Karthika deepam september 16th episode: కాశీ ఎవరో తెలిసి షాకైన శ్రీధర్- టెన్షన్ లో కార్తీక్, అనసూయతో గొడవకు దిగిన పారు
Karthika deepam 2 september 16th:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీని కలిసి తనను ఇంటికి తీసుకెళ్లాలని పెళ్ళికి ఒప్పుకున్నట్టు చెప్పి సర్ ప్రైజ్ చేయాలని శ్రీధర్ అనుకుంటాడు. కానీ కాశీ దాసు కొడుకని తెలుసుకుని షాక్ అవుతాడు.
Karthika deepam 2 serial today september 16th episode: దీప ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తుంటే కార్తీక్ తర్వాత వేసుకుంటానని అంటాడు. మీరు శౌర్యలా మాట్లాడుతున్నారని అంటుంది. నువ్వే శౌర్యకు వేసినట్టు నోట్లో వేయరాదు అని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. బయట ఉండాల్సిన మనిషి ఇక్కడ ఉంది, నన్ను మాత్రం బయటకు పంపించావని అంటుంది.
దీపకు స్వార్థం
దీప చేసిన తప్పులు మర్చిపోయి అందరూ తనని మంచిదానిలా చూస్తున్నారని దెప్పిపొడుస్తుంది. కార్తీక్ బాబు కోలుకోవాలని మీ అందరికంటే నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ నిశ్చితార్థం, పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే అంటుంది. నీ భర్త వల్లే ఈ పరిస్థితి వచ్చింది, ఎవరు ఎలా పోయిన దీప మాత్రం స్వార్థం కోసం చేస్తుంది.
నీ స్థానంలో నేను ఉంటే రాత్రికి రాత్రే పెట్టె సర్దుకుని వెళ్లిపోయే దాన్ని అంటుంది. కార్తీక్ ఎంత వారించినా కూడా వినిపించుకోదు. ఇప్పుడు నీకేం కావాలని దీప జ్యోత్స్నను అడుగుతుంది. నువ్వు వెళ్ళిపోవడం కావాలని అంటుంది. తను కాదు నువ్వు వెళ్లిపోతే బాగుంటుంది.
కాశీ దగ్గరకు శ్రీధర్
దీపతో గొడవ పడటానికి వచ్చినట్టు ఉందని కార్తీక్ అంటాడు. ఏం నేను ఉంటే మీ ప్రైవసీకి ఇబ్బందిగా ఉందా? అని చండాలంగా మాట్లాడుతుంది. నువ్వు కాబోయే భార్యవి నేనే బయటదాన్ని నేనే వెళ్లిపోతానని దీప బయటకు వచ్చేస్తుంది. కాంచన దీపకు నచ్చజెప్పడానికి చూస్తుంది.
శ్రీధర్ కాశీ ఇంటి దగ్గరకు వస్తాడు. అబ్బాయితో మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళి స్వప్నను సర్ ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఇంట్లో నుంచి పారిజాతం కాశీ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. కాశీ నానమ్మ అని పిలవడం వింటాడు. అప్పుడే దాసు కూడా ఇంట్లో నుంచి వస్తాడు.
డాడీ పెళ్ళికి ఒప్పుకున్నారు
దాసు కాశీ కొడుకని తెలుసుకుంటాడు. స్వప్న పెళ్లి జరిగితే నా రెండో పెళ్లి సంగతి బయట పడితే పరిస్థితి ఏంటి అని శ్రీధర్ భయపడిపోయి కాశీని కలవకుండానే వెళ్ళిపోతాడు. స్వప్న కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. డాడీ పెళ్ళికి ఒప్పుకున్నారు. కాశీ వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి వెళ్లాడని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
కాంచన వచ్చి ఏమైందని అడుగుతుంది. నాన్న కాశీని కలిస్తే దాసు మావయ్య గురించి తెలుస్తుంది. అప్పుడు నాన్న రెండో పెళ్లి గురించి తెలుస్తుందని కార్తీక్ టెన్షన్ పడతాడు. మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాస్త ఫోన్ చేయమని అడుగుతుంది. మీ నాన్నలో ఏదో తేడా వచ్చింది.
శౌర్య అంటే ఎందుకంత ఇష్టం
కొడుకు ఈ పరిస్థితిలో ఉంటే ఇంట్లో ఉండకుండా వెళ్లిపోయాడని కాంచన బాధగా అంటుంది. కార్తీక్ టెన్షన్ చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్. దీపకు ఫోన్ చేసి శౌర్యను తీసుకురమ్మని చెప్పనా. అది నీ దగ్గర ఉంటే నీ మొహంలో నవ్వు ఉంటుంది. శౌర్యకు మనకు ఏ బంధం లేదు కదా.
ఎందుకు నీకు అదంటే అంత ఇష్టమని కాంచన అడుగుతుంది. ఎంత ఇష్టమో చెప్పగలను కానీ ఎందుకు ఇష్టమో చెప్పలేను. కొన్ని బంధాలు అలా కలుస్తాయి అంతే అంటాడు. జ్యోత్స్న వాళ్ళ మాటలు విని రగిలిపోతుంది. జ్యూస్ తీసుకురమ్మంటే రాలేదు ఏంటని అంటే కష్టమైన పని చేయలేనని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టానని చెప్తుంది.
ఎందుకు గొడవపడతారు
పనులు ఏవి రావని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. పారిజాతం అనసూయ దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకోవాలని అనుకుంటుంది. పుల్ల విరుపు మాటలు మాట్లాడుతుంది. అనసూయను తిడుతుంది. శౌర్య వెంటనే ఫోన్ తీసుకొచ్చి కార్తీక్ కి ఫోన్ చేసి చెప్తానని బెదిరిస్తుంది.
పారిజాతానికి ధీటుగా శౌర్య కూడా సమాధానం ఇస్తుంది. అనసూయ, పారిజాతం తిట్టుకుంటారు. నువ్వు అంతే నీ కోడలు అంతే అంటే తన కోడలిని ఏమనోద్దని అనసూయ వారిస్తుంది. ఊరికే మాతో గొడవ పడతారు ఏంటి పని లేదా మీకు అని అనసూయ అడుగుతుంది.
పారిజాతం మాత్రం ఆగదు నా ఇల్లు నా ఇష్టం ఇలాగే మాట్లాడతాను మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ నుంచి పోండి అని అరుస్తుంది. తనకు పిచ్చి అని శౌర్య అనసూయకు సైగ చేస్తుంది. అప్పుడే దీప వస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.