Karthika deepam august 17th: కూతుర్ని చూసుకున్న దాసు, ఘోరంగా అవమానించిన శివనారాయణ, రగిలిపోయిన పారిజాతం-karthika deepam 2 serial today august 17th episode parijatam apologies to das for not standing for him ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam August 17th: కూతుర్ని చూసుకున్న దాసు, ఘోరంగా అవమానించిన శివనారాయణ, రగిలిపోయిన పారిజాతం

Karthika deepam august 17th: కూతుర్ని చూసుకున్న దాసు, ఘోరంగా అవమానించిన శివనారాయణ, రగిలిపోయిన పారిజాతం

Gunti Soundarya HT Telugu
Aug 17, 2024 07:01 AM IST

Karthika deepam 2 serial today august 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన కూతురిని చూసుకోవాలని దాసు ఇంట్లోకి వచ్చి జ్యోత్స్నను పిలుస్తాడు. తనని చూసి షాక్ అవుతాడు. రెస్టారెంట్ లో నన్ను కొట్టింది నా కూతురేనా అని అనుకుంటాడు.

కార్తీకదీపం 2 సీరియల్ ఆగస్ట్ 17వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఆగస్ట్ 17వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today august 17th episode: నా కూతురు ఇంట్లోనే ఉంది అంటూ ఆత్రంగా ఇంట్లోకి వెళతాడు. వీడికి నిజం తెలిసిపోయిందేమోనని కంగారుగా వెనుక వెళ్తుంది. నీ కూతురు పుట్టినప్పుడే చనిపోయింది కదా అంటుంది. బిడ్డ చనిపోయింది కానీ నా కూతురు బతికే ఉంది. ఒక పుట్టుక ఒక చావు ఒక బతుకు అంటాడు.

కూతురర్ని చూసుకున్న దాసు

నేను నా కూతురిని చూడాలని అంటాడు. దశరథ అన్నయ్య కూతురు నా కూతురే. అప్పుడు దశరథ అన్నయ్య అన్నాడు కదా నాకు కూతురు పుట్టింది అది నీ మనవరాలే అని. తనని చూడటానికి వచ్చాను తనని చూస్తే నా కూతురిని చూసినట్టే ఉంటుందని అంటాడు.

జ్యోత్స్న జ్యోత్స్న అంటూ గట్టిగా పిలిచేసరికి ఎవరు అంటూ జో కిందకు వస్తుంది. తనని చూసి దాసు షాక్ అవుతాడు. రెస్టారెంట్ లో కొట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. దశరథ కూడా వచ్చి దాసును ప్రేమగా పలకరిస్తాడు. భోజనం చేద్దాం రమ్మని పిలిస్తే వద్దు ఆకలిగా లేదని అంటాడు.

నీ కొడుక్కి నువ్వైనా చెప్పు పిన్నీ అని దశరథ అనేసరికి జ్యోత్స్న షాకింగ్ గా పారిజాతం వైపు చూస్తుంది. దశరథ దాసు నీకు బాబాయ్ అవుతాడని జ్యోత్స్నకు పరిచయం చేస్తాడు. ఎవర్రా బాబాయ్ అని శివనారాయణ కోపంగా అరుస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చావంటూ సీరియస్ అవుతాడు.

బయటకు పో

ఈ మనిషికి ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు ఉంది అనుకున్న వాళ్ళు తనతో పాటు వెళ్లిపోవచ్చని కోపంగా చెప్తాడు. ఇలాంటి వాళ్ళను ఉంచాల్సింది గేటు బయట ఇంటి లోపల కాదని అంటాడు. దాసు క్షమించమని అడుగుతాడు. కొడుకును అవమానించడం చూసి పారిజాతం తట్టుకోలేకపోతుంది.

నీ నీడ కాదు నీ చూపు కూడా ఇంటి మీద పడకూడదు బయటకు పో అని అరుస్తాడు. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. పారిజాతం కన్నీళ్ళు దిగమింగుకుంటుంది. వాడు ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరి సారి కావాలి మళ్ళీ వస్తే తల్లితో వెళతాడు గుర్తు పెట్టుకో అనేసి పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు.

జ్యోత్స్న జాగ్రత్త అమ్మా

నా కూతురు ఎంతో పద్ధతిగా పెరిగి ఉంటుంది అనుకున్నా కానీ అలా లేదు పెంపకంలో ఏదో తప్పు జరిగింది. దశరథ అన్నయ్య కూతురు ఎక్కడ ఉందోనని దాసు అనుకుంటాడు. అవుట్ హౌస్ లో శౌర్య ఆడుకుంటూ కనిపిస్తుంది. అక్కడే కుబేర ఫోటో ఉంటుంది చూసేలోపు పారిజాతం వచ్చి వెనక్కి తీసుకెళ్తుంది.

నన్ను క్షమించు దాసు నీ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానని అంటుంది. ఇంటికి మళ్ళీ రావద్దని ఆ మనిషి చీదరించుకోవడం చూడలేనని అంటుంది. జ్యోత్స్న నన్ను కొట్టింది అమ్మా తను జాగ్రత్త అనేసి వెళ్ళిపోతాడు. నా కొడుకును నాకు దూరం చేశావ్ కదా నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు అనుకుంటుంది.

స్వప్న ఫోన్లో మాట్లాడం విని ఎవరితో మాట్లాడుతుందణి అనుమానపడుతుంది. వెంటనే వెళ్ళి స్వప్న ఫోన్ చెక్ చేసేందుకు ట్రై చేస్తుంది. నా మీద నమ్మకం లేదా నేను అలాంటి దాన్ని కాదని స్వప్న వాదిస్తుంది. నేను మొదట ఇలాగే ఉండేదాన్ని కానీ మీ నాన్న విషయంలో మోసపోయాను.

గతాన్ని గుర్తుచేసుకున్న కావేరి

పెళ్ళికి ముందే మీ నాన్న మొదటి పెళ్లి గురించి తెలిసింది. కానీ అప్పటికే నేను మూడు నెలల గర్భవతిని ప్రేమించిన వాడిని వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ మీ నాన్నతో కలిసి బయట తిరగలేకపోతున్నాను. ఈ నిజం నీకు ఎక్కడ తెలుస్తుందోనని భయపడుతున్నాను.

నాలాంటి బతుకు నీకు వద్దు గౌరవంగా బతకాలి. తొందరపాటుతో ఎక్కడ మోసపోతావో అని భయపడుతున్నానని కావేరి మనసులోనే కుమిలిపోతుంది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని కావేరి కూతురిని నిలదీస్తుంది. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తానని కానీ నీ కూతురు మాత్రం తప్పు చేయదని అంటుంది.

డాడీని వేరే ఆవిడతో చూశా

డాడీని ఒకసారి వేరే ఆవిడతో కారులో చూశాను. అప్పుడు డాడీ మీద డౌట్ వచ్చింది ఆరోజే అడుగుదామని అనుకున్నాను కానీ అడగలేకపోయాను. డాడీ క్యాంప్ కి వెళ్ళడానికి నా అనుమానానికి ఏమైనా సంబంధం ఉందా అని నిలదీస్తుంది. చాలా రోజుల నుంచి నేను నిన్ను ఈ విషయం అడగాలని అనుకున్నానని చెప్తుంది.

ఒక్కటి మాత్రం చెప్తున్నా మీరు తలదించుకునే పని ఎప్పుడూ చేయనని అంటుంది. నువ్వు కాదు నేను తలదించుకునే పని చేశానని కావేరి చాలా బాధపడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.