Karthika deepam august 12th: మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన శోభ.. నరసింహను గెలిపించమని వీవీని అడిగిన జ్యోత్స్న
Karthika deepam 2 serial today august 12th episode: కార్తీకదీపం 2 సీరిల్ ఈరోజు ఏం జరిగిందంటే.. దీప నరసింహకు శోభతో రెండో పెళ్లి అయిందని చెప్తుంది. అయితే శోభ మాత్రం తనకు అసలు పెళ్ళే కాలేదని నరసింహ కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమేనని అబద్ధం చెప్పడంతో జ్యోత్స్నతో సహా అందరూ షాక్ అవుతారు.
Karthika deepam 2 serial today august 12th episode: శోభ నరసింహ రెండో భార్య అని దీప చెప్తుంది. దీంతో జ్యోతి శోభను క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. నరసింహ నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా? అని జ్యోతి అడుగుతుంది. మా అమ్మను అక్క అని పిలిచాడు, ట్యాక్సీ కొనుక్కుంటాను అంటే డబ్బులు ఇప్పించామని చెప్తుంది.
నాకు పెళ్ళే కాలేదు
మీ ఇద్దరికీ ఏ సంబంధం లేదా అని అంటే లేదని చెప్తుంది. ఆమె అబద్ధం చెప్తుంది ఆవిడ నరసింహ రెండో భార్య అని దీప అంటుంది. నాకు అసలు పెళ్ళే కాలేదని శోభ అబద్ధం చెప్తుంది. పెళ్లి కాకుండా పెళ్ళాన్ని ఎలా అవుతాను. ఈ మాట అన్నందుకు నరసింహ ఎంత బాధపడుతున్నాడో అని శోభ అమాయకంగా అంటుంది.
తను చెప్పేది అబద్ధం తన మెడలోకి తాళి ఉందని దీప అంటే శోభ తన మెడలోని చైన్ చూపిస్తుంది. శోభ ఇచ్చిన షాక్ కి జ్యోత్స్న నోరు వెళ్లబెడుతుంది. ఇది మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చిందని అంటుంది. మా అత్తయ్యను అడిగితే అన్ని నిజాలు తెలుస్తాయని దీప అంటుంది.
నరసింహను గెలిపించమన్న జ్యోత్స్న
మీ అమ్మ చెప్పే సాక్ష్యం మీదే ఆధారపడి ఉందని అంటాడు. శోభను చూసి మీరు నా దగ్గర అబద్ధం చెప్తే మీకే నష్టమని వీవీ హెచ్చరిస్తాడు. మిమ్మల్ని నమ్ముతున్నాను, గెలిపిస్తాను వెళ్ళి మీ అమ్మను తీసుకురండి అంటాడు. జ్యోత్స్న వీవీ దగ్గరకు వస్తుంది.
కార్తీక్ మరదల్ని, కాబోయే భార్యను అని పరిచయం చేసుకుంటుంది. నరసింహను గెలిపించండి, దీపకు విడాకులు రాకుండా చూడండి. దీప కూతురు నరసింహకు వచ్చేలా చూడండి. మీకు ఎంత డబ్బు కావాలైన ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇంత విచిత్రమైన కేసును నేను ఎక్కడ చూడలేదని అంటాడు.
దీప కారణంగా నష్టం జరుగుతుంది మీకే విడాకులు తీసుకుంటే మీ బావ దీపను పెళ్లి చేసుకుంటాడనా అని వీవీ అడుగుతాడు. డోంట్ వర్రీ నేను ఈ కేసు ఒడిపోనని ధైర్యంగా చెప్తాడు. మన మనసులో మాట చెప్పాడు అంటే లాయర్ బాగా తెలివైన వాడని పారిజాతం అంటుంది.
తల్లిని బతిమలాడిన నరసింహ
శోభ నరసింహ భార్య అని అనసూయ నోరు తెరిచి చెప్తే విడాకులు వస్తాయని జ్యోత్స్న అనుమానపడుతుంది. ఆవిడకు దీప అంటే చిరాకు కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం ఎందుకు చెప్తుంది అని పారిజాతం అంటుంది. నరసింహ అనసూయ దగ్గరకు వస్తాడు. శోభకు, నాకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పమని అడుగుతాడు.
ఈ మధ్య మీ అమ్మ తేడాగా కనిపిస్తుంది. అక్కడ ఏదైన తేడాగా మాట్లాడితే మనం ఇరుక్కుపోతామని శోభ చెప్తుంది. కోర్టు తీర్పు నీ మాట మీదే ఆధారపడి ఉందని, శోభకు నాకు పెళ్లి అవలేదని అబద్ధం చెప్పు. అబద్ధం చెప్పి నీ కొడుకు జీవితం కాపాడమని నరసింహ తల్లిని బతిమలాడతాడు.
నువ్వు నిజం చెప్తే నేను ఇరుక్కుపోతాను. నువ్వు ఆ మాట చెప్పడం జడ్జి తీర్పు ఇవ్వడం నీ మనవరాలిని తీసుకుని ఇంటికి రావడం జరుగుతుందని నరసింహ అంటాడు. దీంతో సరే నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదని అనసూయ అందుకు ఒప్పుకుంటుంది.
కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కదా
మీ అత్తయ్య నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్తుందని మేము అనుకోవడం లేదని కాంచన, సుమిత్ర డౌట్ పడతారు. అసలు గొడవలకు కారణం ఆవిడే అందుకే కదా కొడుకుని తీసుకుని గొడవ చేసేందుకు ఇంటికి వచ్చిందని అంటాడు. జ్యోత్స్న వాళ్ళు వస్తే మీరు ఎందుకు వచ్చారని సుమిత్ర అడుగుతుంది.
ఇక్కడ శౌర్య కోసం దీప, దీప కోసం బావ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో బావను కాపాడటం కోసం బావ కోసం నేను వచ్చానని చెప్తుంది. దీపకు సపోర్ట్ చేస్తూ కాంచన మాట్లాడుతుంది. నరసింహ అనసూయను తీసుకుని కోర్టుకు వస్తాడు. దీప అత్తతో మాట్లాడేందుకు వస్తుంది.
నేను పుట్టిన దగ్గర నుంచి నన్ను చూసిన నా గురించి తెలిసిన ఏకైక మనిషివి నువ్వే. నా జీవితంలో కష్టం తప్ప ఏ సుఖం అనుభవించలేదని నీకు తెలుసు. అయినా తెగించి మొండిదానిగా బతుకుతున్నాను అంటే నా కూతురి గురించే. ఇప్పటి వరకు నేను మోసిన నిందలు చాలు.
నాకు నా కూతురిని ఇచ్చెయ్యండి
ఇన్నాళ్ళూ భర్త లేకుండానే బతికాను ఇప్పుడు అలాగే బతకాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను నా బిడ్డ కోసం బతుకుతున్నాను. నాకు నా బిడ్డకు చావు భయం చూపించే ఈ బంధాలు నాకు వద్దు అత్తయ్య.
వీడి నుంచి నాకు విముక్తి కావాలి. మూడు ముళ్ళతో నీ కొడుకు నాకు ఉరితాడు వేశాడు. నా కూతురు ఈ మనిషి పేరు చెప్తేనే భయంతో జ్వరం తెచ్చుకుంటుంది. ఆ భయానికి విముక్తి కావాలి. మమ్మల్ని వదిలేయండి అని దీప బతిమలాడుతుంది. నువ్వు నా మేనకోడలు, వీడు నా కొడుకు.
నాకు ఎవరు ఎక్కువ. నీకు నీ కూతురు ఎంతో నాకు నా కొడుకు అంత. ఏం చేస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడో ఒక తల్లిగా అదే చేస్తాను. శౌర్య నీకు కూతురు అయితే నాకు మనవరాలు. ఎక్కడ ఏం చెప్పాలో నాకు తెలుసు అని కోపంగా అంటుంది. న్యాయమే గెలుస్తుందని సుమిత్ర అంటుంది. కోర్టులో మళ్ళీ వాదనలు మొదలవుతాయి. కార్తీక్ అత్త సుమిత్రను విచారించాలని జ్యోతి అనుమతి అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
శౌర్యను కోర్టుకు తీసుకొస్తారు. దీప, నరసింహను చూసి వీళ్లిద్దరిలో ఎవరి దగ్గర ఉంటావా అని జ్యోతి అడుగుతుంది. శౌర్య తండ్రి వైపు చెయ్యి చూపిస్తుంది. దీంతో దీప షాక్ అవుతుంది. నరసింహ తెగ సంతోషపడిపోతాడు.