OTT Series: ఓటీటీలోకి రానున్న రియల్ ఎస్టేట్ రియాల్టీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-real estate reality series million dollar listing india version will streaming soon on sony liv ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Series: ఓటీటీలోకి రానున్న రియల్ ఎస్టేట్ రియాల్టీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Series: ఓటీటీలోకి రానున్న రియల్ ఎస్టేట్ రియాల్టీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 17, 2024 08:23 PM IST

Million Dollar Listing: India OTT: మిలియన్ డాలర్ లిస్టింగ్ రియాల్టీ సిరీస్ ఇండియాకు కూడా వచ్చేస్తోంది. ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ ఖరారైంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT Series: ఓటీటీలోకి రానున్న రియల్ ఎస్టేట్ రియాల్టీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Series: ఓటీటీలోకి రానున్న రియల్ ఎస్టేట్ రియాల్టీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

రియల్ ఎస్టేట్ రంగంపై ఇండియాలో ఓ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ‘మిలియన్ డాలర్ లిస్టింగ్: ఇండియా’ పేరుతో ఈ రియల్ ఎస్టేట్ రియాల్టీ సిరీస్ వస్తోంది. అమెరికాలో ఈ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఎమ్మీ అవార్డులకు కూడా నామినేట్ అయింది. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ‘మిలియన్ డాలర్ లిస్టింగ్’ వస్తోంది.

సిరీస్ ఇలా..

దేశంలోని ఖరీదైన, ఆకర్షణీయమైన ఇళ్లు, భవనాలను ‘మిలియన్ డాలర్ లిస్టింగ్: ఇండియా’ సిరీస్‍లో మేకర్స్ చూపించనున్నారు. అలాగే, ఇండియాలోని డ్రీమ్ ప్రాపర్టీల సృష్టి గురించి కూడా వివరించనున్నారు. క్రయవిక్రయాల గురించి కూడా ఉండొచ్చు. మొత్తంగా ఈ సిరీస్ పూర్తిగా రియల్ ఎస్టేట్‍పైనే ఉంటుంది.

ముందుగా ఢిల్లీ

‘మిలియన్ డాలర్ లిస్టింగ్: ఇండియా’లో ముందుగా ఢిల్లీలోని విలాసవంతమైన లగ్జరీ ప్రాపర్టీలను మేకర్స్ చూపించనున్నారు. ఖరీదైన భవనాలు, ఆస్తులపై ఫోకస్ చేయనున్నారు. కొందరు ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు, వ్యాపారులు ఈ సిరీస్‍లో కనిపించనున్నారు. కొన్ని ఒప్పందాలు కూడా ఈ రియాల్టీ సిరీస్ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రేక్షకులకు ఈ రియల్ ఎస్టేట్ ఆధారిత సిరీస్ ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

‘మిలియన్ డాలర్ లిస్టింగ్: ఇండియా’ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రస్తుతం త్వరలో అంటూ ఆ ప్లాట్‍ఫామ్ పేర్కొంది. తేదీని వెల్లడించలేదు. ఇప్పటికి ఓ వీడియో తీసుకొచ్చింది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ అక్టోబర్‌లో మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. షార్క్ ట్యాంక్, మాస్టర్ చెఫ్ ఇండియాను తెచ్చిన ఈ ప్లాట్‍ఫామ్ మిలియన్ డాలర్ లిస్టింగ్: ఇండియాను త్వరలో తెస్తోందంటూ సోనీ లివ్ పేర్కొంది.

దేశంలోని విలాసవంతమైన ఇళ్ల అమ్మకం, కొనుగోళ్లలో ఉండే చర్చలు, ప్రక్రియను కూడా ఈ సిరీస్‍లో చూపించనున్నట్టు సోనీ లివ్, స్టూడియో నెక్స్ట్ బిజినెస్ హెడ్ దానిష్ ఖాన్ వెల్లడించారు. ఇలాంటి షోను ఆడియన్స్ ఇంతకు ముందెప్పుడు చూసి ఉండరని, అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ సిరీస్‍తో అందరూ రిలేట్ అవుతారని అంచనా వేశారు.

సోనీలివ్‍లో అదరగొడుతున్న తలవన్

సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రస్తుతం తలవన్ చిత్రం దుమ్మురేపుతోంది. భారీ వ్యూస్ దక్కించుకుంటూ ట్రెండ్ అవుతోంది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. మే 24వ తేదీన థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

తలవన్ చిత్రంలో బిజూ మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు పోషించారు. మియా జార్జ్, సుజీత్ శంకర్, అనుశ్రీ, దిలీశ్ పోతన్, జోజీ జాన్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి జిస్ జాయ్ సంగీతం అందించారు. మర్డర్ మిస్టరీతో గ్రిప్పింగ్ నరేషన్‍తో ఈ మూవీ తెరకెక్కింది. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని చూసిన చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఉత్కంఠభరితంగా అదిరిపోయిందంటూ అభిప్రాయపడుతున్నారు.