Brahmamudi April 23rd Episode: బ్రహ్మముడి- రాజ్ కొడుకుపై మీడియా ప్రశ్నలు- అమ్మమ్మను అవమానించిన అనామిక- అర్హత లేదంటూ!-brahmamudi serial april 23rd episode media questions about raj son anamika commands indiradevi brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 23rd Episode: బ్రహ్మముడి- రాజ్ కొడుకుపై మీడియా ప్రశ్నలు- అమ్మమ్మను అవమానించిన అనామిక- అర్హత లేదంటూ!

Brahmamudi April 23rd Episode: బ్రహ్మముడి- రాజ్ కొడుకుపై మీడియా ప్రశ్నలు- అమ్మమ్మను అవమానించిన అనామిక- అర్హత లేదంటూ!

Sanjiv Kumar HT Telugu
Apr 23, 2024 07:35 AM IST

Brahmamudi Serial April 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 23వ తేది ఎపిసోడ్‌లో సీతారాముల కల్యాణానికి వెళ్లిన దుగ్గిరాల వారికి అవమానం జరిగేలా రుద్రాణి మీడియాను రప్పిస్తుంది. దాంతో మీడియా ప్రశ్నలతో విసిగిస్తారు. అందరిముందు రాజ్‌ను అనామిక అవమానిస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 23వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 23వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌లో సీతారాముల కల్యాణం దుగ్గిరాల వారి చేతులమీదుగా జరిపించాలన్న విషయాన్ని గుర్తు చేసేందుకు పంతులు వస్తాడు. ప్రతి ఏడు నిర్వహించే మీరు ఏడాది మీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కంగారు పడ్డాను. అందుకే స్వయంగా కనుక్కోడానికి వచ్చాను అని పంతులు అంటాడు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మేమే జరిపిస్తాం. అందులో మీరు ఎలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఇందిరాదేవి అంటుంది.

అపశ్రుతి దొర్లింది

దానికి అపర్ణ ఫీల్ అవుతుంటే.. రుద్రాణి, ధాన్యలక్ష్మీ మొహాలు చూసుకుంటారు. మా ప్రకాశంను కల్యాణానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం పంపిస్తాను అని సీతారామయ్య అంటే.. పంతులు సంతోషిస్తాడు. తర్వాత పంతులు వెంట ప్రకాశం వెళ్తాడు. మీరు అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అపర్ణ అడుగుతుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది అని ఇందిరాదేవి అంటుంది. కానీ, ఈ తరంలో మన వంశంలో అపశ్రుతి దొర్లింది అని అపర్ణ అంటుంది.

ఆకాశం నుంచి తోకచుక్క ఊడిపడ్డట్టు మనవడు వచ్చాడు కదా. అక్కడ మనవడి గురించి అడిగితే ఏం చెప్పాలని భయపడుతుంది వదినా అని రుద్రాణి అంటుంది. అంతేకదా రుద్రాణి.. మా అక్క భయంలో అర్థముంది. అంతా సర్దుమణిగి సమస్యలన్నీ దూరమైతే వచ్చే ఏడాది కల్యాణం జరిపిద్దామని మొక్కుకుందాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంకో సంవత్సరం లోపు ఇంకో బిడ్డ పుట్టుకొస్తే.. కల్యాణానికి లవకుశలను తీసుకెళ్లాల్సి వస్తుంది అని రుద్రాణి మంటపెడుతుంది.

పాపానికి కళ్లు పోతాయి

దాంతో అంతా షాక్ అవుతారు. రాజ్‌ను అపర్ణ అనుమానంగా చూస్తుంది. అక్కడే ఉన్న స్వప్న రాహుల్.. మంచి ఐ హాస్పిటల్ ఎక్కడుంది అని అడుగుతుంది ఎందుకని రాహుల్ అంటాడు. మీ అమ్మ దేవుడి కల్యాణం విషయంలో అడ్డుపడుతుంది. ఆ పాపానికి కళ్లు పోతాయి కదా. అప్పుడు ఐ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అని స్వప్న అంటుంది. నేను అడ్డు పడట్లేదు. మా వదినా అడ్డుపడుతుంది అని రుద్రాణి అంటుంది. అపర్ణ నీ సమస్య ఏంటని ఇందిరాదేవి అడుగుతుంది.

ఇంట్లోనే సమాజం ఉంది. వాళ్లే ఇన్ని మాటలు అంటుంటే బయట ఇంకెలా ఉంటుంది అని అపర్ణ అంటుంది. అలా అని దైవ కార్యం చేయొద్దా అని సుభాష్ అంటే.. ఇంట్లో తుఫాను జరుగుతుంది. ఓ సముద్రం మొదలు కావడానికి కారణం నీ సుపుత్రుడు అని అపర్ణ అంటుంది. ఎవరో ఏదో అంటారని ఇంకా ఎన్నాళ్లు పనులు మానుకుని కూర్చుంటాం అని ప్రకాశం అంటాడు. ఎవరు ఏం అనకుంటే పర్వాలేదా. ఎప్పటిలాగే ఈ కల్యాణం జరిపిస్తున్నాం అని ఇందిరాదేవి అంటుంది.

నువ్వే ఒప్పించాలి

నేను రాను అత్తయ్య అని అపర్ణ అంటే.. ఇప్పుడు అడుగుతుంది సమాజం. మీ పెద్ద కోడలు ఎందుకు రాలేదని అని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ వస్తుందని సుభాష్ అంటాడు. నాకు తలవంపులు తెచ్చేందుకే పుట్టావురా అని రాజ్‌పై కోపంగా అనేసి వెళ్లిపోతుంది అపర్ణ. దాంతో రాజ్ చాలా ఫీల్ అవుతాడు. పైకి వెళ్లిపోతాడు. తర్వాత ఎవరి దారినా వారు అంతా వెళ్లిపోతారు. అపర్ణకు ఇష్టం లేదని రాజ్ రానంటాడేమో.. ఈ కల్యాణం జరిగితే అయినా ఇంట్లో కష్టాలు పోతాయేమో. వాడిని నువ్వే ఒప్పించాలని కావ్యతో ఇందిరాదేవి అంటుంది.

సరే అని కావ్య అంటుంది. తర్వాత మనం ఎన్ని ప్లాన్స్ వేసిన ఫెయిల్ అవుతున్నాయి. ఇంట్లో అంతా కలిసిపోతున్నారు. ఆ త్లలీ కొడుకు ఒక్కటైతే మళ్లీ రాజ్ ఎండీ అవుతాడు. అప్పుడు నా చిన్నపదవి కూడా పోతుంది అని రాహుల్ అంటాడు. ఇదంతా మన మంచికే జరుగుతుందిరా. కల్యాణానికి రాజ్ బిడ్డతో పాటు వస్తాడు. రాజ్ అక్రమసంబంధాన్ని బయటపెట్టే అవకాశం వచ్చింది. ఇదంతా మీడియాకు చెప్పు. కానీ, వాళ్లు అక్కడ ఏం ప్రశ్నలు అడగాలో నేను చెబుతాను అని రుద్రాణి అంటుంది.

ఇంట్లోంచి గెంటేస్తుంది

మరి ఇంత గొడవ జరిగాక రాజ్ వస్తాడా అని రాహుల్ అంటాడు. రాజ్ వచ్చేలా కావ్య చూసుకుంటుంది కదా అని రుద్రాణి అంటుంది. అప్పుడు అక్కడ మీడియా ఉందని తెలియక వచ్చి పరువు పోగొట్టుకుంటారు అని రాహుల్ అంటారు. ఆ అవమానం భరించలేక మా వదిన తలదించుకుంటుంది. ఆవేశంతో వాడు ఇంట్లో ఉండకూడదని బయటకు గెంటేస్తుంది అని రుద్రాణి అంటుంది. తర్వాత సీతారాముల కల్యాణానికి రాజ్ రానని చెబుతుంటే కావ్య ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది.

భర్త లేకుండా భార్య ఎలా వెళ్తుంది. ఏమో ఈ కల్యాణం జరిపిస్తే అయినా తొలగిపోతాయేమో అని కావ్య అంటుంది. సమస్యలు వాటంతటా అవే వస్తే పోతాయోమో. కానీ, ఇది ఏరికోరి తెచ్చుకున్న సమస్య. జీవితాంత మోయాల్సిందే అని రాజ్ అంటాడు. ఇది కుటుంబం అంతా కలిసి చేసే కల్యాణం. మీరు ఇంటి కొడుకుగా అన్నింటికి దూరమయ్యారు. ఇప్పుడు దీనికి కూడా దూరమై తప్పు చేయకండి. మీ అమ్మ గారు మీకు శిక్ష వేయట్లేదు. ఆమె శిక్ష వేసుకుంటున్నారు అని కావ్య అంటుంది.

పళ్లు రాలగొడతాను

మీరు వెళితే మాత్రం ఆవిడ ప్రశాంతంగా ఉంటారనుకుంటున్నారా. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పూర్తిగా నిర్ణయం జరిగినరోజు పంతాలే గెలుస్తాయి. అప్పటివరకు ఆవిడ గుండెల్లో రగిలే మంటలకు ఆజ్యం పోయకండి. అప్పటిదాకా ఆమె ఏదైనా అంటే మీ అమ్మే కదా. ఆమాత్రం ఓర్చుకుంటే తప్పేంటండి అని కావ్య వెళ్లిపోతుంది. రాజ్ ఆలోచిస్తుంటాడు. మరోవైపు అప్పు బయటకు వెళ్తుంటే సీతారాముల కల్యాణానికి వెళ్లాలి అని చెబుతుంది కనకం.

ఈ కల్యాణానికి వెళితే అయినా నీ పెళ్లి కష్టాలు తీరిపోతాయి. కావ్యకు కూడా చెప్పాను అని కనకం అంటుంది. వాళ్లతో వెళ్తున్నామా. ఆ అనామిక ఏదో ఒకటి అంటుందని అప్పు అంటే.. అదెవరే అనడానికి. నా కూతురు ఇల్లు అది. అది పిలిస్తే హక్కు మనకుంది. ఎవరైనా ఏదో పళ్లు రాలగొడతాను అని అనామికను ఇన్ డైరెక్ట్‌గా కనకం అంటుంది. ఇలా గొడవ చేస్తావనే వద్దంటుంది. ఇలా రెబల్‌గా మారిపోయావేంటే అని అప్పు అంటుంది.

మీడియాతో గొడవ

అదేం లేదు కానీ త్వరగా రెడీగా అని అప్పును తీసుకెళ్తుంది కనకం. కట్ చేస్తే శ్రీరామ నవమి గురించి, వందేళ్ల క్రితం ఆ గుడి కట్టించిన దుగ్గిరాల కుటుంబం గురించి రిపోర్టర్ గొప్పగా చెబుతుంది. గుడికి దుగ్గిరాల కుటుంబం అంతా వస్తుంది. అపర్ణ మాత్రం బాధగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండు అని సుభాష్ అంటాడు. ఇప్పుడు మేము మీడియాతో పెట్టిన గొడవతో ఏది ఉండదు అని రాహుల్ అంటాడు. మనం దుష్టపనులు చేయడంలో ముందు ఉంటాం అని రుద్రాణి అంటుంది.

నీ జీన్సే కదా దుష్టమాత. ఎక్కడికి పోతాయని రాహుల్ అంటాడు. అక్కడ మీడియా ఉండటం చూసి రాజ్ షాక్ అవుతాడు. కల్యాణ్ ఏర్పాట్లు నువ్వేగా చేశావ్. మీడియాను కూడా రమ్మన్నావా అని రాజ్ అడిగితే.. లేదు అన్నయ్య నేనెందుకు రమ్మంటాను అని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు మామ్ ఎలా బాధపడుతుందో అని రాజ్ అంటాడు. కనకం, అప్పు వస్తారు. తర్వాత వాళ్లు వచ్చారు. కవర్ చేద్దాం అని ఓ రిపోర్టర్ అందరికీ చెబుతుంది.

రాజ్ కావ్య చేతులమీదుగా

తరతరాలుగా ఈ కల్యాణం దుగ్గిరాల కుటుంబం చేయిస్తుంది. చెప్పండి మేడమ్. పోయినసారి లాగే ఈ ఏడాది కూడా మీ చేతులమీదుగా కల్యాణం జరిపిస్తున్నారా అని రిపోర్టర్ అడుగుతుంది. కాలం మారుతుంది. దానికి తగినట్లు కొత్త తరం బాధ్యతలు తీసుకోవాలి కదా. ఈ సంవత్సరం నా మనవడు, మనవరాలు రాజ్, కావ్య చేతుల మీదుగా జరిపిస్తున్నాం అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కావ్య అనుమానంగా చూస్తే.. ఏం కాదు అన్నట్లుగా ఇందిరాదేవి సైగ చేస్తుంది.

ఇంతలో బాబును చూసిన రిపోర్టర్.. అరే ఎవరు సార్ ఈ బాబు అని రిపోర్టర్ అడుగుతుంది. దానికి అంతా అవాక్కవుతారు. ఇందుకే ఇక్కడికి రాకూడదని చెప్పింది. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెబుతారు అని అపర్ణ అంటుంది. అమ్మా మేము కల్యాణం జరిపించడానికి వచ్చాం. మమ్మల్ని ఇక్కడే నిలబెడితే ముహుర్తం టైమ్ దాటిపోతుంది. మేము, అన్నదానంతోపాటు టిఫిన్, టీ దానం ఏర్పాటు చేశాం. వెళ్లి టిఫిన్ తిని టీ తాగండి అని ప్రకాశం అంటాడు.

తండ్రీకొడుకుల క్లోజ్ తీసుకోండి

మేము అన్ని కంప్లీట్ చేసుకునే వచ్చాం సార్. ఈ బాబు ఎవరు బాబు అని రిపోర్టర్ అంటే.. పోలికలు చూస్తే తెలియట్లేదా వాడు మా రాజ్ కొడుకు. అపర్ణ మనవడు. మా రక్తసంబంధం. దుగ్గిరాల వారసుడు అని రుద్రాణి అంటుంది. దాంతో మీ నోరు.. మూసుకోండి అని కోపంగా సైగ చేస్తుంది స్వప్న. వావ్.. సెన్సేషనల్ న్యూస్ తెలిసింది. ఈ తండ్రీకొడుకుల క్లోజ్ తీసుకోండి. ఆశ్చర్యంగా ఉందే.. మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అందరికీ తెలుస్తుంది. అలాంటింది ఎందుకింత సీక్రెట్ మెయింటేన్ చేశారు అని రిపోర్టర్ అడుగుతుంది.

దాంతో అంతా మౌనంగా ఉండిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో చూస్తూ సంతోషిస్తున్నావ్ కానీ, అదే కల్యాణం మీ ఇద్దరి చేతుల మీదుగా జరిపిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనామికను రెచ్చగొడుతుంది రుద్రాణి. కానీ, కావ్య, రాజ్‌లతో జరిపిస్తున్నట్లు మీడియాతో అమ్మమ్మ గారు చెప్పారు కదా అని అనామిక అంటుంది. నిజం చెప్పాలంటే వాళ్లకంటే అర్హత మీకే ఉందని రుద్రాణి అంటుంది.

నిలదీసిన అనామిక

సీతారాముల కల్యాణం జరిపిస్తుంటే.. వెళ్లి ఆపమంటుంది అనామిక. ఈ కల్యాణం జరిపించే అర్హత బావగారికి ఉందా అమ్మమ్మ గారు అని అనామిక నిలదీస్తుంది. దాంతో కావ్య చాలా షాక్ అవుతుంది. ఇందిరాదేవి కూడా అలాగే షాక్ అయి చూస్తుంది. రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. చూస్తే అందరిముందు ఇంటి పరువు తీసేలా ఉంది అనామిక.

IPL_Entry_Point