Brahmamudi June 18th Episode: బ్రహ్మముడి- కావ్యకు దెబ్బ మీద దెబ్బ- మాయమైన మాయ- హోటల్‌లో మీడియాకు దొరికిన అప్పు కల్యాణ్-brahmamudi serial june 18th episode rudrani rahul evils scheme maya discharged kavya shocked brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 18th Episode: బ్రహ్మముడి- కావ్యకు దెబ్బ మీద దెబ్బ- మాయమైన మాయ- హోటల్‌లో మీడియాకు దొరికిన అప్పు కల్యాణ్

Brahmamudi June 18th Episode: బ్రహ్మముడి- కావ్యకు దెబ్బ మీద దెబ్బ- మాయమైన మాయ- హోటల్‌లో మీడియాకు దొరికిన అప్పు కల్యాణ్

Sanjiv Kumar HT Telugu
Jun 18, 2024 07:23 AM IST

Brahmamudi Serial June 18th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 18వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి, రాహుల్ ఏర్పాటు చేసిన రౌడీలు మాయను తీసుకెళ్లిపోతారు. అది తెలుసుకుని కావ్య షాక్ అవుతుంది. తర్వాత మీడియాకు అప్పు, కల్యాణ్ ఒకే గదిలో దొరుకుతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 18వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 18వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అపర్ణతో సుభాష్ మాట్లాడుతుంటాడు. తను చేసిన తప్పుకు ఎంతలా ఫీల్ అవుతున్నాడో చెప్పాలనుకుంటాడు. నేను చనిపోవాలనుకున్నాను. అది నీకోసం కాదా అని సుభాష్ అంటే.. అది నాకోసం కాదు. లోకం కోసం. ఈ లోకం ఎక్కడ తప్పు పడుతుందో అనే భయం అని అపర్ణ అంటుంది. నన్ను ఏం చేయమంటావో చెప్పు. నీకు కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు అని సుభాష్ అడుగుతాడు.

నీ పరువు కాపాడాలని

ఇది కోపం కాదు. కోపం మనకు కావాల్సిన వాళ్లపైన వస్తుందని అపర్ణ అంటుంది. అంటే నేను నీకు ఏం కానా అని సుభాష్ అడిగితే.. అది ఆ బిడ్డ తల్లిని అడుగు. ఎవరు ఎవరికీ ఏం అవుతారో చెబుతుంది అని అపర్ణ అని వెళ్లిపోతుంటే సుభాష్ ఆపుతాడు. పెళ్లయిన అప్పటినుంచి ఈ ఇంట్లో నీకు ఎదురుచెప్పలేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ల ముందు నీ పరువు కాపాడాలని. నీకు నేను ఏదైనా చేసేవాన్ని. నాకన్న నీ మీదే నమ్మకం ఎక్కువ అని సుభాష్ అంటాడు.

కానీ, బలహీణ క్షణానిని లొంగిపోయాను. అందులో నా తప్పు లేదని అనట్లేదు. కానీ, అవతల వ్యక్తి నన్ను మాయలోకి పడేసింది. ఆ మాయలో నుంచి బయటపడేసరికి అంతా అయిపోయింది. జరిగింది చెప్పలేక. చేసింది తలుచుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు. తర్వాత ఆ పాపం నన్ను వెంటాడటం మొదలుపెట్టింది. ఆ బిడ్డను అడ్డుపెట్టుకుని తను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందంటూ జరిగింది చెబుతాడు సుభాష్.

బిడ్డకు ఏం చెబుతారో

రాజ్‌కు వేసిన శిక్షలన్ని నాకు పడాలి. నన్ను క్షమించమనడంలేదు. శిక్షించమంటాను అని భుజంపై చేయి వేసి.. నువ్ మౌనంగా ఉంటే భరించలేను. నువ్ ఏ శిక్ష వేసిన భరిస్తాను. చెప్పు. నాకు జవాబు చెప్పు అని సుభాష్ అంటాడు. అపర్ణ కూడా క్షమించినట్లుగా చూస్తుంది. కానీ, ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. దాంతో తేరుకున్న అపర్ణ వెళ్లి మీ బిడ్డకు ఏ సమాధానం చెబుతారో చెప్పండి అని కోపంగా వెళ్లిపోతుంది అపర్ణ.

అలా కరిగిపోయిన అపర్ణ మనసును బిడ్డ చెడగొడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కావ్య జరిగింది ఆలోచిస్తూ కంగారుపడుతుంది. అత్తయ్య, మావయ్యను కలపాలనుకుంటుంది. ఇంతలో అప్పు వస్తుంది. అక్కడే ఫోన్ మాట్లాడుతున్న కల్యాణ్ చూస్తాడు. కావ్యను అప్పు లాక్కెలుతుంది. అది కూడా కల్యాణ్ చూస్తాడు. ఏంటీ అప్పు ఇంత సడెన్‌గా వచ్చావని కావ్య అంటే.. మీ ఇంట్లో గోడలకే కాదు. ఫోన్‌కు కూడా చెవులు ఉన్నాయంటుంది అప్పు.

మరిది గారికి ఇవ్వరా

ఆ అసలు మాయ కోమానుంచి స్పృహలోకి వచ్చిందట. పద వెళ్దాం అని అప్పు అంటుంది. ఈ సమయంలో చాలా మంచి విషయం చెప్పావ్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని కావ్య అంటుంది. ఇద్దరూ వెళ్లబోతుంటే కల్యాణ్ ఇది చాలా బాగుంది వదినా. నేను మాత్రం నీకు అన్ని చెబుతాను. కానీ, మీరు మాత్రం రహస్యంగా చేస్తారు. నేను ఇచ్చిన ఇంపార్టెన్స్ మరిది గారికి మీరు ఇవ్వరన్న మాట అని కల్యాణ్ అంటాడు.

అలా ఏం లేదు. అనామికకు తెలిస్తే మళ్లీ గొడవ అవుతుందని కావ్య అంటుంది. కావ్య, కల్యాణ్ అనామిక గురించి అనుకుంటుంటే.. మధ్యలో అప్పు కలుగ జేసుకుని ఇలాగే ఉంటే అక్కడ లేట్ అవుతుంది. పదండి వెళ్దాం అని అంటుంది. ముగ్గురు హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు ఫోన్‌లో రుద్రాణి అవునా.. ఎప్పుడు జరిగిందంటూ షాక్ అవుతుంది. రాహుల్ వచ్చి ఏమైందని అడుగుతాడు. హాస్పిటల్‌లో కోమాలో ఉన్న మాయ స్పృహలోకి వచ్చిందట అని రుద్రాణి అంటుంది.

మాయను మాయం చేయించు

అంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్లి కావ్య వెళ్లి కలుస్తుంది. ఇంట్లో అందిరిని కలిపేస్తుంది. ఆ నిజం తెలిస్తే ఇంట్లో అంతా ఒక్కటవుతారు. అత్తయ్య కావ్య ఒక్కటవుతారు అని రాహుల్ అంటాడు. అలా జరగకుండా ఉండాలంటే దానికంటే ముందు నీ మనుషులను పంపించి మాయను మాయం చేయించు అని రుద్రాణి చెబుతుంది. తర్వాత అని రాహుల్ అడిగితే.. రుద్రాణి ఏదో చెబుతుంది. దాంతో రాహుల్ కూడా వెళ్తాడు.

కావ్య నువ్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఆ ఒక్క అవకాశాన్ని నేను నీళ్లు చల్లారుస్తున్నాను. నువ్ తీసుకున్న గోతిలో నిన్నే పడేస్తున్నాను అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు రౌడీలు వెళ్లి తమను కావ్య తీసుకురమ్మన్నారని, డిశ్చార్జ్ చేయించాం అని మాయతో అంటారు. మరోవైపు హాస్పిటల్‌కు కావ్య వాళ్లు వస్తారు. కావ్యతో మాట్లాడాలని మాయ అంటే.. కాల్ చేసినట్లు డ్రామా చేస్తారు రౌడీలు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, మీరు ప్రమాదంలో ఉన్నారని మాయను తీసుకెళ్తారు రౌడీలు.

మీరే చెప్పారు కదా

కావ్య వాళ్లు వచ్చి బెడ్‌పై మాయ లేకుండా ఉండటం చూసి షాక్ అవుతారు. మాయ ఎక్కడ అని కంగారుపడతారు. మొత్తం వెతుకుతారు. సిస్టర్ వస్తే డిశ్చార్జ్ చేశామని చెబుతారు. మేము జాయిన్ చేపిస్తే మాకు తెలియకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారు అని కావ్య అంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి కావ్య అడుగుతుంది. అదేంటీ మేడమ్ మీరే కదా కాల్ చేసి చెప్పారు. వస్తున్నాం అన్నారు. కావ్య మేడమ్ అని వచ్చి తీసుకెళ్లారు అని డాక్టర్ అంటుంది.

దాంతో కావ్య షాక్ అవుతుంది. ఎంతసేపు అయిందని కావ్య అడిగితే.. ఇందాకే కిందే ఉండి ఉంటారు అని డాక్టర్ చెబుతుంది. దాంతో కిందకు పరుగెడతారు కావ్య వాళ్లు. అంతలోనే మాయను తీసుకెళ్లిపోతారు. మాయను ఎలాగైనా పట్టుకోవాలని కావ్య అంటే.. రెండు కార్లు ఉన్నాయి. ఏ కారులో వెళ్లారో ఎలా తెలుస్తుందని కల్యాణ్ అంటాడు. దాంతో ఒక కారులో మీరు, ఇంకో కారులో నేను ఫాలో అవుదామని ఫాలో అవుతారు. మరోవైపు అపర్ణకు రాజ్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు.

హోటల్‌లో అప్పు కల్యాణ్

తర్వాత అపర్ణకు కాళ్లు పడతాడు రాజ్. మనిషిని ద్వేషించినంత కాలం మనసు ప్రశాంతంగా ఉండదు. ఇంత చిన్ని జీవితంలో ఎందుకు ద్వేషం. ఒక్కసారి క్షమించి చూడు అని రాజ్ అంటాడు. నిన్ను చూసి నేను నేర్చుకోవాలనుకున్నాను. నువ్ తప్పు చేశావని తెలియగానే గుండె ఆగినంత పని అయింది. నీకు ఎన్నో శిక్షలు వేశాను. అందులో సగం నీ భార్యకు కూడా పడింది. కానీ, మీరు ఎక్కడ తొణకలేదు. మీ అమ్మ గురించి ఆలోచించారు. ఇంతకాలం భరించారు అని అపర్ణ చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

పెళ్లయిన తర్వాత

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కారులో వచ్చిన వాళ్లు ఎక్కడ స్టే చేశారని హోటల్‌లో అడుగుతారు కల్యాణ్, అప్పు. రిసెప్షన్‌లో రూమ్ నెంబర్ చెప్పడంతో అక్కడికి వెళ్తారు కల్యాణ్, అప్పు. ఆ గదిలోకి వెళ్లగానే ఒకడు లాక్ వేస్తాడు. కట్ చేస్తే అక్కడికి మీడియా వస్తుంది. ధాన్యలక్ష్మీ, అనామిక, కావ్య కూడా వస్తారు. ఆ ఇంటి వారసుడు పెళ్లయిన తర్వాత కూడా అప్పు అనే అమ్మాయితో హోటల్‌లో దొరికిపోయాడు అని టీవీలో చెబుతుంది రిపోర్టర్. కట్ చేస్తే ఇంట్లో పంచాయితీ నడుస్తుంది.

WhatsApp channel