Karthika deepam september 14th episode: 'నా బిడ్డకు తల్లిలా మీరున్నారుగా కార్తీక్ బాబు' దీప-గదిలో బంధిస్తానన్న శివనారాయణ-karthika deepam 2 serial today september 14th episode shivanarayana cautions parijatham taking ill about deepa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam September 14th Episode: 'నా బిడ్డకు తల్లిలా మీరున్నారుగా కార్తీక్ బాబు' దీప-గదిలో బంధిస్తానన్న శివనారాయణ

Karthika deepam september 14th episode: 'నా బిడ్డకు తల్లిలా మీరున్నారుగా కార్తీక్ బాబు' దీప-గదిలో బంధిస్తానన్న శివనారాయణ

Gunti Soundarya HT Telugu
Sep 14, 2024 07:41 AM IST

Karthika deepam 2 serial today september 14th episode:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ పొడిచిన కత్తి మీకు గుచ్చుకుంటే శౌర్యకు ఎవరున్నారని కార్తీక్ అంటాడు. నా బిడ్డను తల్లిలా చూసుకోవడానికి మీరున్నారు కదాని దీప అనేసరికి కార్తీక్ సంతోషిస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today september 14th episode: తన రెస్టారెంట్ లో చెఫ్ ఉద్యోగం ఇస్తానని కార్తీక్ దీపకు ఆఫర్ ఇస్తాడు. నేను వంట చేసే దగ్గరకు వస్తేనే నరసింహ మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను మీ రెస్టారెంట్ లో పని చేస్తే ప్రశాంతంగా ఉండనిస్తాడా? ఇప్పటికే జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను.

నా బిడ్డను అమ్మలా మీరు చూసుకుంటారుగా 

అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే మిమ్మల్ని పెళ్లి కొడుకు చేసేవాళ్ళు. పెళ్లి కొడుకుగా ఉండాల్సిన మీరు పేషెంట్ లా ఉన్నారు. దీనికి కారణం నేనే కదా అని బాధపడుతుంది. అదే కత్తి మీకు గుచ్చుకుని మీరు చనిపోయి ఉంటే శౌర్యకు ఎవరు ఉంటారని కార్తీక్ అడుగుతాడు.

మీరు ఉన్నారు కదా. నా తర్వాత నా బిడ్డను అమ్మలా చూసుకునే మనిషి మీరు ఉన్నారని నమ్మకం ఉందని అంటుంది. నా బిడ్డ జోలికి రావొద్దన్న మనిషి నా బిడ్డకు మీరు ఉన్నారుగా అనేసరికి ఆనందంగా ఉందని అంటాడు. నేను ఎప్పుడు మీ శ్రేయోభిలాషినే అంటాడు.

ఫ్రెండ్ లేకపోయినా శౌర్య ఉంటుందేమో కానీ అమ్మ లేకపోతే ఉండలేదని చెప్తుంది. మీరు లేకపోతే కాంచనమ్మ కూడా ఉండలేరు. మీరు బలంగా ఉన్నారు కదా నేను ఉంటాను ఎందుకంటే నాలో ఉంది మీ రక్తమే కదా అంటాడు. స్వప్న ఫోన్ చేసింది ఇంటికి వస్తాను అడ్రస్ చెప్పమని అడిగిందని చెప్తాడు.

ఉరి వేసుకుంటున్న స్వప్న?

సడెన్ గా ఏదో ఒకరకంగా అడ్రస్ తెలుసుకుని వస్తుందేమో అంటాడు. శౌర్య జాగ్రత్త తనకు టైమ్ కి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోవద్దని కార్తీక్ చెప్తాడు. మా అత్తయ్య మీరు ఇదే మాట చెప్తున్నారు. శౌర్యకు ఏమైంది మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని దీప అనుమానంగా అడుగుతుంది.

అదేమీ లేదు చిన్నపిల్ల కదాని కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు. శ్రీధర్ కావేరీ దగ్గరకు వస్తాడు. ఏ ఇంట్లోనూ మనశ్శాంతి లేదని తిట్టుకుంటాడు. శ్రీధర్ ఇంటికి వచ్చే సరికి స్వప్న ఫ్యాన్ తుడుస్తూ ఉంటే ఉరి వేసుకుంటుందని అనుకుంటాడు. వాడి కోసం చనిపోతావా అని తిడతాడు.

నేను ఎందుకు చనిపోవాలి నేనేం తప్పు చేయలేదని అంటుంది. ప్రేమ, నమ్మకం గురించి మాట్లాడుతుంది. కాశీకి ఉద్యోగం వచ్చిందని, వాళ్ళ నాన్న కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్తుంది. ఒక్కసారి కాశీని కలవమని బతిమలాడుతుంది. కావేరీ కూడా స్వప్న గురించి ఆలోచించమని చెప్తుంది.

శౌర్యను తిట్టిన పారిజాతం 

శౌర్య తులసి కోట దగ్గర దణ్ణం పెట్టుకుంటూ కార్తీక్ త్వరగా కోలుకునేలా చేయమని అడుగుతుంది. అమ్మతో చెప్పాను అమ్మ దగ్గరుండి మా ఫ్రెండ్ ని బాగా చూసుకుంటుందని అంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి గాయాలు చేసేది మీరే తగ్గాలని కోరుకునేది మీరేనని తిడుతుంది.

అదంతా అనసూయ దూరం నుంచి చూస్తుంది. శౌర్యకు ఎక్కడ నిజం తెలుస్తుందోనని భయంగా వెళ్ళి అపుతుంది. అసలు ఇదంతా చేసింది మీ నాన్న అనబోతుంటే అనసూయ అవన్నీ పిల్లల దగ్గర అనొద్దని చెప్తుంది. పారిజాతం అనసూయను నోటికొచ్చినట్టు తిడుతుంది.

మా అమ్మను ఏమి అనొద్దని శౌర్య అంటే ఏం చేస్తావ్ అని పారిజాతం అంటుంది. అంటే కార్తీక్ కి ఫోన్ చేసి చెప్తానని బెదిరిస్తుంది. దీంతో పారిజాతం కార్తీక్ క్లాస్ పీకుతాడని అనుకుంటుంది. కూటికి గతిలేక మా ఇంటికి వచ్చి మా మీద పడుతున్నారు. గతిలేకపోతే ఎందుకు మా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారు పోండి అని అరుస్తుంది.

చెడామడా వాయించేసిన శివనారాయణ 

ఇంకా నువ్వు నీ కోడలు ఏ దురుద్దేశంతో ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే పడి ఉన్నారని పారిజాతం అంటుంది. దీంతో అనసూయ కోపంగా పారిజాతం గారు అని ఆగిపోయి క్షమించమని చెప్పి వెళ్ళిపోతుంది. శివనారాయణ వస్తే పారిజాతం దొంగ ఏడుపు నటిస్తుంది.

అనసూయను ఏంటి అన్నావ్ కూటికి గతిలేనిదా? మరి నువ్వు ఏంటి నీ బతుకు ఎక్కడ మొదలైందో నీకు తెలుసు కదా అంటాడు. పారిజాతం కారు తుడుస్తున్న పని చేసుకున్న విషయం గుర్తు చేసుకుంటుంది. పెళ్ళాన్ని చెడామడా వాయించేస్తాడు. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే ఊరుకునేది లేదని గదిలో వేసి బంధిస్తానని వార్నింగ్ ఇస్తాడు.

కావేరీ స్వప్న ప్రేమ గురించి శ్రీధర్ తో మాట్లాడుతుంది. అల్లుడు దొరుకుతాడు కానీ వాడు ఎప్పటికీ భర్త కాలేడు. ఒక్కగానొక్క ఆడపిల్ల అపురూపంగా పెంచుకున్నాం. అలాంటిది తను ఇష్టపడే వాడి గురించి ఆలోచించలేమా ఒక్కసారి వెళ్ళి మాట్లాడమని కావేరీ రిక్వెస్ట్ చేస్తుంది.

కాశీతో మాట్లాడతానాన్న శ్రీధర్ 

స్వప్న మన మాట గౌరవించి మన దగ్గర ఉందంటే అర్థం చేసుకుంటామనే కదా. అది ఏమైనా చేసుకుంటుందేమోనని అంటుంది. దీంతో శ్రీధర్ కాశీతో మాట్లాడతానని అంటాడు. పేరు ఏంటి అంటే స్వప్న వచ్చి కాశీ అని చెప్పి అడ్రస్ మొత్తం చెప్తుంది. స్వప్న చాలా సంతోషంగా తల్లికి ముద్దులు పెడుతుంది.

కాశీతో పెళ్ళికి ఒకే అయినట్టేనని స్వప్న హడావుడి చేస్తుంది. కాశీ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ తప్పకుండా నాన్న పెళ్ళికి ఒప్పుకుంటారని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.