Karthika deepam september 12th episode: కొడుకు చేసిన తప్పుకు కుమిలిపోయిన అనసూయ- కార్తీక్ కి సాయంగా వెళ్ళిన దీప
Karthika deepam 2 serial september 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన కొడుకు దుర్మార్గంగా ప్రవర్తించాడని దేవుడి లాంటి కార్తీక్ బాబును పొడిచాడని అనసూయ బాధపడుతుంది. కొడుకు చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటే దీప ఆపుతుంది.
Karthika deepam 2 serial today september 12th episode: జ్యోత్స్న దీపను ఇంట్లో నుంచి పంపించేయమని గొడవ చేస్తుంది. నన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం దీప చెప్పిన సాక్ష్యం వల్ల. నా ఎంగేజ్ మెంట్ ఆగిపోయింది దీప వల్ల అని అంటుంది. కానీ దానికి కారణం నరసింహ అని దశరథ అంటాడు.
దీప చస్తే మనకేంటి?
నరసింహ కార్తీక్ ని చంపాలని అనుకుంది దీప కోసం కాదా? అలాంటి దీప ఇంట్లో ఉంటే మరోసారి పొడవడని గ్యారెంటీ ఏంటని పారిజాతం అడుగుతుంది. నువ్వు ఇలాగే మాట్లాడితే నేను నిన్ను పొడవనని గ్యారెంటీ ఏంటని శివనారాయణ అంటాడు.
విధి అలా జరిగిందని అంటాడు. సమయానికి కార్తీక్ కాపాడటం వల్ల దీప బతికింది లేదంటే శౌర్య అనాథ అయ్యేదని సుమిత్ర మాట్లాడుతుంది. దీప చచ్చిపోతే మనకేంటి? శౌర్య అనాథ అయితే మనకేంటి? బయట వాళ్ళ గురించి ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలని పారిజాతం అంటుంది.
సుమిత్ర మాత్రం దీపను సపోర్ట్ చేస్తుంది. ఎంత మంది పిలిచినా కళ్ళు తెరవని కార్తీక్ చిన్న పాప పిలుపుకు లేచాడు. ఇప్పుడు కార్తీక్ ప్రాణం శౌర్య కాపాడిందని సుమిత్ర అంటుంది. పారిజాతం మళ్ళీ మాట్లాడుతుంటే శివనారాయణ తిడతాడు. ఆగిపోయింది నా కూతురు పెళ్లి, గాయపడింది నా చెల్లెలి కొడుకు.
కూతురిని అర్థం చేసుకున్న సుమిత్ర
చిన్న పిల్ల దాని వయసుకు లోతుగా ఆలోచించి అర్థం చేసుకోలేదు. మీరైన అర్థం చేసుకోవాలి కదాని దశరథ అంటాడు. పారిజాతం మాత్రం దీపని తిట్టే పనిలోనే ఉంటుంది. జ్యోత్స్నతో ఒకసారి మాట్లాడమని పెద్దాయన చెప్తాడు. దాని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి.
చిన్నప్పటి నుంచి బావ భర్త అని బతికింది. దానికి ఆ ఆశలు కల్పించింది మనమే. కార్తీక్ ని నరసింహ ఒక తప్పుడు మాట అన్నాడనే భరించలేకపోయింది. అలాంటిది కత్తితో పొడిస్తే ఎలా తట్టుకోగలదని సుమిత్ర కూతురి బాధను అర్థం చేసుకుంటుంది. అనసూయ జరిగినది తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
కార్తీక్ బాబు కాపాడకపోయి ఉంటే చంటి దానికి తల్లి కూడా లేకుండా పోయేది కదా. ఏ జన్మలో చేసిన పుణ్యమే కార్తీక్ బాబు నీ ప్రాణాలు కాపాడాడు. ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేరని మెచ్చుకుంటుంది. నరసింహను వీలైనంత త్వరగా పోలీసులు పట్టుకోవాలి.
వాడు మనిషి కాదు మృగం
కార్తీక్ బాబును చంపాలనుకున్న వాడు మనిషే కాదు మృగం. అలాంటి వాడు ఉంటే భూమి మీద భారమే అంటుంది. నరసింహ చేసిన పని వల్ల నేను ఎవరి ముందు తల ఎత్తుకోలేను తిరగలేను. పెళ్లి ఆగిపోవడానికి కారణం నా కొడుకే కదా. వాళ్ళు నన్ను చూసినప్పుడల్లా బాధ గుర్తుకు వస్తుందని ఏడుస్తుంది.
నీ కూతురికి వాళ్ళ నాన్న కార్తీక్ బాబును పొడిచాడని తెలిస్తే తట్టుకోగలదా? నేను ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు ఆ మాట అంటారు. అది చంటి దాని చెవిన పడితే ఏంటి పరిస్థితని అంటుండగా శౌర్య వస్తుంది. మాటలు విన్నది ఏమోనని దీప వాళ్ళు కంగారుపడతారు.
కార్తీక్ కి ఏం కాకూడదని దండం పెట్టుకున్నాను. మీరు వచ్చి తాతయ్యకు దండం పెట్టుకోమని అడుగుతుంది. కార్తీక్ దగ్గరకు తీసుకెళ్లమని శౌర్య అడుగుతుంది. ఇప్పుడు కాదు తర్వాత తీసుకెళ్తానని చెప్తుంది. కార్తీక్ కి గాయాలు ఎలా తగిలాయి ఏదో గుచ్చుకుందని ఎవరో అన్నారు.
దీపను తరిమేయాలి
పాపం ఎంత నొప్పి ఉంటుందో కదా అంటుంది. నిజం నీకు తెలియకూడదని దీప అనుకుంటుంది. కార్తీక్ బాబును చూసుకోవడానికి శ్రీధర్ బాబు ఇంటి పట్టున ఉండరు. కాంచనమ్మ చేయలేరు. సాయంగా ఎవరో ఒకరు ఉండాలి కదా అనుకుని వెళ్లాలని అనుకుంటుంది.
కార్తీక్ ని రెస్ట్ తీసుకోమని తర్వాత ఎవరి సహాయంతో అయిన నడవమని డాక్టర్ చెప్తాడు. శ్రీధర్ మళ్ళీ నోటికి పని చెప్తాడు. తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల ఇలా జరిగిందని అంటాడు. దీప గొడవ మనకు ఎందుకు అంటే వినలేదు ఇప్పుడు నష్టపోయింది ఎవరు?
నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన నరసింహ, దీపను విడిచిపెట్టను. మన రెండు కుటుంబాల నుంచి దీపను తరిమేస్తే కానీ మనకు మనశ్శాంతి ఉండదని అంటాడు. దీప కనిపిస్తే అప్పుడు చెప్తానని అంటాడు. అప్పుడే దీప వస్తే మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతాడు.
దీపకు కృతజ్ఞతలు చెప్పిన కాంచన
సాయం చేయడానికని చెప్తుంది. మీరు ఏమైనా పరవాలేదు నా వల్లే కార్తీక్ బాబుకు ఈ పరిస్థితి వచ్చిందని అంటుంది. నీ వల్లే బతికింది కూడా రక్తం ఇచ్చి కాపాడావు. సమయానికి శౌర్య వచ్చి పిలవడం వల్లే నా కార్తీక్ కళ్ళు తెరిచాడని కాంచన కృతజ్ఞత చెప్తుంది.
శ్రీధర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆయన కోపంలో ఉన్నాడని పట్టించుకోవద్దని చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం కూడా వస్తారు. జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. షరతులు నాకేనా దీపకు వర్తించవా బావ అని జ్యోత్స్న అడుగుతుంది. అందరూ చూడటానికి రావొద్దని తగ్గిన తర్వాత వస్తానని కార్తీక్ చెప్పాడని కాంచన చెప్తుంది.
అందరితో చెప్పిన దీపతో చెప్పాడులే అని జ్యోత్స్న అంటే నాతో చెప్పిన నేను వినను. ఎందుకంటే నేను కార్తీక్ బాబును చూసి వెళ్లిపోవడానికి రాలేదు. సాయం చేయడానికి ఒక మనిషిగా వచ్చాను. ఇంట్లో మనిషికి బాగోకపోతే వంట పని, ఇంటి పని చేయడానికి వచ్చానని చెప్తుంది.
పని మనిషిగా వచ్చావా? వంట మనిషిగా వచ్చావా అని పారిజాతం వెటకారంగా అడుగుతుంది. మనిషి విలువ తెలిసి వచ్చిందని కార్తీక్ అంటాడు. కాబోయే ఇంటి కోడలిగా ఆ మాత్రం సేవలు కూడా జ్యోత్స్న చేయలేదా దానికి దీప రావాలా అని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.