Karthika deepam 2 august 15th: తండ్రి చెంప పగలగొట్టిన జ్యోత్స్న, విలవిల్లాడిన పారు.. కొడుకు దుమ్ము దులిపిన అనసూయ
Karthika deepam 2 serial today august 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రెస్టారెంట్ లో జ్యోత్స్న తన కన్నతండ్రి దాసు చెంప పగలగొడుతుంది. అది చూసి పారిజాతం విలవిల్లాడిపోతుంది. ఎందుకు కొట్టావని గట్టిగా నిలదీస్తుంది.
Karthika deepam 2 serial today august 15th episode: బూచోడు వస్తాడని శౌర్య భయపడుతుంటే రాడని ధైర్యం చెప్తాడు. అమ్మ చెప్పినట్టు వినమని ప్రశ్నలు వేసి విసిగించొద్దని అంటాడు. అంటే నువ్వు మళ్ళీ రావా?అని డౌట్ గా అడుగుతుంది. మనం గుడ్ ఫ్రెండ్స్ కదా ఎప్పటికీ విడిపోమని చెప్తాడు. కార్తీక్, శౌర్య మాట్లాడుకోవడం చూసి జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది.
నరసింహ ఆవేశం
శౌర్యకు కార్తీక్ ఫుడ్ తినిపించడం చూసి జ్యోత్స్నకి కాలిపోతుంది. ఒక తల్లి ఒక తండ్రి ఒక పిల్ల ఆహా ఫ్యామిలీ సినిమా చూస్తున్నట్టు ఉందని పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. వాళ్ళని జ్యోత్స్న ఫోటో తీస్తుంది. నరసింహ ఆవేశంగా ఇంటికి వచ్చి తల్లిని పిలుస్తాడు.
శోభ నరసింహ మీద చిరాకుపడుతుంది. నువ్వు దీపనే కాదు నన్ను కూడా మోసం చేశావు. మీ అమ్మ మనిద్దరిని మోసం చేసింది. ఇంత చేసిన తర్వాత ఆవిడ నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. రాగానే గెంటేస్తానని అంటుంది. అప్పుడే అంత శ్రమ నీకు ఇవ్వను శోభ అనేసి బ్యాగ్ పట్టుకుని వస్తుంది.
నిజం చెప్పొద్దని చేతులు పట్టుకుని బతిమలాడాను కదా. ఇప్పుడు దీప కేసు పెడితే నేను జైలుకు పోతానని అంటాడు. అసలు ఈ రచ్చ అంతా జరగడానికి కారణం నువ్వే అని శోభను తిడుతుంది. కోర్టులు వద్దని ముందే చెప్పాను వినలేదు వాడిని బాగా రెచ్చగొట్టావు. ఇప్పుడు మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారని అంటుంది.
కూతురికి నీ ప్రేమను పంచావా?
నువ్వు నిజం చెప్పకుండా ఉండి ఉంటే అది ఇప్పుడు నా ఇంట్లో ఉండేదని అంటాడు. కన్నప్పుడే వదిలేసి పోయావు. ఏంటి నీ కూతురు ఏరోజైన దానికి కడుపు నిండా అన్నం పెట్టావా? తండ్రిలా నీ ప్రేమను పంచావా? దాని పేరు కూడా నేను చెప్పే వరకు నీకు తెలియదు.
దాన్ని నువ్వు వదిలేసుకున్నా దీప వదిలేసుకోలేదు. బిడ్డను ప్రాణంగా చూసుకుంది. ఆ చంటి దానికోసమే బతికింది. నాన్న ఎప్పుడు వస్తాడని అది అడుగుతుంటే తన కోసం కాకపోయినా బిడ్డ కోసం వస్తావని ఎదురు చూసింది. కానీ నువ్వు దాన్ని దారుణంగా మోసం చేశావని అంటుంది.
మీరు ఏంటి బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతున్నారు మీరు మోసం చేయలేదా అని శోభ నిలదీస్తుంది. నా స్వార్థం కోసం కడుపు తీపి చంపుకోలేక మోసం చేశాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ముగ్గురు ఆడవాళ్ళ జీవితంతో ఆడుకున్నావ్. ఇప్పుడు నీ కూతురిని కూడా బలి చేద్దామని అనుకున్నావా?
ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అనసూయ
దీప కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ చంటిది దీని చేతిలో పడితే బోరు బావిలో పడ్డట్టే. దీప మీద నీకు కోపం ఉందని తెలుసు. దాని కూతురిని నీ దగ్గరకు తెస్తే ఏం చేస్తావో నాకు తెలుసు. కళ్ళు తిరిగి పడిపోయిన కూతురిని రాక్షసుడిలా ఎత్తుకుపోవాలని అనుకున్నాడు.
చంటి దానికి కన్నతండ్రి కాగలడా? ఇవన్నీ ఆలోచించి చేసిన పాపాలు కడుక్కోవాలని అనుకున్నాను. కడిగేసుకున్నాను ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నా దారి నేను చూసుకుంటానని తెగేసి చెప్తుంది. దీప పంచన చెరతారు కదాని శోభ అంటుంది. నాకు ఆత్మాభిమానం ఉంది అవసరమైతే దీప దగ్గరకు వెళ్తాను కానీ నీ దగ్గరకు మాత్రం రానని తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది.
తండ్రి చెంప పగలగొట్టిన జ్యోత్స్న
దాసు జ్యోత్స్న ఉన్న వాళ్ళు ఉన్న రెస్టారెంట్ కి వస్తాడు. దాసు హోటల్ లో పని చేసే వాడికి తగలడంతో పొరపాటున నీళ్ళు జ్యోత్స్న మీద పడతాయి. దీంతో అతడిని జ్యోత్స్న కొడుతుంది. తప్పు అతనిది కాదు నాది చూసుకోలేదని దాసు చెప్పడంతో అయితే కొట్టాల్సింది నిన్ను అని తండ్రిని కొడుతుంది.
అది పారిజాతం చూస్తుంది. కొడుకు కోసం మొత్తం వెతుకుతుంది అతన్ని ఎందుకు కొట్టావ్ అని పారిజాతం అడుగుతుంది. మీద నీళ్ళు పోస్తే మళ్ళీ పోయించుకోమంటావా? అలాంటి వాళ్ళని చేత్తో కాదు చెప్పుతో కొట్టాలని అంటుంది. పారిజాతం కోపంగా జ్యోత్స్న అని చెయ్యి ఎత్తుతుంది.
అల్లాడిపోయిన పారిజాతం
నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? అని పారిజాతం ఆవేశంగా అడుగుతుంది. ఎవరు అతను అని జ్యోత్స్న ఎదురు ప్రశ్నిస్తుంది. వయసులో పెద్దవాడని కవర్ చేస్తుంది. నీ ఆవేశంతో ఏం పోగొట్టుకున్నావో తెలుసు కదా మిస్ హైదరాబాద్ టైటిల్ కూడా పోగొట్టుకున్నావని దెప్పిపొడుస్తుంది.
హోటల్ లో మళ్ళీ కొడుకు కోసం చూస్తుంది. కానీ కనిపించకపోయే సరికి ఇంటికి వెళ్లిపోతారు. జ్యోత్స్న ఆవేశంగా అవుట్ హౌస్ కు తాళం వేస్తుంది. సుమిత్ర అక్కడికి వస్తుంది. తాళం ఎందుకు వేశావని అడుగుతుంది. కోర్టు దీపకు విడాకులు ఇచ్చింది తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని జ్యోత్స్న చెప్తుంది.
జరిగినవి చూశాక తల తిరుగుతుందని హోటల్ లో కార్తీక్ శౌర్యకు తినిపించడం చూపిస్తుంది. అందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముందని సుమిత్ర అడుగుతుంది. శౌర్య ఆకలిగా ఉందని అంటే నేనే రెస్టారెంట్ కు తీసుకుని వెళ్ళమని చెప్పానని అంటుంది.
జ్యోత్స్న మీదకు చెయ్యెత్తిన సుమిత్ర
దీపకు ఈ రేంజ్ ఎంకరేజ్ మెంట్ ఇక్కడే ఉంటే ఇక నాకు పెళ్లి ఎందుకు అవుతుంది. నిన్ను సేవ్ చేసిందని షెల్టర్ ఇప్పించావు. నరసింహతో గొడవలు అంటే విడాకులు ఇప్పించావు. పాప ఆకలి అంటే రెస్టారెంట్ కు పంపించావు. ఇవన్నీ చేసినట్టే పాపం దీప కష్టపడుతుందని రెండు రోజులు అలా సరదాగా తిరిగి రమ్మని బావను తీసుకుని వెళ్ళమనేలా ఉన్నావని జ్యోత్స్న నోటికొచ్చినట్టు వాగుతుంది.
సుమిత్ర కోపంగా నోర్ముయ్ అని కొట్టబోతూ దీపను చూసి ఆగిపోతుంది. అప్పుడే దీప అక్కడికి వచ్చి జ్యోత్స్న మాటలు వింటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్