Karthika deepam august 5th: దీపకు కోర్టులో చుక్కలు చూపించిన వీవీ.. కార్తీక్ తో సంబంధం పెట్టుకుందన్న నరసింహ
Karthika deepam 2 serial today august 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య కోసం నరసింహ కోర్టుకు వెళతాడు. అక్కడ దీప కార్తీక్ తో సంబంధం పెట్టుకుందని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని నరసింహ తరపు లాయర్ వాదిస్తాడు.
Karthika deepam 2 serial today august 5th episode: సుమిత్ర దేవుడికి పూజ చేసుకుంటుంది. కోర్టు తీర్పు దీపకు అనుకూలంగా వచ్చేలా చేయమని దేవుడిని వేడుకుంటుంది. అలాగే దీప సమస్య పరిష్కరించి తన కూతురు, మేనల్లుడికి పెళ్లి జరిగేలా చూడమని కోరుకుంటుంది. శౌర్య వచ్చి మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వస్తుందని అడుగుతుంది.
కూతురు కోసం తండ్రి యుద్ధం
కోర్టు సీన్ స్టార్ట్ అవుతుంది. వీవీ నరసింహను పిలిపించి విచారిస్తాడు. ఇది చాలా విచిత్రమైన కేసు. పిల్లల కోసం ఎక్కడైన తల్లి తాపత్రాయపడుతుంది. కానీ ఇక్కడ కన్నతల్లి బిడ్డను నిర్లక్ష్యం చేస్తుంటే ఇక్కడ తండ్రి బిడ్డ క్షేమం కోసం ఇతను యుద్ధం చేస్తున్నాడని అంటాడు.
వాళ్ళ మాటలను జ్యోతి అడ్డుకుంటుంది. నా క్లయింట్ కు కూతురంటే ప్రాణం. ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం గురించి మాట్లాడితే అసలు విషయం తెలుస్తుందని జ్యోతి అంటుంది. వీవీ దీప గురించి నీచంగా మాట్లాడతాడు. కూతురు అవసరాలు తీర్చడం లేదని నరసింహ భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అంటాడు.
వీవీ మాటలను జ్యోతి అడ్డుకుంటుంది. ఇవి నిరాధారాలు కాదు ఆధారాలు ఉన్నాయని వీవీ చెప్తాడు. నరసింహను జ్యోతి క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. పెళ్లి రోజు ఎప్పుడని జ్యోతి ప్రశ్నిస్తుంది. పెళ్ళికి విలువ ఇవ్వనిదానికి పెళ్లి రోజు గురించి ఎందుకులే అంటాడు. సరే కూతురు పుట్టినరోజు చెప్పమని అడుగుతుంది.
కూతురి పుట్టినరోజు ఎప్పుడు?
ఈ ప్రశ్నలకు కేసుకు సంబంధం లేదని వీవీ వాదిస్తాడు. కూతురు కోసం యుద్ధం చేస్తున్నాడు కదా ఆ మాత్రం గుర్తు ఉండదా అని లాజిక్ గా మాట్లాడుతుంది. కూతురిని ప్రేమించే తండ్రికి ఖచ్చితంగా కూతురి పుట్టినరోజు గుర్తుండాలి. లేదంటే అతడిది నిజమైన ప్రేమ కాదని చెప్తుంది.
జ్యోతి మరోసారి అడిగితే నరసింహ శౌర్య పుట్టినరోజు చెప్తాడు. వీవీ దీపను క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. ఎవరికీ భయపడకుండా ధైర్యంగా మాట్లాడమని కార్తీక్ చెప్పడం విని జ్యోత్స్న రగిలిపోతుంది. వీవీ దీపను వరుసగా ప్రశ్నలు వేసి భర్త పేరు చెప్పమంటే చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
ఎదురుగా భర్త ఉన్న తన పేరు పలకడం కూడా ఇష్టం లేదు. మనసులో భర్త లేడు కాబట్టి అతడిని దూరం పెట్టింది. కూతురిని కూడా చూడనివ్వకుండా చేసింది. తన తప్పులను నిలదీస్తున్నదని దూరం పెట్టింది. తను బతిమాడినా కూడా రాకుండా కూతురిని ఇవ్వకుండా నా క్లయింట్ ని చిత్రహింసలు పెట్టింది. ఇందుకు కారణం ఆమె పెట్టుకున్న వివాహేతర సంబంధమేనని వీవీ వాదిస్తాడు.
నరసింహ చాలా మర్యాదస్తుడు
తన దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తాడు. తన భార్య తనని వద్దనుకున్నదని కానీ నాకు కూతురు కావాలని వెళ్ళి అడిగాను నన్ను లాగిపెట్టి కొట్టిందని చెప్తాడు. దీప అబద్ధమని అంటే కొట్టావా లేదా అని వీవీ అడుగుతాడు. కొట్టాను కానీ అందుకు కారణం వేరే ఉందని చెప్తుంది.
నరసింహ చాలా గొప్పవాడు, మర్యాదస్తుడు అంటూ వీవీ తన తరపున తెగ వాదిస్తాడు. దీప, కార్తీక్ మధ్య సంబంధం ఉందని చెప్తాడు. దీప ఆవేశంగా నరసింహ అంటూ ఆవేశంగా వెళ్లబోతుంటే జ్యోతి ఆపుతుంది. నిజం చెప్పాడని దీప ఎంతో ఆవేశంగా వస్తుందని వీవీ అంటాడు.
స్కూల్ ఫీజు అతడే కట్టాడు
అది ఆవేశం కాదు ఆత్మగౌరవం నిజాయతీతో బతికే ఏ మనిషి ఇలాంటి నిందలు భరించలేదని జ్యోతి సపోర్ట్ చేస్తుంది. దీపకు కోర్టులో చుక్కలు కనిపిస్తున్నాయని జ్యోత్స్న, పారిజాతం తెగ సంతోషపడతారు. స్కూల్ అప్లికేషన్ లో తండ్రి స్థానంలో కార్తీక్ పేరు రాసుకున్నాడని నరసింహ బయటపెడతాడు.
ఇప్పటికీ ఆ పేరు అలానే ఉంది. పాపకు స్కూల్ ఫీజు కూడా అతడే కట్టాడని నరసింహ చెప్తాడు. ఆ డబ్బులు నేను దీపకు అప్పుగా ఇచ్చానని కార్తీక్ అంటాడు. దీప తాను అప్పుగా తీసుకున్నానని అంటుంది. అందుకు ఏదైనా ఆధారం నోటు లాంటిది ఏదైనా ఉందా అని వీవీ అడుగుతాడు.
అలాంటిది ఏమి లేదు. అంత డబ్బు అప్పుగా ఇచ్చాడంటే మీ ఇద్దరి మధ్య అంత పరిచయం ఉందా అని నిలదీస్తాడు. ఊర్లో ఉన్న బాకీలు కూడా కార్తీక్ తీర్చాడని నరసింహ చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.