Murder Mystery OTT: ఒక‌ రోజు ముందుగానే ఓటీటీలోకి మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌-malayalam murder mystery thriller movie thalavan to release on sonyliv ott one day early ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Murder Mystery Ott: ఒక‌ రోజు ముందుగానే ఓటీటీలోకి మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Murder Mystery OTT: ఒక‌ రోజు ముందుగానే ఓటీటీలోకి మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 09, 2024 12:01 PM IST

Murder Mystery OTT: మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ త‌ల‌వాన్ ఓ రోజు ముందుగానే ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త‌ల‌వాన్ మూవీలో బిజుమీన‌న్‌, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించారు.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్  ఓటీటీ
మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఓటీటీ

Murder Mystery OTT: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ల‌వాన్ ఓ రోజు ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 10న‌ ఓటీటీలో రిలీజ్ కానుంది. కానీ ఆడియెన్స్‌కు సోనీ లివ్ గుడ్‌న్యూస్ చెప్పేసింది. ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబ‌ర్ 9 నుంచే త‌ల‌వాన్‌ను సోనీలివ్‌లో చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది. సోమ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంద‌ని వెల్ల‌డించింది.

ఇద్ద‌రు హీరోలు...

త‌ల‌వాన్ మూవీలో బిజు మీన‌న్, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించారు. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజై ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ మూవీ 25 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది

రియ‌లిస్టిక్ క‌థ‌తో...

త‌ల‌వాన్ మూవీకి జిస్ జాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో మియా జార్జ్‌, అనుశ్రీ హీరోయిన్లుగా న‌టించారు. పోలీస్ ఆఫీస‌ర్లుగా బిజు మీన‌న్‌, ఆసిఫ్ అలీ యాక్టింగ్‌తో పాటు క‌థలోని ట్విస్ట్ మ‌ల‌యాళ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ఓ పోలీస్ ఆఫీస‌ర్ జీవితంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు జిస్ జాయ్ త‌ల‌వాన్‌ మూవీని తెర‌కెక్కించాడు.

పోలీస్ ఆఫీస‌ర్ల ఈగో...

ఇద్ద‌రు పోలీస్ ఆఫీస‌ర్ల మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు, వారి ఈగో చుట్టూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఎస్ఐ కార్తిక్ వాసుదేవ‌న్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫ‌ర్‌పై సీఐ జ‌య‌శంక‌ర్ (బిజు మీన‌న్‌) ప‌నిచేస్తోన్న పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తాడు. కార్తిక్ దూకుడు మ‌న‌స్త‌త్వం జ‌య‌శంక‌ర్‌కు న‌చ్చ‌దు. ఓ కేసులో అరెస్ట్ అయిన మ‌నుదాస్ అనే స్నేహితుడిని జ‌య‌శంక‌ర్ అనుమ‌తి లేకుండా కార్తిక్ విడుద‌ల‌చేస్తాడు. ఆ విష‌యంలో కార్తిక్‌తో జ‌య‌శంక‌ర్ గొడ‌వ‌ప‌తాడు. జ‌య‌శంక‌ర్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటాడు కార్తిక్‌.

అనుకోకుండా ఓ రోజు జయశంకర్ ఇంటి టెర్రస్ పై రమ్య అనే యువ‌తి డెడ్‌బాడీ దొరుకుతుంది. ర‌మ్య‌తో జ‌య‌శంక‌ర్‌కు ఎఫైర్ ఉంద‌నే పుకార్లు ఉండ‌టంతో ఈ హ‌త్య అత‌డే చేశాడ‌ని పోలీసులు అనుమానిస్తారు. అత‌డిని అరెస్ట్ చేస్తారు. అస‌లు ర‌మ్య‌ను ఎవ‌రు హ‌త్య ఎవ‌రు? ఈ నేరంలో జ‌య‌శంక‌ర్ ఎలా చిక్కుకున్నాడు? ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేష‌న్ చేసే బాధ్య‌త‌ను కార్తిక్ చేప‌ట్ట‌డానికి కార‌ణం ఏమిటి? గొడ‌వ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి జ‌య‌శంక‌ర్‌ను ఈ కేసు నుంచి కార్తిక్ కాపాడాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

త‌ల‌వాన్ 2 కూడా...

త‌ల‌వాన్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. త‌ల‌వాన్ 2 పేరుతో సీక్వెల్‌ను డైరెక్ట‌ర్ అనౌన్స్‌చేశాడు. ఈ సీక్వెల్‌లోనూ బీజుమీన‌న్, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించ‌నున్నారు. మ‌ల‌యాళంలో హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తోన్న బిజు మీన‌న్ తెలుగులో ఓ రెండు సినిమాల్లో క‌నిపించాడు గోపీచంద్ ర‌ణంతో పాటు రవితేజ ఖ‌త‌ర్నాక్ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్ చేశాడు.

మూడు హిట్స్‌...

ఈ ఏడాది బిజు మీన‌న్ న‌టించిన తుండు, త‌ల‌వాన్‌, నాద‌న్న సంభ‌వం సినిమాలు రిలీజ‌య్యాయి. ఈ మూడు సినిమాల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌నోర‌థంగ‌ల్ అనే వెబ్‌సిరీస్‌తో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు బీజు మీన‌న్‌.

టాపిక్