Brahmamudi May 2 Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లికోసం 10 లక్షలు ఇచ్చిన రాజ్- స్వప్నకు 2 రోజుల గడువు- అప్పు కావ్య ప్లాన్-brahmamudi serial 2nd episode swapna cautions rahul rudrani raj gives 10 lakh to blackmailer brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 2 Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లికోసం 10 లక్షలు ఇచ్చిన రాజ్- స్వప్నకు 2 రోజుల గడువు- అప్పు కావ్య ప్లాన్

Brahmamudi May 2 Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లికోసం 10 లక్షలు ఇచ్చిన రాజ్- స్వప్నకు 2 రోజుల గడువు- అప్పు కావ్య ప్లాన్

Sanjiv Kumar HT Telugu
May 02, 2024 07:56 AM IST

Brahmamudi Serial 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ మే 2వ తేది ఎపిసోడ్‌లో బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తికి రాజ్ పది లక్షలు ఇచ్చి ఇదే చివరిసారి అని లేకుంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అదంతా కావ్య చూస్తుంది. దుగ్గిరాల ఇంట్లో వడ్డీ వ్యాపారి వచ్చి గొడవ చేస్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 2వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 2వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో వడ్డీ వ్యాపారిని ఎలాగైన గంటలో తీసుకొచ్చి స్వప్న అంతు చూడాలని రాహుల్‌కు చెప్పి పంపిస్తుంది రుద్రాణి. అప్పుడే వచ్చిన అనామికను చూసి రుద్రాణి నవ్వుతుంది. మీకు అసలు సిగ్గు ఉందా. చేసిందంతా చేసి ఇంకా నవ్వుతున్నారు అని అనామిక అంటుంది. ఏమైంది అనామిక అని రుద్రాణి అడుగుతుంది. మీరు నాకు ఏదో హెల్ప్ చేస్తున్నారని అనుకున్నాను. కానీ, అందరిలాగే మీరు మోసం చేశారని అనామిక ఫైర్ అవుతుంది.

కల్యాణ్‌కు వచ్చేలా

మీరు చెప్పినట్లే కేసు పెడితే అటు మొగుడికి, ఇటు అత్తగారికి దూరమయ్యాను. ఇదంతా మీ కొడుకుని కల్యాణ్ స్థానంలోకి తీసుకురావాడనికే కదా అని అనామిక అంటుంది. ఎంత అపార్థం చేసుకున్నావ్ అనామిక. రాహుల్‌ను చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాన్ని కదా. రాహుల్ కంటే ఎండీగా అర్హత ఉంది కల్యాణ్‌కే. అందుకే కల్యాణ్‌కు వచ్చేలా చేశాను అని రుద్రాణి అంటుంది.

మొగుడు రెండు రోజులు మాట్లాడకపోయేసరికి ఇలా ఫీల్ అవుతున్నావు. కానీ, జరిగిన మంచి అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇక నుంచి ఆ అప్పు జోలికి వెళ్లాలంటే కల్యాణ్ ఆలోచిస్తాడు. నువ్ చెప్పినట్లే వింటాడు. తర్వాత ఆఫీస్ ఏంటీ ఈ ఇంట్లో వాళ్లు కూడా నువ్ చెప్పినట్లే వింటారు అని రుద్రాణి అంటుంది.

నీ మొగుడి సంగతి

అది నమ్మేసిన అనామిక.. సారీ ఆంటీ ఏదో ఆవేశంలో మిమ్మల్ని తిట్టాను. మీ ప్లాన్ వెనుకాల ఇంత అర్థం ఉందని అర్థం చేసుకోలేకపోయాను. మీరు చెప్పినట్లే కల్యాణ్‌ను నా మాట వినేలా మంచి చేసుకుంటాను అని వెళ్లిపోతుంది అనామిక. మెల్లిమెల్లిగా నా సమస్యలన్నీ తీరిపోతున్నాయి. ముందు స్వప్న పీడ విరగడి చేసుకున్నాక. రాజ్ కావ్య ఇంట్లోంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత నీ సంగతి నీ మొగుడి సంగతి చూస్తాను అని రుద్రాణి అనుకుంటుంది.

మరోవైపు రాజ్‌కు పది లక్షల బ్రీఫ్ కేస్ ఇస్తాడు సుభాష్. అది పై నుంచి చూసిన కావ్య ఈయనకు ఇంత డబ్బు అవసరం ఏమొచ్చింది అని కావ్య అనుకుంటుంది. ఇది ఇక్కడితో ఆగదు. ఎంత కాలం ఇలా అని సుభాష్ అంటాడు. ఆగదని తెలుసు అని రాజ్ అంటే.. మరి తెలిసి ఎందుకింత డబ్బు దారపోస్తున్నావ్ అని సుభాష్ అడుగుతాడు. ఒక్కసారి డబ్బు ఇవ్వడం ఆపేసి చూడు అని సుభాష్ అంటే.. అప్పుడు సమస్యలు ఇంకా పెరుగుతాయ్ డాడ్. అందుకే ఆ నోరు మూయించాలి అని రాజ్ అంటాడు.

బిడ్డ తల్లి కోసం

ఎప్పటికైనా నిజం బయటపడిపోతుందిరా అని రాజ్ అంటే.. ఈ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిజం దాచిపెట్టాలి అని రాజ్ అంటాడు. ఈ బలహీనతే ఆ మనిషికి బలంగా మారుతుంది అని సుభాష్ అంటాడు. తప్పదు డాడ్. తనొచ్చి గొడవ చేస్తే జరిగే పరిణామాల కన్నా ఇదే నయం. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను అని రాజ్ వెళ్లిపోతాడు. ఆ బిడ్డ తల్లికోసం ఈ పది లక్షలు తీసుకెళ్తున్నారా అని అనుకున్న కావ్య కూడా రాజ్ వెంటే వెళ్తుంది.

బాబు ఉయ్యాలలో ఉన్నాడు. నేను వచ్చేవరకు చూసుకోండి. వచ్చాకా ఏంటనేది చెబుతాను అని ఇందిరాదేవికి చెప్పి బయలుదేరుతుంది కావ్య. ఓ చోట రాజ్ కారు ఆపి ఎదురుచూస్తుంటాడు. రాజ్‌ను ఓ చెట్టు చాటు నుంచి ఒకతను చూస్తాడు. చూసి రాజ్ దగ్గరికి వస్తాడు. మీ కోసం ఎంత సేపు అని వెయిట్ చేయాలి సార్. టైమ్‌కు రాలేదని తెలీదా అని అతను అంటాడు. దాంతో అతని చెంపపై లాగి కొడతాడు రాజ్. దాంతో కావ్య షాక్ అవుతాడు.

చంపేస్తానని రాజ్ వార్నింగ్

రేయ్.. నన్నే కొడతావా అని అతను అంటే.. నిన్ను ఇక్కడే చంపేసి నీ శవాన్ని కూడా మాయం చేయగలను. ఎన్నిసార్లు బ్లాక్ మెయిల్ చేస్తావురా. పోయినసారే ఆఖరి సారి అని చెప్పాను. ఈసారి నేను ఒక్కన్ని రాను. ఎవరితోరావాలా వాళ్లతోనే వస్తాను అని రాజ్ అంటాడు. లేదు లేదు ఇంకోసారి అడగను. తీసుకోను అని అతను అంటాడు. ఇంకోసారి తీసుకోడానికి నువ్ మిగిలి ఉండాలి కదా అని చెప్పి అతనికి ఆ పది లక్షల బ్రీఫ్ కేసు ఇస్తాడు.

చూడు ఒక రహస్యం బయటపడకూడదని, అది బయటపడితే.. నా కుటుంబం ఏమైపోతుందో అని ఊరుకున్నాను. ఇదే ఆఖరి సార్ అన్నావ్. పిచ్చి పిచ్చి వేశాలు వేశావంటే అని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. లేదు సార్ ఇంకోసారి రాను అని అతను వెళ్లిపోతాడు. పట్టుకుంటే ఆ రహస్యం ఏంటో బయటపడుతుంది అని కావ్య దాక్కుంటుంది. రాజ్ వెళ్లిపోతాడు. డబ్బు తీసుకున్న అతని కోసం కావ్య వస్తుంది. కానీ అతను ఉండడు. మళ్లీ సమస్య మొదటికొచ్చింది అని కావ్య అనుకుంటుంది.

నా భార్య అప్పు తీసుకోవడమేంటీ

దుగ్గిరాల ఇంట్లోకి వడ్డీ వ్యాపారి వచ్చి స్వప్న కావాలి సార్ అంటాడు. తనతో మీకేంటి పని అంటారు రాహుల్, రుద్రాణి. తను నా దగ్గర అప్పు తీసుకుందని వడ్డీ వ్యాపారి అంటాడు. నేను నమ్మను అని రుద్రాణి డ్రామా చేస్తుంది. నా దగ్గర కోటి రూపాయలు తీసుకుంది అని వడ్డీ వ్యాపారి అంటాడు. దాంతో రుద్రాణి గుండెపోటు వచ్చినట్లు చేస్తుంది. ఏంటయ్యా.. నువ్వు నా భార్య అప్పు తీసుకోవడం ఏంటని రాహుల్ అంటాడు. ఇంతలో స్వప్న వచ్చి ఏం జరుగుతుంది అంటుంది.

ఇతనెవరు అని స్వప్న అడుగుతుంది. నేను ఎవరో నీకు తెలీదా. నా దగ్గర డబ్బు తీసుకుని అసలు మర్చిపోవడమే కాకా నేనే తెలీదంటావా అని వడ్డీ వ్యాపారి అంటాడు. నీకు మెంటలా.. నేను నీ దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటీ అని స్వప్న అరుస్తుంది. మా ఇంటి కోడలు నీ దగ్గర అప్పు తీసుకునే అవసరం ఏంటని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. వడ్డీ వ్యాపారి కాలర్ పట్టుకుని నాటకాలు ఆడుతున్నావా అంటూ రాహుల్ నాటకాలు ఆడతాడు.

తాకట్టు పెట్టి

అప్పు చేసిందనడానికి ఏంటీ సాక్షం అంటాడు రాహుల్. దాంతో స్వప్నకు ఇచ్చిన ఆస్తి పేపర్స్ చూపిస్తాడు వడ్డీ వ్యాపారి. అసలు ఆ పేపర్స్ ఏంటని స్వప్న అంటుంది. సుభాష్ తీసుకుని చూసి ఇవి నీకు తాతయ్య రాసిచ్చిన పేపర్సే కదా అని అంటాడు. అవి తీసుకుని స్వప్న చూసి.. ఇవే అవి.. నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని స్వప్న అంటుంది. నా దగ్గర తాకట్టు పెట్టి తీసుకుంటే వస్తాయి అని డాక్యుమెంట్స్‌పై స్వప్న సంతకం చూపిస్తాడు వడ్డీ వ్యాపారి.

ఇది స్వప్న సంతకమే అని రాహుల్ అంటే రుద్రాణి డ్రామా చేస్తుంది. అంతా షాక్ అవుతారు. నేను ఏంటీ అప్పు తీసుకోవడం ఏంటీ. నేను సంతకం పెట్టడం ఏంటీ స్వప్న అరుస్తుంది. ఇది నీ సంతకమే కదా అని రాహుల్ చూపిస్తాడు. ఇదెలా వచ్చింది. నేను ఎలా సంతకం చేస్తాను అని స్వప్న అంటుంది. డ్రామాలు ఆడకు. డాక్యుమెంట్స్ పోయాయని చెప్పి నాటకం ఆడుతున్నావా అని రుద్రాణి అంటుంది. ఇదేదే గ్యాంబ్లింగ్‌లా ఉందని స్వప్న అంటుంది.

పోలీస్ కంప్లైంట్

ఇంత తప్పు చేసిన నిన్ను ఇంట్లో ఉండనివ్వకూడదు. నడవ్వే బయటకు అని రాహుల్ అంటాడు. నేను ఎందుకు వెళ్లాలి. లక్ష తప్పులు చేసిన మీరు సిగ్గు లేకుండా ఉంటున్నప్పుడు తప్పు చేయనిదాన్ని నేనెందుకు వెళ్తాను అని స్వప్న అంటుంది. ఈ అమ్మాయి నా కొంప ముంచేలా ఉంది. మొగుడినే లెక్క చేయట్లేదు. నేను వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వడ్డీ వ్యాపారి అంటాడు. జరిగింది ఏంటో తెలుసుకుని మీ అప్పు మీకు ఇచ్చేస్తాం. కంగారుపడకండి అని సుభాష్ మాటిస్తాడు.

మీరు మాట తప్పరని తెలుసు. అందుకే వెళ్తున్నాను అని వడ్డీ వ్యాపారి వెళ్లిపోతాడు. నాలాగే మతి మరుపు వచ్చిందా అని ప్రకాశం అడిగితే.. లేదు అంకుల్. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు అని స్వప్న అంటుంది. తెలియదంటే ఊరుకుంటామా అని రుద్రాణి అంటే.. ఇంకా దీన్ని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారు అని బయటకు గెంటేసేందుకు రాహుల్ ట్రై చేస్తాడు. ఆగరా.. కడుపుతో ఉన్నదాన్ని గెంటేస్తా అంటావా. బుద్ధిలేదా అని ఇందిరాదేవి అంటుంది.

రెండు రోజుల్లో గుట్టు విప్పుతా

రుద్రాణిని అనుమానంగా చూస్తుంది అపర్ణ. ఏమ్మా నీకు ఆ డబ్బుతో అవసరం లేదని అందరికీ తెలుసు. నువ్ చాలా తెలివైనదానివి. ఏది ఏలా జరిగిందనేది నీ అనుభవం ద్వారా ఆలోచించు అని అపర్ణ హింట్ ఇస్తుంది. అవును ఆంటీ. ఇలా ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు. రెండు రోజుల్లో ఈ గుట్టు విప్పుతాను. నన్ను నమ్మండి. ఈ రెండు వేస్ట్ క్యాండిడేట్స్ ఏం మాట్లాడిన పట్టించుకోకండి అని స్వప్న అంటుంది. హేయ్ అని రాహుల్ అరిస్తే.. రుద్రాణి ఆగమంటుంది.

ఎక్కువ మాట్లాడకు రాహుల్ అసలే నా నోరు మంచిది కాదు అని స్వప్న అంటుంది. రాహుల్‌ను ఆపుతుంది రుద్రాణి. అసలే గలీజ్ మొహంది. ఎందుకు దాని నోట్లో నోరు పెడతావ్ అని రుద్రాణి అనుకుంటుంది. దాంతో స్వప్న వెళ్లిపోతుంది. రెండు రోజుల్లో ఏం చేస్తావే పిచ్చిదానా. మాకు కోటి రూపాయలు రావడంతోపాటు నిన్ను బయటకు గెంటేసే మంచి అవకాశం దొరికింది అని రుద్రాణి అనుకుంటుంది. కట్ చేస్తే బాబు పడుకోవడం చూసి సంతోషిస్తాడు రాజ్.

కంగారుపడిన రాజ్

థ్యాంక్స్ రా అని చెప్పడంతో బాబు ఏడుస్తాడు. నేను వచ్చేవరకు ఏడుపు ఆపుకున్నావా అని అనుకున్న రాజ్.. బాబును చూసి తడిపేసుకున్నావా అని అనుకుంటాడు. ప్యాడ్స్ చూస్తే ఉండవు. కళావతికి తెలిస్తే.. ఎందుకు తెప్పించలేదు అని అంటుందని రాజ్ అనుకుంటాడు. ఎక్కడికెళ్లావ్ అని ఇద్దరూ అడుక్కుంటారు. మీ అడుగుజాడల్లో నడిచాను అని కావ్య అంటే.. రాజ్ కంగారుపడతాడు. మీ కారు జాడల్లో వెళ్లి వచ్చాను అని డైపర్స్ తెచ్చానని కావ్య చెబుతుంది. తర్వాత బాబుకి డైపర్స్ మారుస్తుంది కావ్య.

బ్రహ్మముడి ఎపిసోడ్‌ తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్‌ను కావ్య ఫోన్ అడుగుతుంది. రాజ్ ఇవ్వనంటాడు. కాల్ చేసుకోవాలని కావ్య చెప్పి రాజ్ ఫోన్ తీసుకుంటుంది. రాజ్ ఫోన్‌లో ఓ నెంబర్ తీసుకుంటుంది కావ్య. తర్వాత అప్పుకి కాల్ చేసి ఒక నెంబర్ పంపించాను అని అది ఎవరిది, అడ్రస్ ఏంటని తెలుసుకోమ్మని చెబుతుంది కావ్య. తర్వాత కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ అదోలా చూస్తూ ఉంటాడు. రాజ్‍ను చూసి కావ్య షాక్ అవుతుంది.

IPL_Entry_Point