో ఉంటుంది. దొంగ మాయ చిత్రను చంపబోతుంది రుద్రాణి. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 11వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 11వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అని సుభాష్ అంటే అపర్ణ షాక్ అవుతుంది. అలా అయితే నా మీద మీకు చాలా కోపంగా ఉండి ఉంటుందని అపర్ణ అంటుంది. నాకు కోపం లేదు. నీ మీద జాలిగా ఉందని సుభాష్ అంటాడు. నా మీద ఎందుకు జాలి అని అపర్ణ అడుగుతుంది.

నాకు తృప్తిగా ఉంటుంది

నేను చేసిన తప్పు తెలిస్తే ఏమైపోతావా అని భయంగా ఉంది. నిజం తెలిసినా రోజు రాజ్‌కు చేసింది తలుచుకుని కుమిలిపోతావు. ఎలాగైనా నీ ప్రాణానికి ప్రమాదం ఉంది అని సుభాష్ మనసులో అనుకుంటాడు. జాలెందుకండి అని మళ్లీ అపర్ణ అడగడంతో నాకు కోపంగా లేదు అని చెబుతాడు సుభాష్. అయితే నా పక్కన వచ్చి మండపంలో నిల్చోండి. నాకు తృప్తిగా ఉంటుంది అని అపర్ణ అంటుంది. నేను రాలేను అని సుభాష్ అంటాడు.

రుద్రాణి వచ్చి తండ్రి స్థానంలో నీ పని నువ్ పూర్తి చేయు అన్నయ్య. లేకుంటే వదినా మనసు నొచ్చుకుంటుంది అని అంటుంది. ఈ పెళ్లి జరగలాని మీ వదినా కంటే నీకే ఎక్కువగా ఉంది. అది ఎందుకో నీ మనసాక్షికే తెలియాలి. నాకు మాత్రం అర్థం కావడం లేదు అని డౌట్ పడతాడు సుభాష్. తెలియాల్సిన రోజు వచ్చినప్పుడు తెలుస్తుందిలే అని చెప్పిన రుద్రాణి అపర్ణతో కలిసి సుభాష్‌ను మండపంపైకి బలవంతంగా తీసుకొస్తారు.

వెనుతిరిగిన కావ్య

నా మీద నీకు బాగానే అనుమానం ఉంది. పర్లేదు. నువ్ చేసిన తప్పుకు కొడుకు బలి అవుతున్నాడన్న బాధలో అన్నావ్ అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్‌లో మాయకు ఎలా ఉంది. స్పృహ వచ్చిందా. వెళ్లి మాట్లాడొచ్చా అని కావ్య అడిగితే.. తను కోమాలోకి వెళ్లిపోయిందని డాక్టర్ చెబుతుంది. దాంతో కుమిలిపోతూ కావ్య వెనుతిరుగుతుంది. ఇంటి బయట స్వప్న, ఇందిరాదేవి, సుభాష్, కల్యాణ్ అంతా కావ్యకోసం ఎదురుచూస్తుంటారు.

ఏదో ఆధారం తీసుకురావడానికే వెళ్లినట్లుందని స్వప్న అంటుంది. దేవుడా ఎలాగైనా కావ్య జీవితం బాగుపడాలని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో కావ్య వస్తే.. ఏమైందని అడుగుతారు. కావ్య సైలెంట్‌గా ఉండటం చూసి షాక్ అవుతారు. ఇంట్లోకి వచ్చిన కావ్యను చూసిన రాజ్ ఏమైందని అడుగుతాడు. దాంతో కావ్య క్షమించు అన్నట్లుగా దండం పెడుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. రుద్రాణి, మాయ సంబరపడతారు.

గట్టిగా అరిచిన సుభాష్

ముహుర్తం అవుతుందని రుద్రాణి అంటుంది. పంతులు కూడా ముహుర్తం అవుతుంది. తాళి కట్టమని చెబుతాడు. రుద్రాణి, అపర్ణ చెబుతుంది రాజ్ వినడు. అలాగే కావ్యను చూస్తూ ఉండిపోతాడు. అపర్ణ గట్టిగా పిలవడంతో తేరుకుంటాడు. తాళి తీసుకుని కట్టేందుకు రెడీగా ఉంటాడు రాజ్. దొంగమాయకు రాజ్ తాళి కట్టబోతుంటాడు. ఇంతలో ఆగు అని గట్టిగా అరుస్తాడు రాజ్. అంతా అవాక్కవుతారు. చాలు రాజ్.. ఇంక చాలు తల్లి ప్రాణం కోసం, తండ్రి పరువు కోసం ఇప్పటివరకు తలవంచింది చాలు అని సుభాష్ అంటాడు.

హే.. లేవ్వే.. అని సుభాష్ అంటే.. స్వప్న వచ్చి లెవ్వమంటున్నారు కదా.. అని బయటకు లాక్కొస్తుంది స్వప్న. ఏంటండి పెళ్లి మీరేందుకు ఆపుతున్నారని అపర్ణ అంటే.. పెళ్లి జరగడానికి వీల్లేదని సుభాష్ అంటాడు. ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత మాట్లాడుకుందామని రుద్రాణి అంటే.. హేయ్.. ఆగు.. అక్కడే ఆగు అని వార్నింగ్ ఇస్తాడు సుభాష్. వాడు దీని మెడలో తాళి కట్టే ప్రసక్తే లేదు. నేను కట్టనివ్వను అని సుభాష్ తెగేసి చెబుతాడు సుభాష్.

అడ్డు వచ్చిన కావ్య, రాజ్

కావ్యకు ఎలాంటి న్యాయం చేయాలో చేద్దాం అని అపర్ణ అంటే.. ఈ పెళ్లి వల్ల రాజ్‌కు అన్యాయం జరుగుతుంది. వాడి జీవితం నాశనం అవుతుంది అని సుభాష్ అంటాడు. అదేంటండి రాజ్ తప్పు చేశాడు కదా అని అపర్ణ అంటుంది. లేదు లేదు.. నా కొడుకు దేవుడు. ఎలాంటి తప్పు చేయలేదు. నా కొడుకు శ్రీరామచంద్రుడు. అసలు నిజమేంటో తెలుసా అని సుభాష్ అంటే.. రాజ్, కావ్య వచ్చి అడ్డుకుంటారు. అయినా సుభాష్ వినడు.

మీ జీవితం చిన్నాభిన్నం అవుతుంటే చూస్తూ ఉండలేను. గుండ్రాయిలా ఉండలేను. లేదంటే జీవితాంతం మీ ఇద్దరి ముందు దోషిలా జీవింతాలి. ప్రశాంతంగా బతకలేను. అలాంటి జీవితం నాకొద్దు. నాకు దూరంగా ఉండు అని సుభాష్ అంటాడు. రేయ్ నాన్న సుభాష్ ఏమైంది.. ఏ నిజం బయటపెట్టాలనుకుంటున్నావ్. ఎందుకింత తల్లడిల్లిపోతున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. రాజ్ ఎలాంటి తప్పు చేయలేదు అని సుభాష్ అంటాడు.

రాజ్ బిడ్డ కాదా

మరి ఆ బిడ్డ అని ఇందిరాదేవి అడిగితే.. ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు. అది అసలు మాయే కాదు. డబ్బు కోసం నన్ను, కావ్య, రాజ్‌ను బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడిదాకా తెచ్చిందని సుభాష్ అంటాడు. అంతా షాక్ అవుతారు. మామయ్యగారు ఇంతటితో ఆపేయండని కావ్య అంటే.. ఈ పెళ్లి జరగదని రాజ్ అంటాడు. రాజ్ మరి ఆ బిడ్డ ఎవరు. ఆ బిడ్డ తండ్రి ఎవరు అని అపర్ణ అడుగుతుంది. కాదు అని సుభాష్ అంటాడు. ఏంటండి మీరు ఎందుకింతలా కదిలిపోతున్నారు. బిడ్డ గురించి తెలుసా. రాజ్ బిడ్డ కాదా అని అపర్ణ అడుగుతుంది.

కాదు కాదు కాదు. వాడు రాజ్ కన్నబిడ్డ కాదు అని సుభాష్ అంటే.. మరి ఆ బిడ్డ అని అపర్ణ అడుగుతుంది. నా బిడ్డ. వాడిని కన్నతండ్రిని నేనే అని సుభాష్ నిజం చెబుతాడు. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. అంతా అవాక్కవుతారు. సుభాష్ ఏంట్రా అని సీతారామయ్య అడుగుతాడు. అవును, నాన్న.. మీ కొడుకు మంచివాడు. ఒకానొకప్పడు బలహీణ క్షణంలో మాయ అనే అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు అని మాయ గురించి జరిగిందంతా చెబుతాడు సుభాష్.

నా కొడుకు దేవుడు

అపర్ణకు కళ్లు తిరుగుతాయి. తను ఆత్మహత్య చేసుకోబోతుంటే రాజ్ ఆపి తన బిడ్డగా తీసుకొచ్చాడు. అప్పటినుంచి నాకోసం రాజ్ అవమానాలు పడ్డాడు. అన్ని తెలిసిన కావ్య అత్త ప్రాణాల కోసం భర్తనే దారపోస్తుంది. అందుకే ఈ నిజం బయటపెట్టలేక తప్పలేదు. నా భార్య కోసం నేను, తల్లి కోసం రాజ్, అత్త గారి కోసం కావ్య ఎంత నరకం చూశామో మాకే తెలుసు. నా కొడుకు దేవుడు. నా కోడలు దేవత. నేనే పాపాత్ముడిని. నేనే పాపిష్టివాడిని అని సుభాష్ అంటాడు.

అపర్ణ నేను నీకు సర్వస్వం అని తెలుసు. నాపై నమ్మకం ఉందని తెలుసు. కానీ, ఆ నమ్మకం ఉంచుకోలేకపోయాను. నేను నిన్ను క్షమించమని అడగని. దయచేసి ఈ ఒక్కసారి నన్ను క్షమించు. మళ్లీ తప్పు చేయను అని సుభాష్ చేయి పట్టుకుని అడుగుతాడు. గుండెనొప్పితో అపర్ణ కుప్పకూలిపోతుంది. అంతా షాక్ అయి.. హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. హాస్పిటల్‌లో బెడ్‌పై అపర్ణ ఉంటుంది. డాక్టర్‌తో రాజ్ మాట్లాడి వస్తారు.

నా ప్రయత్నాలు ఫలించలేదు

ఇదంతా నా వల్లే. ఏదైతే జరగకూడదని ఇంతకాలం బాధపడ్డానో అదే జరిగిందని సుభాష్ అంటాడు. లేదు మావయ్య నా ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే ఈయన పెళ్లి దాకా వచ్చిందని కావ్య అంటుంది. అసలు ఇంట్లోకి ఒక ఆడది పేరుతో ఎలా వచ్చింది. ఇంట్లో అందరి గురించి, అందరి వాళ్ల అలవాట్ల గురించి ఎలా తెలిసింది. ఆ మాయ ఇంకా ఇంట్లోనే ఉందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. కట్ చేస్తే రుద్రాణి మాయను వెళ్లమని చెప్పింది గుర్తు చేసుకుంటుంది.

ఇలా పంపిస్తే ఎలా నా డబ్బు నాకిస్తే వెళ్లిపోతానని మాయ అంటుంది. ఇచ్చేయ్ మమ్మీ అని రాహుల్ అంటే.. ఇప్పటికిప్పుడు ఎలా ఇవ్వను. సరే పంపిస్తాను ఇప్పుడు వెళ్లు. నా నిజాయితీ ఉంది అని రుద్రాణి అంటుంది. ఇంట్లో నిజాయితీ లేనిదానివే నువ్వు. నీ కుటుంబానే ఇలా చేయాలనుకున్నావ్. నన్ను మోసం చేయవని గ్యారెంటీ ఏంటీ అని మాయ అంటుంది. దాంతో మాయ పీక నొక్కుతుంది రుద్రాణి. రాహుల్ వెళ్లి తలుపులేస్తాడు.

కావ్యను నిందించిన రాజ్

నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నీకు లైఫే ఉండదు అని చంపబోయి వదిలేస్తుంది రుద్రాణి. దాంతో భయంతో సూట్ కేస్ పట్టుకుని పారిపోతుంది మాయగా వచ్చిన చిత్ర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‍‌లో డాక్టర్ వచ్చి అపర్ణకు వచ్చింది సివియర్ హార్ట్ ఎటాక్ అని, చాలా క్రిటికల్ స్టేజ్‌లో ఉందని చెబుతుంది. కట్ చేస్తే నిజం బయటపెట్టేలా చేసింది, మా మమ్మీకి ఇలా జరగడానికి కారణం నువ్వేనని కావ్యను నిందిస్తాడు రాజ్. ఒకవేళ మా అమ్మకు ఏమైనా అయితే.. జీవితంలో నీ మొహం చూడను అని రాజ్ అంటాడు.

టీ20 వరల్డ్ కప్ 2024