Brahmamudi June 19th Episode: బ్రహ్మముడి- కావ్య తలకు గన్- వీడియోలో నిజం చెప్పిన మాయ - కల్యాణ్, అప్పుకు అక్రమసంబంధం-brahmamudi serial june 19th episode rudrani rahul manipulates anamika maya reveals truth kavya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 19th Episode: బ్రహ్మముడి- కావ్య తలకు గన్- వీడియోలో నిజం చెప్పిన మాయ - కల్యాణ్, అప్పుకు అక్రమసంబంధం

Brahmamudi June 19th Episode: బ్రహ్మముడి- కావ్య తలకు గన్- వీడియోలో నిజం చెప్పిన మాయ - కల్యాణ్, అప్పుకు అక్రమసంబంధం

Sanjiv Kumar HT Telugu
Jun 19, 2024 07:32 AM IST

Brahmamudi Serial June 19th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 19వ తేది ఎపిసోడ్‌లో హాస్పిటల్ బెడ్‌పై ఉన్నప్పుడే వీడియో ద్వారా సుభాష్ కొడుకు గురించి నిజం చెబుతుంది మాయ. ఆ వీడియోను కావ్యకు పంపిస్తుంది. ఆ తర్వాత కావ్యకు గన్ గురిపెట్టి రౌడీ ఫోన్ తీసుకెళ్లిపోతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 19వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 19వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో నువ్, నీ భార్య చాలా భరించారు. ఇంటి గుట్టును కాపాడారు. కానీ, నా విషయం వచ్చేసరికి నా భర్త జీవితంలో మరో ఆడది ఉందనే ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను. కొడుకు తప్పు చేస్తే కడుపులో దాచుకుంటాం. కానీ, భర్త తప్పు చేస్తే భరించలేం. ఇక నా జీవితంలో భర్త అనే అధ్యాయం ముగిసిపోయింది అని రాజ్‌తో అపర్ణ అంటుంది. రాజ్ షాక్ అవుతాడు.

వీడియో పంపిస్తున్నా

మరోవైపు మాయను తీసుకెళ్తున్న కారులను ఫాలో అవుతారు కావ్య, కల్యాణ్, అప్పు. ఒక్కో కారు ఒక్కో వైపు వెళ్తే.. కావ్య ఓవైపు.. కల్యాణ్, మరోవైపు వెళ్తారు. ఇంతలో కావ్యకు మాయ వీడియో మెసేజ్ పంపిస్తుంది. హాస్పిటల్‌లో ఉండగానే చేసిన వీడియో అది. కావ్య నిన్ను మళ్లీ కలుస్తానో లేదో తెలియదు. నా వెనుక ఉన్నవాళ్లు నన్ను ప్రాణాలతో ఉంచుతారో తెలియదు. అందుకే ఇలా వీడియో పంపిస్తున్నా అని మాయ అందులో చెబుతుంది.

ఆ బిడ్డకు మీ మామయ్యకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నాకు కూడా ఆ బిడ్డ పుట్టలేదు. అనాథ శరణాలయం నుంచి బాబును తీసుకొచ్చాం. ఒకరోజు అనుకోకుండా మేము కలిసాం. కానీ, దానివల్ల నాకు ఎలాంటి ప్రెగ్నెన్సీ కాలేదు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని నా వెనుకున్న వాళ్లు ఇలా చేయించారు. ఇందులో మీ మామయ్యది ఎటువంటి తప్పేం లేదు. ఒకవేళ నేను చనిపోయిన నీకు నిజం తెలియాలని ముందుగానే వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నా అని మాయ అంటుంది.

కావ్యకు గన్ గురిపెట్టిన రౌడీ

మీ ఫ్యామిలీని ఇంతలా బాధపెట్టినందుకు నన్ను క్షమించమని మీ మామయ్యకు చెప్పు అని మాయ వీడియో పూర్తి అవుతుంది. అంటే నా నమ్మకమే నిజమైంది. ఎలాగైనా మాయను కాపాడి ఇంటికి తీసుకెళ్లాలి అని కావ్య అనుకుంటుంది. ఒక కారు ముందుకు ఆపిన కావ్య వచ్చి ఆ కారులో చూస్తుంది. మాయ ఎక్కడ అని కావ్య అడిగితే.. తప్పుగా అంచనా వేశారు. మాయ ఇంకో కారులో ఉందని రౌడీ కావ్యకు గన్ గురిపెడతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది.

ఇంతలో ఎవరో కాల్ (రాహుల్) చేసి దాని దగ్గరున్న ఫోన్ లాగేసుకోండ్రా అని చెబుతాడు. దాంతో గన్ పట్టుకున్న రౌడీ కావ్య గన్ లాగేసుకుని వెళ్లిపోతాడు. ఉన్న ఒక్క వీడియో కూడా వీడు తీసుకెళ్లిపోతాడు. మాయను కాపాడటం తప్పా ఇంకోదారి లేదు అనుకున్న కావ్య డ్రైవర్ యాదగిరి ఫోన్ తీసుకుని కల్యాణ్ వాళ్లకు కాల్ చేస్తుంది. మీరు ఫాలో అవుతున్న కారులోనే మాయ ఉంది. మీ కారు లొకేషన్ పంపించండి అని కావ్య చెబుతుంది.

కల్యాణ్ అంతు చూస్తాను

మరోవైపు నువ్ చెప్పినట్లే అన్ని ఏర్పాట్లు చేశాను. మీడియాను రమ్మన్నాను అని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఇక్కడ చేయాల్సిన పనులు పూర్తి చేద్దాం పదా అని కల్యాణ్, అప్పు హోటల్ గదిలో 402 గదిలో ఉన్నాడు. వాళ్లను బయటపెట్టు. అప్పుడు వాళ్లిద్దరు విడిపోతారు అని రుద్రాణి అంటుంది. కల్యాణ్ నన్ను ఇంత మోసం చేస్తాడా. ఇప్పుడే దాని అంతు చూస్తాను అని వెళ్లబోతూ ఈ విషయం మీకెలా తెలుసు అని అనామిక అడుగుతుంది.

లాటరీ వస్తే ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందని అడగకూడదు. ముందున్న పని చూడు అని రుద్రాణి అంటుంది. అత్తయ్యను తీసుకెళ్లి దాని అంతు చూస్తాను అని చెప్పి ధాన్యలక్మీ దగ్గరికి వెళ్తుంది. కల్యాణ్ మంచోడు అన్నావు కదా. అతని నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను. నన్ను మోసం చేశాడు. ఇంతకాలం అప్పు, కల్యాణ్ సంబంధం గురించి మాట్లాడితే నన్నే తప్పు బట్టారు కదా. నాతో వస్తే మీ అబ్బాయి చీకటి కోణం చూపిస్తా అని అనామిక అంటుంది.

అనామికే చేసిందని

దాంతో ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. నేను చూపించిన నిజం చూశాకా మాట్లాడుదురు అని తీసుకెళ్తుంది అనామిక. మరోవైపు అప్పు కల్యాణ్ హోటల్‌కు వెళ్తారు. వాళ్లు వెళ్లిన రూమ్ గది మూసుకుంటుంది. అప్పుడు మీడియా వచ్చి వాళ్లది అక్రమ సంబంధం అని చెబుతుంది. దాంతో వాళ్లిద్దరు విడిపోతారు. ఇక అనామికకు వాళ్లు అక్కడున్నట్లు ఎలా తెలిసిందని అనుమానం వస్తుంది. అదంతా అనామికే చేసిందని కల్యాణ్ అనుకుంటాడు అని రుద్రాణి చెబుతుంది.

దాంతో అనామికకు కల్యాణ్ విడాకులు ఇద్దామనుకుంటాడు. కానీ, దానికి ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. ఇంట్లో పెద్ద సునామీనే వస్తుంది. ఆ గొడవ కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మా వదిన దగ్గరే ఆగుతుంది. భర్త చేసినదానికి కుమిలిపోతున్న మా వదిన చిట్టి గుండె వీటన్నింటితో ఆగిపోతుంది అని రుద్రాణి చెబుతుంది. వామ్మో నువ్ సూపర్ మామ్ అని రాహుల్ అంటాడు. మరోవైపు కారు ఓ హోటల్ వద్ద ఆగడం చూస్తారు కల్యాణ్ అప్పు.

మీడియా రావడంతో

కిడ్నాప్ చేసినవాళ్లు ఇలా హోటల్‌కు ఎందుకు తీసుకొస్తారు అని కల్యాణ్‌కు డౌట్ వస్తుంది. కానీ, టైమ్ లేదని అప్పు లోపలికి తీసుకెళ్తుంది. హోటల్‌లో కారులో వచ్చిన వాళ్ల రూమ్ నెంబర్ అడిగి 402 గదిలోకి వెళ్తారు అప్పు, కల్యాణ్. అప్పటివరకు వాళ్లను గమనిస్తున్న ఓ వ్యక్తి వెళ్లి ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేస్తాడు. ఇంతలో అప్పు కల్యాణ్ చూసి షాక్ అవుతారు. ఆ వెంటనే మీడియా వస్తుంది. మరోవైపు హోటల్‌కు కావ్య కూడా వస్తుంది.

మీడియా వాళ్లు వచ్చాకా రూమ్ లాక్ తీసి వ్యక్తి వెళ్లిపోతాడు. బయటకు వచ్చిన అప్పు కల్యాణ్‌ను మీడియా చుట్టుముడుతుంది. అదంతా కావ్య చూస్తుంది. మీరు దుగ్గిరాల ఇంటి వాళ్లు కదా. మీరు ఈ అమ్మాయితో ఇక్కడ ఏం చేస్తున్నారు. హోటల్‌కు ఎందుకు వచ్చారు. మీకు అక్రమ సంబంధం ఉందా అని మీడియా నానా ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పుడు మాయ గురించి చెబితే ఇంటి పరువు నేనే తీసిన వాళ్లం అవుతాను. చెప్పకూడదు అని కల్యాణ్ అనుకుంటాడు.

మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

ఇంతలో కావ్య వచ్చి ఒక ఆడ మగ కలిసి కనిపిస్తే అక్రమ సంబంధం అంటగంటేస్తారా. మాకు సవా లక్ష పనులు ఉన్నాయి. మీరు నిజాన్ని బయట పెట్టే మీడియానే కావొచ్చు. కానీ, మీకు ఎవరు చెబితే వచ్చారో నాకు తెలియదు కానీ. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని కావ్య అంటుంది. మరి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని రిపోర్టర్ అడుగుతాడు. అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు అని అప్పు, కల్యాణ్‌ను తీసుకెళ్తుంది కావ్య.

ఇంతలో అనామిక, ధాన్యలక్ష్మీ ఎదురుపడతారు. అది చూసి ముగ్గురు షాక్ అవుతారు. చూస్తున్నారు కదా. దుగ్గిరాల కుటుంబం అంటే పరువు ప్రతిష్టకు పెట్టింది పేరు. కానీ, పెళ్లయిన కల్యాణ్ హోటల్ గదిలో ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇందులో తప్పు ఎవరిదీ అని మీడియా నానా రచ్చ చేస్తుంది. అది చూసిన కృష్ణమూర్తి, కనకం కుప్పకూలిపోతారు. అంతా అయిపోయింది. నా కూతురు జీవితం నాశనం చేశారు. మనల్ని అంతా కలిసి రోడ్డుకు లాగారు అని కృష్ణమూర్తి అంటాడు.

నిజం చెప్పి తీసుకురావాలి

అదంతా ఆ ఇంటి వాళ్ల వల్లే. ఆ కల్యాణ్‌ను వాళ్లు కంట్రోల్ చేయలేకపోయారు. పదా వెళ్దాం. జరిగిన తప్పేంటో తెలుసుకుని మన కూతురు తప్పు లేదని నిజం చెప్పి తీసుకురావాలి. మీరు వస్తే రండి లేకుంటే లేదు అని కనకం బయలుదేరుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఇంట్లో అందరిముందు కల్యాణ్‌ను నిలదీస్తుంది అనామిక. ఎన్నాళ్లుగా సాగుతుంది ఈ బాగోతం. ఇది స్నేహమా. ప్రేమనా. ఇంకేదైననా అని అనామిక అంటుంది. తన మూలంగా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అది తెలిసి కూడా హోటల్‌కు వెళ్లింది అంటే ఏమనుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో వచ్చిన కనకం అదే అనుకోవాలి. వాళ్ల మధ్య అదే సంబంధం ఉందనుకోవాలి అని అంటుంది.

WhatsApp channel