Karthika deepam august 7th: నరసింహను చెప్పుతో కొట్టిన దీప.. పారిజాతం మీద సుమిత్ర ఫైర్, తీర్పు ఏం రాబోతుంది?
Karthika deepam 2 serial today august 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప ఆరోగ్య పరిస్థితి బాగోలేదని జ్యోతి ఒక రోజు వాయిదా అడుగుతుంది. దీప, కార్తీక్ మధ్య వివాహేతర సంబంధం ఉందని రుజువైందని పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.
Karthika deepam 2 serial today august 7th episode: దీప కళ్ళు తిరిగి పడిపోగానే కార్తీక్ పరిగెత్తుకుంటూ వస్తాడు. దీంతో దీప, కార్తీక్ మధ్య సంబంధం ఉందనడానికి ఇంతకంటే రుజువు అవసరం లేదు. దీన్ని పరిగణలోకి తీసుకుని శౌర్యను ఇప్పించాల్సిందిగా వీవీ కోరతాడు. దీప ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఒక్క రోజు వాయిదా ఇవ్వమని జ్యోతి కోరుతుంది.
నరసింహ గెలుస్తాడు
జడ్జి అందుకు పర్మిషన్ ఇస్తాడు. బావ ఏం చేసిన శౌర్యను నరసింహ తీసుకుపోతాడు. బావ ఓడిపోవడం, నరసింహ గెలవడం ఖాయమని జ్యోత్స్న పారిజాతం అనుకుంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజమే గెలుస్తుందని వీవీ జ్యోతిని రెచ్చగొడతాడు.
అందుకు జ్యోతి ధీటుగా న్యాయమే గెలుస్తుందని అంటుంది. దీప కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇవన్నీ నాకు ఎందుకు ముందే చెప్పలేదని జ్యోతి అడుగుతుంది. అవన్నీ అబద్ధాలు అందుకే చెప్పలేదని అంటాడు. మనం కేసు గెలవాలంటే బలమైన ఆధారం కావాలి.
నరసింహ ఎలాంటి వాడు, తనని ఎంత టార్చర్ పెట్టాడో దీప కోర్టులో చెప్పాలని జ్యోతి అంటుంది. దీప కూర్చుని ఏడుస్తుంటే నరసింహ వాళ్ళు వస్తారు. అడిగినప్పుడే నా కూతురిని ఇచ్చేసి ఉంటే నీకు ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు చూడు పరువు పోయింది. నువ్వు బుడ్డ దాన్ని నా దగ్గరకు పంపేందుకు రెడీ అయిపో అంటాడు.
రేపు మీ నాన్న తీసుకుపోతాడు
అనసూయ నరసింహను మాట్లాడనివ్వకుండా తీసుకుని వెళ్ళిపోతుంది. కార్తీక్ వచ్చి దీపను ఇంటికి రమ్మని పిలుస్తాడు. లేదు మీరు వెళ్ళిపోండి మళ్ళీ ఫోటోస్ తీసి ఏదో ఒకరకంగా పొడుస్తారని దీప బాధపడుతుంది. ఇంటి దగ్గర శౌర్య సుమిత్రతో ఆడుకుంటూ అమ్మ ఇంకా రాలేదు ఏంటని అడుగుతుంది.
చిన్న పని ఉండి బయటకు వెళ్ళిందని సర్ది చెప్తారు. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఇంటికి వస్తారు. శౌర్య జోకి హాయ్ చెప్తే... బాగా ఆడుకో ఈ ఒక్క రోజే రేపు మీ నాన్న వచ్చి నిన్ను తీసుకుని పోతాడని జ్యోత్స్న అంటుంది. దీంతో శౌర్య అమ్మమ్మ బూచోడు వస్తాడా? అని భయపడుతుంది.
సుమిత్ర వచ్చి జ్యోత్స్నని నిలదీస్తుంది. శౌర్యతో అలా ఎందుకు అన్నావని అంటుంది. జరగబోయేది అదే అని పారిజాతం అంటుంది. కోర్టుకు వెళ్లామని చెప్తుంది. నీకు కాబోయే అల్లుడు ఇంటి పరువు తీశాడు. దీప, కార్తీక్ కి సంబంధం ఉందని నరసింహ నిరూపించాడు.
దీప మనకు సున్నం రాసింది
సుమిత్ర మాత్రం కార్తీక్ అలాంటి వాడు కాదని అంటుంది. అసలు మీరు కోర్టుకు ఎందుకు వెళ్లారని దశరథ పారిజాతాన్ని నిలదీస్తాడు. నీ వెంట జ్యోత్స్నను ఎందుకు తీసుకెళ్లావ్ అంటాడు. అక్కడ కోర్టులో నిందలు వేస్తుంది నా బావ మీద నన్ను ఏమన్నా ఐ డోంట్ కేర్. ఈ కేసులో జడ్జిమెంట్ దీపకు మాత్రమే కాదు నాకు చాలా ఇంపార్టెంట్ అందుకే నేను వెళ్లానని జ్యోత్స్న అంటుంది.
సహాయం చేసిన మనకు దీప సున్నం రాసిందని పారిజాతం తిడుతుంది. అనవసరమైన విషయాల్లో మీరు ఎందుకు కలుగుజేసుకుంటున్నారని సుమిత్ర అత్తకు చీవాట్లు పెడుతుంది. శ్రీధర్ కు అందరూ ఫోన్ చేసి కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు.
పరువు గురించి మీరు మాట్లాడుతున్నారా?
అందరికీ ఈ గొడవ తెలిసిపోయింది. దీప, కార్తీక్ కి మధ్య సంబంధం ఉందా అని అడుగుతున్నారని శ్రీధర్ అంటుంటే కార్తీక్ ఎంట్రీ ఇచ్చి మరి మీరు ఏం చెప్పారని అడుగుతాడు. నా కొడుకు నా పరువును వాయిదా పద్ధతుల్లో తీస్తున్నాడని అంటాడు. పరువు గురించి మీరు మాట్లాడకండి అనేసరికి శ్రీధర్ షాక్ అవుతాడు.
అదేంటి అంత మాట అన్నావని కాంచన అడుగుతుంది. మా అమ్మను నన్ను మోసం చేయడమే కాకుండా ఇంకా పరువు గురించి మాట్లాడుతున్నావా అని మనసులో రగిలిపోతాడు. కార్తీక్ చిరాకుగా మాట్లాడతాడు. ఏదో ఒకటి చేసి తల్లీకూతుళ్ళు విడిపోకుండా చేసేందుకు నేను ప్రయత్నిస్తుంటే మీరు పరువు గురించి మాట్లాడతారు ఏంటని అంటాడు.
నరసింహను చెప్పుతో కొట్టిన దీప
రెండో వాయిదా పూర్తయ్యేంత వరకు కాస్త సమయం ఇవ్వమని అప్పుడే అందరికీ సమాధానం చెప్తానని అంటాడు. నేను ఇదంతా చేస్తుంది ఆ నీచుడి నుంచి శౌర్యను కాపాడేందుకేనని కాంచనతో చెప్తాడు. దీప దిగులుగా ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తుంది. నరసింహ కంట దీప పడుతుంది.
అనసూయ వద్దని చెప్పినా కూడా వినకుండా దీపకు ఝలక్ ఇచ్చి వస్తానని వెళతాడు. దీప చెప్పు తెగిపోతే అది పక్కకి విసిరేస్తుంది. అది కాస్త నరసింహ మీద పడుతుంది. నన్నే చెప్పుతో కొడతావా అని నరసింహ ఆవేశపడుతుంటే అనసూయ ఆపుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.