Horror Movies: ఈ వీక్ ఓటీటీలోకి వ‌చ్చిన థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే హాలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ మూవీస్ ఇవే!-the watchers to the deep dark best hollywood horror thriller movies releasing on ott this week amazon prime video ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Horror Movies: ఈ వీక్ ఓటీటీలోకి వ‌చ్చిన థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే హాలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ మూవీస్ ఇవే!

Horror Movies: ఈ వీక్ ఓటీటీలోకి వ‌చ్చిన థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే హాలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ మూవీస్ ఇవే!

Jul 20, 2024, 10:22 AM IST Nelki Naresh Kumar
Jul 20, 2024, 10:22 AM , IST

Horror Movies: థియేట‌ర్ల‌లో హాలీవుడ్‌ ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టిన‌ ప‌లు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ల‌తో రూపొందిన ఈ సినిమాలు ఏవంటే?

హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ది వాచ‌ర్స్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షోలో శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అడ‌విలో ఓ యువ‌తి ఎలా బందీగా మారింది?  ప్రాణాల‌ను కాపాడుకోవ‌డం కోసం వింత జీవుల‌తో ఎలాంటి పోరాటం చేసింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 

(1 / 5)

ఫ్రెంచ్ మూవీ ది డీప్ డార్క్ బుక్ మై షో స్ట్రీమింగ్ యాప్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఓ ప‌రిశోధ‌న నిమిత్తంచాలా ఏళ్లుగా మూత‌ప‌డిన గ‌నిలోకి వెళ్లిన కొంద‌రు సైంటిస్ట్‌ల‌కు అక్క‌డ ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌న్న‌ది హార‌ర్ అంశాల‌తో భ‌య‌పెట్టేలా ద‌ర్శ‌కుడు ఈ మూవీలో చూపించాడు. 

(2 / 5)

సైకో థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన గుడ్‌బై మూవీ ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది.  మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే కిల్ల‌ర్ కార‌ణంగా ఓ ప్రేమ జంట ఎలా ప్ర‌మాదంలో ప‌డింద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ బుక్ బై షో స్ట్రీమింగ్ యాప్ ద్వారా ఇటీవ‌లే విడుద‌లైంది. 

(3 / 5)

నికోల‌స్ కేజ్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఆర్కాడియ‌న్ ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో రిలీజైంది. కొన్ని అదృశ్య శ‌క్తుల‌తో  తండ్రి, అత‌డి కొడుకులు సాగించిన యుద్ధం నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కింది. 

(4 / 5)

ఇటాలియ‌న్ మూవీ ది బోట్ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. బోట్‌లో టూర్‌కు వెళ్లిన ఓ జంట ఎలా ప్ర‌మాదంలో ప‌డ్డార‌నే పాయింట్‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ది బోట్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు