ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న పూజ గదిలో అందరి దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. కానీ శని దేవుడి విగ్రహం మాత్రం పొరపాటున కూడా పెట్టరు.
pinterest
శని దేవుడిని న్యాయదేవుడు అంటారు. శని అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా రాజు అవుతాడు. కానీ శని దేవుడి విగ్రహాన్ని పెట్టుకుని ఇంట్లో పూజించడం మాత్రం నిషేధం.
pinterest
శని శ్రీకృష్ణుడి భక్తుడు. ఎల్లప్పుడూ కృష్ణుని నామస్మరణలోనే ఉండేవాడు. ఒకనాడు శని భార్య ప్రసవించిన తర్వాత అతని వద్దకు వచ్చింది. అప్పుడు కూడా శని కృష్ణుని ధ్యానంలో మునిగిపోయాడు.
pinterest
ఎంత ప్రయత్నించిన శని దేవుడి దృష్టిని ఆమె మరల్చలేకపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె శనిదేవుడిని శపించింది. శని చూపు పడితే కీడు కలుగుతుందని శపిస్తుంది.
pinterest
తప్పు తెలుసుకున్న శని భార్యకు క్షమాపణలు చెప్పాడు. కానీ శాపం ఉపసంహరించుకునే అవకాశం లేకపోయింది. అప్పటి నుంచి శని దేవుడు తల దించుకుని నడిచాడు.
pinterest
అందుకే శని దేవుడిని ఇంట్లో పూజించరు. కేవలం ఆలయానికి వెళ్ళి మాత్రమే పూజలు చేస్తారు. అది మాత్రమే కాదు శని దేవుడి పాదాలు మాత్రమే చూస్తూ పూజించాలి.
pinterest
శని దేవుని కళ్ళలోకి చూస్తే చెడు జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే చెడు దృష్టి నుంచి తప్పించుకోవడం కోసం పాదాలు చూస్తారు.
pinterest
చాలా మందికి లోదుస్తులకు గడువు తేదీ ఉంటుందని తెలియదు. కొంతమంది ఒకే లోదుస్తులను ఎక్కువకాలం ఉపయోగిస్తారు.