Karthika deepam august 21st: స్వప్న బాయ్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్, కాపాడిన దీప, మిస్ హైదరాబాద్ పరువు పోయే
Karthika deepam 2 serial today august 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏంజరిగిందంటే.. ఇంటర్వ్యూకు వెళ్తున్న స్వప్న బాయ్ ఫ్రెండ్ కాశీకి యాక్సిడెంట్ జరుగుతుంది.అతడిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లమని చుట్టుపక్కల జనాలుజ్యోత్స్నను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది.
Karthika deepam 2 serial today august 21st episode: కార్తీక్ ఇంట్లో అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల జ్యోత్స్నకు నాకు జరగాల్సిన ఎంగేజ్ మెంట్ ఆగిపోయింది. ఇక జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ అవసరం లేదు అనేసరికి ఇంట్లో అందరూ షాకింగ్ గా చూస్తారు.
నిశ్చితార్థం కాదు డైరెక్ట్ పెళ్ళే
మనకి నిశ్చితార్థం కలిసి రాలేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిశ్చితార్థం కాకుండా డైరెక్ట్ గా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అనేసరికి ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
జ్యోత్స్న పట్టరాని ఆనందంతో ఉంటుంది. తన నిర్ణయం నచ్చిందని సుమిత్ర అంటుంది. మీ పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ దీప చెప్పిన మాటలను జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. పారిజాతం తెగ సంతోషపడిపోతుంది.
శౌర్యను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తున్నాను మిగతావి తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. గుడికి వెళ్ళి మొక్కలు తీర్చుకోవాలని పారిజాతం హడావుడి చేస్తుంది. కాశీ ఇంటర్వ్యూకు వెళ్లబోతుంటే స్వప్న ఎదురుపడుతుంది. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు.
దాసు నీ తండ్రి అని చెప్తా
ఇంటర్వ్యూకు వెళ్తున్నాను ఎదురు రమ్మని చెప్తాడు. తను రావడం మంచిది కాదని అంటుంది. తన మీద స్వప్న చూపిస్తున్న ప్రేమ చూసి కాశీ చాలా సంతోషిస్తాడు. స్వప్న ఎదురు వెళ్ళి కాశీని ఇంటర్వ్యూకి పంపిస్తుంది. బావతో ఎంగేజ్ మెంట్ ఎప్పుడని నేను వెయిట్ చేస్తుంటే ఏకంగా పెళ్లి ముహూర్తాలు పెట్టించమన్నాడు.
ఏదో జరిగింది. మరి ఇప్పుడు దీప, శౌర్య పరిస్థితి ఏంటని జ్యోత్స్న అంటుంది. నీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళని కనిపించకుండా చేస్తానని అంటుంది. నీకు కార్తీక్ కి పెళ్లి అయిన తర్వాత దాసు నీ తండ్రి అని చెప్పి నీకు వాడిని దగ్గర చేస్తాను. అప్పుడు దశరథ మాదిరిగా నా కొడుకు కూడా దర్జాగా బతుకుతాడని అనుకుంటుంది.
జ్యోత్స్న చీదరింపు, దీప సాయం
కాశీకి యాక్సిడెంట్ జరిగి రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉంటాడు. జ్యోత్స్న అటుగా వెళ్తుంటే జనాలు ఆమె కారును ఆపి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి సాయం చేయమని అడుగుతారు. అతనికి బాగా రక్తం కారుతుంది నా కారులో ఎక్కించుకుంటే సీటుకు రక్తం అవుతుంది.
ఏదో ఒక ఆటోలో తీసుకెళ్లండని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అది అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉంటాడు. అటుగా దీప వచ్చి యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. వీడియో తీసిన వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.
నువ్వు చేసిన పని నాకు నచ్చలేదని పారిజాతం మనవరాలి మీద సీరియస్ అవుతుంది. నేను కాపాడకపోతే అతని ప్రాణాలు పోతాయా ఇంకెవరూ సాయం చేయరా అని జ్యోత్స్న అంటుంది. కార్తీక్, శౌర్య ఉన్న హాస్పిటల్ కు దీప కాశీను తీసుకొస్తుంది. యాక్సిడెంట్ కేసు ముందు పోలీస్ కేసు పెట్టమని డాక్టర్ అంటాడు.
మా బావతో పెళ్లి ఎవరూ ఆపలేరు
ఆలోపు ప్రాణం పోతే ఏంటి పరిస్థితి అని నిలదీస్తుంది. కాశీ బాధ్యతను తను తీసుకుంటానని చెప్తుంది. జ్యోత్స్న తన ఫ్రెండ్స్ ని కలిసి పెళ్లి డేట్ పెట్టమని మా బావ చెప్పాడంటూ సంతోషంగా చెప్తుంది. ఇంతకు ముందు జరిగినట్టు మళ్ళీ జరిగితే ఏంటి పరిస్థితని అడుగుతారు.
బావతో పెళ్లి ఎవరు ఆపలేరని అంటుంది. స్వప్న కాశీ ఫోన్ కోసం ఎదురుచూస్తుంది. అప్పుడే ఫోన్లో వీడియో చూస్తూ అందులో జ్యోత్స్నను చూస్తుంది. ఆ వీడియోలో ఉన్న కాశీను చూసి షాక్ అవుతుంది. వెంటనే దీపకు స్వప్న ఫోన్ చేసి నువ్వు కాపాడిన అతనికి ఎలా ఉందని ఏడుస్తూ అడుగుతుంది.
ఆపరేషన్ జరుగుతుందని చెప్తుంది. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది. లేదని అంటే వెంటనే స్వప్న హాస్పిటల్ కు బయల్దేరుతుంది. హాస్పిటల్ లోని నర్స్ దీప వీడియో చూస్తూ తనని చూస్తుంది. శౌర్యకు ఎలా ఉందని దీప కార్తీక్ ని అడుగుతుంది. ఏం కాలేదు జనరల్ చెకప్ అని చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.