Brahmamudi June 20th Episode: బ్రహ్మముడి- అప్పు కల్యాణ్‌పై పంచాయితీ- పుట్టింటికి అనామిక! రౌడీల నుంచి తప్పించుకున్న మాయ-brahmamudi serial june 20th episode kanakam dispute to anamika kavya reveals truth maya escape brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 20th Episode: బ్రహ్మముడి- అప్పు కల్యాణ్‌పై పంచాయితీ- పుట్టింటికి అనామిక! రౌడీల నుంచి తప్పించుకున్న మాయ

Brahmamudi June 20th Episode: బ్రహ్మముడి- అప్పు కల్యాణ్‌పై పంచాయితీ- పుట్టింటికి అనామిక! రౌడీల నుంచి తప్పించుకున్న మాయ

Sanjiv Kumar HT Telugu
Jun 20, 2024 07:37 AM IST

Brahmamudi Serial June 20th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 20వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో అప్పు, కల్యాణ్ హోటల్ వ్యవహారంపై పంచాయితీ పెడుతుంది అనామిక. ఈ క్రమంలో ఇంకోసారి వాళ్లిద్దరు కలవద్దని కనకం వార్నింగ్ ఇస్తుంది. కావ్య అసలు నిజం చెబుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 20వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 20వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో హోటల్‌లో కల్యాణ్, అప్పు మీడియాకు దొరకడంపై ఇంట్లో పంచాయితీ పెడుతుంది అనామిక. ఇప్పుడు చెప్పండి. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ బాగోతం. ఎన్నాళ్ల నుంచి ఇలా సీక్రెట్‌గా కలుస్తున్నారు. నన్ను, అప్పును ఏం చేయాలనుకుంటున్నారు. హోటల్‌లో ఇద్దరు కలిసి మీడియాకు దొరికారు. ఇది నేను కల్పించి చెప్పడం లేదు. అందుకు అత్తయ్య గారే సాక్ష్యం అని అనామిక అంటుంది.

మన పెంపకాన్నే తప్పు పట్టినట్టు

ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు. మీ అందరిని న్యాయం చేయమని వేడుకోవాలా. నా బతుకు నాశనం చేయొద్దని అప్పును బతిమిలాడాలా అని అనామిక అంటుంది. ఎందుకురా ఇలా చేశావ్. అందరి ముందు తలెత్తుకోకుండా చేశావ్. ఎన్నాళ్లుగా ఇలా కలుసుకుంటున్నారు. ఇలా బరితెగించి తిరుగుతున్నారు అని ధాన్యలక్ష్మీ అంటున్నారు. ఆవేశపడకు ధాన్యలక్ష్మీ. మన పెంపకాన్నే తప్పు బడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. రాజ్ విషయంలో నేను పశ్చాత్తాప పడుతున్నాను అని అపర్ణ అంటుంది.

అవును ధాన్యం మన కల్యాణ్ అలాంటివాడు కాదు. ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని ప్రకాశం అంటే.. మా అప్పు కూడా అలాంటిది కాదు. స్నేహమంటే ప్రాణం ఇస్తుంది. ఏదైనా ఓపెన్‌గా చెప్పేస్తుంది. వాళ్లు అలా ఎందుకు వెళ్లారో అడుగుదామని స్వప్న అప్పుకు సపోర్ట్ చేస్తుంది. నువ్ మధ్యలో మాట్లాడకు. నువ్ రాహుల్‌ని, కావ్య ఇంట్లోకి ఎలా వచ్చారో తెలిసు. అప్పును కల్యాణ్‌తో పెళ్లి చేసేందుకు మీ అమ్మ ఎన్ని పన్నాగాలు పన్నిందో నాకు బాగా తెలుసు అని అనామిక అంటుంది.

నాకు అన్యాయం జరిగిందని

నీకు బాగా తెలుసు. మరి నీ సంగతి ఏంటీ. నువ్ కవిగారిని నీ చుట్టు తిప్పుకోలేదా. ప్రేమిస్తున్నానంటూ వెంట పడలేదా. నీ తల్లిదండ్రులకు అంతా తెలిసినా నిన్ను కవిగారి దగ్గరికి పంపించలేదా. నువ్ ఎలా పెళ్లి చేసుకున్నావ్. నువ్ మాట్లాడకు. నీకన్న పెద్దవాళ్ల ముందు భాషను సంస్కారంగా మార్చుకుని మాట్లాడు అని కావ్య అంటుంది. ఇది నా జీవితం. నా సమస్య. నాకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నాను. నాకు ప్రశ్నించే అధికారం లేదా అని అనామిక అంటుంది.

లేదు ఉంది. నీకు అధికారం ఉంది. కానీ, అడ్డమైన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీచంగా నిందలు వేస్తుంటే తలవంచాల్సిన అగత్యం లేదు అని కల్యాణ్ అంటాడు. నువ్వేంటే అనామిక అన్ని అంటుంటే సైలెంట్‌గా ఉంటావేంటే అని స్వప్న అడుగుతుంది. కవికి అనామిక పెళ్లి ఎప్పుడైతే అయిందో నేను అంతా మర్చిపోయాను. అది గతం. కానీ, ప్రతిసారి కల్యాణ్‌తో సంబంధం అంటగట్టినా ఊరుకుంటున్నాను అంటే నా అక్కల కోసం అని అప్పు అంటుంది.

గుంటనక్కలా బోడి సలహా

ఈ ఇంట్లో నా అక్కలు ఉన్నారు. నేను ఆవేశపడితే వాళ్లకు సమస్య అవుతుందని ఊరుకుంటున్నాను అని అప్పు అంటుంది. ఎహే.. అక్కలు లేరు ఆవకాయ బద్దలు లేరు. ఇది నీ జీవితం. ఎందుకు సైలెంట్‌గా ఉండాలి అని స్వప్న అంటుంది. వాళ్లు హోటల్‌లో దొరకడం అనామిక, ధాన్యలక్ష్మీ, మీడియా అంతా చూశారు. నీ విప్లవ ధోరణి ఆపు అని రుద్రాణి అంటే.. మధ్యలో గుంటనక్కలా నీ బోడి సలహా ఎవరు అడిగారు అని స్వప్న అంటుంది.

నేను చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను. నువ్ ఆపు. ఇది నీ చెల్లెలి తప్పు. తన హద్దుల్లో తనుండాలి. కానీ, తను లేదు. తనవల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అది తెలిసి కూడా హోటల్‌కు వెళ్లిందంటే ఏమనుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటే.. అదే అనుకోవాలి. అంతే అనుకోవాలి. ఇంకేదే కారణం ఉందని ఎందుకు అనుకోవాలి అని కనకం ఎంట్రీ ఇస్తుంది. ఒక ఆడ మగ మధ్య నువ్ అనుకునే సంబంధం ఉంటుంది. మీరు పెరిగిన వాతావరణం మీకు ఇలాంటి సంస్కారమే నేర్పింది కదా అనామికపై ఫైర్ అవుతుంది కనకం.

ఎవరికీ ఇవ్వాలి మర్యాద

నేను మీకన్న ఎక్కువ చదువుకోలేదు. నేను మీకన్న నీచంగా మాట్లాడగలను. నీచంగా నిందలు వేయగలను. అందరిముందే నీ నాలుకు కోసి పడేయగలను. ఖబడ్దార్ అని కనకం వార్నింగ్ ఇస్తుంది. ధాన్యలక్ష్మీ వారిస్తుంటే ఎవరికీ ఇవ్వాలి గౌరవం. నీకా.. నీ కోడలికా. మీరు ఇలాగే మాట్లాడుతారని, ఇలాగే నిందిస్తారని ఎంత చెప్పిన వినని నీ కొడుక్కి ఇవ్వాలా మర్యాద. అసలు ఏం చేద్దామనుకుంటున్నారు నా కూతురిని. దాని భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నారు. ఇలాంటి నిందలు వేస్తుంటే రేపు దాని పెళ్లి ఎలా అవుతుందని అనుకుంటున్నారు అని కనకం అంటుంది.

ఎన్నిసార్లు దాని శీలంపై మచ్చ వేస్తారు. ఎందుకు ఇన్నిసార్లు పనికిమాలిన పంచాయితీలు పెడుతారు అని కనకం ప్రశ్నిస్తుంది. ఏ అనామిక నువ్ ఎప్పుడైనా నీ భర్తతో ప్రేమగా ఉన్నావా. సవ్యంగా కాపురం చేసే మొహమేనా నీది. నీ మొగుడు తప్పా ఇంకా పురుగేది లేదా. ఏం పుట్టుక నీది. ఎలా పెంచారు నిన్ను అని కనకం అంటుంది. నా నోరు మూయించడం కాదు. మీడియా అడిగిన ప్రశ్నలు వినే వచ్చావా అని అనామిక అంటుంది.

నిందలు పడటమేంటీ

లేదు వినను. ఎందుకంటే నాకు నమ్మకం. నా కూతురి పైనే కాదు. నీ మొగుడిపై కూడా. స్నేహం కోసం ఈగ కూడా వాలనివ్వని మనిషి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తాంటే నేను చచ్చినా నమ్మను అని కనకం అంటుంది. ఇంతలో ఆపండి అని రాజ్ అరుస్తాడు. ఎవరు ఏం అనుకున్నా ఇద్దరు హోటల్‌కు వెళ్లిన మాట నిజం. ఇంతమంది మాట్లాడుతుంటే వాళ్లెందుకు మౌనంగా ఉన్నారు. వాళ్లు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. కానీ, వాళ్లు వెళ్లినందుకు కారణం చెప్పకుండా ఇలా నిందలు పడటం ఏంటీ అని రాజ్ అడుగుతాడు.

రేయ్ కల్యాణ్ మీరెందుకు అక్కడికి వెళ్లారు అని రాజ్ అడుగుతాడు. ఇద్దరు సైలెంట్‌గా ఉంటారు. నిందలు నిజమైపోతాయి అని ఇందిరాదేవి అంటుంది. నేను చెబుతాను అని కావ్య అంటుంది. ఒక మంచి పని చేయడానికి వెళ్లారు అని కావ్య అంటే.. వాళ్లు వెళ్లింది నీకు తెలుసా అని రాజ్ అడుగుతాడు. తెలుసు. ఎందుకంటే నేను కూడా వెళ్లాను. మాయ కోసం వెళ్లాను. నా వల్లే అక్కడికి వెళ్లారు అని జరిగింది చెబుతుంది కావ్య. ఒసెయ్ ఇంకా మాయను వదలవానే అని స్వప్న అంటుంది.

నిర్దోషిగా నిరూపించవచ్చు

అంతా నీవల్లే. కానీ, అక్కడ ఏం జరిగింది అని రాజ్ అడుగుతాడు. మీకు మాయతో పెళ్లి అవుతున్న రోజే నాకు అసలు మాయ దొరికింది. కానీ, నన్ను చూడగానే అసలు మాయ పారిపోవడానికి ప్రయత్నించింది అని యాక్సిడెంట్, హాస్పిటల్, కోమా, కిడ్నాప్ అన్ని చెబుతుంది కావ్య. ఆ తర్వాతే అత్తయ్య, అనామిక మీడియాతో వచ్చి రచ్చ చేశారు. అసలు మాయ దొరికితే మావయ్య గారు నిర్దోషి అని నిరూపించొచ్చు అని అనుకున్నాను అని కావ్య చెబుతుంది.

దాంతో అనామిక చప్పట్లు కొడుతుంది. శభాష్. నీ కుటుంబానికి నాటకాలు ఆడటం మాత్రమే వచ్చనుకున్నాను. ఇలాంటి కథలు కూడా రాయడం వచ్చని తెలిసింది. నీ చెల్లిని కాపాడటం కోసం బాగానే కథ అల్లావ్ అని అనామిక అంటుంది. నీ కళ్లకు అనుమానపు పొరలు కమ్ముకున్నాయి. ఇక నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు అని కావ్య అంటుంది. మారనివాళ్ల గురించి ఎందుకులే వదినా అని కల్యాణ్ అంటాడు. ఇక నుంచి అప్పును కల్యాణ్ కలవకూడదు అని అనామిక అంటుంది.

ఎవరు బుద్ధులు వచ్చాయో

నువ్ కండిషన్ పెట్టేది ఏంటే.. నేను చెబుతున్నాను. ఇంకోసారి కల్యాణ్ స్నేహితుడిగా, బంధువుగా వస్తే కలవనివ్వను. అయినా వస్తే మొహంపైనే తలుపు వేస్తాను అని కనకం అంటుంది. చాలా.. ఇంతగా అల్లరుపాలై నీ పరువు మా పరువు పోగొట్టుకోవడం అవసరమా అని అప్పును తీసుకెళ్తుంది కనకం. అడ్డంగా దొరికిపోయాకా అడ్డమైన కథలు చెప్పి తల్లికూతుళ్లు తప్పించుకున్నారు. కానీ, నేను నమ్మను. నీకు భార్య ఉండగా ఇంకో అమ్మాయితో తిరిగేందుకు నీకు మనసెలా వచ్చింది కల్యాణ్. అసలు నీకు ఎవరి బుద్ధులు వచ్చాయో అని సుభాష్‌ను ఇన్‍‌డైరెక్ట్‌గా అంటుంది అనామిక.

అంతా షాక్ అవుతారు. అనామిక నోర్మూయ్. నువ్ ఎంత నీ బుతుకెంత. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడతావా. పిచ్చిపిచ్చిగా ఉందా. ఇక్కడ కొడితే పుట్టింట్లో వెళ్లి పడతావ్. నీ మొహం నాకు చూపించకు. వెళ్లు అని ఫైర్ అవుతుంది ఇందిరాదేవి. ధాన్యలక్ష్మీ నీ కోడలికి కాస్తా బుద్ధి చెప్పు. ఎవరితో ఎలా మాట్లాడాలో అని ఇందిరాదేవి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తప్పించుకున్న మాయ

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్, కావ్య కారులో వెళ్తుంటే రౌడీల నుంచి తప్పించుకున్న మాయ వెనుక పరుగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన కావ్య కారు ఆపమని చెబుతుంది. దాంతో రాజ్ కారు దిగి మాయను చూస్తాడు. కట్ చేస్తే దుగ్గిరాల ఇంట్లో మాయ ఉంటుంది. ఇప్పుడు మాయ ఏం చెబుతుందో వినండి అని కావ్య అంటే.. మాయ జరిగిందిన చెప్పినట్లుగా చూపించారు.

Whats_app_banner