Brahmamudi May 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకున్న కావ్య- అమ్మోరుగా కనకం- స్వప్న రివేంజ్ ప్లాన్-brahmamudi serial 3rd episode kanakam in ammoru getup for helping swapna and kavya knows truth brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకున్న కావ్య- అమ్మోరుగా కనకం- స్వప్న రివేంజ్ ప్లాన్

Brahmamudi May 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకున్న కావ్య- అమ్మోరుగా కనకం- స్వప్న రివేంజ్ ప్లాన్

Sanjiv Kumar HT Telugu
May 03, 2024 07:29 AM IST

Brahmamudi Serial May 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ మే 3వ తేది ఎపిసోడ్‌లో ఆస్తి పేపర్స్ గురించి స్వప్న ప్లాన్ చేస్తుంది. దాని కోసం తల్లి కనకం అమ్మోరు గెటప్పు వేసి వడ్డీ వ్యాపారిని భయపెడుతుంది. దాంతో స్వప్న నిజం తెలుసుకుని రివర్స్ ప్లాన్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 3వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 3వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో బాబుకు కావ్య డైపర్స్ మారుస్తుంటుంది. డైపర్స్ కోసం వెళ్లిందా.. ఇంకా నన్ను ఫాలో అయిందేమో అనుకున్నాను అని రాజ్ అనుకుంటాడు. అదే నిజం అని కావ్య అంటుంది. దాంతో రాజ్ చాలా షాక్ అవుతాడు. ఏంటీ అని రాజ్ అడిగితే.. అదే నిజం. మీరు అన్నదే నిజం. అదే డైపర్స్ కోసం వెళ్లడమే నిజం అని కావ్య అంటుంది.

బ్యాలెన్స్ లేదు

ఇంతకీ మీరెక్కడికి వెళ్లారు అని రాజ్‌ను కావ్య అడిగితే.. చెప్పడు. దాంతో కావ్య పంచ్‌లు వేస్తుంది. మీరు ఎలాగు చెప్పరని తెలుసు. కానీ, మీతోనే నిజం రాబడతాను. మీ ఫోన్‌లో నెంబర్ ఉంటుంది కదా అలా తెలుసుకుంటాను అని కావ్య అనుకుంటుంది. తర్వాత రాజ్‌ను ఫోన్ అడిగితే.. ఇవ్వను అంటాడు రాజ్. నీ ఫోన్ ఉంది కదా అని రాజ్ అంటే.. బ్యాలెన్స్ లేదని, చార్జింగ్ లేదని, నెట్‍వర్క్ సరిగా లేదని కావ్య చెబుతుంది.

అవన్ని నేను చేయిస్తాను అని రాజ్ అంటే.. నెట్ వర్క్ కోసం కారేసుకుని బయటకు వెళ్లాల అని కావ్య పంచ్ వేస్తుంది. ఫోన్ ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే అందులో బాబు తల్లితో దిగిన సెల్ఫీలు ఉన్నాయా అని కావ్య అంటుంది. అదా నీ అనుమానం. పటు తీసుకో. కాల్ చేసుకో అని రాజ్ అంటాడు. దేన్ని కాల్చేసుకోవాలి. ఫొటోనా అని కావ్య అంటే.. ఫోన్ కాల్ చేసుకోమన్నా. కాల్చేసుకోమని కాదు. ఎధవ కుళ్లు జోకులు అని రాజ్ అంటాడు.

అప్పుకు చెప్పి

మీరు తండ్రి అయినప్పటి నుంచి చిప్ దొ.. అని అనబోయి ఊరుకుంటుంది కావ్య. ఫోన్ తీసుకుని రూమ్ బయటకు వెళ్తుంది కావ్య. అమ్మో టార్చర్ అని రాజ్ బెడ్‌పై వాలిపోతాడు. బాల్కనీలో ఉండి ఒక ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి నాలుగైదు సార్లు కాల్ రావడం చూసి వాడే అనుకుంటాను అని కావ్య అనుకుంటుంది. అప్పుకు కాల్ చేసి ఆ నెంబర్ గురించి చెప్పి అది ఎవరిదో కనుక్కోమ్మంటుంది కావ్య. సరే కనుక్కుంటానని అప్పు చెబుతుంది.

కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి కావ్యను రాజ్ చూస్తుంటాడు. దాంతో కావ్య షాక్ అవుతాడు. ఎవరి ఫోన్‌తో మాట్లాడుతున్నావ్. బ్యాలెన్స్, ఛార్జింగ్, నెట్ వర్క్ లేదన్నావ్ అని రాజ్ అంటే.. ఒక్క రూపాయి, ఒక్క పుల్ల, సిగ్నల్ ఒక్క పుల్ల ఉంది అని కావ్య చెబుతుంది. మరి నా ఫోన్ ఎందుకు తీసుకున్నావ్ రాజ్ అడిగితే.. ఈ ఒక్క పుల్ల పని చేయకపోతే మీది వాడుకుందామని అని కావ్య అంటుంది. నాకు ఏదో తేడా కొడుతుందే అని రాజ్ అంటే.. ఎండదెబ్బ కొడుతున్నట్లు ఉందని కావ్య వెళ్లిపోతుంది.

కనకంకు ఫోన్

నా ఫోన్ తీసుకుని మళ్లీ తన మొబైల్ నుంచే కాల్ ఎందుకు చేసింది. నాకు ఏదో అనుమానంగా ఉందే అని రాజ్ అనుమానిస్తాడు. మరోవైపు పేపర్స్ కోసం స్వప్న విపరీతంగా వెతుకుతూ ఉంటుంది. బట్టలన్నీ తీసి కింద పడేస్తుంది. ఒరిజినల్ పేపర్స్ మిస్ అయ్యాయి. వాడికి ఎవరో సహాయం చేశారు. పేపర్స్ ఇచ్చారు సరే. నా సంతకం ఎలా. అది ఫోర్జరీ చేసినట్లు కూడా లేదు. నా సంతకమే. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న స్వప్న వెంటనే.. దొరికాడు అని తల్లి కనకంకు ఫోన్ చేస్తుంది.

తనకు పెద్ద సమస్య వచ్చిందని చెప్పి.. తాను చెప్పిన చోటుకు రమ్మంటుంది స్వప్న. ఏమైందని కనకం అడిగితే.. జరిగింది చెబుతుంది స్వప్న. నీ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారా. అర్థమైంది పోన్ పెట్టేయవే అని కనకం అంటుంది. తర్వాత ఒకరి ఇంట్లోకి దొంగచాటుగా స్వప్న వెళ్తుంది. కుక్కలు లాంటివి ఏం లేవని సంతోషపడి తన తల్లికి కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. వడ్డీ వ్యాపారి ఇంట్లో ఉన్నాను, నీ వెనుకే అని కనకం చెబుతుంది.

అమ్మోరు గెటప్పులో కనకం

వెనక్కి తిరిగి స్వప్న చూసేసరికి కనకం అమ్మోరు గెటప్పులో ఉంటుంది. స్వప్న భయపడిపోతుంది. దాంతో నేను మీ అమ్మనే. అమ్మోరు గెటప్పులో వచ్చాను అని చెబుతుంది కనకం. అమ్మా నువ్వా అని స్వప్న అంటే.. నువ్వే కదే అమ్మోరు గెటప్పు తీసుకురమ్మన్నావ్. టైమ్ వేస్ట్ ఎందుకని వేసుకుని వచ్చానని చెబుతుంది కనకనం. తర్వాత వడ్డీ వ్యాపారిని భయపెట్టేందుకు ఇంట్లోకి వెళ్తుంది కనకం. పడుకున్న వడ్డీ వ్యాపారిని లేపి కోపంతో ఊగిపోతుంది కనకం.

దాంతో రోజు నిన్నే కొలుస్తాను కదమ్మా. ఎందుకు నాపై కోపంగా ఉన్నావ్ అని వడ్డీ వ్యాపారి అంటాడు. నా ఆప్త భక్తురాలు స్వప్న ఆస్తి పేపర్స్ నీ దగ్గరే ఉన్నాయి కదా. నువ్ ఎన్ని మోసాలు చేసిన ఊరుకున్నా. ఈసారి ఊరుకునేది లేదు. నిన్ను చీల్చేస్తాను అని కనకం అంటుంది. అందులో నా తప్పేం లేదు. రాహులే నాకు ఆ పేపర్స్ ఇచ్చాడు అని వడ్డీ వ్యాపారి చెబుతాడు. హో ఇచ్చాడా అని చెప్పిన కనకం.. వెంటనే ఆ పేపర్స్ స్వప్నకు ఇచ్చేయ్.. స్వప్న నిన్ను క్షమించమని కలలో చెబుతాను అని కనకం అంటుంది.

అడ్రస్ గురించి

లేదంటే అని త్రిశూలం గురి పెడుతుంది కనకం. దాంతో భయంతో కళ్లు మూసుకుంటాడు వడ్డీ వ్యాపారి. అప్పుడు కనకం మాయమైపోతుంది. కళ్లు తెరచిన వడ్డీ వ్యాపారి.. మాతాది ఎక్కడ.. అమ్మా తల్లి అని అనుకుంటాడు. వాడు భయపడిపోయాడే.. నీ పేపర్స్ నీకు తెచ్చి ఇస్తాడు అని స్వప్నకు చెబుతుంది కనకం. అప్పు కాల్ కోసం వెయిట్ చేస్తుంటుంది కావ్య. ఇంతలో అప్పు కాల్ చేస్తుంది. అడ్రస్ తెలిసిందా అని కావ్య అడుగుతుంది.

తెలిసింది కానీ, ఇదంతా ఎందుకు అని అప్పు అడుగుతుంది. జరిగింది చెబుతుంది కావ్య. ఇప్పుడు నువ్వెళ్లి ఫైట్ చేస్తావా అని అప్పు అంటే.. అవును, లేకుంటే మీ బావగారు ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వస్తుంది అని కావ్య అంటుంది. అయితే నేను కూడా వస్తాను అని అప్పు అంటుంది. నీకు ఏమైనా జరిగితే తట్టుకోలేనని కావ్య అంటే.. లేకుంటే నేను అడ్రస్ చెప్పను. మాకోసం చాలా చేశావ్. నేను నీతో వస్తాను అని ఒప్పిస్తుంది అప్పు.

స్వప్న రివేంజ్ డ్రామా

నువ్ నేరుగా లొకేషన్‌కు వచ్చేయ్.. నేను మా వాళ్లతో వస్తాను అని అప్పు అంటుంది. మీ వాళ్లా అని కావ్య అడిగితే.. రేపు చూస్తావ్ కదా అని అప్పు కాల్ కట్ చేస్తుంది. మరోవైపు సంతోషంగా రుద్రాణి, రాహుల్ కలిసి మందు తాగుతుంటారు. అది చూసిన స్వప్న నన్నే మోసం చేసి నా ఆస్తి పేపర్స్ తీసుకుని నన్ను బ్యాడ్ చేయాలని ట్రై చేసి కోటి రూపాయలు కొట్టేస్తారా. ఇక నేను ఏంటనేది చూడండి అని స్వప్న అనుకుంటుంది.

రాహుల్, రుద్రాణి చాలా సంతోషంగా ఉందని అనుకుంటే.. ఇదంతా ఒక్కరోజే అత్త అని స్వప్న అనుకుంటుంది. ఏంటీ రాహుల్ ఆస్తి పేపర్స్ పోయాయని నేను ఫీల్ అవుతుంటే మీరు సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారా అని స్వప్న అంటుంది. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావ్ స్వప్న. మత్తులో పడితే బాధ తగ్గుతుందని ఏదో తీర్థం పుచ్చుకుంటున్నాం అని రుద్రాణి, రాహుల్ అంటారు. నేను కూడా తాగుదామనుకుంటే నా కడుపులో బిడ్డ ఉందని ఆలోచిస్తున్నాను. నా బాధను పోగొట్టేందుకు మీరైమైనా చేయగలరా అని స్వప్న అడుగుతుంది.

నిజం తెలుసుకున్న కావ్య

హా చేద్దాం. ఏం కావాలి అని రుద్రాణి అంటుంది. మంచి మ్యూజిక్ పెట్టు రాహుల్ నాలుగు స్టెప్పులు వేద్దాం అని స్వప్న అడుగుతుంది. సరే అని రాహుల్, రుద్రాణి అంటారు. కాసేపు నేను అత్త, నువ్వు కోడలు అని స్వప్న అంటుంది. వెంటనే రుద్రాణి క్యారెక్టర్‌లోకి దిగిపోతుంది. రుద్రాణి, స్పప్న కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. చూస్తుంటే ఇదివరకు డ్యాన్స్ చేపించి ఆస్తి పేపర్స్ కొట్టేసినట్లు స్వప్న డెమో ఇస్తుందనిపిస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ 10 లక్షలు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి కావ్య, అప్పు పోలీసులతో వెళ్తారు. రాజ్ గురించి, డబ్బు ఇవ్వడం గురించి కావ్య అడుగుతుంది. నిజం చెబితే వదిలేస్తాం. ఆయనకు నిజం తెలిసిలోపో పారిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు అని కావ్య అంటుంది.

ఈ ఐడియా బాగుందని ఫిబ్రవరి 18న రాజ్ వచ్చి తనను కలిసినట్లు చెబుతాడు. ఇంకేదో చెబుతుంటే ఓ అమ్మాయి బిడ్డను ఎత్తుకుని రాజ్‌తో మాట్లాడటం చూపించారు. కానీ, ఆ అమ్మాయి మొహం మాత్రం పూర్తిగా చూపించలేదు. మొత్తానికి కావ్య మాత్రం నిజం తెలుసుకున్నట్లు తెలుస్తోంది.