Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి - అత్తకు ఎదురుతిరిగిన కావ్య - అప్పు, కళ్యాణ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు
Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి జూలై 15 ఎపిసోడ్‌లో తనను అసభ్యంగా కామెంట్స్ చేసిన వ్యక్తిని అప్పు కొడుతుంది.ఆ కేసులో అప్పును పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పును విడిపించడానికి పోలీస్ స్టేషన్ వచ్చిన కళ్యాణ్ కూడా జైలు పాలవుతాడు.
Brahmamudi July 15th Episode: అపర్ణ, సుభాష్‌లను కలిపేందుకు కావ్య ప్రయత్నిస్తుంది. కానీ అపర్ణ మాత్రం పట్టువీడదు. తప్పు చేసినట్లు ఒప్పుకున్న సుభాష్‌ను క్షమించేది లేదని కావ్యతో ఖరాఖండిగా చెబుతుంది అపర్ణ. నన్ను హడలగొట్టి సమస్యను పరిష్కరించకుండా చేయాలని అనుకుంటున్నారా అంటూ అత్తతో అంటుంది కావ్య.
కాస్త చనువిస్తే నన్నే నిలదీస్తావా అంటూ కోడలిపై అపర్ణ ఫైర్ అవుతుంది. నాకే ఎదురుసమాధానం చెబుతావా...అందుకే నిన్ను నా గదిలోకి రావద్దని అన్నాను. ఎదురుపడొద్దని చెప్పానని కావ్యపై ఫైర్ అవుతుంది అపర్ణ.
ఓ తప్పుతో పోగొట్టుకున్నాడు...
అపర్ణ ఎంత కొప్పడిన కావ్య మాత్రం అత్తయ్య గదిలో నుంచి బయటకు వెళ్లడానికి ఒప్పుకోదు. సమస్య నా కాపురానికి, నమ్మకానికి సంబంధించింది. నేను నా భర్త మీద పెంచుకున్న గౌరవానికి సంబంధించింది. అదంతా ఓ తప్పుతో సుభాష్ పొగొట్టుకున్నాడని అపర్ణ బాధపడుతుంది.
సమస్య నువ్వు అనుకున్నంత చిన్నది కాదని కావ్యతో అంటుంది అపర్ణ. అది నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. తాళి కట్టిన భర్త చేసిన మోసాన్ని ఆడది జీవితాంతం మర్చిపోలేదని, మనతోనే ఉంటూ, మనలోనే ఉంటూ మనకు తెలియకుండా ఇంకొకరితో కలిసి మోసం చేస్తే ఎవ్వరూ క్షమించరని కోడలితో చెబుతూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది.
నేనే తేల్చుకుంటా...
ఈ సమస్య నాకు సంబంధించింది. నేనే తేల్చుకుంటాను. భరిస్తానో, సహిస్తానో, ద్వేషిస్తానో, క్షమిస్తానో నాకు వదిలేయమని కావ్యతో వాదిస్తుంది అపర్ణ. ఇంట్లో ఇంత మంది ఉన్నా మామయ్య ఒంటరిగా ఫీలవుతున్నాడని, తప్పు చేసిన వాడిలా ఎవరికి ఎదురుపడకుండా తిరుగుతున్నాడని కావ్య మళ్లీ సుభాష్‌నే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.
రాజ్ ఇదే తప్పు చేస్తే...
ఇదే తప్పు రాజ్ చేస్తే క్షమిస్తావా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. రాజ్ బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడని బయటపడితే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని నువ్వే నాతో అన్నావు. నిజమా కాదా అని కావ్యను అడుగుతుంది అపర్ణ. అవునని కావ్య ఒప్పుకుంటుంది.
నీ విషయంలో నిజమైన నమ్మకం నా విషయంలో మాత్రం ఓడిపోయిందని, సుభాష్ తప్పు చేశాడని అపర్ణ అంటుంది. ఆ తప్పును నువ్వే నిరూపించావు. మళ్లీ ఏం ముఖం పెట్టుకొని వచ్చి సుభాష్ తరఫున మాట్లాడుతున్నావని కావ్యకు క్లాస్ ఇస్తుంది అపర్ణ.
కొడుకును దులిపేసిన అపర్ణ...
తండ్రి చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించి రాజ్ కూడా తప్పు చేశాడని కొడుకును దులిపేస్తుంది అపర్ణ. నీతో పాటు ఇంట్లో వాళ్లందరు తప్పు చేసిన మనసులో తాను పెట్టుకోలేదని, ఇది వేరు, ఈ తప్పును మాత్రం క్షమించేది లేదని అంటుంది.
తన మాటలను అపర్ణ వినదని కావ్యకు అర్థమవుతుంది. మీరు ఈ శిక్ష వేసింది మామయ్యకే కాదు మీకు మీరు కూడా శిక్ష వేసుకుంటున్నారు. ఈ భారం మోసినంత కాలం మీరు ప్రశాంతంగా ఉండలేరని చెప్పి అపర్ణ రూమ్‌లో నుంచి కావ్య వెళ్లిపోతుంది.
కళ్యాణ్‌కు స్వప్న సలహా...
అప్పుకు ఫోన్ చేస్తాడు కళ్యాణ్. కానీ అప్పు ఫోన్ కట్ చేస్తుంది. దాంతో స్వప్న ఫోన్ నుంచి కాల్ చేస్తాడు. అయినా అప్పు లిఫ్ట్ చేయదు. సమస్యలను పెద్దది చేయకుండా కొన్ని రోజులు మీరిద్దరు మాట్లాడుకోకుండా ఉండటమే మంచిదని కళ్యాణ్‌కు సలహా ఇస్తుంది స్వప్న.
ఈ బాధ నుంచి బయటపడటానికి ఆఫీస్‌కు వెళ్లమని కళ్యాణ్‌తో అంటుంది స్వప్న. కళ్యాణ్ ఆఫీస్‌కు రావడం రాహుల్‌కు ఇష్టం ఉండదు. అప్పుతో మాట్లాడలేకపోతున్నానని కళ్యాణ్ బాధపడుతుంటే నువ్వు ఆఫీస్‌కు వెళ్లమని అంటున్నావేంటి స్వప్న సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతాడు. ఓ సారి మాట్లాడితే తప్పేంటి అని అంటాడు. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదని చెప్పి రాహుల్‌ను అక్కడి నుంచి పంపించేస్తుంది.
కొడుకుకు రుద్రాణి క్లాస్...
అప్పుతో మాట్లాడమని కళ్యాణ్‌కు రాహుల్ సలహాలు ఇవ్వడం చూసి రుద్రాణి కూడా కొడుకుకు క్లాస్ ఇస్తుంది. డిప్రెషన్‌లో ఉన్న కళ్యాణ్...అప్పుకు దగ్గరై ఆమెను పెళ్లి చేసుకుంటే మనం చేయగలిగింది ఏం ఉండదని రుద్రాణి చెబుతుంది. కావ్య ను ఏదో ఒక రకంగా తట్టుకొని నిలబడగలుతున్నాం... కానీ అప్పు ఆటం బాంబ్ లాంటిది. ఆమె స్పీడును తట్టుకోలేం.
కోపం వస్తే ఎదురుగా ఎవరు ఉన్న పట్టించుకోదని రాహుల్‌ను భయపెడుతుంది రుద్రాణి. అప్పు కళ్యాణ్ దగ్గరవ్వకుండా, వాళ్లు పెళ్లి చేసుకోకుండా తన దగ్గర ఓ ప్లాన్ ఉందని రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మిని అడ్డుపెట్టుకొని ఆ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్సవుతుంది.
రాజ్, కావ్య బాధ...
సుభాష్, అపర్ణ ఇన్ని రోజులు కలిసి పోయినట్లు నాటకం ఆడారనే నిజం తెలిసి రాజ్, కావ్య బాధపడతారు. వాళ్ల మధ్యలోకి పదే పదే వెళ్లి ఇంకా దూరం పెంచడం తప్పితే ఏం చేయలేమని రాజ్ అంటాడు. మన మధ్య అలాంటి దూరమే ఉందని కావ్య అంటుంది. శోభనం రోజు రాజ్ తనతో ఏదో చెప్పాలని ప్రయత్నించి ఆగిపోయిన విషయం కావ్యకు గుర్తొస్తుంది. అదేమిటని రాజ్‌ను అడుగుతుంది. కావ్య ఆ విషయం గురించి చెప్పగానే రాజ్ కంగారు పడతాడు. నువ్వు ఇలా డైరెక్ట్‌గా అడిగితే చెప్పలేనని, కళ్లుమూసుకోమని అంటాడు.
అంతరాత్మ ఎంట్రీ...
రాజ్ కష్టపడి ఒక్కో మాట కూడగట్టుకొని కావ్యకు తన మనసులో ఉన్న ప్రేమను చెప్పబోతాడు. కానీ అతడి వాయిస్ అతడికే వినిపించడంతో చుట్టూ చూస్తాడు. అక్కడ కావ్య కనిపించదు. ఆమె బదులుగా అతడి అంతరాత్మ కనిపిస్తుంది. అంతరాత్మను చూసి రాజ్ షాకవుతాడు.
కావ్య ఎప్పుడో వెళ్లిపోయిందని రాజ్‌తో అంతరాత్మ చెబుతుంది. పీరియడ్స్ వచ్చాయని నీరసంగా రూమ్‌లోకి వచ్చిన కావ్య నిద్రపోతుంది. ఏదైనా రేపు మాట్లాడుకుందా అని భర్తతో అంటుంది. తన ప్రేమను వ్యక్తం చేసే మంచి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారడంతో రాజ్ నిరాశపడతాడు.
అప్పుకు అవమానం...
అప్పు రోడ్‌పై నడుచుకుంటూ వెళుతోండగా కొందరు అబ్బాయిలు కళ్యాణ్‌తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ చేస్తారు. లాడ్జ్‌లో దొరికింది నిజమేనా అని అడుగుతారు. నాకు తెలిసిన హోటల్ ఉంది...అక్కడికి వస్తావా అని మాటలతో అవమానిస్తారు. మళ్లీ గొడవలు పడటం ఇష్టం లేక సెలైంట్‌గా అప్పు అక్కడి నుంచి వెళ్లబోతుంది. మధ్యలోకి ఫ్యామిలీ మొత్తాన్ని లాగడంతో అప్పు సహించలేకపోతుంది. తనపై చీప్‌గా కామెంట్స్ చేసిన వ్యక్తిని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. అతడు పక్కనే ఉన్న రాయిపై పడటంతో తలకు గాయమవుతుంది.
కళ్యాణ్‌కు కాల్...
అప్పును పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ విషయం కనకం, కృష్ణమూర్తికి కాకుండా కళ్యాణ్‌కు ఫోన్ చేసి చెబుతాడు బంటి. అప్పు కోసం పోలీస్ స్టేషన్‌కు కళ్యాణ్ బయలుదేరబోతాడు. ధాన్యలక్ష్మి ఆపుతుంది. మళ్లీ అప్పు దగ్గరికి వెళుతున్నావా అని కొడుకును నిలదీస్తుంది. అప్పు దగ్గరికి కాదని కళ్యాణ్ అబద్దం ఆడి పోలీస్ స్టేషన్‌కు వెళతాడు.
కళ్యాణ్ అరెస్ట్...
పోలీస్ స్టేషన్‌లో అప్పు గురించి చీప్‌గా కామెంట్స్ చేసిన వ్యక్తి కనబడతానే కళ్యాణ్ కోపంతో రగిలిపోతాడు. అతడిని కొట్టబోతాడు. కానీ పొరపాటుగా ఆ దెబ్బ కానిస్టేబుల్‌పై పడటంతో కళ్యాణ్‌కు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడన్న సంగతి ఎస్ఐ ద్వారా విని రాజ్, కావ్య షాకవుతారు.