Karthika deepam august 6th: తూటాల్లాంటి ప్రశ్నలు వేసిన వీవీ, దీపను దోషిని చేసిన నరసింహ.. శౌర్య దూరం అవుతుందా?
Karthika deepam 2 serial today august 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ మధ్య వివాహేతర సంబంధం ఉందని వీవీ సాక్ష్యాలు కూడా కోర్టులో చూపిస్తాడు. లాయర్ అడిగే ప్రశ్నలకు దీప కళ్ళు తిరిగిపడిపోతుంది. దీంతో కార్తీక్ పరిగెత్తుకుంటూ వస్తాడు.
Karthika deepam 2 serial today august 6th episode: నరసింహ తరపు లాయర్ వీవీ దీప, కార్తీక్ గురించి నీచంగా మాట్లాడతాడు. ఊర్లోని బాకీలు కూడా కార్తీక్ తీర్చాడని నరసింహ చెప్తాడు. ఎంత తీర్చాడని అంటే నాలుగు లక్షలని నరసింహ చెప్తాడు. పాప హాస్పిటల్ బిల్లు కూడా రెండు సార్లు అతడే కట్టాడని చెప్తాడు.
సాయం ఉరితాడుగా మారింది
తన బంగారు గాజులు తాకట్టు కింద పెట్టానని దీప చెప్తుంది. స్కూల్ ఫీజు కోసం నరసింహను డబ్బులు అడిగారా అని వీవీ దీపను ప్రశ్నిస్తాడు. లేదని చెప్తుంది. దీప డబ్బులు అడగనప్పుడు నరసింహ తనని గాలికి వదిలేసినట్టు అవుతుంది. దీప కార్తీక్ దగ్గర సుమారు ఆరు లక్షలు పైనే తీసుకుందని నరసింహ చెప్తాడు.
ఏ కాగితం లేకుండా నీకు అతను అంత డబ్బు ఎందుకు ఇచ్చాడని వీవీ ప్రశ్నిస్తాడు. నేను చేసిన సాయాలు అన్నీ దీప మెడ చుట్టూ ఉరితాడుగా మారాయని కార్తీక్ ఫీల్ అవుతాడు. నా భార్యకు కార్తీక్ కి సంబంధం ఉంది. ఇది పచ్చి నిజం. నా కూతురిని సరిగా చూసుకోకుండా దాన్ని ఇబ్బందులు పెడుతుంటే తెచ్చుకుందామని వెళ్తే అది నీ కూతురు కాదు నా కూతురు అని చెప్పాడు.
కాపాడటం కోసం అబద్ధం చెప్పాడు
అది ఎవరి ముందో కాదు దీప ముందే చెప్పాడని నరసింహ చెప్తాడు. కార్తీక్ అలా చెప్పాడా లేదా అని వీవీ అడుగుతాడు. తన కూతురిని కాపాడేందుకు అలా చెప్పాడని దీప అంటుంది. దీపతో ఏ సంబంధం లేకుండా తన కూతురికి నేనే తండ్రినని ఎవరైనా ఎందుకు చెప్తారు? అలా చెప్తే దీప ఎందుకు ఊరుకుందని వీవీ ప్రశ్నిస్తాడు.
ఊరుకున్నానని మీకు చెప్పానా? నరసింహ నా కూతురిని ఎత్తుకుపోవాలని అనుకున్నాడు. అందుకే కార్తీక్ బాబు అబద్ధం చెప్పాడని దీప ఏడుస్తూ చెప్తుంది. నరసింహ శౌర్యను ఎత్తుకుపోవాలని అనుకున్నట్టయితే దీప కేసు పెట్టాలి కదా. దీప మరి నువ్వు కేసు పెట్టావా? అని నిలదీస్తాడు.
కేసు పెట్టలేదని చెప్తుంది. కేసు పెట్టలేదంటే అది అబద్ధం. దీపకు వివాహేతర సంబంధం ఉందని వీవీ అంటే లేదని దీప గట్టిగా అరుస్తుంది. తనకు ఎవరితోనూ ఏ సంబంధం లేదని ఏడుస్తూ అరుస్తుంది. నీకు కార్తీక్ కి మధ్య సంబంధం ఉంది అనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని వీవీ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తాడు.
ఆధారాలు చూపించిన వీవీ
దీప పడిపోతుంటే కార్తీక్ పట్టుకున్న ఫోటో జడ్జి చూస్తాడు. తన కూతురిని తనకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీప అంటుంది. జడ్జికి చూపించిన ఫోటోస్ వీవీ దీపకు చూపిస్తాడు. ఈ విజువల్స్ చూస్తే నాకే అనుమానం వస్తుంది, ఇవి అబద్ధం అయితే దీప ఎందుకు మాట్లాడటం లేదని జ్యోతి మనసులో అనుకుంటుంది.
ఏ సంబంధం లేకుండానే కార్తీక్ మిమ్మల్ని పట్టుకున్నాడా? అంటూ వీవీ నీచమైన ప్రశ్నలు అడుగుతాడు. వీవీ మాటలకు దీప కళ్ళు తిరిగిపడిపోతుంది. కార్తీక్ పరిగెత్తుకుంటూ వస్తాడు. కాసేపటికి స్పృహ వస్తుంది. నేను చూపించిన ఆధారాలు అబద్ధం అనుకుంటే దీప కళ్ళు తిరిగి పడగానే కార్తీక్ వచ్చి నీళ్ళు అందించాడు.
దీప కళ్ళు తెరిచే వరకు విలవిల్లాడిపోయాడు. దీపకు కార్తీక్ కి సంబంధం ఉందని చెప్పేందుకు ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏముంటుంది. వివాహేతర సంబంధం కారణంగా కూతురిని నిర్లక్ష్యం చేస్తున్న దీప దగ్గర నుంచి తనని నరసింహకు అప్పగించాల్సిందింగా వీవీ జడ్జిని కోరతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.