Karthika Deepam 2 Today Episode: కార్తీక్ ప్రాణాలు కాపాడింది దీపనే - ట్విస్ట్ రివీల్ - కూతురి ప్రేమపై కావేరి ఆరాలు
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం ఆగస్ట్ 26 ఎపిసోడ్‌లో కార్తీక్‌కు పదే పదే ఫోన్ చేస్తూ ప్రశ్నలతో శౌర్య విసిగిస్తుందని దీప అనుమానపడుతుంది. కూతురిపై కోప్పడుతుంది. దీప మాటలను కార్తిక్ వింటాడు. శౌర్యను తనకు దూరం చేయద్దని అంటాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక్‌తో పాటు తల్లిదండ్రులు తనపై ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకోవడానికి దీపనే కారణమని జ్యోత్స్న అపోహపడుతుంది. అదే విషయం దీపతో అంటుంది. మన మాట తీరును బట్టే మనవాళ్లు మన గురించి మాట్లాడుతుంటారని, నిన్ను మంచిదారిలో పెట్టాలని మీ వాళ్లు అనుకుంటున్నారని జ్సోత్సకు సర్ధిచెప్పబోతుంది దీప. కానీ జ్యోత్స్న వినదు.
ప్లాన్ ప్రకారమే...
కాశీ ప్రాణాలను ప్లాన్ ప్రకారమే నువ్వు కాపాడవంటూ దీపను అవమానిస్తుంది జ్యోత్స్న. ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించి...ఆ తర్వాత నువ్వే కాశీని కాపాడినట్లు వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టావంటూ దీపను అనుమానిస్తుంది జ్యోత్స. వీడియో తీసిన వాడికి ఎంతిచ్చావని నిలదీస్తుంది. ఎవరి దృష్టిలోనో గొప్ప అనిపించుకోవడానికి సాయం చేయాల్సిన అవసరం తనకు లేదని జ్యోత్స్నకు ధీటుగా బదులిస్తుంది దీప.
ప్రేమతో గెలవాలి...అహంకారంతో కాదు...
మనుషులను గెలవాల్సింది ప్రేమతో అహంకారంతో కాదని జ్సోత్సకు దీప క్లాస్ ఇస్తుంది. అర్థంలేని ప్రవర్తనతో నీ అంతట నువ్వే కార్తీన్‌ను దూరం చేసుకోవద్దని మందలిస్తుంది. దీప మాటల్ని జ్సోత్స్న పట్టించుకోదు. నీతులు చెప్పినంత మాత్రానా నా దృష్టిలో నువ్వు మంచిదానివైపోవని లోలోన కోపంతో రగిలిపోతుంది. బావకు నిన్ను ఎలా దూరం చేయాలో నాకు తెలుసునని అనుకుంటుంది.
కావేరి ఫైర్...
కాశీతో స్వప్న దిగిన ఫొటోలను కావేరి కనిపెట్టేస్తుంది.నీ ప్రేమ విషయం ఎందుకు దాచిపెట్టావని కూతురిని నిలదీస్తుంది. నేను చెప్పేలోపు నువ్వు సీక్రెట్ ఏజెంట్‌లా కనిపెడతావని నాకు ఏం తెలుసునని తల్లితో అంటుంది స్వప్న. కూతురు తనను ఎదురించడం కావేరి తట్టుకోలేకపోతుంది. స్వప్న చెంపలు వాయిస్తుంది. తల్లిదండ్రులనే మోసం చేస్తావా... ఇప్పుడే మీ ప్రేమ విషయం డాడీకి చెబుతానని ఫోన్ తీస్తుంది. డాడీకి ఈ విషయం చెప్పొద్దని తల్లిని బతిమిలాడుతుంది స్వప్న. కూతురి కన్నీళ్లు చూసి కావేరి ఆగిపోతుంది.
దీప మంచిది...
కాశీది వైజాగ్ అని, ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చాడని అంటుంది. కాశీకి జాబ్ వచ్చిన తర్వాత మా ప్రేమ విషయం మీకు చెప్పాలని అనుకున్నానని తల్లితో అంటుంది స్వప్న. ఇంటర్వ్యూ కోసం వెళుతున్న టైమ్‌లోనే కాశీకి యాక్సిడెంట్ అయితే దీపనే కాపాడిందని కావేరితో జరిగిన నిజం చెబుతుంది స్వప్న. దీపను అనవసరంగా అపార్థం చేసుకున్నామని, తను చాలా మంచిదని స్వప్న అంటుంద.ఇ
కాశీ తల్లిదండ్రులు ఎవరు?
కాశీ తల్లిదండ్రులు ఎవరు అని, అతడి జీవితంలో నువ్వు కాకుండా మరెవరైనా ఉన్నారా అని అనుమానంగా కూతురిని అడుగుతుంది కావేరి. కాశీ తల్లిదండ్రుల గురించి తనకు తెలియదని అంటుంది. కూతురి జీవితం తనలా కాకూడదని లోలోన కావేరి మదనపడుతుంది. మగాళ్లను అంత ఈజీగా నమ్మకూడదని కూతురికి సలహా ఇస్తుంది.
గొప్పింటి కోడలు కావాలి...
కాశీతో తన ప్రేమ విషయం అప్పుడే డాడీకి చెప్పొద్దని తల్లిని బతిమిలాడుతుంది స్వప్న. కూతురి సంతోషం కోసం కావేరి సరేనని అంటుంది.కాశీ చరిత్ర ఏమిటో, అతడి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని నిర్ణయించుకుంటుంది. నాలాగా నువ్వు మోసపోకూడదని, నాలాంటి జీవితం నీకు వద్దని, నువ్వు గొప్పింటి కోడలిగా సంతోషంగా బతకాలని కూతురిని ఉద్దేశించి కావేరి మనసులో అనుకుంటుంది.
కార్తీక్‌కు శౌర్య ఫోన్...
తాను ట్యాబ్లెట్స్ వేసుకున్న విషయం కార్తీక్‌కు ఫోన్ చేసి చెబుతుంది శౌర్య. కార్తీక్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నాకు ఇంకో డౌట్ ఉందని ఏమైంది నీకు అంటూ కార్తీక్‌ను ఏదో అడగబోతుంది శౌర్య. కూతురు ఏం మాట్లాడబోతుందోనని కంగారు శౌర్య చేతిలో నుంచి దీప ఫోన్ లాక్కుంటుంది. కార్తీక్‌బాబు నీలాగా, నాలాగా ఖాళీగా ఉంటాడని అనుకుంటున్నావా...అతడికి చాలా పనులు ఉంటాయని, ఏంటా ప్రశ్నలు అంటూ కూతురిపై దీప కొప్పడుతుంది. ఫోన్ చేసి విసిగిస్తుంటే తప్పక ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నావని కూతురితో అంటుంది దీప.
నీ వయసు ఏంటి...
కార్తీక్ నా ఫ్రెండ్ దీపకు బదులిస్తుంది శౌర్య. నీ వయసు ఏంటి? ఆయన వయసు ఏంటి? నీ చదువు ఏంటి? ఆయన పని ఏంటి? క్షణం కూడా తీరక లేకుండా కార్తీక్ బాబు ఉంటాడని కూతురిపై కోప్పడుతుంది దీప. అయిన నిన్ను కాదు..నువ్వు కాల్ చేయగానే లిఫ్ట్ చేస్తున్నాడు చూడు ఆయన్ని అనాలి అంటూ కార్తీక్‌పై కూడా దీప ఫైర్ అవుతుంది. శౌర్య ఫోన్ కట్ చేయకపోవడంతో దీప అన్న మాటలు మొత్తం కార్తీక్ వింటాడు.
కార్తీక్ రివర్స్ కాల్...
ఆ తర్వాత శౌర్య ఫోన్ కట్ చేయగానే తిరిగి కార్తీక్ కాల్ చేస్తాడు. మీరు అన్న మాటలు మొత్తం నేను విన్నాను అని దీపతో చెబుతాడు కార్తీక్. ఇబ్బంది పడుతూ తాను శౌర్యతో ఫోన్ మాట్లాడటం లేదని నిజం బయటపెట్టేస్తాడు. శౌర్యకు సరదాగా ఫోన్ మాట్లాడుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరని, ఫ్రెండ్‌షిప్‌కు వయసుతో పనిలేదని దీపకు క్లారిటీ ఇస్తాడు.
నేను మీ శ్రేయోభిలాషిని, శౌర్య నా ఫ్రెండ్...శౌర్య మీద మీకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉందని అంటాడు. శౌర్య కోసం తాను డాక్టర్‌నే కాదు...అవసరమైతే యాక్టర్‌ను అవుతానని దీపతో చెబుతాడు కార్తీక్. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అలాగే ఉండనివ్వమని దీపను కోరుతాడు. నేను ఇబ్బంది పడతానని శౌర్యను నాకు దూరం చేయద్దని దీపతో చెప్పి ఫోన్ క ట్ చేస్తాడు.
కార్తీక్ జ్ఞాపకం...
లాప్‌ట్యాప్ కప్‌బోర్డ్‌లో పెట్టబోతుంటే అందులో నుంచి ఓ చైన్ కిందపడుతుంది. ఆ చైన్ చూడగానే పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటాడు కార్తిక్. చిన్నతనంలో తన ప్రాణాలను కాపాడిన ఓ అమ్మాయి గుర్తుగా ఆ చైన్ కార్తిక్ దగ్గర ఉండిపోతుంది. ఎలా ఎంతకాలం నాకు కనిపించకుండా ఉంటావని, అసలు ఎక్కడున్నావని ఆ అమ్మాయిని తలుచుకుంటాడు.
నువ్వు నాకు హెల్ప్ చేసినట్లే నేను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నానని ఆ అమ్మాయిని ఉద్దేశించి కార్తీక్ అనుకుంటాడు. నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నానని అంటే అది మీకే అని కార్తీక్ అంటాడు. దీప కూడా అలాగే ఆలోచిస్తుంది. కార్తీక్ లాంటి మంచి స్నేహితుడు తనకు దొరకడం అదృష్టమని అనుకుంటుంది. కార్తీక్ తనకు ఎంతో సాయం చేశాడని, అతడికి చాలా రుణపడి ఉన్నానని అనుకుంటుంది.
కార్తీక్‌తో జ్సోత్స పెళ్లి జరగగానే తన కూతురిని తీసుకొని ఎక్కడికైన దూరంగా వెళ్లిపోవాలని దీప నిర్ణయించుకుంటుంది.
స్వప్న ప్రేమకు హెల్ప్...
తమ ప్రేమకు హెల్ప్ చేయాలని స్వప్న తనను కోరిక విషయం గుర్తొచ్చి కార్తీక్ టెన్షన్ పడతాడు. నీ పెళ్లి నేను చేయాలని చూస్తే...నీ తండ్రి, నా తండ్రి ఒక్కరనే విషయం బయటపడుతుంది. నాన్న మోసం చేశాడని అమ్మ తట్టుకోలేకపోతుందని కార్తీక్ అనుకుంటాడు.
తల్లి అనుమానం...
అప్పుడే కార్తీక్ దగ్గరకు తల్లి వస్తుంది. శ్రీధర్‌కు ఎవరో ఫోన్ చేసి బేబీ అని అన్నారని, ఫోన్ చేసిందిఎవరు అని అడిగితే తండ్రి సరిగ్గా సమాధానం చెప్పడం లేదని అంటుంది. నాన్నను ఎవరో మోసం చేస్తున్నారు కావచ్చునని తల్లి అంటుంది. ఆ తర్వాత కొడుకు చేతిలో ఉన్న చైన్ చూసి నీ లైఫ్‌లో ఓ బేబీ ఉందా అని కొడుకును అడుగుతుంది. ఇది ఇప్పటికథ కాదు...
పదేళ్ల క్రితం జరిగిన కథ అంటూ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు కార్తీక్. కోనేటిలో నేను మునిగిపోతున్నప్పుడు నన్ను కాపాడిన అమ్మాయిది ఈ చైన్ అని, ఇది నా దగ్గరకు ఎలా వచ్చిందో కూడా తెలియదని కార్తీక్ అంటాడు. అక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.