Brahmamudi July 19th Episode: బ్రహ్మముడి- కావ్యతో రాజ్ డిన్నర్ పార్టీ- చెడగొట్టేందుకు రుద్రాణి రాహుల్ కన్నింగ్ ప్లాన్
Brahmamudi Serial July 19th Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 19వ తేది ఎపిసోడ్‌లో కావ్యతో కలిసి డిన్నర్ చేసేందుకు రాజ్ ప్రపోజల్ పెడతాడు. దానికి కావ్య ఒప్పుకుంటుంది. కానీ, వాళ్ల మాటలు విన్న రుద్రాణి అది చెడగొట్టాలని రాహుల్‌తో ప్లాన్ చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఇందిరాదేవి చెప్పిందని రాజ్, అపర్ణ సలహా ఇచ్చిందని కావ్య ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ ఒకేసారి గదిలోకి అడుగుపెడతారు. కావ్య బట్టలు సర్దుతూ ఉంటుంది. రాజ్ వచ్చి ఇవాళ నేను చరితాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాను. అది వింటే నువ్ ఎగిరి గంతు వేస్తావ్ అని అంటాడు. అవునా అయితే త్వరగా చెప్పండి ఎగిరి గంతేసి పడుకుంటాను అని కావ్య సెటైర్ వేస్తుంది.
ఇదేనా చారితాత్మక నిర్ణయం
ఏంటీ పడుకుంటావా.. సరే నువ్ ఇంటికోసం ఎంతో ప్రయత్నిస్తున్నావ్. ఎన్నో చేశావ్. అందుకే నీకోసం నేను ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. నువ్ ఇంత వరకు చేసిన అన్ని తప్పులను నేను క్షమిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు నువ్ చేసిన ప్రతి తప్పును నేను క్షమిస్తున్నాను అని రాజ్ అంటాడు. దాంతో ఏంటీ ఇదా మీరు తీసుకున్న చారితాత్మక నిర్ణయం అని కావ్య కోప్పడుతుంది.
ఇది కూడా మా నానమ్మ ఏదో చెబుతుందని. నేను నీకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాను అని రాజ్ అంటుంది. ఏంటీ క్షమాభిక్ష అని కోప్పడిని కావ్య బ్లాంకెట్‌ను అటు ఇటు అంటుంది. దాంతో అదేంటే ఇంత మంచి విషయం చెబితే నా మీద కోపం బ్లాంకెట్‌పై చూపిస్తున్నావ్. నేను నీకు అంత చులకన అయ్యానా, నీకు అంత లోకువ అయ్యానా అని రాజ్ అంటాడు. దాంతో కావ్య తెగ ఫైర్ అవుతుంది. అసలు తప్పులన్నీ చేసింది మీరు అని కావ్య అంటుంది.
వర్షంలో నిలబెట్టారు
మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని వస్తే స్టోర్ రూమ్‌లో నన్ను పడేయలేదా. నేను తిన్నానో లేదో కూడా పట్టించుకోలేదు. కష్టపడి డిజైన్స్ చేస్తే ఉద్యోగం ఇవ్వకుండా వంటింట్లో పడి ఉండమని అనలేదా. అంతెందుకు పెళ్లై సంవత్సరం అవుతుంది. ప్రేమగా ముద్దు పెట్టుకున్నారా. అచ్చటగా ఆలింగనం చేసకున్నారా. ఓసారి రాత్రి వర్షంలో నిలబెట్టారు. మా బావతో ఏదో ఉందని అనుమానించారు. శ్వేతతో ఉంటూ నాతో విడిపోయేందుకు ప్లాన్ చేశారు అని కావ్య అన్ని తప్పులు చెబుతుంది.
ఇంకా ఆ వెన్నెల.. మ్యారేజ్ యానివర్సరికీ ఆశగా ఎదురుచూస్తుంటే.. బిడ్డను తీసుకొచ్చారు. ఎప్పుడు మా అక్క తప్పు చేసింది నిరూపించుకో. నువ్ తప్పు చేశావ్ నిరూపించుకో అని గడువులు పెట్టారు. సంవత్సరమంతా తప్పులు అన్ని మీరు చేసి నాకు క్షమాభిక్ష పెడుతున్నారా. చెప్పండి అని రాజ్‌ను నిలిదీస్తుంది కావ్య. అమ్మో మనసు నిండా ఇన్ని పెట్టుకుని పైకి ప్రేమగా నటిస్తున్నావా అని రాజ్ అంటాడు. నాది నటన అని మళ్లీ ఫైర్ అవుతుంది కావ్య
ఎవరిదారిన వాళ్లు
ఇలా కావ్య రాజ్ రాత్రంతా గొడవ పడుతూనే ఉంటారు. మీదే తప్పు అని కావ్య నీవే అన్ని తప్పులు. ప్రతికారం తీసుకుంటూ నిందలు వేస్తున్నావ్ అని రాజ్ అంటాడు. ఇంతలో దాదాపు తెల్లారే సమయం అవుతుంది. అప్పుడు కూడా గొడవ పడుతూనే అలాగే నిద్రలోకి జారుకుంటారు. ఇందిరాదేవి, అపర్ణ కలిసి ఉండమని చెబితే మళ్లీ గొడవ పడుతూ ఎవరిదారిన వాళ్లు పడుకుంటారు రాజ్ కావ్య.
మరుసటి రోజు కావ్యను డిన్నర్‌కు పిలుస్తాడు రాజ్. ఈరోజు రాత్రి నీతో కలిసి డిన్నర్ చేయాలని ఆశపడుతున్నాను వెంటపడుతున్నాను కుతుహలపడుతున్నాను వస్తావా. నా బుల్ బుల్ అని రాజ్ అంటాడు. సరే మీరు ఇన్ని రకరకాలుగా పడుతున్నారు కాబట్టి ఏం చేస్తాను. వస్తాను లెండి అని కావ్య అంటుంది. ఆ మాటలు రుద్రాణి విన్నట్లు తెలుస్తోంది. వెళ్లి ఇదే విషయం రాహుల్‌కు చెబుతుంది.
రాహుల్ కొత్త ప్లాన్
రాజ్ తన మనసులో ఉన్న ప్రేమను కావ్యకు చెప్పి తనకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నాడు. అదే గనుక జరిగితే ఇక వాళ్లిద్దరూ ఒక్కటైపోతారు. కావ్య రాజ్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని మన నెత్తిమీద కూర్చుంటుంది అని రుద్రాణి కంగారుగా చెబుతుంది. దాంతో ఇప్పుడు రాజ్ ఆ డిన్నర్‌కు వెళ్లకుండ ఆపాలి అంతేగా అని రాహుల్ అంటాడు. అవును అని నవ్వుతూ చెబుతుంది రుద్రాణి. దాంతో రాహుల్ ఆలోచిస్తాడు. రాజ్ కావ్యతో డిన్నర్ చేయకుండా ఉండేందుకు రాహుల్ ఏదో ప్లాన్ చేస్తాడని తెలుస్తోంది.
టాపిక్