Karthika deepam 2 serial today july 5th episode: దీప కోపంగా కార్తీక్ దగ్గరకు వచ్చి కత్తెర పట్టుకుని ఏయ్ నువ్వా నా కూతురికి తండ్రివి అని అంటుంది. దీప ఏంటి ఈ ఆవేశం అంటాడు. నువ్వు చెప్పిన మాటలకు నరాలు చిట్లిపోతున్నాయి. మీరు కత్తి తీసుకుని గొంతు కోసినా కూడా ఇంత బాధపడే దాన్ని కాదు.
అసలు ఎవరు నువ్వు? నా కూతురికి తండ్రివి అని ఎలా చెప్తావ్. నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? అలా అనే ముందు ఒక్కసారైన ఆలోచించావా? అని నిలదీస్తుంది. పాపను కాపాడుకోవడానికని కార్తీక్ నచ్చజెప్పడానికి చూస్తాడు. తల్లిని నేను బతికే ఉన్నాను కదా నేను కాపాడుకుంటాను.
మీరు నా తండ్రిని చంపారని ద్వేషించాను. కానీ నిజం తెలిసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడ్డాను. కానీ మనుషులను చంపడానికి మీకు కారులే అవసరం లేదు ఒక్క మాట చాలు. ఒక్క నింద వేశాడని తాళి కట్టిన భర్తని క్షమించలేదు. అలాంటిది ఆ నిందను నిజం చేసిన మిమ్మల్ని నేను ఏం చేయాలి.
పర్యవసానాలు ఆలోచించకుండా మీరు అన్న మాట వల్ల ఎలాంటి తుఫాను తీసుకొస్తుందో మీకు తెలుసా? నేను ఏ తప్పు చేయకుండానే నాకు సంబంధం అంటగట్టి నరకం చూపిస్తున్న నా భర్త ముందు ఆ మాట అన్నారు. మీరు నోటికొచ్చిన అబద్ధాలు ఆడి వాడి అనుమానం నిజం చేశారు.
వాడు వెళ్ళి మీ ఇంట్లో చెప్తే ఏంటి పరిస్థితి? మీ అత్తయ్య, మీ అమ్మానాన్నకు తెలిస్తే ఏమవుతుంది?వాళ్ళకు మీరు సమాధానం చెప్పగలరా?ఇన్ని రోజులు ఎవరు ఎన్ని నిందలు వేసినా నా మంచితనం,వ్యక్తిత్వానికి ఇచ్చిన గౌరవం నాశనం అయిపోయింది. మనం కాకుండా మన మాటలు ఎవరైనా విన్నారు ఏమోనని భయంతో సగం చచ్చిపోయాను.
ఈ మాటలు నా బిడ్డ వింటే పరిస్థితి ఏంటి? నాన్న అని కాలవరించే నా కూతురు ఈ అబద్దాన్ని నిజం అనుకుంటే పరిస్థితి ఏంటి? ఇది అబద్ధం అని చెప్తే నిజం ఏంటో చెప్పాలి. అది చెప్పలేకే కదా దానికి రోజుకో అబద్ధం చెప్తున్నాను. అది ఈ మాటలు విన్నదో లేదో కూడా అర్థం కావడం లేదు.
నా కూతురు గురించి ఆలోచించి ఆగిపోతున్నాను కానీ పైనుంచి దూకి చచ్చిపోయేదాన్ని. ఇక్కడ నుంచే కాదు మా జీవితాల్లో నుంచి కూడా వెళ్ళిపోండి అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. హాస్పిటల్ లో రిసెప్షన్ లో నర్స్ పాప హాస్పిటల్ బిల్లు పే చేయలేదని కార్తీక్ ని అడుగుతారు.
కార్తీక్ డబ్బులు కడతాడు. పాపకు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం స్పృహలో లేనప్పుడు కూడా వాళ్ళ నాన్నను కలవరించిందని అనుకుంటారు. జ్యోత్స్న కార్తీక్ మాటలు తలుచుకుని బాగా ఏడుస్తుంది. గతంలో నరసింహ అన్న మాటలు అన్నీ తలుచుకుని రగిలిపోతుంది.
నాకు నువ్వు తప్ప వేరే లోకం తెలియదు బావ. అలాంటిది శౌర్యను నీ కూతురు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా బావ అలాంటి వాడు కాదు నా బావ ఏ తప్పు చేయడు. మరి ఏ తప్పు చేయనప్పుడు దీప భర్తతో శౌర్యకు తండ్రి నేనే అని ఎలా చెప్తాడు.
చెప్పకూడదు మరి ఎలా చెప్పాడు. దీపను సేవ్ చేయడానికి అలా చెప్పి ఉంటాడా? కాపాడటం కోసం వేరే పని చేయవచ్చు కదా. బావ చెప్పిన దాంట్లో నిజం ఎంత? నేను ఏమైనా తప్పుగా విన్నానా? బావ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే నేనెమని అర్థం చేసుకోవాలి. నేను ఏం చేయాలి. ఈ విషయం ఎవరికి చెప్పాలని అంటుంది.
నరసింహను బిడ్డను ఎత్తుకుని రమ్మని పంపించినట్టు శోభ అనసూయకు చెప్తుంది. దాన్ని మాటలతో లొంగదీసుకుని బిడ్డను తెచ్చుకోవాలి కానీ ఇలా చేస్తే ఊరుకుంటుందా? ఏంటని అంటుంది. అయినా నా భర్తకు పుట్టిన బిడ్డ మీద దాని అధికారం ఏంటని శోభ అంటుండగా నరసింహ వస్తాడు.
దీప గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలతాయని తిడుతుంది. నువ్వు తిట్టినా కొట్టినా ఇదే నిజం శౌర్య కార్తీక్ గాడికి పుట్టిన కూతురని అంటుంది. నువ్వు వెధవ అయితే అది నిఖార్సయిన మనిషి అని దీపను సపోర్ట్ చేస్తుంది. నేను కాదు కార్తీక్ దాని ముందే చెప్పాడు.
అది నిజం కాదు బిడ్డను కాపాడుకోవడానికి అలా చెప్పి ఉంటారు. వాడు తెలివైన వాడు అందుకే నీ అహం మీదే కొట్టాడు. కానీ దీప ఊరుకోదు. రెండు తగిలించే ఉంటుంది. అది నా తమ్ముడి చేతిలో పెరిగింది. అది ఎలా పెరిగిందో నాకు తెలుసు అంటుంది. నువ్వు నీ పెళ్ళాన్ని మోసం చేసినట్టు అది దాని మొగుడిని మోసం చేయలేదు.
ఆ కార్తీక్ కాదు ఇంకో పది మంది వచ్చి చెప్పినా దీప గురించి నేను నమ్మను. అది నీకు పుట్టిన బిడ్డ నీ కూతురు. దాని మీద నీకే హక్కు ఉంది. దీప దృష్టిలో మంచివాడు అవడం కోసం ఆ మాట అని ఉండవచ్చు కానీ దీప మాత్రం నిప్పు. తాళి కట్టిన భర్తతో కాకుండా ఇంకొకడితో బిడ్డను కన్నదంటే దీప గురించి తెలిసిన ఏ ఆడది నమ్మదు.
ఏం చేస్తే దీప నీ దారికి వచ్చి బిడ్డను నువ్వే తీసుకుపో అంటుందో అది ఆలోచించు. అది అయితే నీ కూతురే అంటుంది. ఇప్పుడు నేను ఎవరి మాటలు నమ్మాలని నరసింహ డైలమాలో పడతాడు. దీప జరిగింది తలుచుకుని కుమిలిపోతుంది. శౌర్య మాటలు వింటే తనకు ఏం చెప్పాలి. అలా జరగకూడదు అంటే ఒక్కటే మార్గం అనుకుంటుంది.
శౌర్య దగ్గరకు వచ్చిన నర్స్ ని అక్కడే ఉంచి దీప బయటకు వెళ్తుంది. కార్తీక్ దీప గురించే ఆలోచిస్తాడు. రౌడీ మీద వాడి నీడ కూడా పడకూడదు. నేను ఏం చేసిన అది రౌడీ కోసమే. ఈరోజు నేను ఆవేశపడినా అది శౌర్య కోసమే. నేను ఎప్పటికీ మీరు బాగుండాలని కోరుకునే శ్రేయోభిలాషినే అనుకుంటాడు.
జ్యోత్స్న దీని గురించే ఆలోచిస్తూ రగిలిపోతుంది. కార్తీక్, దీపను తిట్టుకుంటుంది. అప్పుడే దీప ఇంటికి వస్తుంది. బ్యాగ్ సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్