Karthika deepam august 10th: కోర్టులో నరసింహకు ఝలక్ ఇచ్చిన దీప, ‘సాయాన్ని సంబంధం అంటారా’? కార్తీక్ ఆవేదన
కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కోర్టులో నరసింహకు దీప అదిరిపోయే ఝలక్ ఇస్తుంది. శోభను రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో లాయర్ వీవీ కూడా ఆశ్చర్యపోతాడు.
Karthika deepam 2 serial today august 10th episode: దీప దగ్గరకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. మా ఇంటి పరివి తీశావ్ కాదే. నా మనవరాలిని పోలీస్ స్టేషన్ ఎక్కేలా చేశావ్, నా మనవడిని కోర్టు గుమ్మం ఎక్కేలా చేశావ్. నీ స్థాయి ఇదే ఇప్పుడు మమ్మల్ని కూడా నీ స్థాయికి లాగావు. నీ ఆటకు ముగింపు వచ్చిందని సూటిపోటి మాటలు అంటుంది.
శ్రీధర్ నిష్టూరం
కార్తీక్ రావడం చూసి పారిజాతం వాళ్ళు వెళ్లిపోతారు. సుమిత్ర ఇంటికి కాంచన, శ్రీధర్ వస్తారు. కూతురు నిశ్చితార్థం ఆగిపోయింది, కాబోయే అల్లుడు తనకు సంబంధంలేని విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. మాకు భోజనం కూడా చేయాలని అనిపించడం లేదు. కానీ నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటున్నావని కాంచన అడుగుతుంది.
కార్తీక్ మీద నీకేమైన అనుమానం ఉందా?అని సుమిత్ర అడుగుతుంది. నీ కొడుకు కాబట్టి నీకు ఉండదు కానీ జనాలకు అలా ఉండదు కదా. ఆ నరసింహ ఇంటికి వచ్చి ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసు కదా. వీడి ముందు నిలబడే అర్హత కూడా లేని వాడు ఇంటికి వచ్చి మాట్లాడాడని శ్రీధర్ నిష్టూరంగా మాట్లాడతాడు.
నా మేనల్లుడు ఏ తప్పు చేయడు
దీప అయినా చెప్పాలి కదా ఈ కేసుకు కార్తీక్ కి సంబంధం లేదని అంటాడు. దీప అలా ఏమైనా చెప్పిందా అంటాడు. కానీ నా కొడుకు కోర్టు బోనులో దోషిగా నిలబడుతున్నాడు. మన కార్తీక్ మీద మనకే నమ్మకం లేకపోతే ఎలా? నా మేనల్లుడు ఏ తప్పు చేయడు.
దీప ఎలాంటిదో కూడా నాకు తెలుసు. దీప, శౌర్య మీద నాకెంత అభిమానం ఉందో వాడికి అంతే ఉంది. నేను ఆడదాన్ని కాబట్టి ఎవరూ అనుమానించడం లేదు. కానీ కార్తీక్ మగాడు కాబట్టి అనుమానిస్తున్నారు. మన చేతుల్లో పెరిగిన పిల్లల ఆవేశం, కోపం మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు.
సుమిత్ర కోర్టుకు వెళ్తుంటే కాంచన కూడా వస్తానని చెప్తుంది. శ్రీధర్ వస్తానని అంటే వద్దని అంటుంది. దీపను బోనులో నిలబెడతారు. వీవీ దీప దోషి అంటూ వాదిస్తాడు. ఆధారాలన్నీ పరిశీలించి దీప దగ్గర ఉన్న నా క్లయింట్ ఆరేళ్ళ కూతురిని నా క్లయింట్ కి ఇప్పించాల్సిందిగా వీవీ జడ్జిని కోరతాడు.
నోరు జారిన లాయర్ వీవీ
జ్యోతి మాత్రం అబ్జెక్ట్ చేస్తుంది. అవన్నీ తప్పుడు అనుమానాలని చెప్తుంది. కార్తీక్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పిలుస్తాడు. అప్పుడే కోర్టుకు సుమిత్ర, కాంచన వస్తారు. కొడుకుని కోర్టు బోనులో చూసి కాంచన చాలా బాధపడుతుంది. వాడు తప్పు చేసి నిలబడలేదు. న్యాయం చేయడానికి ఉన్నాడని సుమిత్ర చెప్తుంది.
దీపతో ఎందుకు ఈ విధమైన సంబంధం పెట్టుకున్నారని వీవీ కార్తీక్ ని అడుగుతాడు. రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి కిందపడిపోతుంటే చెయ్యి అందించి పైకి లేపడాన్ని ఏమంటారు? అంటే సాయం, మానవత్వం అని లాయర్ చెప్తాడు. చెయ్యి అందించింది స్త్రీకి అయితే అప్పుడు ఏమంటారు?
నరసింహ కండిషన్ పెట్టాడు
అవును పెళ్ళయి కూతురు పుట్టిన దగ్గర నుంచి నా భర్త దూరంగానే ఉన్నాడని దీప చెప్తుంది. మా అత్తయ్య అవుట్ హౌస్ లో ఉంటూ దీప ఒక హోటల్ లో వంట మనిషిగా చేస్తుంది. శౌర్య తెలివితేటలకు మంచి స్కూల్ లో చేర్పించాను. గార్డియన్ గా మాత్రమే సంతకం పెట్టాను.
కానీ అక్కడ జరిగిన ఒక మిస్టేక్ ని పట్టుకుని తప్పుగా చూపించారు. హాస్పిటల్ లో బలవంతంగా కూతురిని తీసుకుపోవాలని అనుకుంటే నేను అడ్డుపడ్డాను. వాడు భార్యకు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?శౌర్య నాకు పుట్టిన కూతురు కాదని చెప్పు వదిలేస్తాను లేదంటే తీసుకెళ్తానని అన్నాడు.
ఏం చేయాలో అర్థం కాక పాపను కాపాడటం కోసం నేనే తండ్రిని అని చెప్పాను. నాకు మా అత్త కూతురితో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. మా ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ జరుగుతుంటే అక్కడికి వచ్చి గొడవ పెట్టాడు. శౌర్యకు వాళ్ళ నాన్న అంటే భయం. పాపను ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని అనుకున్నాడు.
కార్తీక్ ఆవేదన
స్పృహ తప్పిన పాపను తీసుకెళ్లిపోతుంటే నేను అడ్డుపడి ఎంగేజ్ మెంట్ వదిలేసుకుని తనను తీసుకుని హాస్పిటల్ కు తీసుకెళ్ళాను. నిస్సహాయంగా ఉన్న ఒక ఆడదానికి మనిషిగా సాయం చేశాను కానీ సంబంధం ఉందని కాదని చెప్తాడు. సహాయానికి కూడా ఆడ, మగ అని తేడా ఎందుకు?
నడి రోడ్డు మీద అప్పుల వాళ్ళు చుట్టుముడితే అక్కడే నేను ఉండి సాయం చేశాను. తను పడిపోతుంటే చెయ్యి పట్టుకున్నాను. ఒక ఫోటో చూసి ఇలా మాట్లాడటం ఎంత వరకు న్యాయమో మీరే ఆలోచించండి. దీపకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి దగ్గర ఊరికే సాయం తీసుకోదు.
నిందలను నిజం చేయకండి. తల్లీకూతుళ్లను దూరం చేయకండి. న్యాయం చేయమని కార్తీక్ కోరతాడు. మీరు చెప్పేవన్నీ నమ్మాలా అని వీవీ అడుగుతాడు. జ్యోతి అబ్జెక్ట్ చేస్తుంది. కార్తీక్ ప్లేస్ లో స్త్రీ ఉంటే ఈ విధంగా సంబంధం అంటగట్టే వాళ్ళు కదా అని అంటుంది. నిందలు భరించే ఓపిక ఇక నాకు లేదు.
నరసింహకు ఝలక్ ఇచ్చిన దీప
నాకు నా భర్తతో విడాకులు ఇప్పించండి అని దీప జడ్జిని అడుగుతుంది. భర్త పేరు చెప్పడానికి ఇష్టపడని దీప ఇప్పుడు విడాకులు అడుగుతుందంటే కూతురిని సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇదని వీవీ అంటాడు. విడాకులు ఇప్పించడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తాడు.
భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే ఆ భార్యకు విడాకులు వస్తాయా? అని దీప అడిగితే వస్తాయి విడాకులు రావడమే కాదు ఆ భర్తకు జైలు శిక్ష కూడా పడుతుందని వీవీ అంటాడు. నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నా భర్త దగ్గర కూర్చున్న శోభనే మా ఆయన రెండో భార్య.
కూతురిని ఇవ్వకుండా తప్పించుకోవడానికి నాటకంలా అనిపిస్తుందని వీవీ అంటాడు. అయితే శోభను క్రాస్ ఎగ్జామిన్ చేయాలని జ్యోతి అంటుంది. నరసింహ నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా? అని శోభను జ్యోతి ప్రశ్నిస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగింది.
టాపిక్