Brahmamudi June 22nd Episode: బ్రహ్మముడి- అపర్ణ కాళ్లపై మాయ- రుద్రాణికి గుండెపోటు- బిడ్డను పెంచుకుంటామన్న కావ్య రాజ్-brahmamudi serial june 22nd episode maaya exposes truth about subhash heart stroke to rudhrani brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi June 22nd Episode: బ్రహ్మముడి- అపర్ణ కాళ్లపై మాయ- రుద్రాణికి గుండెపోటు- బిడ్డను పెంచుకుంటామన్న కావ్య రాజ్

Brahmamudi June 22nd Episode: బ్రహ్మముడి- అపర్ణ కాళ్లపై మాయ- రుద్రాణికి గుండెపోటు- బిడ్డను పెంచుకుంటామన్న కావ్య రాజ్

Sanjiv Kumar HT Telugu
Jun 22, 2024 07:51 AM IST

Brahmamudi Serial June 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 22వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో అందరికి మాయ అసలు నిజం చెబుతుంది. అపర్ణ కాళ్లపై పడి వేడుకుంటుంది మాయ. దాంతో సుభాష్, అపర్ణ మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. తర్వాత బిడ్డను తామె పెంచుకుంటామని కావ్య రాజ్ అంటారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జూన్ 22వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జూన్ 22వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ కావ్య వెళ్తున్న కారు ఆగిపోతుంది. దాంతో కావ్యను ఏం నోరే అని తిడతాడు రాజ్. మీకు బానెట్ ఓపెన్ చేసి తల పెట్టి గెలకడం వచ్చా అని కావ్య అడిగితే.. రాజ్ కారు రిపేర్ చేస్తాడు. కారు స్టార్ట్ అవుతుంది. కారు వెళ్తుంటే వెనుక మాయ పరుగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన కావ్య కారు ఆపమని చెబుతుంది. ఎందుకు అని రాజ్ అడిగితే.. మాయ అండి అని కావ్య అంటుంది.

పారిపోయిన రౌడీలు

దాంతో షాక్ అయిన రాజ్ కారు ఆపుతాడు. ఇద్దరూ కారు దిగుతారు. కావ్యను చూసి మాయ వాళ్ల దగ్గరికి వస్తుంది. రాజ్‌ను చూసిన రౌడీలు ఇప్పుడు వీడికి దొరికితే.. దీని వెనుక రుద్రాణి ఉన్న విషయం తెలుసుకునేదాకా విడిచిపెట్టడు. అప్పుడు మన ఇంటికి వచ్చిన రుద్రాణి అడుక్కు తింటుంది అని అనుకుంటారు. రాజ్ వస్తుంటే అది చూసి రౌడీలు పారిపోతారు. తర్వాత మాయ దగ్గరికి వస్తాడు రాజ్. మాయ మళ్లీ స్పృహ తప్పిపోతుంటుంది.

అది చూసి వెంటనే మాయను లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది కావ్య. ఏంటే అలా కొట్టావ్ అని రాజ్ అడిగితే.. ఇలా కొట్టకుంటే మళ్లీ కోమాలోకి వెళ్లిపోతుంది అని కావ్య చెబుతుంది. కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంట్లో మాయ ఉంటుంది. ఈమె అసలు మాయ. ఈమె కోసమే నేను ఇన్నాళ్లు కష్టపడ్డాను. కానీ, ఈ మాయ వెనుక కూడా చాలా అబద్ధాలు ఉన్నాయి. మోసం చేసింది మావయ్య కాదు. మావయ్యనే ఈ మాయ మోసం చేసింది అని కావ్య చెబుతుంది. నిజాలు చెప్పమని మాయను అంటుంది కావ్య.

నీకు హార్ట్ స్ట్రోక్ కావాలా

ఒక్క నిమిషం. ఇంతకుముందు ఒక మాయను తీసుకొచ్చావ్. ఇప్పుడు ఇంకో మాయను తీసుకొచ్చావ్. నీకు ఈ ఇల్లు ఏమైనా రంగస్థలమా. ఆ మాయ బూటకమని తెలిసాకే కదా మా వదినకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఎవరికీ హార్ట్ స్ట్రోక్ తెప్పించాలని అనుకుంటున్నావ్ అని రుద్రాణి అంటుంది. మీకే రుద్రాణి గారు. కావాలా హార్ట్ స్ట్రోక్ అని కావ్య అంటే.. ఆ పని చేయవే. ఓ దరిద్రం పోతుంది. నెలకో పిండం పెట్టి దండం పెట్టుకోవచ్చు అని స్వప్న అంటుంది.

ఏం మాట్లాడుతున్నారు మీ అక్కా చెల్లెలు. ఆమె అసలు మాయ అని చెప్పడానికి సాక్ష్యాలు ఏంటీ అని రుద్రాణి అంటుంది. నేనే. అసలు మాయ తనే అని సుభాష్ అంటాడు. అంతా అబద్ధం. రాజ్, కావ్య, మా అన్నయ్య ఒక్కటై నాటకం ఆడుతున్నారు. మా అన్నయ్యను కాపాడటానికి ఇలా చేస్తున్నారు అని రుద్రాణి అంటుంది. అవునా.. నీకెలా తెలుసు చెప్పు అని రాజ్ అడుగుతాడు. రాత్రి కల వచ్చిందా. లేదంటే అందరూ కలిసిపోయే టైమ్‌ వచ్చిందని కుళ్లు వచ్చిందా అని స్వప్న అంటుంది.

ఎందుకు ఉలిక్కి పడుతున్నావ్

నిన్ను ఆరోజే పాము ఉన్న ఫామౌస్‌కు పంపించి ఉంటే బాగుండేది. పామును ఇంట్లో పెట్టుకుని ఫామౌజ్ అక్కడ పెట్టాం అని ప్రకాశం అంటాడు. నీకు ఇలాంటి చావు తెలివితేటలు ఎలా వస్తాయి అత్త. ముందే అబద్ధం అని ఎలా చెబుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు. మాయ అసలు విషయం చెప్పకముందే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. చాలా నువ్ ఇంటి మంచికోసం చెప్పినా అందరూ నిన్నే అంటారు. అందుకే మూసుకోని ఉండొచ్చు కదా అని రాహుల్ అంటాడు.

మమ్మీ.. డాడ్ మోసపోయారు. అది ముందుగా కావ్య గుర్తించింది. డబ్బు తీసుకునే తల్లి ప్రేమ నిజాయితిపై అనుమానం కలిగింది. నెలకు లక్షలు తీసుకునే మాయను బయటపెట్టాలనుకుంది. ఆ సమయంలో ఓసారి ప్రమాదంలో కూడా పడింది. అప్పుడు నేనే కాపాడను. ఆ తర్వాత ఈ మాయ ఉండాల్సిన అడ్రస్‌లో దొంగ మాయ ఉంది. కావ్యను మోసం చేసి ఇంట్లోకి అడుగుపెట్టింది. దానివల్ల పరిస్థితి నా పెళ్లిదాకా వెళ్లింది. అప్పుడు తప్పనిపరిస్థితుల్లో డాడ్ నిజం చెప్పాల్సి వస్తుంది అని రాజ్ అంటాడు.

ఆ బిడ్డ ఏంటీ

అయినా కావ్య ప్రయత్నాలు ఆపలేదు. మాయను తీసుకువస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. కోమాలోకి వెళ్లిన మాయను ఎవరో తప్పించారు. అక్కడి నుండి పారిపోతూ మాకు దొరికింది. ఇది జరిగిన నిజం అని రాజ్ అంటాడు. కానీ, అసలు నిజం ఇంకా ఉంది. ఇప్పుడు ఈమె నోరు విప్పి ఏం చెబుతుందో వినండి. ఇది నేను ఊహించని కథ అని కావ్య అంటుంది. నువ్వేంటి.. ఆ బిడ్డ ఏంటీ అని ఇందిరాదేవి అడుగుతుంది. నేనే మాయను అని మాయ చెబుతుంది.

నా ప్రమేయం లేకుండానే సుభాష్ గారి జీవితంలోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని మాయ అంటే.. అంటే మీకు సంబంధం ఉంది నిజమేనా. ఆ బిడ్డ మీ ఇద్దరికి పుట్టిన బిడ్డేనా అని సీతారామయ్య అడుగుతాడు. మాకు సంబంధం ఉంది నిజమే. కానీ ఆ బిడ్డ మా బిడ్డ కాదు. నేను తల్లిని కాదు. ఆయన తండ్రి కాదు. మీ ఇంటి పరువు తీయడానికో, డబ్బు కోసమో నన్ను బెదిరించారు. అనాథ శరణాలయం నుంచి బిడ్డను తీసుకొచ్చి నాటకం ఆడమని బ్లాక్ మెయిల్ చేశారు.

అపర్ణ కాళ్లపై మాయ

బ్లాక్ మెయిల్ చేసి నెలకో పది లక్షలు తీసుకోమ్మన్నారు. లేకపోతే నా ప్రాణాలు తీస్తామన్నారు. అప్పుడే సుభాష్ గారిని బెదిరించాల్సి వచ్చింది. ఇదంతా చేయాల్సి వచ్చింది అని చెప్పిన మాయ అపర్ణ దగ్గరికి వెళ్లి ఈ నిజం మీ గుండెను గాయం చేస్తుందని నాకు తెలుసు. కానీ, ఇందులో ఆయన తప్పు లేదు. తప్పంతా నాదే. నా ప్రాణాలు తీస్తానన్న మళ్లీ మీ జీవితంలోకి రాను. నన్ను క్షమించండి అని అపర్ణ కాళ్లపై పడుతుంది మాయ.

ఈ మోసగత్తెను పోలీసులకు పట్టిద్దామా అని ధాన్యలక్ష్మీ అంటే.. మీరు ఏ శిక్ష వేసిన నేను భరిస్తాను అని మాయ అంటుంది. సరే ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తానని ప్రకాశం అంటే ఇందిరాదేవి ఆపుతుంది. బిడ్డ సంగతి పక్కన పెడితే తప్పు జరిగిందనే మాట నిజమే. మీ అన్నయ్య చేసింది తప్పే. ఆమెను ఎవరో పావుగా వాడారు. దాంట్లో ఆమె తప్పులేదు అని ఇందిరాదేవి అంటుంది. అవును, మన ఇంటి పరువుతీయడానికి ఎవరో ప్రయత్నించారు. శిక్ష వాళ్లకు పడాలి అని సీతారామయ్య అంటాడు.

బిడ్డను ఏం చేయాలి

దాంతో అందరికి నమస్కరించి మాయ వెళ్లిపోతుంది. నా కొడుకుపైన ఉన్న నింద పోయింది. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అపర్ణ నీకు సంతోషమేనా అని ఇందిరాదేవి అడుగుతుంది. అవును అన్నట్లుగా అపర్ణ తల ఊపుతుంది. అంతా సంతోషిస్తారు. అంత ప్రశాంతంగా ఉంటే ఎలా అని రుద్రాణి అంటే.. ఏ మీకు నిద్ర పట్టదా. తిండి పోదా అని స్వప్న అంటుంది. మరి ఆ బిడ్డ సంగతి ఏంటీ. మాయ తనకు ఏ సంబంధం లేదని వెళ్లిపోయింది. ఇప్పుడు వాడిని ఏం చేయాలని రుద్రాణి అడుగుతుంది.

ఇదేం ఆర్తులకు, అనాథలకు శరాణాలయం కాదు కదా. వాడిని ఏదో ఒక అనాథశరాణాలయంలో చేర్పిద్దాం అని రుద్రాణి అంటుంది. ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి నేనేం అడగలేదు. నేను వాడిని కన్నతల్లి స్థానంలో ఉండి పెంచాను. వాడిని అలా అనాథలా వదిలేయాలని లేదు. నేనే పెంచుకోవాలని అనుకుంటున్నాను అని కావ్య అంటుంది. ఒసెయ్ పిచ్చిదానా నువ్ ఇంకా లేని పోని సమస్యలు తెచ్చుకుంటావేంటే అని స్వప్న అంటుంది.

బిడ్డను పెంచుకుంటానన్న కావ్య

కళావతి నిర్ణయం నాకు నచ్చింది. నాకు రక్తసంబంధం లేకపోయినా. ఆ బిడ్డతో అనుబంధం ఏర్పడింది. రెండు రోజులు ఆ దొంగ మాయ వద్ద వదిలిపెట్టినందుకు మనసు అదోలా అనిపించింది. అనాథశరాణాలయంలో వదిలేస్తే తట్టుకోలేను అని రాజ్ అంటాడు. చాలా సంతోషంగా, గర్వంగా ఉందని, ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. అత్త మామల మధ్య కలతలు తీసేయాడానికి చాలా కష్టపడ్డావ్. నువ్ నిజంగా మా ఇంటి మహాలక్ష్మివి అని ఇందిరాదేవి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కావ్యను చూస్తూ సంతోషంగా ఉంటాడు రాజ్. కావ్య బెడ్ షీట్స్ సర్దుతుంటే వెనుక వచ్చి వినిపించేలా సౌండ్ చేస్తాడు. దాంతో కావ్య ఉలిక్కపడి బెడ్ ఎక్కుతుంది. మీరా అని కావ్య అంటే.. ఇంకా ఎవరు అనుకున్నావ్ అని రాజ్ అంటాడు. నేను మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఇంకా రావట్లేదేంటా అని. స్టార్ట్ చేయండి అని కావ్య అంటుంది. ఇంత ఫాస్టా. కానీ, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని రాజ్ అంటాడు.

Whats_app_banner