Karthika deepam 2 july 30th:కార్తీకదీపం 2 సీరియల్.. దీపను ఘోరంగా అవమానించిన జ్యోత్స్న.. శోభ చెంప పగలగొట్టిన అనసూయ-karthika deepam 2 serial today july 30th episode deepa breaks down as jyotsna mistakes her intentions towards karthik ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 July 30th:కార్తీకదీపం 2 సీరియల్.. దీపను ఘోరంగా అవమానించిన జ్యోత్స్న.. శోభ చెంప పగలగొట్టిన అనసూయ

Karthika deepam 2 july 30th:కార్తీకదీపం 2 సీరియల్.. దీపను ఘోరంగా అవమానించిన జ్యోత్స్న.. శోభ చెంప పగలగొట్టిన అనసూయ

Gunti Soundarya HT Telugu
Jul 30, 2024 06:54 AM IST

Karthika deepam 2 serial today july 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నీ వల్లే నా నిశ్చితార్థం ఆగిపోయిందంటూ జ్యోత్స్న దీపను ఘోరంగా అవమానిస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ కార్తీక్ నీ మెడలో తాళి కడతాడని పారిజాతం అంటుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 30వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 30వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today july 30th episode: జ్యోత్స్న ఫ్రెండ్స్ తనని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. మీ బావకు నువ్వంటే ఇష్టం లేదు. ఎవరో పిల్ల కోసం నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. మీ బావ మనసులో ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి వంద కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

మీ బావతో పెళ్లి క్యాన్సిల్ చేసుకో 

జ్యోత్స్న, పాప అంటే మీ బావ పాపను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ బావతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోమని అంటారు. అప్పుడే సుమిత్ర కోపంగా ఈ చాలు ఆపండి అని వచ్చి వాళ్ళని తిడుతుంది. ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని జ్యోత్స్న డిస్ట్రబ్ అవుతుంటే మీరు ఇంకా చెడగొడుతున్నారని తిడతంటే వెళ్లిపోతారు.

నా ఫ్రెండ్స్ మీద అరిచినట్టు దీప మీద అరిస్తే నేను ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. నిన్ను కాదు అనాల్సింది అనాల్సిన వాళ్ళను అనాలి అనుకుని జ్యోత్స్న ఆవేశంగా వెళ్ళిపోతుంది. శోభ అనసూయ దగ్గరకు వచ్చి గట్టిగా పిలుస్తుంది. మీకు చేతకానిది ఆయన చేస్తుంటే ఎందుకు తిడుతున్నారని అంటుంది.

శోభ చెంప పగలగొట్టిన అనసూయ 

వాడు అసలు తండ్రా కసాయి వాడా? పిల్ల కళ్ళు తిరిగి కిందపడిపోతే తండ్రి అన్నవాడు అల్లాడిపోతాడు. దాన్ని తీసుకుని హాస్పిటల్ కి పరిగెడతాడు. అంతే కానీ అది ఏమైపోతే నాకేంటి అని భుజాన వేసుకుని పోడు అని అనసూయ అంటుంది. ఇప్పుడు అర్థం అయ్యింది శౌర్య నా మొగుడికి పుట్టింది కాదు కార్తీక్ కి పుట్టిందని శోభ అంటుంది.

అనసూయ లాగిపెట్టి ఒకటి పీకుతుంది. దాని పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే చెప్పు తెగుతుంది. కార్తీక్ ఒక తండ్రి చేయాల్సిన పని చేశాడు. చేశాడు కదాని వాడు తండ్రి అయిపోడు. అది వాడు ఆ బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ. వాడికి అదే ప్రేమ ఉంటే అదే పరిగెత్తుకుంటూ ఎదురు వస్తుంది.

బిడ్డ కావాలని అనుకున్నాం, తీసుకురావాలని అనుకున్నాం. అలా ఎత్తుకు వచ్చినా అది ఇక్కడ ఉండదు. దీప ఊరుకోదని అనసూయ చెప్తుంది. మా పిన్ని మనవరాలిని దత్తత తీసుకుంటానంటే ఊరుకోలేదు ఇప్పుడు ఎవరు లేకుండా పోయింది. అనాథను దత్తత తీసుకుంటానని అంటుంది.

నీతోనే ఉంటానని కార్తీక్ ప్రామిస్ 

హాస్పిటల్ లో చంటిది ఎలా ఉందోనని అనసూయ కాస్త కంగారుపడుతుంది. శౌర్య మళ్ళీ బూచోడు నాన్నగా వద్దు నాకు నాన్నగా ఇష్టం లేదు. మళ్ళీ బూచోడు వస్తాడా అని అడుగుతుంది. బూచోడు వచ్చి ఆరోజు రాత్రి నన్ను ఎత్తుకుపోయినట్టు మళ్ళీ నన్ను ఎత్తుకుపోతాడా అని అంటుంది.

నీకోసం ఏ బూచోడు రాడని కార్తీక్ అంటాడు. అయితే నువ్వు ఎప్పుడు నాతో ఉంటావా ప్రామిస్ చెయ్యి అని శౌర్య అడుగుతుంది. ప్రామిస్ నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని కార్తీక్ శౌర్య చేతిలో చెయ్యి వేయబోతుంటే దీప ముందు తన చేతిని వేస్తుంది. నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో వాడిని ఇక నీ దగ్గరకు కూడా రానివ్వనని మాట ఇస్తాడు.

ప్రామిస్ పిల్లకా? తల్లికా?

హాస్పిటల్ కి జ్యోత్స్న, పారిజాతం వస్తారు. శౌర్య ఎలా ఉందని జ్యోత్స్న దీపను అడుగుతుంది. బాగానే ఉందని చెప్తుంది. మీ వల్ల ఎవరు ఏమైపోయినా మీరు బాగానే ఉంటారని దెప్పిపొడుస్తుంది. నీ జీవితంలో వాడిని ఎప్పుడూ నీ దగ్గరకు రానివ్వనని ఎవరితో ప్రామిస్ చేస్తున్నావ్ బావ పిల్లతోనా, తల్లితోనా అని జ్యోత్స్న కార్తీక్ ని నిలదీస్తుంది.

చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావని దీప అంటుంది. అవును నాకు బుద్ధి లేక మొదటి నుంచి తప్పుగానే అర్థం చేసుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. అవును నీకు నిజంగానే నీకు బుద్ధి లేదు. ఇద్దరూ ఇక్కడికి గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అని కార్తీక్ అంటాడు.

కార్తీక్ బాబు ఎవరికీ మాట ఇవ్వలేదు ఇవ్వబోతుంటే నేను ఆపానని దీప చెప్తుంది. ఈరోజు ణా నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం నువ్వే దీప అని జ్యోత్స్న అంటుంది. మనవడు ఎవరి కోసం మాటిచ్చినా తాళి కట్టాల్సింది మాత్రం నీ మెడలోనే అది గుర్తు పెట్టుకో అనేసి పారిజాతం వార్నింగ్ ఇస్తుంది.

దీప ఆవేదన 

మీరు నిశ్చితార్థం వదులుకుని ఎందుకు వచ్చారని దీప ఏడుస్తూ అడుగుతుంది. నరసింహ స్పృహలేని శౌర్యను ఎత్తుకుని పోతుంటే నిశ్చితార్థం గురించి ఆలోచించాలా? పసిదానికి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి. జ్యోత్స్న అలా మాట్లాడటానికి కారణం పారు. వీళ్ళు తప్ప ఇంకెవరూ తప్పుగా ఆలోచించలేదని చెప్తాడు.

ఈరోజు మీరు నా బిడ్డను కాపాడారు. దానికి జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ మీరు చూపించే జాలి అది ఎదుటి వారికి తప్పుగా అర్థం అవుతుంది. నా వ్యక్తిత్వానికి మచ్చగా మారుతుంది. నా కారణంగా ఒకరు ఎందుకు బాధపడాలి. ఇప్పటి వరకు మీరు నా బిడ్డకు తోడుగా ఉన్నారు. ఇక ఇంటికి వెళ్లిపొమ్మని చెప్తుంది.

శౌర్యను డిశ్చార్ట్జ్ చేస్తున్నారని ఇంట్లో దిగబెడతానని అంటాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటికి రావాలని బాధపడుతుంది. మీ మంచితనంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మా దారిన మమ్మల్ని వదిలేయండి. నా కూతురిని నేనే కాపాడుకుంటానని చెప్తుంది.

రగిలిపోతున్న జ్యోత్స్న 

పారిజాతం నిశ్చితార్థం ఆగిపోయినందుకు తిండి కూడా మానేస్తుంది. జ్యోత్స్న వచ్చి పిలుస్తుంది కానీ తన బాధను చెప్పుకుంటుంది. మీ పెళ్లి నా జీవితాశయం అంటుంది. పారిజాతం గతంలో పిల్లలని మార్చిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. నీకు కార్తీక్ కి పెళ్లి చేయాలి, నా కొడుక్కు న్యాయం చేయాలి. అప్పుడే నా కొడుక్కి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది.

ఇంట్లో వాళ్ళందరూ ఏం జరగనట్టుగా భోజనం చేస్తూ రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. అప్పుడే సుమిత్రకు కార్తీక్ ఫోన్ చేస్తాడు. అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మని పిలుస్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner