Karthika deepam september 3rd episode: శభాష్ గ్రాని మంచి పని చేశావన్న జ్యోత్స్న- కన్నీళ్ళు పెట్టుకున్న కార్తీక్
Karthika deepam 2 september 3rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దాసు కూతురికి నిజం చెప్పడంతో జ్యోత్స్న వచ్చి పారిజాతాన్ని నిలదీస్తుంది. దీంతో టెన్షన్ పడిన పారు క్షమించమని అడుగుతుంది. నువ్వు తప్పు చేయలేదు శభాష్ గ్రాని మంచి పని చేశావ్ అని జ్యోత్స్న మెచ్చుకుంటుంది.
Karthika deepam 2 serial today september 3rd episode: నేనే నీ కన్నతండ్రినని దాసు జ్యోత్స్నకు చెప్తాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావ్, నువ్వు నా కన్న తండ్రి ఏంటి ఛీ నేను పని మనిషి కూతురు ఏంటని జ్యోత్స్న అంటుంది. నిన్ను మార్చేసింది ఎవరో కాదు మా అమ్మ పారిజాతం అనేసరికి జ్యోత్స్న షాక్ అవుతుంది.
నువ్వు పని మనిషి కూతురివి
జ్యోత్స్న మాత్రం తాను నమ్మను అంటుంది. నీకు అబద్దం అనిపిస్తే వెళ్ళి మా అమ్మను అడుగు. నువ్వే అసలైన వారసురాలు అనుకుని అహంకారంతో విర్రవీగుతున్నావ్. నేలను వదిలి నడుస్తున్నావ్ ఇది నీకు మంచిది కాదు. నేనేనమ్మ నీ తండ్రిని. కల్యాణి నీ తల్లి.
ఒకప్పుడు అదే ఇంట్లో పని చేసేది తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. కాశీ నీ తమ్ముడు. ఇప్పటి నుంచైనా మనుషులను కొట్టడాలు మానేయ్. ఓ మనిషిలాగా పద్ధతిగా ఉండు లేదంటే నీ జాతకం బయటపడిన రోజు నువ్వు దాసు కూతురిగానే మిగిలిపోతావు. వీటన్నింటికీ సాక్షి మా అమ్మ పారిజాతం.
నువ్వు నాకు నచ్చలేదు
ఈ నిజం ఎవరికీ తెలియదు. నువ్వు ఎవరి స్థానంలో బతుకుతున్నావో ఆ బిడ్డ కూడా బతికే ఉంది. కానీ ఎక్కడ ఉందో తెలియదు. నువ్వు నేను చూడాలనుకున్న కూతురిలా బతికి ఉంటే నీకు ఈ నిజం చెప్పేవాడిని కాదు కానీ నువ్వు అలా లేవు అందుకే నువ్వు నాకు నచ్చలేదు.
నీ స్థాయి ఏంటో నీకు తెలిసింది కాబట్టి కాళ్ళు నేల మీద పెట్టి నడువు అనేసి వెళ్లిపోతుంటే నేను ఇదంతా నమ్మలేకపోతున్నానని అంటుంది. వెళ్ళి మా అమ్మ పారిజాతాన్ని అడుగు నిజం నీకే తెలుస్తుందని అంటాడు. దీప సాధువు మాటలనే గుర్తు చేసుకుంటుంది.
కార్తీక్ శౌర్యను తీసుకుని ఇంటికి వస్తాడు. దాసు గురించి దీప కార్తీక్ తో చెప్తుంది. మా తాతయ్య పారును రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు కొడుకు, కూతురు ఉన్నట్టే పారుకు కూడా అదే వయసు కొడుకు ఉన్నాడు. దాసు నాకు చిన మావయ్య అవుతాడు. కాశీ నాకు బామ్మర్ధి అవుతాడు.
దాసు నాకు చిన మావయ్య
ఇంటి పని మనిషితో ఏదో ప్రేమ కథ అది బయట పడి మా తాతయ్య దాసు మావయ్యకు కల్యాణి అత్తకు పెళ్లి చేసి పంపించేశాడు. అప్పటి నుంచి దాసు మావయ్య అంటే తాతయ్యకు ద్వేషం. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు మళ్ళీ ఇంటికి రాలేదు. వాళ్ళు వైజాగ్ వెళ్లిపోయారు. చిన మావయ్య కాశీ మళ్ళీ ఇన్నాళ్ళకు వచ్చారు.
ఇప్పుడు సమస్య ఏంటో మీకు అర్థం అయ్యింది కదా అంటాడు. స్వప్న, కాశీకి పెళ్లి జరగాలి అంటే తన తండ్రి ఎవరో దాసు బాబాయ్ కి తెలియాలి కదా. ఆయనకు తెలిస్తే మీ నాన్న రెండో పెళ్లి గురించి మీ అమ్మకు తెలిసిపోతుంది కదా అంటాడు. ప్రస్తుతానికి కాశీ, స్వప్నను దూరంగా ఉండమని దీప చెప్తుంది.
కన్నీళ్ళు పెట్టుకున్న కార్తీక్
అంత అవకాశం మనకు లేదు. మా నాన్నకు స్వప్న ప్రేమ గురించి తెలిసిపోయింది. కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకూడదు. అందుకే మా ఆఫీసులో పని చేసే వాడితో పెళ్లి ఫిక్స్ చేశాడని కార్తీక్ చెప్తాడు. కాశీని ప్రేమించిన విషయం చెప్పిన పెళ్లి కొడుకు పరవాలేదు అన్నాడు.
పెళ్లి జరిగితే స్వప్న బతకదు. తను బతకాలంటే స్వప్నతో కాశీ పెళ్లి చేయాలి. అలా చేస్తే మా అమ్మ బతకదు. ఆగి సమస్యకు పరిష్కారం ఆలోచించే టైమ్ కూడా లేదని కార్తీక్ చాలా టెన్షన్ పడతాడు. స్వప్న నా సొంత చెల్లెలు కదా తనకు ఏమైనా అయితే నేనే బాధపడతాను.
వాళ్ళది పెళ్లిలా కనిపించడం లేదు బాంబ్ లా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి పెళ్లి నేను చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం కాదు. పొరపాటున వాళ్ళు లేచిపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేనని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దామని దీప సర్ది చెప్తుంది.
కూతురు తండ్రిని కొట్టడం తప్పు కదా
కార్తీక్ పరిస్థితి చూసి దీప జాలిపడుతుంది. జ్యోత్స్న ఆవేశంగా ఇంటికి వస్తుంది. ఇది నా ఇల్లు కాదు. దశరథ, సుమిత్ర కన్నబిడ్డను కాదా? నేను ఈ ఇంటి వారసురాలి స్థానంలో బతుకుతున్న పని మనిషి కూతురినా? అసలు ఇదంతా నేనెందుకు నమ్మాలని అనుకుంటుంది.
అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వస్తుంది. దాసును కలిశావా? వాడిని మాటలతో బాధపెట్టావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. రెస్టారెంట్ లో నీ కొడుకును నేను కొట్టాను కదా కూతురు తండ్రిని కొట్టడం తప్పే కదా అంటుంది. పారిజాతం అవును తప్పే అని ఫ్లోలో నిజం ఒప్పేసుకుంటుంది.
మళ్ళీ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మా అమ్మ ఎవరు అని జ్యోత్స్న నిలదీస్తుంది. సుమిత్ర అంటే మరి కల్యాణి ఎవరు? కల్యాణి ఏమవుతుంది? కల్యాణికి ఒక కూతురు పుట్టింది కదా అది ఎక్కడ ఉందని జ్యోత్స్న అడగడంతో పారిజాతం టెన్షన్ పడుతుంది.
శభాష్ మంచి పని చేశావ్ గ్రాని
పుట్టగానే చచ్చిపోయింది అంటే అబద్దం ఆ బిడ్డ బతికే ఉంది. ఇదిగో ఇలా నీ ముందు నిలబడి నీతో మాట్లాడుతుంది. నువ్వు నా సొంత మనవరాలిని అని అంటుంటావ్ కదా నేను నీ సొంత మనవరాలిని. నేను నీ కొడుకు దాసు కూతురిని అంటుంది. ఇది నీకు ఎవరు చెప్పారని పారిజాతం అడుగుతుంది.
నిజమా కాదా చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. నన్ను క్షమించు నా స్వార్థం కోసం నేనే ఈ పని చేశాను అంటుంది. క్షమాపణ చెప్పడానికి నువ్వు చెడ్డ పని చేయలేదు మంచి పని చేశావ్. దేవుడు రాసిన తలరాత నువ్వు మార్చేశావ్. నువ్వు ఈ పని చేయకపోతే వందల కోట్ల ఆస్తికి వారసురాలిగా కాకుండా పని మనిషి కూతురిగా బతకాల్సి వచ్చేది.
టెన్షన్ లో పారిజాతం
శభాష్ గ్రాని నువ్వు పని మనిషి కూతురిని అదే ఇంటికి యజమానిని చేశావని మెచ్చుకుంటుంది. ఈ నిజాలు నీకేవారు చెప్పారని అంటే అది నన్ను అడుగు అని దాసు ఎంట్రీ ఇస్తాడు. నేనే నిజం చెప్పానని అంటాడు. ఈ నిజాలు నీకేలా తెలుసు ఎవరు చెప్పారని పారిజాతం అడుగుతుంది.
నాకు ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అన్నీ కంట కనిపెడుతూనే ఉన్నాను. సైదులు బిడ్డను మార్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని జరిగినది అంతా చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.