Brahmamudi June 25th Episode: బ్రహ్మముడి.. ఎట్టకేలకు రాజ్, కావ్య శోభనం.. కనకంకు గుండెపోటు.. అనామికకు అప్పు వార్నింగ్
Brahmamudi Serial June 25th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 25వ తేది ఎపిసోడ్‌లో భార్య కావ్యకు లైన్ వేస్తాడు రాజ్. కావ్య నడుమును చూస్తాడు. తర్వాత ఇందిరాదేవి రహస్య సమావేశం పెట్టి వారికి తెలియకుండా ఇద్దరికీ శోభనం ప్లాన్ చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కావ్య ఇంటి బయట మొక్కలకు నీళ్లు పడుతుంటుంది. రాజ్ వస్తాడు. అక్కడున్న ఊయలో కూర్చుని కావ్య నడుమునే చూస్తుంటాడు. తర్వాత చిట్టి నడుమునే చూస్తున్న అనే పాట ప్లే చేస్తాడు రాజ్. దాంతో రాజ్‌ను చూస్తుంది కావ్య. ఏంటీ శ్రీవారు కొత్తగా కనిపిస్తున్నారు, ఓ ఆట ఆడుకుందామని కావ్య అనుకుంటుంది. ఏం చూస్తున్నారు అని కావ్య అడిగుతుంది.
ఖుషీ సీన్ రిపీట్
నేచర్‌ను చూస్తున్నాను అని రాజ్ అంటే.. దానికి పాటలు ఎందుకు అని కావ్య అంటుంది. నేచర్‌ను చూస్తూ పాటలు ఎంజాయ్ చేయమని ఓ కవి చెప్పారని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ అలాగే కావ్య నడుము చూస్తాడు. అది గమనించిన కావ్య అరుస్తుంది. మీరు ఏం చేస్తున్నారు. నా నడుము చూస్తున్నారు అని ఖుషీ సీన్ రిపీట్ అవుతుంది. మీరు జెంటిల్‌మెను అనుకున్నాను. కానీ, ఇలా చేస్తారనుకోలేదు అని కోపంగా వెళ్లిపోతుంది కావ్య.
ఇప్పుడు దీనికి నేను సైట్ కొడుతున్నాను ఇది నమ్మాలి. ఎలా నమ్మించాలి. అమ్మాయిలకు లైన్ వేయడమే నాకు తెలియదు. అలాంటిది పెళ్లానికి ఎలా లైన్ వేయాలి. పెళ్లానికి లైన్ ఎలా వేయాలి అని ఎవరైనా బుక్ రాసినా అయిపోయేది అని తల పట్టుకుంటాడు రాజ్. మరోవైపు అప్పు బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని కనకం అడుగుతుంది. అప్పు చెప్పొదు. ఇంత జరిగిన తర్వాత ఎక్కడికి అంటూ కనకం ఫైర్ అవుతుంది.
బయటకు వద్దన్న కనకం
మా కష్టం మేము పడాలి కదా పిజ్జా డెలీవరీ బ్యాగ్ వేసుకును బయలుదేరుతుంది. పెళ్లి చేస్తాం. అక్కడ పడు ఈ కష్టం అని కనకం అంటుంది. ఇన్నాళ్లు పెంచిన తల్లిదండ్రులే చేయనివ్వట్లేదు. ఇంకా నువ్ చెప్పిన ఆ మొగుడు చేయనిస్తాడా. నాకు పోలీస్ ఎగ్జామ్ ఉంది. అందుకే వెళ్తున్నా అని అప్పు అంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయడం అవసరమా అని కనకం అంటుంది. అమ్మాయి అంటే పెళ్లి ఒక్కటేనా. ముందు నేను పోలీస్ అవ్వాలని అప్పు అంటుంది.
నువ్ పెళ్లి వద్దన్న ప్రతిసారి నాకు గుండెపోటు వచ్చేలా ఉందని కనకం అంటుంది. అమ్మా ఎగ్జామ్‌కు టైమ్ అవుతుంది మనసు పాడు చేయకు అని బంటిని పట్టుకుని వెళ్తుంది అప్పు. మరోవైపు గార్డెన్‌లో నువ్ వేసిన ఎధవ వేశాలు నేను చూశాను అని రాజ్‌తో అంటుంది ఇందిరాదేవి. అది కళావతిని సెట్ చేశా అని రాజ్ కవర్ చేస్తుంటే.. సెట్ చేసుకుంటున్నావా. ఎన్నాళ్లు దోబుచులు. మనసులో ఉన్న ప్రేమను చూపించాలి కదా. నీ ప్రేమ ఏంటో కావ్యకే కాదు మాక్కూడా అర్థం కావట్లేదు అని ఇందిరాదేవి అంటుంది.
అక్కర్లేదని చెప్పినా
ఇంకా ఎన్నాళ్లు కావ్యను బాధపెడతావ్. అసలు నీ మనసులో ఏముంది అని ఇందిరాదేవి అడుగుతుంది. అద్దంలో ఇలా అడుక్కున్న ప్రతిసారి తప్పు నాదే అని నా మనసు చెప్పింది. నేను తను వేరు వేరు అనుకున్నా. కానీ, ఎప్పుడు కళావతి నా మనసు మార్చిందో నాకే తెలియదు. అందరూ ఒక్కటిగా ఉండాలనే నిర్ణయాన్ని తన నిర్ణయంగా బతుకుతోంది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు పడిందో నాకు తెలుసు. నేను అక్కర్లేదు అని మొహం మీదే చెప్పినా మీ మనసు నేను గెలుచుకుని తీరుతాను అంటూ నాతోనే ఛాలెంజ్ చేసిందని రాజ్ చెబుతాడు.
జీవితంలో నిన్నెప్పుడు కోడలిగా అంగీకరించను అని చెప్పిన మా అమ్మను తనవైపుకు తిప్పేసుకుంది. అలాంటి కావ్యను నేను భార్యగా అంగీకరించడం ఏంటీ.. తనే భర్తగా తీసుకుంటుందో అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తాను అందరినీ కలిపినందుకే నేను ప్రేమ చూపిస్తున్నానేమో అని అనుమానంగా ఉందని రాజ్ అంటాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడే చెబుదువు పదా అని ఇందిరాదేవి లాక్కెళితే రాజ్ ఆపుతాడు.
యాక్సిడెంట్ అయిపోతుంది
దానికి మంచి సమయం, ప్లేసు దొరక్కానే చెబుతాను అని రాజ్ వెళ్లిపోతాడు. వీడిని నమ్ముకుంటే లాభం లేదు. వీడు అడిగే ప్లేసు నేనే రెడీ చేస్తా. ఇవాళ రాత్రికే చేయాలి అని ఇందిరాదేవి అనుకుంటుంది. అప్పు ఆటోలో వెళ్తుంటే అనామిక కారులో అడ్డు వస్తుంది. ఏదో సాధించినదానిలా కారు దిగుతుంది. ఎదురుగా వచ్చేది మనకంటే బలమైనది వస్తే పక్కకు తప్పుకోవాలి. లేకుంటే యాక్సిడెంట్ అయిపోతుంది అని అనామిక అంటుంది.
మీరు హోటల్‌లో ఉన్నప్పుడు మీడియాకు తెలిసేలా చేసింది. మీకు అక్రమ సంబంధం అంటగట్టింది నేనే. నీ బాయ్‌ఫ్రెండ్‌కు చెబుతావా అని అనామిక అంటుంది. ఒకరి గురించి చెప్పడాలు. ఇలాంటి ముదనష్టపు పనులు చేయడాలు నాకు రావు అని అప్పు అంటుంది. డబ్బు సంపాదించలేని వాడు డబ్బులో ఏముందిలే అంటాడు. ఇప్పటికైనా డబ్బు పవర్ అర్థమైందా అని అనామిక అంటుంది. నాకున్నది నిజాయితీ. దాని నుంచి వచ్చిన పొగరు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని అప్పు అంటుంది.
కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని
నువ్ మారతావు. నా ఫ్రెండ్ జీవితం బాగుంటుందని ఎక్కడో ఓ చిన్న ఆశ ఉండేది. అందుకే నిన్ను ఏం అనకుండా ఊరుకుంటున్నాను. నీ స్థానంలో ఇంకొకరు ఉంటే ఈ అప్పు పొగరు రుచిచూపించేదాన్ని అని వెళ్లిపోతుంది అప్పు. దీని పొగరును రెచ్చగొట్టాం కాబట్టి ఇది కల్యాణ్‌ను కలవదు అని గ్యారెంటీ ఉంది. కలవకుంటే వాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చనే క్లారిటీ నాకుంది. ఈ క్లారిటీ ఉంటే చాలు ఆస్తిని దక్కించుకోడానికి అని అనామిక సంబరపడుతుంది.
మరోవైపు అపర్ణ, ప్రకాశం, స్వప్న వస్తారు. రుద్రాణి కూడా వస్తుంది. ఇక్కడ ఏంటీ రహస్య సమావేశం అని ఏంటీ అని రుద్రాణి అంటుంది. కావ్య, రాజ్ పెళ్లి అయి సంవత్సరం అయినా ఏం జరగలేదు. ఇవాళే వాళ్లకు శోభనం పెడుతున్నాను అని ఇందిరాదేవి అంటుంది. ఓ బుద్దిలేని మొద్దుకు, ఎర్రి సన్నాసికా శోభనం అని అపర్ణ అంటుంది. మరి వాళ్లకు చెప్పనా అని ప్రకాశం అంటే.. వద్దు తప్పించుకుంటారు. అత్తయ్యకు అలా ఉంది, ఇలా ఉందని తప్పించుకుంటారని ఇందిరాదేవి అంటుంది.
రుద్రాణిపై అపర్ణ ఫైర్
వాడికి ప్రేమ కూడా ఏడ్చిందా అని అపర్ణ అంటే.. పెళ్లాం నడుము చూస్తూ పాటలు కూడా పాడుతున్నాడు. డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం లేదుకదా వెధవకి. ముహుర్తం పెట్టేందుకు టైమ్ లేదు. వాడి ప్రేమను కావ్యకు చెప్పాలనుకుంటాన్నాడు. శోభనం పెడితే వాళ్ల తంటాలు వాళ్లు పడతారు అని ఇందిరాదేవి చెబుతుంది. ఇన్నాళ్లు చెప్పనివాడు ఇప్పుడు ఎలా చెబుతాడు అని రుద్రాణి అంటే.. అపర్ణ కోప్పడుతుంది. మధ్యలో ఎవరు దూరమన్నారు అని అపర్ణ అంటుంది.
రాజ్ కావ్యకు తెలియకుండా శోభనం రెడీ చేయాలని ఇందిరాదేవి అంటే.. స్వప్న రెడీ చేస్తానని చెబుతుంది. పూలు, స్వీట్స్ రెడీ చేస్తానని ప్రకాశం అంటాడు. అపర్ణ నీ చల్లని చేత్తో ఏదో ఒకటి చేయమని అగరవత్తులు పెట్టమంటుంది ఇందిరాదేవి. నా జీవితమే బాగుంటే ఇదంతా ఎందుకు. నేను చేయను అని అపర్ణ అంటుంది. నేను అంటించనా అని రుద్రాణి అంటే.. మంట పెట్టేందుకు జెట్ స్పీడులో మా అత్త ఉంటుందని స్వప్న అంటుంది.
కావ్యపై ప్రేమగా రాజ్
నువ్వేం చేయొద్దని ఇందిరాదేవి చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్, కావ్య గదిలోకి వెళ్లేసరికి శోభనం డెకరేషన్‌తో ఉంటుంది. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. పూల పక్క.. మీ పక్క.. పాలు కావాల అని కావ్య అడిగితే.. వద్దని రాజ్ అంటాడు. మరి ఏం కావాలని కావ్య అంటే.. నువ్వే కావాలి అని ప్రేమగా కావ్యను తాకబోతాడు రాజ్.
టాపిక్