Karthika deepam august 22nd: దీపను ఆకాశానికెత్తేసిన కార్తీక్, జ్యోత్స్నపై ఫైర్, కూతురి ప్రవర్తనకు బాధపడిన దాసు
Karthika deepam 2 august 22nd episode:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కాపాడిన కాశీ తండ్రి దాసు హాస్పిటల్ కు వస్తాడు. అక్కడ కార్తీక్ ను చూసి తన మేనల్లుడు అని మాటల్లో అర్థం చేసుకుంటాడు. జ్యోత్స్న గురించి వైరల్ అవుతున్న వీడియో చూసి దాసు చాలా బాధపడతాడు.
Karthika deepam 2 serial today august 22nd episode: శౌర్యకు ఎలా ఉందని డాక్టర్ ఏమన్నారని దీప కార్తీక్ ని అడుగుతుంది. బాగానే ఉందని చెప్తాడు. తల్లిగా నేను తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకున్నారని చాలా ఇబ్బందిగా ఉందని అంటుంది. నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం కూడా చేయలేనా అని అంటాడు.
జ్యోత్స్న తమ్ముడే కాశీ
దాసు హడావుడిగా హాస్పిటల్ కు వస్తాడు. కాశీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని, తీసుకురావడం కాస్త ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవని డాక్టర్ చెప్తాడు. తన కొడుకును కాపాడినందుకు దాసు కార్తీక్ కి థాంక్స్ చెప్తాడు. నేను కాదు కాపాడింది దీప అని చెప్తాడు. నా బిడ్డను కాపాడినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని దాసు చేతులెత్తి దణ్ణం పెడతాడు.
మీ అబ్బాయికి ఏం కాదని దీప దాసుకు ధైర్యం చెప్తుంది. అప్పుడే అటుగా నర్స్ దీపను చూస్తూ వెళ్తుంటే ఆపి ఎందుకు చూస్తున్నావ్ అని అడుగుతుంది. మీరు ఒక ప్రాణం కాపాడారు కదా దానికి సంబంధించి వీడియో ఎవరో సోషల్ మీడియాలో పెట్టారని వీడియో చూపిస్తుంది.
తప్పు చేశావ్ అమ్మ
అందులో జ్యోత్స్నను చూసి ఏంటి తనకు ఇంత నిర్లక్ష్యమని కార్తీక్ అనుకుంటాడు. ఆ వీడియో దాసు కూడా చూస్తాడు. అందులో జ్యోత్స్న మాటలు విని షాక్ అవుతాడు. జ్యోత్స్నకు ఇలాంటి బుద్ధులు వచ్చాయి ఏంటి? పెద్దలంటే గౌరవం లేదు. చావు బతుకుల్లో ఉన్న మనిషిని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది.
ఇదంతా మా అమ్మ ప్రభావమా? కారులో నువ్వు పక్కనే ఉన్నావ్ కదా నా కూతురిని ఇలా మనసు లేని దానిలా చూడలేకపోతున్నానని దాసు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. దీప బాధపడకండి బాబాయ్ అని ప్రేమగా పిలిచి ధైర్యం చెప్తుంది. తను చూపించిన ప్రేమకు దాసు కరిగిపోతాడు.
దీప కార్తీక్ ని పేరు పెట్టి పిలవడం విని కాంచన కొడుకు పేరు కూడా ఇదే కదా అనుకుంటాడు. అందరూ బాగున్నారు ఎటొచ్చి అన్యాయం జరిగింది దశరథ అన్నయ్య కూతురికి తను ఎక్కడ ఉందోనని దాసు బాధపడతాడు. ఎంత సర్ది చెప్పుకున్నా మా అమ్మ చేసింది క్షమించరాని నేరం తప్పు చేశావ్ అమ్మా అనుకుంటాడు.
ఏంటి నీతులు చెప్తున్నావ్
పారిజాతం జ్యోత్స్న వీడియో చూసి టెన్షన్ పడుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తే పారు హడావుడిగా వచ్చి వీడియో చూపిస్తుంది. ఎవరు ఈ వీడియో తీసింది అంటే ఎవరు తీశారో నువ్వు విలన్ అయిపోతే దీప హీరోయిన్ అయిపోయింది. ఈ వీడియో బావ కూడా చూసి ఉంటాడు.
కార్తీక్ శౌర్యను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళి ఉంటాడు దీప కూడా అక్కడే ఉండి ఉంటాడని వెంటనే బావకు ఫోన్ చేస్తుంది. కార్తీక్ కోపంగా బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేస్తాడు. ప్రతి విషయంలో తప్పు చేస్తున్నావని పారిజాతం అంటుంది. ఏంటి ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది.
కోప్పడుతున్నావ్, అరుస్తున్నావ్, నీతులు చెప్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు మీ నాన్నను కొడితే కానీ నాకు బుద్ధి రాలేదని పారిజాతం మనసులో అనుకుంటుంది. వీడియో చూసిన దగ్గర నుంచి జ్యోత్స్న మీద చాలా కోపంగా ఉందని అంటాడు. కార్తీక్ తన మేనల్లుడు అని దాసుకు అర్థం అవుతుంది. జ్యోత్స్న మీకు మరదలు మాత్రమే కాదు కాబోయే భార్య కూడా అని దీప సర్ది చెప్తుంది.
జ్యోత్స్న మీద కార్తీక్ ఫైర్
దీప ప్రవర్తన చూసి దాసు చాలా మెచ్చుకుంటాడు. దీప చాలా మంచిదని కార్తీక్ తెగ పొగుడుతాడు. ఏమైంది కాలం నా వాళ్ళను నాకు పరిచయం చేస్తుందని దాసు అనుకుంటాడు. పంతులను పిలిచి ముహూర్తాలు పెట్టించమని శివనారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్ వస్తే శౌర్య గురించి సుమిత్ర అడుగుతుంది.
కార్తీక్ జ్యోత్స్న చేసిన పని గురించి ఇంట్లో చెప్తాడు. వీడియో ఇంట్లో అందరికీ చూపిస్తాడు. తాను ఏ తప్పు చేయలేదని జ్యోత్స్న తనని తాను సమర్థించుకుంటుంది. మానవత్వం లేని మిస్ హైదరాబాద్ అంటూ అందరూ తిడుతున్నారు. ఒక సాధారణ మహిళ అతడి ప్రాణాలు కాపాడింది నిజమైన మిస్ హైదరాబాద్ ఎవరు నువ్వా, దీప అని పక్క పక్కన ఫోటోలు పెట్టి వేస్తున్నారని అంటాడు.
దీపను పొగడొద్దు
దీప చేసింది మరీ గొప్ప పని అని నీకు అనిపిస్తే సన్మానం చేయి అంతే కానీ తనను నా ముందు పొగడొద్దు. వాడికి సాయం చేసినంత మాత్రాన దీప జ్యోత్స్న కాలేదని అరుస్తుంది. అందరిలో ఎక్కువ గుర్తింపు నీకు ఉంది అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ క్లాసు పీకుతాడు.
నీకు అవకాశం ఉండి కూడా అతడిని కాపాడలేదు. మనిషి ప్రాణం విలువ తెలిసిన దీప అతడిని కాపాడింది. నిజంగా నువ్వు ఆ పని చేసి ఉంటే నేను చాలా సంతోషించే వాడినని అంటాడు. మనిషి ప్రాణం నీకు విలువ తెలియదని కార్తీక్ చిన్నతనంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు. కార్తీక్ జ్యోత్స్నను బాగా తిడతాడు.