Karthika deepam august 13th: అసలు ఆట ఇప్పుడు మొదలైంది.. కోడలిని గెలిపించిన అత్త, తల్లి దగ్గరే ఉంటానన్న శౌర్య
Karthika deepam 2 serial today august 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ కి సంబంధం లేదని అనసూయ కోర్టులో కుండబద్ధలు కొట్టినట్టు చెప్తుంది. తల్లీకూతుళ్లను విడదీయొద్దని వేడుకుంటుంది. దీంతో దీపకు విడాకులు వస్తాయి.
Karthika deepam 2 serial today august 13th episode: సుమిత్రను జ్యోతి క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. దీప గురించి మీ అభిప్రాయం ఏంటని జ్యోతి అడుగుతుంది. దీప ఎలాంటిదో నా మేనల్లుడు చెప్పాడు నాది అదే అభిప్రాయం. దీపకు అమ్మానాన్న ఎవరూ లేరు. చివరకు తన మేనత్త కూడా దీపకు అన్యాయం చేసింది.
దీప నా పెద్దకూతురు
దీపకు ఎవరూ లేరనే కారణంతో మా అవుట్ హౌస్ లోనే ఉండమని చెప్పాను. డబ్బులు సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కానీ మేం సాయం చేద్దామని చూసినా ఏ రోజు మా సాయం తీసుకోలేదని చెప్తుంది. అంటే దీపను వంట మనిషిగా ఉండమని అడిగారా? అని జ్యోతి ప్రశ్నిస్తుంది.
నా ఇంట్లో నా పెద్ద కూతురిగా ఉండమని అడిగాను. దీప అంటే నాకు అంత ఇష్టం. ఎంగేజ్ మెంట్ ఆగిపోయినందుకు మీకేం కోపం లేదా అంటే లేదు. కార్తీక్ చేసింది తప్పు కాదు. ఎంగేజ్ మెంట్ ఆగిపోతే మళ్ళీ చేసుకోవచ్చు. కానీ పాపకు ఏదైనా అయితే తిరిగి తీసుకురాగలమా?
నరసింహ తండ్రిగా తప్పు చేస్తే నా మేనల్లుడు మానవత్వంతో సరిచేశాడని చెప్తుంది. దీప తప్పు చేస్తే మనిషి అయితే కార్తీక్ కి పిల్లను ఇచ్చే అత్త ఇలా ఎందుకు మాట్లాడతారు? నరసింహ శోభను రెండో పెళ్లి చేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరనే కారణంతో దీప కూతురిని తీసుకుని వెళ్లిపోవాలని అనుకుంటున్నాడని జ్యోతి అంటుంది.
శౌర్య నా కొడుకు దగ్గరే పెరగాలి
అనసూయను విచారిస్తే తప్ప నిజాలు బయటకు రావని వీవీ ఆమెను విచారించాలని చెప్తాడు. దీప భర్తతో కాపురం నిలబెట్టుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసిందా అని వీవీ అడిగితే లేదని చెప్తుంది. దీప మనసులో భర్తకు స్థానం ఇవ్వలేదు అనడానికి ఇంతకన్నా మరొక కారణం లేదు.
శౌర్య నా కొడుకు కూతురు కాబట్టి కదా నా కొడుకు దగ్గరే పెరగాలి అని అనసూయ అంటుంది. దీప కార్తీక్ తో కలిసి తిరగడం ఎప్పుడైనా చూశారా అంటే చాలా సార్లు చూశానని చెప్తుంది. కార్తీక్ నరసింహను కొట్టాడా అంటే రెండు మూడు సార్లు కొట్టాడు. ఒకసారి పోలీస్ కేసు కూడా పెట్టాడని చెప్తుంది.
దీపకు కార్తీక్ కి సంబంధం ఉందని వాళ్ళ అత్తగారు ఒప్పుకుంది కాబట్టి అని వీవీ అంటే అనసూయ కోపంగా నేను ఎప్పుడు ఒప్పుకున్నాను అనడంతో అందరూ షాక్ అవుతారు. కలిసి తిరిగితే సంబంధం ఉన్నట్టేనా? చిన్నప్పటి నుంచి దీప నా చేతుల్లో పెరిగిన పిల్ల దాని గుణం ఎలాంటిదో నాకు తెలుసు.
శోభను రెండో పెళ్లి చేసుకున్నాడు
మీ కొడుక్కి శోభతో రెండో పెళ్లి జరిగిందని దీప చెప్తుంది అది నిజమా కాదా? అని లాయర్ అడుగుతాడు. చేసుకున్నాడని అనసూయ చెప్పడంతో నరసింహ, శోభకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. మా ఊరు ముత్యాలమ్మ తల్లి మీద ఒట్టు నా కొడుకు శోభను రెండో పెళ్లి చేసుకున్నాడు.
మా దీప చెప్పింది అక్షరాలా నిజం. నా కొడుకు ఊరు నిండా అప్పులు చేసి నన్ను నా కోడలిని వదిలేసి వచ్చి హైదరబాద్ పారిపోయి వచ్చాడు. వాడు ఇక్కడికి వచ్చేసి ఆరేళ్లు అయ్యింది. ఊర్లో అప్పులు వాళ్ళు పీక్కుతింటుంటే నా కొడుకును వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చింది.
అప్పుడే ఈ వెధవ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. నా కోడులు దిక్కులేనిది అయిపోతే సుమిత్రమ్మ ఆదుకుంది, కార్తీక్ బాబు సాయం చేశారు. శోభకు పిల్లలు పుట్టే యోగం లేదని నేను ఇచ్చిన సలహా వల్ల దీప కూతురిని బలవంతంగా తెచ్చుకుని పెంచుకోవాలని అనుకున్నాడు.
విడాకులు వచ్చేశాయ్
దీప ఇవ్వకపోయే సరికి ఇలా కేసు పెట్టి దీప పరువు బజారుకు ఈడ్చి కూతురిని దక్కించుకోవాలని అనుకుంటున్నాడు. మా దీప ఏ పాపం ఎరుగని మంచి మనిషి. దీపకు బిడ్డ అంటే ప్రాణం. ఆ తల్లీకూతుళ్లను దూరం చేయవద్దని కోరుకుంటుంది. నరసింహ తల్లి స్వయంగా చెప్పింది నరసింహ ఎలాంటిదో మీరే ఆలోచించి నిర్ణయం చెప్పమని జ్యోతి అడుగుతుంది.
నేను ఇక ఈ దరిద్రుడి గురించి వాదించడం కూడా వేస్ట్ అని వీవీ అనుకుంటాడు. శోభ అనసూయ వైపు కోపంగా చూస్తుంది. దీప, కార్తీక్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనదిగా కోర్టు పరిగణిస్తుంది. అలాగే దీప కోరుకున్నట్టు విడాకులు కూడా మంజూరు చేయడం జరిగిందని జడ్జి తీర్పు ఇస్తాడు.
నీ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిశాక ఎందుకు కేసు పెట్టలేదు. తప్పును సమర్థించకూడదు. వెంటనే అతడి మీద కేసు పెట్టు. భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆరు నెలల జైలు శిక్ష పదివేలు జరిమానా పడే అవకాశం ఉందని జడ్జి చెప్తాడు. మా అమ్మను సెంటిమెంట్ తో కొట్టి నన్ను చావ గొట్టిందని నరసింహ అనుకుంటాడు.
బూచోడు వద్దు అమ్మతోనే ఉంటా
పాప కస్టడీ గురించి జ్యోతి అడిగితే అది నిర్ణయించాల్సింది మనం కాదు పాప ముందు తనని పిలిపించమని జడ్జి చెప్తాడు. కార్తీక్ వెళ్ళి శౌర్యను తీసుకొస్తాడు. దీప, నరసింహను చూపించి వీళ్లిద్దరిలో ఎవరి దగ్గర ఉంటావని జ్యోతి శౌర్యను అడుగుతుంది. నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టమని చెప్తుంది.
చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే చెయ్యి ఎత్తి చూపించమని జడ్జి చెప్తాడు. శౌర్య నరసింహ వైపు చేతిని చూపిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఒక్క క్షణం దీప షాక్ అయిపోతుంది. ఈ కేసులో ఇన్ని ట్విస్ట్ లా నేను ఎక్స్ పెక్ట్ చేయలేదని వీవీ అనుకుంటాడు.
అందరూ బిత్తరపోతారు. నాన్న దగ్గర ఉంటావా? అని జడ్జి అడుగుతారు. ఈ బూచోడు మా నాన్న కాదు, నేను బూచోడితో ఉండను. నేను మా అమ్మతోనే ఉంటానని చెప్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. నాకు అమ్మైనా నాన్న అయినా మా అమ్మే అనేసరికి దీప శౌర్యను గట్టిగా హగ్ చేసుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
కోర్టు విడాకులు ఇచ్చింది కదా దీప, కార్తీక్ కలవరని పారిజాతం అంటుంది. అప్పుడే కార్తీక్ దీప, శౌర్యను తీసుకుని జ్యోత్స్న వాళ్ళు ఉన్న రెస్టారెంట్ కే వస్తారు. వాళ్ళను చూస్తే ఏమనిపిస్తుందని జో అడుగుతుంది. ఒక ఫ్యామిలీని చూస్తున్నట్టు ఉందని చెప్తుంది. ఇక ఇది మీ కన్నీటికి వీడ్కోలు కష్టాలకు ముగింపు అని కార్తీక్ దీపతో అంటుంటాడు. అప్పుడే ఆటోలో నుంచి దాసు దిగుతాడు. అసలు కథ ఇప్పుడు మొదలైంది.