Karthika deepam august 20th episode: పెళ్లి చేసి వెళ్లిపోతానన్న దీప, జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ అవసరం లేదన్న కార్తీక్
Karthika deepam 2 serial today august 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ బాబుతో నీ పెళ్లి చేయడం తన బాధ్యత అని పెళ్లి జరగ్గానే ఊరు వెళ్లిపోతానని దీప జ్యోత్స్నకు మాటిస్తుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఇక లేదని చెప్తాడు.
Karthika deepam 2 serial today august 20th episode: దీప నీకు ఏదైన సాయం కావాలంటే చేస్తానని దశరథ అంటాడు. తండ్రి మాటలు విని జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. సుమిత్ర తనకు నచ్చజెప్పి ఇంట్లోకి పంపించేందుకు చూస్తుంది కానీ వినదు. చెప్పు దీప నీకేం సాయం కావాలి మా మమ్మీ డాడీ ఆగిపోయిన కూతురి ఎంగేజ్ మెంట్ గురించి కాకుండా నీ గురించి ఆలోచిస్తున్నారు.
మీ పెళ్లి చేసి వెళ్లిపోతా
వేరే తల్లిదండ్రులు అయితే మళ్ళీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం, పెళ్లి ఎక్కడ ప్లాన్ చేద్దామని ఆలోచిస్తారు. కానీ మా పేరెంట్స్ మాత్రం నా గురించి కాకుండా నీ గురించి ఆలోచిస్తున్నారు. నీ జీవితం ఏమైపోతుందోనని తెగ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు లేని పోనీ భయాలు, భ్రమలు పెట్టుకుంటున్నావని సుమిత్ర అంటుంది.
అవును బావతో నాకు పెళ్లి అవుతుందనే భ్రమలో బతుకుతున్నాను, ఈ దీప వల్ల మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందోనని భయపడుతున్నానని అంటుంది. కార్తీక్ బాబుతో నీ పెళ్లి జరుగుతుంది అది నా సమక్షంలోనే జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చింది నీ పెళ్లి చూడటానికి అది చూసే నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్తుంది. మీ పెళ్లి మీ అమ్మానాన్నలకే కాదు నాకు బాధ్యత.
నీ పెళ్ళికి నేను అడ్డం అని ఎప్పుడూ అనుకోకు. నీ పెళ్లి అవగానే నేను నా కూతురిని తీసుకుని మా ఊరు వెళ్లిపోతాను. ఈ మాట సుమిత్ర అమ్మకు ఎప్పుడూ చెప్తాను ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను. అన్నం పెట్టిన చేతిని ఈ దీప ఎప్పుడూ మర్చిపోదని చెప్తుంది.
కార్తీక్ మీద శ్రీధర్ సీరియస్
స్వప్న, కాశీ కలుసుకుని మాట్లాడుకుంటారు. ఇద్దరూ కాసేపు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా పేరెంట్స్ ఒప్పిస్తానని అంటుంది. మన పెళ్ళికి సపోర్ట్ గా అన్నయ్య ఉన్నాడని కార్తీక్ గురించి చెప్తుంది. ఇంటర్వ్యూ అయిపోగానే నిన్ను ఇంట్లో వాళ్ళకు పరిచయం చేస్తానని చెప్తుంది.
కార్తీక్ వెళ్తుంటే టిఫిన్ చేయమని అడుగుతుంది. తనకు అర్జెంట్ పని ఉందని హాస్పిటల్ కి వెళ్లాలని చెప్తాడు. శౌర్యను వారం వారం హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్తాడు. అయితే దీపను తీసుకెళ్లమని శ్రీధర్ సీరియస్ అవుతాడు. శౌర్య పరిస్థితి చెప్పలేనని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
దీప వైపు జ్యోత్స్న కోపంగా చూస్తుంది. అది ఇంట్లో ఉన్నంత కాలం మనకు మనశ్శాంతి ఉండదు. ఎలాగైనా దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని పారిజాతం అంటుంది. మనం దీపకు భయపడుతున్నామా అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ శౌర్య దగ్గరకు వస్తాడు.
దీప గురించి మర్చిపోవడం బెటర్
శౌర్యను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లాలని జనరల్ చెకప్ కోసం తీసుకెళ్లాలని చెప్తాడు. అయితే నేను తీసుకుని వెళ్తాను మీరు వెళ్ళండని దీప చెప్తుంది. కానీ కార్తీక్ మాత్రం శౌర్య ఆరోగ్య పరిస్థితి తెలిసిపోతుందని అనుకుని తానే తీసుకుని వెళ్తానని అంటాడు. మీరు నాకు ఎంతో సాయం చేశారు.
ఇప్పుడు మీ పెళ్లి గురించి ఆలోచించండి అని చెప్తుంది. మనం దీప గురించి ఎక్కువగా భయపడుతున్నాం ఏమో. తను మా పెళ్లి బాధ్యత అన్నది కదా ఇక దీప మనసులో బావ గురించి ఎలాంటి ఫీలింగ్ ఉండి ఉండదు. మనం తన గురించి మర్చిపోవడం బెటర్ ఏమోనని జ్యోత్స్న అంటుంది.
పెళ్లి చేసుకోమన్న దీప
అప్పుడే దీప కార్తీక్ మాట్లాడుకోవడం పారు జోకి చూపిస్తుంది. ఇప్పుడు చెప్పు వాళ్ళిద్దరి మనసులో ఏమి లేదని అంటుంది. వాళ్ళను చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. మేమందరం సంతోషంగా ఉండాలంటే మీ పెళ్లి జరగాలని దీప చెప్తుంది. జ్యోత్స్న మళ్ళీ ఏదో అన్నట్టు ఉందని కార్తీక్ అర్థం చేసుకుంటాడు.
మీరు ఇంకా మా కోసం చేయాల్సింది ఏదైనా మిగిలిపోయింది అంటే అది ఇదేనని దీప చెప్తుంది. శౌర్య వచ్చి హాస్పిటల్ కి వెళ్దామా అంటుంది. మీరు చెప్పింది నిజమే మీకోసం చేయాల్సింది ఒకటి ఉందని వెంటనే సుమిత్ర ఇంట్లోకి వాళ్ళని తీసుకుని వెళతాడు. ఇంట్లో అందరినీ రమ్మని పిలుస్తాడు.
నరసింహతో విడాకులు ఇప్పించింది దీపను పెళ్లి చేసుకోవడానికి. అదే విషయం మనకు చెప్పడం కోసం దీప దాని కూతురిని వెంట పెట్టుకుని వచ్చాడని పారిజాతం జ్యోత్స్నకు నూరి పోస్తుంది. కార్తీక్ ఎక్కడ అందరి ముందు జ్యోత్స్నను తిడతాడో అనుకుని ఆపేందుకు చూస్తుంది.
జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ అవసరం లేదు
అటు పారిజాతం కూడా దీపను పెళ్లి చేసుకోవడం గురించి చెప్తాడేమోనని కంగారుగా పిలుస్తుంది. కార్తీక్ ఏం చేస్తాడోనని అందరూ కంగారుపడతారు. ఒక మనిషికి జీవితాన్ని ఇవ్వడం కంటే గొప్ప విషయం ఏమి ఉండదని చెప్తావ్ కదా మావయ్య. పెళ్లి చేసుకోవడం కూడా లైఫ్ ఇవ్వడమే కదా అంటూ పొంతన లేకుండా మాట్లాడి అందరినీ టెన్షన్ పెడతాడు.
కొన్ని అనుకోని కారణాల వల్ల జ్యోత్స్నకు నాకు జరగాల్సిన ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని అంటాడు. దాంట్లో ఏముంది ముహూర్తాలు పెట్టుకుని మళ్ళీ చేసుకోవచ్చని పారిజాతం అంటుంది. ఇక జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదని కార్తీక్ అనడంతో అందరూ షాక్ అవుతారు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.