Brahmamudi July 20th Episode: బ్రహ్మముడి- రాహుల్ రుద్రాణికి స్వప్న బాత్రూమ్ శిక్ష- తెలియని వారి ఇంట్లో కావ్య రాజ్ శోభనం
Brahmamudi Serial July 20th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 20వ తేది ఎపిసోడ్‌లో కావ్యను రాజ్ డిన్నర్‌కు తీసుకెళ్లడాన్ని ఆపాలని రాహుల్‌తో కలిసి రుద్రాణి ప్లాన్ చేస్తుంది. కానీ, అది విన్న స్వప్న ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. ఇద్దరికీ బాత్రూమ్ శిక్ష వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కావ్యను డిన్నర్ తీసుకోడానికి ట్రై చేస్తుంటాడు రాజ్. నీకోసం ఏం చేయలేదని ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారు కాబట్టి నిన్ను డిన్నర్‌కు తీసుకెళ్తున్నాను పదా. రెడీ అవు అని రాజ్ అంటాడు. ఓహో.. ఇది ఇంట్లో వాళ్లకోసమా అని కావ్య అంటుంది. సరే సరే మన కోసమే డిన్నర్‌కు వెళ్తున్నాం. వెళ్లు రెడీ అవు అని రాజ్ అంటాడు.
డిన్నర్ చేయాలని
డిమాండా రిక్వెస్టా. కావాలంటే నాకు కావాల్సింది నేనే ఇంట్లో చేసుకుని తినగలను. మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక భార్యను భర్త ఎలా డిన్నర్‌కు పిలుస్తారో అలా పిలిస్తే వస్తాను అని కావ్య అంటుంది. అయినా రాజ్ పిలిచేది ఆర్డర్‌లానే ఉంటుంది. అన్ని ఆర్డర్‌లాగే ఉన్నాయి అని కావ్య అంటుంది. నేను నీతో డిన్నర్ చేయాలని ఆరాటపడుతున్నాను, ఆశపడుతున్నాను, ఉత్సాహపడుతున్నాను. నాతో డిన్నర్‌కు వస్తావా బుల్ బుల్ అని రాజ్ అంటాడు.
సరే ఇది కొంచెం బాగానే ఉంది. మీరు ఇన్ని రకాలుగా పడుతున్నారు కాబట్టి వస్తాను అని కావ్య అని వెళ్లిపోతుంది. ఆ మాటలు అన్ని చాటున ఉండి విన్న రుద్రాణి.. డిన్నర్‌కు వెళ్తారా.. అది ఎలా జరుగుతుందో చూస్తాను అని వెళ్లిపోతుంది. హమ్మయ్యా.. భార్యను డిన్నర్‌కు ఒప్పించడం ఇంత కష్టమా. సరే ఇవాళ ఎలాగైనా నా మాట వినేలా చేసుకోవాలి అని రాజ్ అనుకుంటాడు. రాహుల్ దగ్గరికి వెళ్లి నువ్ అర్జంట్‌గా ఓ పని చేయాలని రుద్రాణి అంటుంది.
వాళ్లు ఒక్కటైపోతారు
లేదు మామ్. నాకు గంటలో మీటింగ్ ఉంది. అర్జంట్‌గా వెళ్లాలి అని రాహుల్ అంటాడు. నువ్వేమైనా ఎంప్లాయ్‌వా టైమ్‌కి వెళ్లేందుకు. బాస్‌వే కదా అని రుద్రాణి అంటుంది. అదంతా పక్కన ఉండి స్వప్న వింటుంది. పని చేయకుంటే చేయలేదని అంటావ్. పని చేస్తుంటే ఇలా అడ్డుపడతావ్. సరే పనేంటో చెప్పు అని రాహుల్ అంటాడు. రాజ్ కావ్య డిన్నర్‌కు వెళ్తున్నారు. అదే జరిగితే వాళ్లు ఒక్కటైపోతారు. రాజ్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని మన నెత్తిన ఎక్కి కూర్చుంటుంది కావ్య. అలా జరగకూడదు అని రుద్రాణి అంటుంది.
ఇప్పుడు రాజ్ డిన్నర్‌కు వెళ్లకుండా ఆపాలి అంతే కదా. మీటింగ్‌కు నాతోపాటు రాజ్ కూడా రావాలని కండిషన్ పెడతాను. అప్పుడు ఎలా వెళ్తాడు అని రాహుల్ అంటాడు. అదంతా విన్న స్వప్న అమ్మా దొంగ మొహమా ఇంత కుట్ర చేస్తావా. చెబుతా నీ సంగతి అని కిచెన్‌లోకి వెళ్తుంది. జ్యూస్‌లో మోషన్ ట్యాబ్లెట్స్ కలుపుతుంది. ఇప్పుడు రాజ్‌ను ఆపలేక తనను తాను ఆపుకోలేక అటు బెడ్ రూమ్‌కు కాకుండా ఇటు బాత్రూమ్‌కు కాకుండా పోతాడు అని స్వప్న అనుకుంటుంది.
రొమాంటిక్‌గా స్వప్న
రాజ్‌ను ఎలా ఆపాలి అని రాహుల్ అనుకుంటూ ఉండగా.. రాహుల్ అని ప్రేమగా పిలుస్తుంది స్వప్న. నీకోసం ఈ జ్యూస్ ఫ్రెష్‌గా రెడీ చేసి తీసుకొచ్చాను అని స్వప్న అంటుంది. ఇందాక కుక్క గిక్క అని అన్నావ్. నీకిష్టమొచ్చినట్లు అంటే ఊరుకోవాలా అని రాహుల్ అంటాడు. ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నా కదా. నీ బంగారాన్ని క్షమించవా అని కావాలనే రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. దాంతో మొత్తానికి స్వప్న దారికి వస్తాడు రాహుల్.
సరే మీటింగ్‌కు రమ్మని రాజ్‌ను పిలవాలి. అది చెప్పాకా వచ్చి నీ దగ్గరికి వస్తాను అని రాహుల్ అంటాడు. అందాకా నాలానే ఈ జ్యూస్ కూడా వెయిట్ చేయాలా అని స్వప్న అంటే.. సరే ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతా. తర్వాత నీ సంగతి చూస్తా అని జ్యూస్ తాగుతాడు రాహుల్. కట్ చేస్తే రాజ్ కావ్య వెళ్తుంటే.. నేను కూడా మీతోనే వస్తాను అని రాహుల్ అంటాడు. భార్య భర్త వెళ్తుంటే నువ్ వెళ్తానంటావేంటీ రాహుల్ అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది.
బాబాయ్ వాళ్లు చూసుకుంటారు
ఆఫీస్‌కే కదా. కలిసే వెళ్దాం. ఇవాళ చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందని రాహుల్ అంటాడు. దాంతో కావ్య స్వప్నవైపు చూస్తుంది. స్వప్న హింట్ ఇచ్చేలా చూస్తుంది. దాంతో అంత ముఖ్యమైన మీటింగ్ ఉంటే మీకు ఎవరు చెప్పలేదా అని కావ్య అంటుంది. అది బాబాయ్ వాళ్లు చూసుకుంటా అన్నారు కదా. ఉండు కాల్ చేస్తాను అని రాజ్ అంటాడు. దాంతో వద్దు. నేను చెబుతున్నాను కదా అని రాహుల్ అంటాడు. ముఖ్యమైన మీటింగ్ అంటున్నాడు కదా. వెళ్లొచ్చు కదా అని రుద్రాణి అంటుంది.
ఆఫీస్ విషయాలు నీకేం తెలుసు. వాళ్లు శుభమా అని వెళ్తుంటే అడ్డు పడతారెందుకు అని స్వప్న అంటుంది. వీళ్లేదు. ఆఫీస్‌కు రావాల్సిందే. ముఖ్యమైన డెసిషియన్ తీసుకోవాల్సిందే అని రాహుల్ అంటాడు. అంత ఇంపార్టెంట్ అయితే డాడ్ చెప్పేవారు కదరా అని రాజ్ అంటాడు. ఇంతలో రాహుల్‌కు మోషన్స్ వచ్చినట్లు గడబిడ అవుతుంది. రా రమ్మని రారా రమ్మని అని స్వప్న అంటుంది. రాహుల్ వెళ్తుంటే.. స్వప్న ఆపి.. నువ్ ఏదో ముఖ్యమైన మీటింగ్ అన్నావ్ కదా. అది తేల్చుకుని వెళ్లు అని స్వప్న అంటుంది.
స్వప్న సెటైర్లు
ఏమైందిరా అని రుద్రాణి అంటే.. రావోయి చందమామా గుడగుడ మని అని పాటలు పాడుతుంది స్వప్న. రాహుల్ వెళ్తుంటే రాజ్ ఆపుతాడు. అసలు నీకు నేను మీటింగ్‌కు వెళ్లాలని ఎవరు చెప్పారు. అది చెప్పు వెళ్లు అని రాజ్ అంటాడు. అది నేనే అన్నాను. వచ్చాకా చెబుతా. మమ్మీ రాజ్‌ను ఆపు అని రాహుల్ వెళ్లిపోతాడు. రాజ్ రాహుల్ అలాగే అంటాడు మీరు వెళ్లండి అని స్వప్న అంటుంది. రుద్రాణి ఆపడానికి ట్రై చేస్తుంటే సెటైర్లు వేసి స్వప్న రాజ్‌ను వెళ్లమంటుంది.
దాంతో రాజ్ స్వప్న వెళ్లిపోతారు. రాహుల్ మోషన్స్‌తో తంటాలు పడుతుంటాడు. ఏం చేశావే అని రుద్రాణి అడిగితే.. మీరు ఏం ప్లాన్ చేశారు. మా చెల్లి రాజ్ డిన్నర్‌కు వెళ్తుంటే అడ్డుకోవాలని చూస్తారా. అందుకే రాహుల్‌కు మోషన్ ట్యాబ్లెట్ కలిపి ఇచ్చాను. ఇంత కుల్లుతనం ఎందుకు అత్త. అనామికకు చెప్పి దాని కాపురం కూల్చావ్. ఒకరు పచ్చగా ఉంటే ఓర్వలేవు కదా అని స్వప్న అంటుంది. నిన్ను ఏం చేసిన పాపం లేదే అని రుద్రాణి అంటుంది.
బాత్రూమ్ కడగమన్న స్వప్న
రాహుల్‌కు మోషన్ ట్యాబ్లెట్ మాత్రమే ఇచ్చాను. నీకు మాత్రం ఏం కలిపి ఇచ్చి చంపేస్తానో నాకో తెలీదు. తర్వాత వెళ్లి ఆ బాత్రూమ్ కడుగు అని స్వప్న అంటుంది. అంది నా కంఠంలో ఉండగా జరగదని రుద్రాణి అంటుంది. కడగకుంటే నువ్ ఆ గదిలో ఉంటావ్. నేను నీ రూమ్‌లో ఉంటావ్. నీ కొడుకేగా. చిన్నప్పుడు కూడా ఇలాగే వేరేవాళ్లకు అప్పజెప్పావా అని స్వప్న అంటుంది. దాంతో చీదరించుకుంటూ వెళ్లిపోతుంది రుద్రాణి. మీలాంటి వాళ్లకు ఇంతకన్న దారుణమైన శిక్షలు వేయాలే. మీరంతా సర్వ నాశనం అయిపోతారు అని స్వప్న అనుకుంటుంది.
మరోవైపు కల్యాణ్ అప్పు గురించి.. అప్పు బస్తీ వాళ్లు తనను అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. అప్పుకు కాల్ చేసి నీతో మాట్లాడాలి అంటాడు కల్యాణ్. మనమేంటో మనకు తెలుసు. కానీ, సమాజం అలా కాదు. మన వల్ల మన ఇంట్లోవాళ్లు ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పు. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నావల్ల మావాళ్లు బాధపడటం నాకు ఇష్టం లేదు. మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని అప్పు కాల్ కట్ చేస్తుంది.
ఇకనుంచి థ్రిల్ల్స్
వెంటనే దూరం గురించి, అప్పు గురించి, తను ఉన్న ఇంపార్టెన్స్ గురించి కల్యాణ్ కవిత రాస్తాడు. మరోవైపు రెస్టారెంట్‌కి రాజ్ కావ్య వెళ్తారు. ఇద్దరూ సరదాగా అక్కడికి వచ్చినవాళ్లపై జోకులు వేసుకుంటారు. నన్ను ఇలాగే రెస్టారెంట్‌కు తీసుకురండి. ప్రశాంతంగా ఉంటుంది అని కావ్య అంటుంది. ఇది అంత కాదు కళావతి ఆరంభం. నీకు ఇకనుంచి థ్రిల్స్ ఇస్తాను. ఇప్పుడు వాష్ రూమ్‌కు వెళ్లొస్తాను అని రాజ్ అంటాడు.
సరే త్వరగా రండి లేకుంటే ఒక్కదాన్ని బిక్కు బిక్కు మంటూ కూర్చోవాలని కావ్య అంటుంది. చిటికెలో వస్తాను అని రాజ్ అంటే.. యాడ్స్ అన్ని పోయాక వస్తారా అని కావ్య జోక్ వేస్తుంది. దాంతో నవ్వుకుంటూ రాజ్ వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ కావ్య వెళ్లే దారిలో వర్షం పడితే.. ఓ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తే.. చుట్టూ క్యాండిల్స్‌తో రొమాంటిక్‌గా ఉంటుంది.
రాజ్ కావ్య శోభనం
చీర మార్చుకుని రాపో అని రాజ్ అంటాడు. ఎవరిదోనండి అని కావ్య అంటుంది. వర్షంలో తడిచావ్. జలుబు చేస్తుంది మార్చుకో అని రాజ్ అంటాడు. ఇద్దరు డ్రెస్సులు మార్చుకుని వస్తారు. పక్కన కర్టెన్స్ వైపు ఎవరో పరిగెత్తినట్లు కనిపిస్తుంది. దాంతో ఇద్దరూ భయంతో హగ్ చేసుకుంటారు. రాజ్ కావ్యను ప్రేమగా అలాగే పట్టుకుంటాడు. అలా ఇద్దరూ ఒక్కటవుతారని, వారిద్దరికి అక్కడే శోభనం జరగనున్నట్లు తెలుస్తోంది.