Brahmamudi April 27th Episode: బ్రహ్మముడి- పోలీసులతో రాజ్ బేరాలు-కోర్టుకు కల్యాణ్ అప్పు కేసు- బాగా పేలిన అనామిక బాంబ్-brahmamudi serial april 27th episode anamika domestic violence case on kalyan appu brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 27th Episode: బ్రహ్మముడి- పోలీసులతో రాజ్ బేరాలు-కోర్టుకు కల్యాణ్ అప్పు కేసు- బాగా పేలిన అనామిక బాంబ్

Brahmamudi April 27th Episode: బ్రహ్మముడి- పోలీసులతో రాజ్ బేరాలు-కోర్టుకు కల్యాణ్ అప్పు కేసు- బాగా పేలిన అనామిక బాంబ్

Sanjiv Kumar HT Telugu
Apr 27, 2024 10:21 AM IST

Brahmamudi Serial April 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 27వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటిపై అనామిక అనే అణుబాంబును ప్రయోగిస్తుంది రుద్రాణి. దాంతో పోలీసులు కల్యాణ్, అప్పును అరెస్ట్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 27వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 27వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌లో అప్పు మానం తీయాలని రుద్రాణి ఓ ప్లాన్ చెబుతుంది. ఇలా చేస్తే కల్యాణ్ నీ కాళ్ల దగ్గరికి వస్తాడని రుద్రాణి అంటుంది. అంతా బాగానే ఉంది గానీ, కల్యాణ్ ఇబ్బందిపడతాడేమో అని అనామిక అంటుంది. మొండిమొగుడు గిల్లినా ఏడుస్తాడంటే కొట్టైనా దారిలోకి తెచ్చుకోవాలని రుద్రాణి అంటుంది. కానీ ఇంతపెద్ద పని చేయాలంటే అని అనామిక ఆలోచిస్తుంది.

ఇంకెవరి మాట వినను

నీకు నీ కల్యాణ్ కావాల వద్దా. అప్పుకు దూరం కావాల వద్దా అని రుద్రాణి అంటే.. అది ముఖ్యంగా కావాలి అని అనామిక అంటుంది. అలా జరగాలంటే నేను చెప్పింది చేయాలి. కాకపోతే నువ్ చేసెటప్పుడు నీ చుట్టూ వాళ్లు నిన్ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేయొచ్చు. భయపెట్టొచ్చు కూడా. కానీ, అవన్ని పక్కన పెట్టి నువ్ చేస్తేనే నువ్ అనుకుంది జరుగుతుంది అని రుద్రాణి అంటుంది. ఇంత తెగించాకా నేను ఇంకెవరు మాట వింటాను అని అనామిక వెళ్లిపోతుంది.

ఈ అనుబాంబును ఇంటిపై వేశాను. ఇప్పుడు ఆ కావ్య ఇంటి పరువు ఎలా కాపాడుతుందో.. లేదా తన చెల్లి అప్పు మానం పోకుండా ఎలా కాపాడుకుంటుందో చూస్తాను అని రుద్రాణి అంటుంది. తర్వాత కాసేపటికి ధాన్యలక్ష్మీ కంగారుగా అనామిక గురించి అందరినీ అడుగుతుంది. అనామిక ఎవరు అని కల్యాణ్ అంటే.. నా కర్మ, మీ నాన్న మతిమరుపు నీకొచ్చిందా. నీ భార్య అని ధాన్యలక్ష్మీ అంటుంది. నాతో ఎప్పుడు భార్యగా నడుచుకోలేదు. నీ ముద్దుల కోడలిగానే తెలుసు అని కల్యాణ్ అంటాడు.

మీరేమైన గొడవపడ్డారా

ఆ ముద్దుల కోడలే కనిపించిందా అని ధాన్యలక్ష్మీ అంటే.. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది. ఏ మూలనో కూర్చుని కారణం వెతుక్కుని ఏడుస్తుంటుంది అని కల్యాణ్ అంటాడు. మీరేమైనా గొడవపడ్డారా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. తనెప్పుడు నన్ను భర్తల చూడలేదు. ఎక్కడికీ వెళ్తుందో నాకు ఎప్పుడైనా చెప్పిందా అని కల్యాణ్ అంటాడు. ఏంట్రా ఎప్పుడు లేనిది ఆవేశంగా అంటున్నావ్. ఏమైనా గొడవ జరిగిందా అని ఇందిరాదేవి అడుగుతుంది.

వాడు మొహం చూస్తుంటే వీడే ఏదో అనుంటాడు. లేదా కొట్టుంటాడు అని రుద్రాణి అంటే.. అత్త.. నీ పనులు మీరు చూసుకుంటే గౌరవంగా ఉంటుంది అని కల్యాణ్ అంటాడు. ఆవిడ మొహం.. అందరికీ లేనిపోని చాడీలు చెప్పి పైశాచిక ఆనందం పొందుతుంది అని స్వప్న అంటాడు. రాజ్ అడిగితే.. నాకు నిజంగానే తెలీదు అని కల్యాణ్ అంటాడు. అయితే నిజమే. నా తమ్ముడు అబద్ధం చెప్పడు అని రాజ్ అంటాడు. ఇన్నాళ్లు నీపై నమ్మకం పెట్టుకున్నాం. నువ్ ఏం చేశావ్ అని రుద్రాణి అంటుంది.

పోలీసులతో కనకం గొడవ

కల్యాణ్‌కు అనామికను కొట్టిన విషయం గుర్తుకు వస్తుంది. మరోవైపు రాత్రిపూట అప్పు ఇంటికి పోలీసులు వస్తారు. దాంతో ఇదేంటి పోలీసులు వచ్చారని కనకం, అప్పు షాక్ అవుతారు. ఎవరు కావాలి అని కనకం అడిగితే.. మీ అమ్మాయి అప్పుని అరెస్ట్ చేయడానికి వచ్చామని పోలీస్ అడుగుతాడు. ఏం తప్పు చేసింది అని కనకం అడుగుతుంది. కాస్తా పోలీసులతో గొడవ పడుతుంది కనకం. దుగ్గిరాల కల్యాణ్‌తో కలిసి మీ అమ్మాయి అనామికను టార్చర్ పెడుతున్నారని పోలీస్ అంటాడు.

మీ అమ్మాయి మాయలో పడి అనామికను కల్యాణ్ కొట్టాడని గృహ హింస కేసు పెట్టినట్లు పోలీస్ చెబుతాడు. దాంతో షాక్ అయిన కనకం వాళ్ల ఇంట్లో మేమెక్కడ చచ్చాం. అది అనామిక భర్తతో తెల్చుకోండి అని కనకం అంటుంది. అతనితో మీ అమ్మాయి సంబంధం పెట్టుకుని టార్చర్ పెడుతున్నట్లు కెస్ పెట్టాకా అరెస్ట్ చేయక తప్పదని పోలీస్ అంటాడు. ఆమెకు మేమంటేనే పడదు. ఉండండి మాట్లాడతాను అని అనామికకు కనకం కాల్ చేస్తే కలవదు.

చెంప పగులగొట్టాను

కేసు పెట్టినామే ఇంకెందుకు లిఫ్ట్ చేస్తారు అని పోలీస్ అంటాడు. కనకం వాదనకు దిగితే.. అమ్మ కేస్ పెట్టింది అనామిక. ఏం చేయాలో నాకు తెలుసు అని పోలీసులతో వెళ్తుంది అప్పు. ఇంతపని చేసిన ఆ అనామికను నేనెందుకు ఊరుకుంటాను. ఆ ఇంటికే వెళ్లి తేల్చుకుంటాను. తెల్లారేలోపు నా అప్పును తెచ్చుకుంటాను అని కనకం అనుకుంటుంది. మరోవైపు నిజం చెప్పురా ఏం జరిగింది అని కల్యాణ్‌ను ధాన్యలక్ష్మీ అడుగుతుంది.

చెంపపగులగొట్టాను అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఏంటీ. ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కదా అని సుభాష్, ప్రకాశం నిలదీస్తారు. ఏమని చెప్పాలి. ఎవడైనా భరించలేని ఆవేశంతోనే కొడతారు అని కల్యాణ్ అంటే.. విన్నారా అని పోలీసులతో దిగుతుంది అనామిక. విన్నారా ఎంత ధైర్యంగా చెబుతున్నాడో. నేను చెబితే నమ్మలేదు కదా. ఇది ఇంట్లో నా పరిస్థితి. ఈ డొమెస్టిక్ వయెలెన్స్ నా వల్ల కాదు. మీరు చేయాల్సింది చేయండి అని పోలీసులతో అంటుంది అనామిక.

నా భర్త వల్ల అన్యాయం

అనామిక ఏంటింది అని ధాన్యలక్ష్మీ అడిగితే.. క్షమించండి అత్తయ్య.. నేను మీ అబ్బాయి మీద కేసు పెట్టాను అని అనామిక అంటుంది. అపర్ణ కూడా నిలదీస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందామని సుభాష్ అంటాడు. నాకు అన్యాయం జరుగుతుంది. అది ఎవరు అడగట్లేదు అని అనామిక అంటుంది. ఎవరి వల్ల నీకు అన్యాయం జరుగుతుంది అని అపర్ణ అడుగుతుంది. నా భర్త. అప్పుతో తిరుగుతు నన్ను పట్టించుకోవట్లేదు అని అనామిక అంటుంది.

అప్పును కల్యాణ్ ఫ్రెండ్‌లా చూస్తున్నాడు అని స్వప్న, రాజ్ నచ్చజెప్పి చూస్తారు. కానీ, అనామిక వినదు. ఆ అప్పుతో తిరగుతూ రేపో మాపో పెళ్లి చేసుకునేంత గాఢమైన ప్రేమలో ఉన్నాడు. ఇదేంటని అడిగితే.. కొట్టి హింసిస్తున్నాడు. మీరు యాక్షన్ తీసుకోకుంటే మీ పై ఆఫీసర్స్ ను కలుస్తాను అని అనామిక అంటుంది. కావ్య వచ్చి చెప్పిన వినదు. నీ అంత పిచ్చిదాన్ని కాదు. నీ చెల్లిని తీసుకొస్తే నా కాపురు ఏం అవుతుందో అని భయంగా ఉందని అనామిక అంటుంది.

చిక్కుముడి చేసుకుంటున్నావ్

ఇప్పుడు మాత్రం వెలుగబెట్టావా. ఇన్నాళ్లు పిల్ల చేష్టలు అని ఊరుకుంటే ఇంత ధైర్యం చేస్తావా అని ఇందిరాదేవి అంటుంది. పెద్దవాళ్లం మేమున్నాం. నీకు అన్యాయం జరగినిస్తామా. మీ తల్లిదండ్రులను తీసుకొచ్చి మాట్లాడిస్తే అయిపోయేదానికి ఇలా పోలీసులను తీసుకురావడం సమంజసం కాదని సీతారామయ్య అంటాడు. ఇక్కడ పరువు పోతుందనే భయంతో ఎవరు మాట్లాడట్లేదు. నీ కాపురాన్ని నీ చేతులారా చిక్కుముడి చేసుకుంటాన్నవని హెచ్చరిస్తున్నాను. అది అర్థం చేసుకో అని ఇందిరాదేవి అంటుంది.

సర్.. ఆ అమ్మాయి ఇన్నోసెంట్. మా తమ్ముడు సెన్సిటివ్. ఎక్కడో అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందే తప్పా ఇంటెన్షనల్‌గా మా తమ్ముడు చేసింది ఏం లేదు. మీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు. అయినా మీరు కేస్ టేకప్ చేశారంటే అని రాజ్ అంటాడు. నాకు తెలుసు సార్. కానీ, ఈ అమ్మాయి ఎంత చెప్పినా వినలేదు. కేసు వాపసు తీసుకుంటే మేము వెళ్లిపోతాం అని పోలీసులు అంటారు. విన్నావు కదా. కేసు వెనక్కి తీసుకో. కల్యాణ్‌తో ఏం మాట్లాడాలో.. అప్పు విషయం ఏం చేయాలో నేను చూసుకుంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

బుద్ధి లేని పని చేస్తుంది

అనామిక ఆలోచిస్తూ రుద్రాణి వైపు చూస్తుంది. వద్దన్నట్లు సైగ చేసిన రుద్రాణి.. మరి నువ్ ఏం చేస్తే పట్టువీడతావో చెప్పు అని రుద్రాణి అంటుంది. నాలుగు తగిలిస్తే పట్టు వీడుతుంది అని స్వప్న ఆవేశంతో అంటుంది. కావ్య ఆపుతుంది. మరి ఏంటక్కా.. మా అత్తను అలా నాలుగు తగిలించేవారు లేకే మొగుడిని వదిలేసి వచ్చి ఉంటుంది. తనను చూసి కూడా బుద్ధి తెచ్చుకోకుండా బుద్ధిలేని పని చేస్తుంది అని స్వప్న అంటుంది.

ఏయ్.. నా విషయం తీయకు అని రుద్రాణి అంటే.. మరి నువ్వెందుకు దీర్ఘాలు తీస్తూ హింట్స్ ఇస్తున్నావ్. నీ బోడి సలహా ఎవరు అడిగారు అని స్వప్న అంటుంది. చెప్పు ఏం చేస్తే కేసు వెనక్కి తీసుకుంటావో అని ధాన్యలక్ష్మీ కోపంగా అడుగుతుంది. నాకు మాత్రం నా భర్త జైలుకు వెళ్లాలని అనుకుంటానా. కావ్య లాగే నా పరిస్థతి అయ్యేలా ఉంది. ఆ అప్పు నాకు సవతి అయ్యేలా ఉంది. అలా జరగకూడదంటే అప్పును జీవితంలో కల్యాణ్ కలవడకూడదు. నన్ను కొట్టినందుకు తప్పైందని ఒప్పుకుని సారీ చెప్పాలి అని అనామిక అంటుంది.

యావజ్జీవ కారాగార శిక్ష

అంతా షాక్ అవుతారు. ఏంటీ నీకు సారీ చెప్పాలా. ఇంత జరిగాకా నీకు సారీ చెప్పాల. అప్పుపై నా స్నేహం ఎంత పవిత్రమైందో నా మనసుకు తెలుసు. ఎన్నడు లేని వధంగా ఇంటి పరువును ఇలా దిగజార్చావ్. జీవితాంతం జైల్లో ఉంటానే తప్పా నీకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని కల్యాణ్ అంటాడు. దానికి అనామికతో పాటు అంతా షాక్ అవుతారు. నీలాంటి దాంతో కాపురం చేయడమే యావజ్జీవ కారాగార శిక్షతో సమానం అని కల్యాణ్ అంటాడు.

తొందరపడకండి సార్. ఇంత చిన్న విషయానికి నిర్ణయం తీసుకోకండి సార్ అని పోలీస్ అంటాడు. ఇంత చిన్న విషయానికి కూడా పోలీస్ కేసు పెట్టిన ఈ ఆడదా తొందరపడింది.. నేనా.. ఏం జరిగితే అది జరిగింది. నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లండి. జైలుకు పంపండి. పదండి అని కల్యాణ్ నడుస్తాడు. రాజ్ వాళ్లు ఆపుతారు. నాకోసం మీరెవరు పోలీస్ స్టేషన్‌కు రావొద్దు అని కల్యాణ్ అంటాడు. సర్ మీరెం చేయలేరా అని రాజ్ అడిగితే.. లేదు సార్ అని పోలీస్ అంటాడు.

అనుభవించాల్సిందే

అన్నయ్య బతిమిలాడతావేంటీ అని కల్యాణ్ పోలీసులతోపాటే వెళ్లిపోతాడు. పోతే పోనివ్వే.. ఇన్నాళ్లు కొడుకును తప్పు బట్టి కోడలిని వెనుకేసుకు వచ్చి ఇంతదాకా తెచ్చావ్. నిన్ను చేసుకున్నందుకు నేను.. ఈ పిల్లను చేసుకున్నందుకు వాడు అనుభవించాల్సిందే అని ప్రకాశం ఆవేశంతో అంటాడు. ధాన్యలక్ష్మీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్ లో పోలీసులతో కల్యాణ్ బెయిల్ కోసం రాజ్ బేరసారాలు చేస్తాడు. కానీ, ఇది చాలా క్లిష్టమైన కేసు అని, కోర్టులోనే తేల్చుకోవాలని ఎస్సై చెబుతాడు. చూస్తుంటే కల్యాణ్, అప్పు కేసు కోర్టుకు వెళ్లేలా ఉంది. ఇక రుద్రాణి వేసిన అనామిక బాంబ్ గట్టిగానే పేలినట్లు తెలుస్తోంది.

 

 

Whats_app_banner